కాశీయాత్ర చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎ఏనుగుల వీరాస్వామయ్య: వివవరణ-విస్తీకరణ
→‎మూలాలు, వనరులు: మూలాలు జతచేశాను
పంక్తి 33: పంక్తి 33:
==మూలాలు, వనరులు==
==మూలాలు, వనరులు==
*[[తెలుగు సంగతులు]], [[బూదరాజు రాధాకృష్ణ]], మీడియా హౌస్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2003.
*[[తెలుగు సంగతులు]], [[బూదరాజు రాధాకృష్ణ]], మీడియా హౌస్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2003.
* "పాత కెరటాలు- ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీ యాత్ర చరిత్ర" మాలతీ చందూర్(1981) స్వాతి మే 1981




{{వికీసోర్స్|కాశీయాత్ర చరిత్ర}}
{{వికీసోర్స్|కాశీయాత్ర చరిత్ర}}

==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://ia331330.us.archive.org/3/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf కాశీయాత్రచరిత్ర పూర్తి పుస్తకం పీడిఎఫ్]
*[http://ia331330.us.archive.org/3/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf కాశీయాత్రచరిత్ర పూర్తి పుస్తకం పీడిఎఫ్]

01:35, 19 అక్టోబరు 2015 నాటి కూర్పు

1869 ముద్రణ ముఖచిత్ర పరిచయం
దిగవల్లి వేంకటశివరావు సంపాదకత్వంతో 1941లో ముద్రింపబడిన ప్రతి, మరల 1991లో ముద్రింపబడింది
ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంతో సంక్షిప్తీకరింపబడిన ప్రతి (తెలుగు విశ్వవిద్యాలయం)

కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

ఏనుగుల వీరాస్వామయ్య

శ్రీ ఏనుగుల వీరాస్వామి అనే మహాపురుషుడు మద్రాసు నుండి కాశీకి రెండుసార్లు కాలి మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ వివరాలు ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర అనే గ్రంథంగా తర్వాతి కాలంలో అంటే 1838 లో కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లై అనే విద్వాంసుడు అచ్చు వేయించాడు. శ్రీ వీరాస్వామి మద్రాసు సుప్రీం కోర్టు శాఖలో ఇంటర్‌ప్రిటర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆయనకు ధర్మబుద్ధి, పలుకుబడి ఎక్కువే. సకుటుంబ సపరివారంగా డేరాలతో సహా ఆయన చేసిన ప్రయాణాలలో మనకు అద్భుతం కల్గించే అంశాలు ఎన్నో ఉన్నాయి. 1941 లో దిగవల్లి వేంకట శివరావు ఈ గ్రంథాన్ని సంస్కరించి ఎన్నో క్లిష్టతరమైన ఆలనాటి తెలుగు-ఉరుదూ-తమిళం కలిసియున్న మాటలకు అర్ధములతో సరళమైన తెలుగు భాషలో వెలువరించి 3 వ సంకలనము ప్రచురించారు. వీరస్వామి వ్రాసింది తెలుగు భాషలోనే. ఐతే అది రెండు వందల సంవత్సరాల నాటి జనవ్యవహార భాష కావటంతో మూడవసంకలనములో చేసిన సంస్కరణలుకు భాషా శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం లభించి, గిడుగు రామమూర్తి పంతులుగారి మన్ననలకు పాత్రమయింది. వెళ్ళేటప్పుడు మద్రాసు, హైదరాబాద్‌, నాగపూర్‌, అలహాబాదుల మీదుగా వీరాస్వామిగారు కాశీ చేరారు. వచ్చేటప్పుడు గయ, ఛత్రపురం, భువనేశ్వర్‌, విశాఖపట్నం, ఒంగోలు, కావలి, నెల్లూరు మీదుగా సాగరతీరం వెంట మద్రాసు చేరారు. లొదటి రెండు సంకలనములలో లేనివి ఈ 1941 మూడవ సంకలనములో ఏనెన్నో విశేషములు కలువ. క్షేత్ర మహాత్మ్య కధలు, తీర్ధశార్ధ విధులు మతధర్మ చర్చలు, దేశచరిత్రాంశములు, గ్రంధకర్త జీవితవిశేషములు, రాజకీయ సాంఘిక పరిస్తితులను గూర్చి వివరణ, 39 పుటల అకారాది సూచిక, అనేక చిత్రపఠములు కలవు. 3వ సంకలన మొదటిముద్రణ లో యాత్ర మార్గసూచికాపఠము(route map) లేదు. దిగవల్లి వేంట శివరావుగారు తన 94 వ ఏట ఆ మార్గసూచికాపఠమును (route map)ను 1991లో ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ క్రొత్త ఢిల్లీ వారు చేసినరెండవముద్రణ లో జతచేయించారు. ఈ అమూల్య పుస్తకమును అనేక సాహిత్యకారులు, విద్వాంసులు సమీక్షించి బహుముఖముగా ప్రశంసించారు

కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత

యాత్రా క్రమం, విశేషాలు

  • అప్పటికి (1831-1832) బ్రిటిషు వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో రాజు ల క్రింద ఉండేది.
  • ఆనాటి వాడుకభాషలో సమకాలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా వ్రాయగలిగాడు.
  • అప్పటి సంస్థానాలలో, ఇంగ్లీషు రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా వ్రాశాడు.
  • విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా వ్రాశాడు.
  • కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, భిన్న ప్రాంతాలలో ఆర్ధిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.
  • పుప్పాడ లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.
  • హైదరాబాదు, శంషాబాద్, కంటోన్మెంట్ వంటి నేటి హైదరాబాద్ నగర ప్రాంతాల్లోని నాటి జనజీవనం గురించి ఆయన రాసిన విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

రచన నుండి కొన్ని ఉదాహరణలు

  • రచయిత ఉపమాక అగ్రహార వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు చెపుతూ ఆ ప్రాంత వాసులు దౌర్జన్యం చేయదలచినా కూడా తీయనైన మాటలను వీడరు అంటాడు

రచయిత వాడిన పదాలు

ముద్రణలు

  • చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన వీరాస్వామి యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై మొదటిసారిగా 1838 లో ముద్రించాడు.
  • ఈ గ్రంథం 1869 లో ద్వితీయ ముద్రణ పొందింది.
  • ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు అనేక వివరణలతో మూడవ సంకలనం ప్రచురించారు ఆంద్రగ్రంధాలయ ముద్రాక్షరశాలలో ముద్రించారు. ఈ మూడవ సంకలనం రెండవ ముద్రణ తిరిగి 1991లో ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు క్రొత్త ఢిల్లీ లో ముద్రించారు.

మూలాలు, వనరులు


Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


బయటి లింకులు