Coordinates: 16°23′57″N 79°46′03″E / 16.399201°N 79.76738°E / 16.399201; 79.76738

ఒప్పిచర్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 150: పంక్తి 150:
[14] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-20; 4వపేజీ.
[14] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-20; 4వపేజీ.
[15] ఈనాడు గుంటూరు రూరల్; 2016,జనవరి-5; 4వపేజీ.
[15] ఈనాడు గుంటూరు రూరల్; 2016,జనవరి-5; 4వపేజీ.
[16] ఈనాడు గుంటూరు రూరల్; 2016,జనవరి-22; 5వపేజీ.
{{కారంపూడి మండలంలోని గ్రామాలు}}
{{కారంపూడి మండలంలోని గ్రామాలు}}



11:02, 25 జనవరి 2016 నాటి కూర్పు

ఒప్పిచెర్ల
—  రెవిన్యూ గ్రామం  —
ఒప్పిచెర్ల is located in Andhra Pradesh
ఒప్పిచెర్ల
ఒప్పిచెర్ల
అక్షాంశ రేఖాంశాలు: 16°23′57″N 79°46′03″E / 16.399201°N 79.76738°E / 16.399201; 79.76738
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం కారంపూడి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,157
 - పురుషుల సంఖ్య 3,604
 - స్త్రీల సంఖ్య 3,553
 - గృహాల సంఖ్య 1,923
పిన్ కోడ్ 522 614
ఎస్.టి.డి కోడ్ 08649

ఒప్పిచెర్ల, గుంటూరు జిల్లా, కారంపూడి మండలానికి చెందిన గ్రామము.పిన్ కోడ్ నం. 522 614., ఎస్.టి.డి.కోడ్ = 08649.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

పేటసన్నిగండ్ల 2 కి.మీ, నర్మలపాడు 4 కి.మీ, పెదకొదమగుండ్ల 8 కి.మీ, చినకొదమగుండ్ల 8 కి.మీ, చినగార్లపాడు 9 కి.మీ,

సమీప మండలాలు

ఉత్తరాన దాచేపల్లి మండలం, తూర్పున పిడుగురాళ్ల మండలం, పశ్చిమాన దుర్గి మండలం, ఉత్తరాన మాచవరం మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

  1. ఈ పాఠశాల నిర్మాణదాత డాక్టర్ గాడిపర్తి అచ్చయ్య గారు. [7]
  2. ఈ పాఠశాలలో చదువుచున్న మక్కెన శివపార్వతి అను విద్యార్ధిని, అండర్-17 విభాగంలో, నవంబరు 2013 చివరి వారంలో, మెదక్ లో నిర్వహించే అంతర్ జిల్లాల వాలీబాలు పోటీలలో గుంటూరుజిల్లా తరపున పాల్గొనుటకు ఎంపికైనది. [3]
  3. ఈ పాఠశాలకు చెందిన రెబ్బలపల్లి శివలక్ష్మి అను విద్యార్ధిని, ఇటీవల కొల్లిపర మండలం తూములూరులో నిర్వహించిన ఎంపిక పోటీలలో, అండర్-14 విభాగంలో తన ప్రతిభ కనబరచి, రాష్ట్రస్థాయి స్కూల్ గేంస్ ఫెడరేషన్ వాలీబాల్ పోటీలకు, గుంటూరు జిల్లా జట్టు తరపున పాల్గొనేటందుకు ఎంపికైనది. ఈమె అక్టోబరు/2015లో కడప పట్టణంలో నిర్వహించు అంతర్ జిల్లాల వాలీబాల్ పోటీలలో పాల్గొంటుంది. [14]
  4. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న తమ్మిశెట్టి శ్రీనివాసరావు అను విద్యార్ధి మరియు బొమ్మనబోయిన అనూష అను విద్యార్ధిని, 2015,జనవరి-10 నుండి 12 వరకు అనంతపురం జిల్లాలోని ఉరవకొండ గ్రామములో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్-జూనియర్ ఖో-ఖో పోటీలలో, అండర్-14 విభాగంలో పాల్గొని, తమ ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2016,ఫిబ్రవరి లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో, రాష్ట్ర జట్టులో పాల్గొంటారు. [16]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం

గ్రామంలోని స్మశానపేటలో ఈ కేంద్రం రు. 9.5 లక్షలతో నిర్మించడానికి, రెండు సంవత్సరాల క్రితం, భూమిపూజ నిర్వహించినారు. 8 నెలల క్రితం భవన నిర్మాణం పూర్తి అయి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. [8]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

  1. ఎర్ర చెరువు:- ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమం క్రింద, ఈ చెరువులో పూడికతీత పనులను, ప్రారంభించినారు. నాలుగు లక్షల రూపాయల నిధులతో, ఈ చెరువులో ఇంతవరకు 3,000 క్యూబిక్ మీటర్ల పూడిక్ మట్టిని త్రవ్వితీసినారు. ఈ విధంగా చేయడం వలన, చెరువులో నీటినిలున సామర్ధ్యం పెరుగుతుంది. ఈ మట్టిలో పొషకాలు అధికంగా ఉన్న ఈ మట్టిని రైతులు తమ పొలాలకు ట్రాక్టర్లతో తరలించుకొని పోవుచున్నారు. అందువలన, పొలాలకు కృత్రిమ ఎరువుల అవసరం అంతగా ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుచున్నారు. [11]
  2. నల్ల చెరువు:- గ్రామములోని ఈ చెరువులో, 2003 లో అప్పటి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమంలో భగంగా పూడికతీత కార్యక్రమం చేపట్టినది. దీనివలన, ఇప్పటి వరకు, గ్రామంలోని త్రాగు/సాగునీటి అవసరాలను ఈ చెరువు తీర్చినది. ఇప్పుడు మరియొకసారి ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో, పూడికతీయడానికి, 4.75 లక్ష్లల రూపాయలతో ముందుకు వచ్చినది. పూడిక మట్టి నల్లరేగడి కావడంతో, రైతులు పొలాలకు తరలించుచూ, బలోపేతం చేసుకొనుచున్నారు. ఇదే క్రమంలో గ్రామస్థులు, చెరువులో పెరుగుచున్న జమ్మును స్వచ్ఛందంగా తొలగించుచున్నారు. [12]

గ్రామ పంచాయతీ

ఈ గ్రామానికి చెందిన శ్రీ పాలకుర్తి శ్రీను, గొర్రెల కాపరి వృత్తి చేయుచూ జీవనం సాగించుచున్నారు. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఈయన, సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు, మొదటిసారి ఏర్పడిన కారంపూడి మండల సర్పంచిల సంఘానికి కోశాధికారిగా ఎన్నికైనారు. [4]&[5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. ప్రతి మాఘ బహుళ పంఛమి నాడు తిరునాళ జరుగుతుంది. కరెంటు ప్రభలు డాన్సులు నాటకాలు వుంటాయి. అందరు అప్పుడు కలుసుకుంటారు. అనేక వేల ఏల్లక్రితమే కాకతీయుల జాయపసెనాని సహాయముతొ పోతినెని బఛువారు దేవతలబావి నిర్మించారని శాసనాలలొ వుంది దాని ఎదురు మండపాలు వున్నాయట.
  2. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల ఆలయం:- ఈ ఆలయంలో, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కళ్యాణవేడుకలు ప్రతి సంవత్సరం మాఘమాసంలో, బహుళ పక్షoలో జరుగును. మరుసటి రోజు శివపార్వతుల కళ్యాణం, తరువాత గ్రామోత్సవం, ప్రభల ఊరేగింపు, భజన కార్యక్రమాలు జరుగును. 2015,ఫిబ్రవరి-10, మంగళవారం నిర్వహించినది, స్వామివారి 44వ వార్షికోత్సవం. [9]
  3. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వరస్వామివారి ఆలయం.
  4. శ్రీ ధనమల్లేశ్వరస్వామివారి ఆలయం.
  5. శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో ప్రతిష్ఠించనున్న పంచముఖ ఆంజనేయస్వామి మూలవిరాట్టు, నవగ్రహాలు, జీవధ్వజ, శిఖర గోపురాలకు, 2015,మే నెల-8వ తేదీ శుక్రవారంనాడు, గ్రామోత్సవం నిర్వహించినారు. ఈ క్రమంలో దేవాలయంలో నిర్మించిన యాగశాలలో, వేదపండితులు, హోమక్రతువులు, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు, ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించినారు. అనంతరం 2015,జూన్-21వ తేదీ ఆదివారంనాడు, మండల ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించినారు. [10]&[13]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

గ్రామ విశేషాలు

  1. ఈ గ్రామములో పదివేల వరకు జనాభా వుంటుంది. ఇక్కడ రైతులలో కమ్మ, తెలగ వుంటారు.కమ్మవారు ఎక్కువ.ఇక్కద దాదాపు భారతీయ తెలుగు కులాలన్నీ వున్నాయి. అందరు కలసి అనందించే యస్.పేట ఇక్కడ వుంది.
  2. 2016,జనవరి-4వ తేదీనాడు, ఈ గ్రామంలోని రైతుల బృందానికి, రు. 16,75,000 విలువైన వరి కోత యంత్రాన్ని, రు. 10 లక్షల రాయితీతో వ్యవసాయాధికారులు, పంట సంజీవని పథకం ద్వారా అందజేసినారు. [15]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7.020.[1] ఇందులో పురుషుల సంఖ్య 3,554, స్త్రీల సంఖ్య 3,466, గ్రామంలో నివాస గృహాలు 1,642 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 2,057 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 7,157 - పురుషుల సంఖ్య 3,604 - స్త్రీల సంఖ్య 3,553 - గృహాల సంఖ్య 1,923
  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

మూలాలు

వెలుపలి లింకులు

[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,నవంబరు-12; 5వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2013,డిసెంబరు-17; 4వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,జనవరి-20; 5వపేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-13; 4వపేజీ. [7] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-22; 4వపేజీ. [8] ఈనాడు గుంటూరు రూరల్; 2014,డిసెంబరు-5; 4వపేజీ. [9] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఫిబ్రవరి-11; 5వపేజీ. [10] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మే-9; 4వపేజీ. [11] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మే-30; 5వపేజీ. [12] ఈనాడు గుంటూరు రూరల్; 2015,జూన్-19; 4వపేజీ. [13] ఈనాడు గుంటూరు రూరల్; 2015,జూన్-22; 4వపేజీ. [14] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-20; 4వపేజీ. [15] ఈనాడు గుంటూరు రూరల్; 2016,జనవరి-5; 4వపేజీ. [16] ఈనాడు గుంటూరు రూరల్; 2016,జనవరి-22; 5వపేజీ.