వి.కె.ఆదినారాయణ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1917 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 7: పంక్తి 7:


[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
[[వర్గం:1917 జననాలు]]

13:47, 25 అక్టోబరు 2015 నాటి కూర్పు

దస్త్రం:Vkadinarayanareddy.jpg
వి.కె.ఆదినారాయణ రెడ్డి

వి.కె.ఆదినారాయణ రెడ్డి ( వలిపిరెడ్డి గారి కొండారెడ్డి గారి ఆదినారాయణరెడ్డి) అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్యసమరయోధుడు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు.

జీవిత విశేషాలు

ఇతడు అనంతపురం జిల్లా, పెద్దపప్పూరు మండలం, చీమలవాగుపల్లిలో 1917, అక్టోబర్ 8వ తేదీన వి.కె.రంగప్ప, వి.కె.రంగమ్మ దంపతులకు జన్మించాడు. చీమలవాగుపల్లిలో ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత ఇతడూ తాడిపత్రి హైస్కూలులో సెకండ్ ఫారమ్‌ వరకు చదివాడు. తరువాత గుత్తిలోని లండన్ మిషన్ హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివాడు. వల్లూరు రామారావు అనే ఆయన ప్రేరేపణతో స్వాతంత్ర్యం కోసం పోరాడే కాంగ్రెస్ రాజకీయాలవైపు ఆకర్షితుడైనాడు. 1937లో జరిగిన మద్రాసు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున గ్రామాలు తిరిగి ప్రచారం చేశాడు. తమ సామాజిక వర్గం నుండి, బంధువుల నుండి జస్టిస్ పార్టీని బలపరచాలని వత్తిడి వచ్చినా స్వతంత్రం కోసం పోరాడే కాంగ్రెస్ కే ప్రచారం చేశాడు. 1937లో గుంటూరు జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య మహాసభల పిలుపు మేరకు గుత్తి హైస్కూలులో డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా సమ్మె చేయించాడు. ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు ముగిసిన తర్వాత సెలవులలో అమ్మ, మాలపల్లి మొదలైన నవలలు చదివి మానవతావాదల వైపు, అతివాద భావాలవైపు ఆకర్షితుడైనాడు. అనంతపురంలోని దత్తమండల కళాశాలలో 1938లో చేరినప్పుడు ఇతడిని విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నారు. జిల్లా యువజన సంఘం తరఫున నీలం రాజశేఖరరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, ఏటుకూరి బలరామమూర్తిలతో జరిగిన శిక్షణా తరగతులలో ఇతడు పాల్గొన్నాడు. గుత్తి రామకృష్ణ ఇతనితో పరిచయం పెంచుకుని కమ్యూనిస్టు సాహిత్యం అందజేసేవాడు. నెహ్రూ వ్రాసిన లెటర్స్ టు ఇందిర, గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా మొదలైన పుస్తకాలు చదివి రష్యా గొప్పతనం, కమ్యూనిజం గొప్పతనం తెలుసుకున్నాడు. వాటీజ్ టుబి డన్ వంటి మార్క్సిస్టు పుస్తకాలు చదివాడు. 1940 వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఫలితంగా 1941లో మూడునెలలపాటు బళ్లారి జైలులో , అలీపురం జైలులో శిక్ష అనుభవించాడు. 1942 జూలై నెలలో కలరా తీవ్రంగా వ్యాపించింది. ఈ సమయంలో జిల్లా విద్యార్థి సమాఖ్య తరఫున ఇతడు తీవ్రంగా శ్రమించాడు. దళాలుగా పల్లెటూర్లకు వెళ్లి ఆరోగ్యసూత్రాల బోధన, త్రాగు నీటిని శుభ్రపరచడం, కలరా టీకాలు వేయించడం, అన్నివస్తువులను కంట్రోలు ధరలకు అమ్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టాడు. 1942 ఆగస్ట్ పిలుపును అందుకొని ఇతని నాయకత్వంలో దత్తమండల కళాశాలలో సమ్మె జరిగింది. 1942 సెప్టెంబర్ 10న పరీక్షల చివరిరోజున దత్తమండల కళాశాల లేబరేటరీని ఎవరో తగలబెట్టారు. లక్షరూపాయల నష్టం వాటిల్లింది. పోలీసులు వెంటనే ఇతడితో సహా 8 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ కేసు సందర్భంగా మూడునెలలు సబ్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో బళ్లారి రాఘవాచారి, నగరూరి నారాయణరావు ముద్దాయిల తరఫున వాదించి కేసును కొట్టివేయించారు. 1942 చివర్లో జిల్లా కమ్యూనిస్టు పార్టీ కమిటీలో ఇతడిని సభ్యుడిగా ఎన్నుకున్నారు. పార్టీ సూచనమేరకు పుట్లూరు మండలం కరువు సహాయక పనుల్లో పాల్గొనడానికి వెళ్లి తనపై వారెంటు ఉన్నదనే సమాచారం అందుకుని అజ్ఞాతంలో వెళ్లిపోయాడు. అజ్ఞాతంలో ఉంటూనే రైతుసంఘ నిర్మాణానికి, హమాలీ సంఘ యూనిట్ నిర్మాణానికి, ఆదోని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిర్మాణానికి, గుంతకల్లు రైల్వేవర్కర్స్ యూనియన్ బలోపేతానికి దోహదపడ్డాడు. 1943 కరువులో రాష్ట్ర రైతుసంఘం వాలెంటీర్లతో ఉరవకొండ, గుంతకల్లు, ఆదోని ప్రాంతాలలో కరువు పనులు పర్యవేక్షించాడు. 1946 మద్రాసు శాసనసభ ఎన్నికలనాటికి ఇతడు అజ్ఞాతవాసం నుండి అనంతపురం తిరిగివచ్చాడు. ఆ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గెలుపుకై ధర్మవరం ఏరియాలో ప్రచారం చేశాడు.

స్వాతంత్ర్యానంతరం ఇతడు జిల్లా కమ్యూనిస్టుపార్టీ నాయకుడిగా, వ్యవసాయ కూలీ సంఘం బాధ్యుడిగా, రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, జాతీయ సమితి సి.పి.ఐ కంట్రోలు కమీషన్ సభ్యుడిగా, విశాలాంధ్ర విజ్ఞాన సమితి గవర్నింగ్ బాడీ సభ్యుడిగా తన సేవలను అందించాడు. 1962లో గుత్తి నియోజకవర్గం నుండి శాసన సభకు ఎన్నికైనాడు.