రోజా సెల్వమణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 106.220.191.159 (చర్చ) చేసిన మార్పులను సుల్తాన్ ఖాదర్ యొక్...
పంక్తి 73: పంక్తి 73:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


==ఇతర లింకులు
==ఇతర లింకులు==
==
* {{IMDb name|id=0737730|name=Roja}}
* {{IMDb name|id=0737730|name=Roja}}
{{Use dmy dates|date=June 2011}}
{{Use dmy dates|date=June 2011}}

18:24, 29 డిసెంబరు 2015 నాటి కూర్పు

రోజా
రోజా సెల్వమణీ
జననం
లతారెడ్డి

(1972-11-17) 1972 నవంబరు 17 (వయసు 51)
తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిసినిమా నటి
రాజకీయవేత్త
క్రియాశీల సంవత్సరాలు1992-ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామిఆర్.కె.సెల్పమణి
పిల్లలు2

రోజా సెల్వమణి (Roja Selvamani) - (జ.నవంబర్ 17, 1972)దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి మరియు రాజకీయవేత్త.[1] ఈమె ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో నాయకురాలు[2]

జీవిత విశేషాలు

రోజా సెల్వమణి (Roja Selvamani) - (జ.నవంబర్ 17, 1972) తెలుగు సినిమా నటి. చిత్తూరు జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004 ,2009 శాసనసభ ఎన్నికలలోనగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు.2014 శాసనసభ ఎన్నికలలోనగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు.

రోజా తండ్రి కుమారస్వామిరెడ్డి .శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. చిత్తూరు జిల్లాలోనే పుట్టినా హైదరాబాద్‌లో కుటుంబం స్థిర పడింది. రోజా మొదట తమిళచిత్రంలో నటించింది. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్‌కే సెల్వమణి రూపొందించాడు. ‘చంబరతి’ పేరుతో విడుదలైన ఆ చిత్రంలో హీరో ప్రశాంత్‌.

ఆ సినిమా తమిళంలో మ్యుజికల్‌ హిట్‌. తెలుగులో చేమంతి కింద డబ్‌చేయబడింది. అయితే తెలుగులో మాత్రం రోజా తొలి చిత్రం ప్రేమ తపస్సు లో నటించింది. రోజా ఆర్‌కే సెల్వమణిని పెళ్లిచేసుకుంది. జయప్రదను ఆదర్శంగా తీసుకుని రోజా తెలుగుదేశం పార్టీలో చేరింది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన వ్యక్తిగత విమర్శలు చేసి తాను కూడా విమర్శల పాలయ్యారు. తెలుగు దేశం మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు.చివరకు రాజీనామా చేశారు.రాజశేఖరరెడ్డి తో భేటీ అయ్యి కాంగ్రెస్‌ తీర్థం అందుకోవడమే తరువాయి అని భావిస్తున్న తరుణంలో గంగాభవాని రోజాపై విమర్శలు చేశారు[3]

వ్యక్తిగత జీవితం

రోజా గారి తండ్రి పేరు కుమారస్వామి రెడ్డి, చిత్తూరు జిల్లాలో నివాసులు. ప్రస్తుతం హైదరాబాద్ లో కుటుంబంతో సహా నివాసం ఏర్పరచుకున్నారు. రోజా నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రం లో పట్టభద్రులయ్యారు. కొన్ని సంవత్సరాలు, రోజా కూచిపూడి నృత్యాన్ని అభ్యశించారు. చినతనంలో, రోజా గారి స్వరం గద్గదం గా ఉండుటవలన, చాలామంది చిత్ర పరిశ్రమకి వెళ్ళవద్దని నిరుత్సాహ పరిచారు.

రోజా తమిళ చిత్ర దర్శకుడు ఆర్.కె.సెల్వమణి ని వివాహమాడారు. గతం లో తెలుగు దేశం పార్టీ లో మహిళా అధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియొజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2014 నవంబరులో నగరి నియోజకవర్గం వైయస్సార్ పార్టీ తరపు నుండి పోటి చేసి MLA గా గెలుపొందారు.

రోజా అభిరుచులు వస్త్రాలంకరణ మరియు కేశాలంకరణ. రోజా మరియు మీనా చాలా మంచి స్నేహితులు. చిన్నతనంలో రోజా మరియు మీనా ఒకరినొకరు పోలి ఉండేవారు. పలు చిత్రాలలో మీనా రొజాకి చెల్లెలిగా నటించారు.

నట జీవితం

రోజా తెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. డాక్టర్‌ శివప్రసాద్‌ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్‌ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు.

తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కె.సెల్వమణి గారు చెంబరుతి చిత్రం ద్వారా పరిచయం చేశారు, ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నరు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా మోడ్రన్ మహాలక్ష్ములు(మా టీవీ), జబర్దస్త్(ఈ టీవి) వంటి కర్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు.

చిత్ర సమాహారం

తెలుగు

తమిళం

మూలాలు

ఇతర లింకులు

మూస:TamilNaduStateAwardForBestActress