బ్రహ్మపుత్రా నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి robot Adding: simple:Brahmaputra
పంక్తి 10: పంక్తి 10:
===టిబెట్‌లో===
===టిబెట్‌లో===


ఉత్తర హిమాలయలలోని [[కైలాస పర్వతం]] <ref>[http://www.100gogo.com 100gogo.com]'']</ref> దగ్గర ''జిమా యాంగ్ జాంగ్'' హిమానీనదం<ref>''[http://www.100gogo.com/canyon.htm The New Largest Canyon in the World]''from [http://www.100gogo.com 100gogo.com]''</ref> లో పుట్టింది ''యార్లుంగ్ త్సాంగ్ పో'' నది. అక్కడి నుండి తూర్పు దిశగా సుమారు 1700 కిలో మీటర్లు, 4000 మీటర్ల ఎత్తున, ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదులకన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. ఆ తర్వత [[ మొఉంట్ నంచా బార్వ]] ని చుడుతూ ''యార్లుంగ్ త్సాంగ్ పో పెనులోయ'' ను ఏర్పరుస్తుంది. ఈ పెనులోయ ప్రపంచంలోనే అత్యధిక లోతైనదిగా గుర్తించబడినది. <ref>''[http://www.canyonsworldwide.com/tibet/mainframe2.html Canyonlands of Tibet and Central Asia]'', from [http://www.canyonsworldwide.com canyonsworldwide.com].</ref>
ఉత్తర హిమాలయలలోని [[కైలాస పర్వతం]] <ref>[http://www.100gogo.com 100gogo.com]'']</ref> దగ్గర ''జిమా యాంగ్ జాంగ్'' హిమానీనదం<ref>''[http://www.100gogo.com/canyon.htm The New Largest Canyon in the World]''from [http://www.100gogo.com 100gogo.com]''</ref> లో పుట్టింది బ్రహ్మపుత్ర నది. అక్కడి నుండి తూర్పు దిశగా సుమారు 1700 కిలో మీటర్లు, 4000 మీటర్ల ఎత్తున, ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదులకన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. ఆ తర్వత [[ మొఉంట్ నంచా బార్వ]] ని చుడుతూ ''యార్లుంగ్ త్సాంగ్ పో పెనులోయ'' ను ఏర్పరుస్తుంది. ఈ పెనులోయ ప్రపంచంలోనే అత్యధిక లోతైనదిగా గుర్తించబడినది. <ref>''[http://www.canyonsworldwide.com/tibet/mainframe2.html Canyonlands of Tibet and Central Asia]'', from [http://www.canyonsworldwide.com canyonsworldwide.com].</ref>


===భారతదేశంలో===
===భారతదేశంలో===

13:24, 13 జూలై 2007 నాటి కూర్పు

బ్రహ్మపుత్రా నది ఉపగ్రహ చిత్రం.
చిత్వాన్‌‌లో ఒక పడవ.

బ్రహ్మపుత్ర (Brahmaputra river) (అస్సామీ భాష: ব্ৰহ্মপুত্ৰ, బెంగాలీ భాష: ব্রহ্মপুত্র} హిందీ భాష: ब्रम्हपुत्र, టిబెటన్ భాషཡར་ཀླུངས་གཙང་པོ་ yar klung gtsang, Yarlung Tsangpo) ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్‌లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా 'బ్రహ్మపుత్ర' పురుషనామంతో పిలువబడడం విశేషం.

టిబెట్లో నైఋతిన యార్లుంగ్ (Imperial blood) నది గా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది. నైఋతి లో అస్సాంలో ప్రవహించి, దక్షిణాన బంగ్లాదేశ్ లో జమునగా పారుతుంది. అక్కడా గంగా నదితో కూడి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. షుమారు 2900 కిలొమీటర్లు(1800 మైళ్ళు) పొడుగున్న ఈ నది వ్యవసాయానికి జల మార్గాలకు ఉపయోగకారి. దీని ఎగువ పారుదల ప్రాంతం చాలా రోజుల వరకు గుప్తంగా ఉన్నది. దీనికి జాంగ్ బో పెనులోయతో గల సంబంధం 1884-86 అన్వేషణ వల్లనే కనుగొనబడినది.

ఈ నది దిగువ ప్రాంతము హిందువు లకు పవిత్రమైనది. ఈ నది మెరుపు వరదలకు ప్రసిద్ది. ప్రపంచంలో టైడల్ బోర్ (tidal bore)ను ప్రదర్శించే అరుదైన నదులలో ఇది ఒకటి.

నదీ ప్రవాహ మార్గం

టిబెట్‌లో

ఉత్తర హిమాలయలలోని కైలాస పర్వతం [1] దగ్గర జిమా యాంగ్ జాంగ్ హిమానీనదం[2] లో పుట్టింది బ్రహ్మపుత్ర నది. అక్కడి నుండి తూర్పు దిశగా సుమారు 1700 కిలో మీటర్లు, 4000 మీటర్ల ఎత్తున, ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదులకన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. ఆ తర్వత మొఉంట్ నంచా బార్వ ని చుడుతూ యార్లుంగ్ త్సాంగ్ పో పెనులోయ ను ఏర్పరుస్తుంది. ఈ పెనులోయ ప్రపంచంలోనే అత్యధిక లోతైనదిగా గుర్తించబడినది. [3]

భారతదేశంలో

అరుణాచల్ ప్రదేశ్ లో నది ప్రవేశంచిన చోట ఈ నది పేరు సియాంగ్ అక్కడ చాలా ఎత్తు నుంచి చాల వేగంగా కిందికి దిగుతుంది. పర్వత పాద ప్రాంతంలో ఈ నదిని దిహంగ్ అంటారు. అక్కడ నుండీ 35 కిలో మీటర్లు ప్రవహించాక దిబంగ్, లోహిత్ అనే మరు రెండు నదులతో సమాగం అవుతుంది. ఈ సమాగమ కేంద్రం నుండి ఈ నది చాలా వెడల్పు అవుతుంది, ఇక్కడ నుండి ఈ నది బ్రహ్మపుత్ర గా పేరొందింది. సియాంగ్, దిబంగ్, లోహిత్ నదులు జల విద్యుదుత్పత్తికి ఎంతో అనుకూలమైనవి. భారత ప్రభుత్వం వీటి మీద డ్యాం లు కట్టడానికి కృషి చేస్తోంది. అస్సాం లో ఈ నది వెడల్పు కొన్ని చోట్ల 10 కిలో మీటర్లు కూడా ఉంటుంది. జోర్హాత్ కి దగ్గరలో రెండు పాయలుగ విడీపొయు 100 కిలో మీటర్ల దూరం తర్వత కలవడం ద్వారా ఈ నది మజూలి అనె ద్వీపాన్ని ఎర్పరుస్తోంది. మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం. గౌహతి దగ్గర్లో హజో అనే గ్రామం దగ్గర షిల్లంగ్ పీఠభూమి ని కోస్తూ పోవడం వల్ల నది వెదల్పు చాలా సన్నగా మరుతుంది. ఎన్నో శత్రు దాడులను ఎదుర్కోవడానికి కూడా విశాల మైన నది అస్సంకి అండగా ఉండేది. సన్న బడ్డ నది దగ్గరే సరాయ్ ఘాట్ యుద్ధము జరిగినది. ఇక్కడే నిర్మించిన రైలు రోడ్డు వంతెనకు సరాయ్ ఘాట్ వంతెనఅని పేరు పెట్టారు.

పురాణ సంస్కృత నామం : లౌహిత్య అస్సాంలొ పిలిచే పేరు: లుయిత్

అక్కడ నివసించే బోడో లు ఈ నదిని భుల్లం - బుతుర్, అని పిలుస్తారు. అంటే 'గర గర శబ్ధం చేసేది' అని అర్ధం. చివరగా బ్రహ్మపుత్ర అని సంస్కృతీకరించారు.

బంగ్లాదేశ్‌లో

బంగ్లాదేశ్‌లో ముఖ్యమైన నదులను చూపే చిత్రపటం. ఇందులో బ్రహ్మ పుఎ్రకు ఉపనదులైన 'జమున', 'దిగువ బ్రహ్మపుత్ర'లను చూడవచ్చును.

బంగ్లాదేశ్ లో, బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమున గ సాగి దిగువ గంగలో కలుస్తుంది, ప్రాంతీయులు దీనిని పద్మ నది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్ర గా పారి మేఘ్న నదిలో కలుస్తుంది. ఈ రెండు పాయలు చివరకు బంగ్లాదేశ్లోని చాంద్ పూర్ అనే ప్రదేశంలొ కలిసి బంగాళా ఖాతం లోకి సాగిపోతాయి. ఈ ప్రదేసశంలో గంగ, బ్రహ్మపుత్ర నదీ జలాలు గంగ - బ్రహ్మపుత్ర దెల్టా ని ఏర్పరుస్తుంది. ఈ నదీ డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దదైనది.

నదీ ప్రయాణ సౌకర్యాలు

1947 లో భారత దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ, బ్రహ్మపుత్రా నది ఒక పెద్ద జల మార్గం గా ఉపయోగించబడినది. ఎగువ అస్సాం లఖింపూర్ జిల్లాలోని సదియా నుంచి దిగువ అస్సాం లోని ధుబ్రి వరకూ జాతీయ జలమార్గం - 2 గ ప్రకటించబడింది. సరుకుల రవాణాకు ఈ మార్గం అనుగుణంగా ఉండేది. అస్సాం రాష్ట్ర ప్రధాన నగర మైన గౌహతి, గౌహతి, ఉత్తర గౌహతిగ బ్రహ్మపుత్ర నది వల్ల విభజించబడినది. ఉత్తర గౌహతికి పోవుటకు అత్యంత సౌకర్యమైన ది నదీ మార్గమే. ఈ మధ్య కాలంలో చాలా నదీ క్రూజ్‌లు కూడా పెరిగాయి. అస్సాం బెంగాల్ నేవిగేషన్ చరైద్యూ అనే క్రూజ్ షిప్ ని కూడా నడుపుతోంది.

మూలాలు


మరిన్ని వనరులు