ఉప్మా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి {{commons category|Upma}}
→‎చిట్కాలు: {{తెలుగింటి వంట}}
పంక్తి 33: పంక్తి 33:


{{commons category|Upma}}
{{commons category|Upma}}

{{తెలుగింటి వంట}}


[[వర్గం:ఫలహారాలు]]
[[వర్గం:ఫలహారాలు]]

08:30, 15 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

ఉప్మా తక్కువ సమయంలో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారము. ఈ ఉప్మాను బియ్యం రవ్వతో, అటుకులతో, సేమ్యాతో లేదా గోధుమ నూకతో చేసుకోవచ్చును. ఉప్పు మరియు మావు( రవ్వ) అను రెండు తమిళ పదాల నుంచి దీని పేరు ఉప్మావు అని వచ్చింది. దీనిని తెలుగులో ఉప్మా అని ఉప్పిండి అని కూడా పిలుస్తారు.


కావలసిన పదార్ధాలు

తయారుచేయు విధానం

  • బూరెల మూకుడు పొయ్యి మీద పెట్టి, నెయ్యివేసి, జీడిపప్పు దోరగా వేయించి తీసివేయాలి. ఆ నెయ్యిలోనే గోధుమనూక ఒక కప్పువేసి, వేయించిన తరువాత దానిని వేరు పళ్ళెంలోకి తీసుకోవాలి.
  • బూరెల మూకుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టి, పోపుకి తగిన నెయ్యివేసి మరిగాక ఆవాలు, మినప పప్పు వేసి, ఆవాలు చిటపటలాడాక జీలకర్రవేసి ఆ పైన తరిగి ఉంచుకున్న అల్లం, పచ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి - పోపు కమ్మని వాసన వచ్చిన తరువాత రెండు కప్పుల నీరుపోసి, తగినంత ఉప్పువేయలి.
  • నీరు మరిగిన తరువాత వేయించిన గోధుమ నూకవేసి కలియబెట్టాలి. మూతపెట్టి అయిదు నిమిషాలు ఉంచాలి.
  • రవ్వ మెత్తబడిన తర్వాత కిందకి దించి, వేయించిన జీడిపప్పు ఒక చెక్క నిమ్మకాయ రసం పిండి బాగా కలియబెట్టి వేరే పళ్ళెం లోకి దిమ్మరించుకోవాలి.

ఉప్మాలో రకాలు

  • టొమాటో ఉప్మా:
  • సేమ్యా ఉప్మా:
  • అటుకుల ఉప్మా:
  • మజ్జిగ ఉప్మా:
  • బొరుగుల ఉప్మా:
  • సగ్గుబియ్యము ఉప్మా:
  • పులుసు ఉప్మా:
  • పెసరపప్పు ఉప్మా:

చిట్కాలు

  • ఉప్మాలో నెయ్యి ఎక్కువ వెయ్యకపోతే ముద్దలాగా అంటుకుంటుంది.
  • ఉప్మా ఉండలు ఉండలుగా తయారుకాకుండా, నూకను నీటిలో వేసేముందు వేపుకోవాలి.
  • ఉప్మాలో ఎవరికి ఇష్టమైన మసాలా దినుసులు వేపుకొని ఉడుకుతున్న నీటిలో వేసుకోవచ్చును
"https://te.wikipedia.org/w/index.php?title=ఉప్మా&oldid=1689115" నుండి వెలికితీశారు