గోల్కొండ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 216: పంక్తి 216:


==మార్గం==
==మార్గం==
[[File:17202 Guntur bound Golconda Express at Aler 03.jpg|thumb|950px|center|17202 గుంటూరు హద్దుతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నల్గొండ జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషను ప్రవేశిస్తున్న చిత్రం ]]
[[File:17202 Guntur bound Golconda Express at Aler 03.jpg|thumb|950px|center|<center>'''17202 గుంటూరు హద్దుతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నల్గొండ జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషను ప్రవేశిస్తున్న చిత్రం'''<center/> ]]





15:11, 25 అక్టోబరు 2015 నాటి కూర్పు

గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు మధ్య నడిచే ఇంటర్ లింక్ ఎక్స్ ప్రెస్. 17201/17202 నెంబర్లతో నడిచే ఈ రైలు భారతీయ రైల్వేలకు చెందిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్ కు చెందినది. మొత్తం 383 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు సుమారు 8 గంటల సమయం తీసుకుంటూ నెమ్మదిగా ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందింది. సికింద్రాబాద్, గుంటూరు మధ్య ఉన్న మొత్తం 24(గుంటూరు, సికింద్రాబాద్ సహా) స్టేషన్లలోనూ ఈరైలు ఆగుతుంది.

పేరు

హైదరాబాద్ నగరంలోని చారిత్రక గోల్కొండ కోట పేరును ఈ రైలుకు పెట్టారు. గోల్కొండ కోట హైదరాబాద్ లోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. హైదరాబాద్ ను పరిపాలించి కుతుబ్ షాహీల పాలన లో గోల్కొండ కోటను నిర్మించారు.

రికార్డులు

1973లో ప్రారంభించిన ఈ రైలు అప్పట్లో భారత దేశంలోనే అతి వేగంగా ఆవిరితో నడిచే ప్యాసింజర్ రైలుగా రికార్డుల్లోకి ఎక్కింది.[1]

సమయ పట్టిక

గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరు- సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ఈ క్రింది సమయ పట్టికను అనుసరించి నడుస్తుంది

సంఖ్య స్టేషన్

పేరు(కోడ్)

రాక బయలుదేరుట ఆగు

సమయం

ప్రయాణ దూరం
1 గుంటూరు

జంక్షన్ (GNT)

ఆరంభం 05:45 0 0 కి.మీ.
2 గోగాముక్

(PDKN)

05:52 05:53 1 ని. 6 కి.మీ.
3 నంబూరు

(NBR)

05:59 06:00 1 ని. 9 కి.మీ.
4 మంగళగిరి

(MAG)

06:10 06:11 1 ని. 20 కి.మీ.
5 విజయవాడ

జంక్షన్ (BZA)

06:45 07:00 15 ని. 32 కి.మీ.
6 రాయనపాడ్

(RYP)

07:13 07:14 1 ని. 44 కి.మీ.
7 కొండపల్లి

(KI)

07:28 07:29 1 ని. 50 కి.మీ.
8 ఎర్రుపాలెం

(YP)

07:46 07:47 1 ని. 74 కి.మీ.
9 మధిర

(MDR)

07:59 08:00 1 ని. 89 కి.మీ.
10 బోనకలు

(BKL)

08:13 08:14 1 ని. 105 కి.మీ.
11 ఖమ్మం

(KMT)

08:35 08:36 1 ని. 134 కి.మీ.
12 డోర్నకల్

జంక్షన్ (DKJ)

08:54 08:55 1 ని. 156 కి.మీ.
13 గార్ల

(GLA)

09:00 09:01 1 ని. 161 కి.మీ.
14 మహబూబాబాద్

(MABD)

09:15 09:16 1 ని. 180 కి.మీ.
15 కే

సముద్రం (KDM)

09:27 09:28 1 ని. 196 కి.మీ.
16 నెక్కొండ

(NKD)

09:40 09:41 1 ని. 211 కి.మీ.
17 వరంగల్

(WL)

10:13 10:15 2 ని. 241 కి.మీ.
18 కాజీపేట్

జంక్షన్ (KZJ)

10:33 10:35 2 ని. 251 కి.మీ.
19 ఘన్

పూర్ (GNP)

10:56 10:57 1 ని. 271 కి.మీ.
20 జనగామ్

(ZN)

11:14 11:15 1 ని. 299 కి.మీ.
21 ఆలేర్

(ALER)

11:29 11:30 1 ని. 313 కి.మీ.
22 భువనగిరి

(BG)

11:59 12:00 1 ని. 336 కి.మీ.
23 మౌలాలీi

(MLY)

12:38 12:40 2 ని. 377 కి.మీ.
24 సికింద్రాబాద్

జంక్షన్ (SC)

13:45 ముగింపు 0 383 కి.మీ.

విజయవాడ రైల్వే స్టేషన్ లో ఈ రైలు 15 నిమిషాల పాటు ఆగుతుంది. ఇక మిగతా అన్ని స్టేషన్లలో కేవలం 1 నిమిషం నుంచి 2 నిమిషాల సేపు మాత్రమే ఆగుతుంది.

మార్గం

17202 గుంటూరు హద్దుతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నల్గొండ జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషను ప్రవేశిస్తున్న చిత్రం


గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరు లో ఉదయం 5:45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 13:45గంటలకు చేరుతుంది[2]. తిరుగు ప్రయాణంలో రెండవ రేక్ రైలు సికింద్రాబాద్ లో మధ్నాహ్నం 13:05 గంటలకు బయలు దేరి గుంటూరు స్టేషన్ కు రాత్రి 21:20 గంటలకు చేరుతుంది. నల్గొండ జిల్లాలోని ఆలేర్ రైల్వే స్టేషన్ , విజయవాడ, వరంగల్ మరియు కాజీపేట స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.

రైలు ప్రమాదాలు

జులై 2, 2003 ఉదయం వరంగల్ సమీపంలో గొల్గొండ ఎక్స్ ప్రెస్ రైలు వంతెన పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో కనీసం 21 మంది ప్రయాణికులు చనిపోయారు.[3][4] 1999లోనూ అప్పటి ఆంధ్రప్రదేశ్(ప్రస్తుతం తెలంగాణ) రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఘన్ పూర్(స్టేషన్) సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది.

మూలాలు

  1. Bryan Morgan (1985), The Great Trains, Rh Value Publishing, p. 206
  2. "Golconda Express timetable". cleartrip.com. Retrieved 2015-07-21.
  3. "Golconda Express toll rises to 21". Rediff. July 3, 2003. Retrieved 2015-07-21.
  4. V Subrahmanyam and D Krishna Reddy (July 2, 2003). "Golconda Express derails, 18 dead". Retrieved 2015-07-21.