Coordinates: 16°13′04″N 80°54′32″E / 16.217642°N 80.908756°E / 16.217642; 80.908756

మొవ్వ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 136: పంక్తి 136:
===బ్యాంకులు===
===బ్యాంకులు===
#ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం.08671/252432. సెల్=9912223826.
#ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం.08671/252432. సెల్=9912223826.
#విజయ బ్యాంక్:- మొవ్వ గ్రామములో ఈ బ్యాంక్ శాఖను, 2016,జనవరి-22వ తేదీ శుక్రవారం ఉదయం 10-35 గంటలకు ప్రారంభించినారు. []
#విజయ బ్యాంక్:- మొవ్వ గ్రామములో ఈ బ్యాంక్ శాఖను, 2016,జనవరి-22వ తేదీ శుక్రవారం ఉదయం 10-35 గంటలకు ప్రారంభించినారు. [16]


==గ్రామములో వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామములో వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==

14:14, 25 జనవరి 2016 నాటి కూర్పు

మొవ్వ
—  రెవిన్యూ గ్రామం  —
దస్త్రం:Http://www.thehindu.com/multimedia/dynamic/01333/18DFRKSHETRAGYA ST 1333343g.jpg
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మొవ్వ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 5,653
 - పురుషుల సంఖ్య 3,174
 - స్త్రీల సంఖ్య 3,103
 - గృహాల సంఖ్య 1,673
పిన్ కోడ్ 521 135
ఎస్.టి.డి కోడ్ 08671
మొవ్వ
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో మొవ్వ మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో మొవ్వ మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో మొవ్వ మండలం స్థానం
మొవ్వ is located in Andhra Pradesh
మొవ్వ
మొవ్వ
ఆంధ్రప్రదేశ్ పటంలో మొవ్వ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°13′04″N 80°54′32″E / 16.217642°N 80.908756°E / 16.217642; 80.908756
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం మొవ్వ
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 56,259
 - పురుషులు 28,118
 - స్త్రీలు 28,341
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.79%
 - పురుషులు 75.71%
 - స్త్రీలు 63.94%
పిన్‌కోడ్ 521135

మొవ్వ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 521 135., యస్.టీ.డీ.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ఈ గ్రామము దివి తాలూకా లో విద్యా రాజధాని గా ప్రసిద్ధి. ఈ గ్రామం లోని విద్యా సంస్థలు చుట్టు పక్కల గ్రామాలన్నిటికి నాణ్యత గల విద్యను అందిస్తున్నాయి.

పాఠశాలలు & కళాశాలలు

వేమూరి సుందర రామయ్య ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి. కళాశాల

క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల

  1. ఈ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకులైన శ్రీ వేమూరి శివనాగేశ్వరరావు, గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే, రాష్ట్రస్థాయిఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికైనారు. 2014,సెప్టెంబరు-5న గుంటూరులోని పెరేడ్ గ్రౌండ్సులో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రమంత్రుల నుండి, వీరీ పురస్కారాన్ని, ప్రశంసాపత్రాన్నీ అందుకుంటారు. ఇంతకుముందు వీరు, 2014,ఆగష్టు15, స్వాతంత్ర్య దినోత్సవం రోజున జిల్లా కలక్టరుగారి చేతులమీదుగా, జిల్లాస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకున్నారు. వీరు కళాశాలలో 100% ఉత్తీర్ణతకు కృషిచేయడమేగాక, సెలవురోజులలోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించుచూ విద్యాభివృధికి కృషిచేయుచున్నారు. [7]
  2. కార్పొరేటు కళాశాలకు దీటుగా విద్యాబోధన జరుచున్న ఈ కళాశాలలో ప్రస్తుతం 550 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నారు. గత ఏడు సంవత్సరాలుగా, 4 సార్లు రాష్ట్రస్థాయిలో, మిగిలిన మూడు సంవత్సరాలు జిల్లాస్థాయిలో, ప్రధమస్థానంలో, ఫలితాలు సాధించినారు. [11]

మండవ కనకయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

బెంగళూరులోని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియంలో 2016,జనవరి-19 నుండి 23 వరకు నిర్వహించనున్న దక్షిణ భారతదేశ స్థాయి వైద్య,విఙానిక సదస్సులో పాల్గొనడానికి ఈ పాఠశాల విద్యార్ధుల బృందం ఎంపికైనది. [13]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

లాల్ బహదూర్ విద్యాలయం

ఇమ్మానుయేలు మిషన్ స్కూలు

హోలీ స్పిరిట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల

2015,అగష్టు-22,23 తేదీలలో ఏలూరులోని టొబాకో మర్చంట్స్ హాలులో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీలలో, ఈ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్ధులు, 4 పతకాలు గెల్చుకున్నారు. [12]

పి.హెచ్.డబ్ల్యు.పాఠశాల

శాఖా గ్రంధాలయం

  1. ఈ పురాతన గ్రంధాలయాన్ని, చాలా సంవత్సరాల క్రితం, గ్రామానికి చెందిన శ్రీ మండవ వెంకటరంగయ్య ఙాపకార్ధం, ఆయన భార్య శ్రీమతి ప్రసూనాంబ మరియు గ్రామస్థుల సహాకారంతో అప్పట్లో నిర్మించినారు. ఈ భవనం ప్రస్తుతం శిధిలావస్థకు చేరడంతో, నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలను మంజూరు చేసినది. ఇదిగాక కంప్యూటర్ల కొనుగోలుకు, 2011 లోనే, మరియొక 2.90 లక్షల రూపాయలను మంజూరు చేసినది. నూతన భవననిర్మాణానికి 16 నెలల క్రితమే శంఖుస్థాపన గూడా నిర్వహించినారు. కానీ ఇంతవరకు, భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కంప్యూటర్లూ కొనలేదు. [10]
  2. ఈ గ్రంధాలయానికి నూతన భవనం, నిర్మాణం పూర్తి అయి ప్రారంభానికి సిద్దంగా ఉన్నది. [15]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

బ్యాంకులు

  1. ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం.08671/252432. సెల్=9912223826.
  2. విజయ బ్యాంక్:- మొవ్వ గ్రామములో ఈ బ్యాంక్ శాఖను, 2016,జనవరి-22వ తేదీ శుక్రవారం ఉదయం 10-35 గంటలకు ప్రారంభించినారు. [16]

గ్రామములో వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013-జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ తాతినేని పిచ్చేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [8]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

ఈ గ్రామము లోని గోపాల స్వామి దేవాలయము చాలా పురాతనమైనది. ఈ ఊరి స్థలపురాణము ప్రకారం, మౌగల్య మహర్షి చేత ఇసుకతో ఇచటి మువ్వ గోపాల స్వామి విగ్రహం తయారుచేయబడెను. ఆ విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. అంతే కాక చదువు రాని వరదయ్య స్వామి కృప తో గొప్ప కవి అయ్యాడని ప్రతీతి. వరదయ్య వ్రాసిన శృంగార కవిత్వం ఎంతో ప్రసిద్ధి.

ఇక్కడి ఇతర దేవాలయాలు

  1. శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం (శివాలయం):- ఈ అలయంలో స్వామివారి మహాకుంభాభిషేకాలను, 5వ తేదీ శుక్రవారంనాడు, ప్రారంభించినారు. ముందుగా మహాగణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, ఋత్వికా వరుణ, యాగశాల ప్రవేశం, శాలాసంస్కారలు ధ్వజపతాక ఆవిష్కరణ, నవగ్రహ ఆరాధన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించినారు. 6వ తేదీ శనివారంనాడు, దేవతాహోమాలు నిర్వహించినారు. 7వ తేదీ ఆదివారం ఉదయం 8-48 గంటలకు, శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత శ్రీ భీమేశ్వరస్వామి మరియు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారలకు, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, నాగసుబ్రహ్మణ్యం, నందీశ్వర, బలిపీఠ ప్రతిష్ఠా మహోత్సవాలు, శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద్రేంద సరస్వతీస్వామివారు నిర్వహించెదరు. [9]
  2. శ్రీ రామాలయం.
  3. శ్రీ సిద్ధి గణపతి ఆలయం.
  4. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం.
  5. శ్రీ షిర్దీ సాయి ఆలయం.

పై ఆలయాలే కాక గ్రామ దేవతల ఆలయాలు మరి కొన్ని కలవు. ఈ కారణాన మొవ్వ ను దేవాలయాల గ్రామం (the village of temples) అని ప్రస్తావించెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

ప్రముఖులు

  1. క్షేత్రయ్య లేదా మొవ్వా వరదయ్య అని పిలువబడే 17వ శతాబ్దపు వాగ్గేయకారుడు.
  2. భారత జాతీయ పతాకం రూప కల్పన చేసిన పింగళి వెంకయ్య ఈ మండలములో నున్న భట్లపెనుమర్రు గ్రామమునకు చెందినవాడు.
  3. ఈ గ్రామానికి చెందిన శ్రీ మండవ జానకి రామయ్య కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఛైర్మన్. ఈయన ఇండియన్ డైరీ అసోసియేషన్ వారి ప్రతిష్టాత్మక 'కురియన్' అవార్డుకు యెన్నికయ్యాడు. జాతీయ స్థాయిలో ప్రతి యేటా అన్ని రాష్ట్రాలలో డెయిరీ రంగం అభివృద్ధికి కృషి చేసిన వారికి ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. 'ఫాదర్ ఆఫ్ మిల్క్ డెయిరీ' గా పేరొందిన డాక్టర్ కురియన్ పేరు మీద ఈ అవార్డుని ప్రదానం చేస్తున్నారు[1] వీరికి 2014,మార్చ్-31 ఉగాదిరోజున, విజయవాడలోని ఫన్ టైం క్లబ్ వారు, "కృష్ణరత్న" పేరుతో ఉగాది పురస్కారం అందజేసి, దుశ్శాలువతో సన్మానించారు. [6]
  4. అమెరికాలొ 8వ గ్రేడ్ విద్ద్యార్ధిని అయిన నందిపాటి స్నిగ్ధ ఈ వూరి బాలికయే. అమెరికాలో 2012 లొ నిర్వహించిన స్పెల్లింగ్-బీ పోటీలలో 2012 వ సంవత్సరానికి గాను జాతీయ ఛాంపియన్ గా ఎన్నిక అయింది. ఈ పోటీలలో ఎన్నిక అయిన మొదటి ముగ్గురు విద్యార్ధులూ భారతీయ అమెరికనులు కావటం విశేషం[2].
  5. ఈ గ్రామమునకు చెందిన కీ.శే.మండవ కనకయ్య, సీతారత్నం దంపతుల కుమారుడు శ్రీ మండవ బాబూరావు, అమెరికాలో చేసిన సమాజసేవను గుర్తించిన అ దేశప్రభుత్వం, 2011 లో వీరికి ప్రతిష్ఠాత్మక ఇల్లీస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని ప్రదానం చేసినది.[3]. వీరు జన్మభూమి స్ఫూర్తితో 50 లక్షల రూపాయల వితరణతో, మొవ్వ గ్రామభివృద్ధికి తోడ్పడటమే గాకుండా, అమెరికాలో 800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినారు. వీరు 2016,జనవరిలో పరమపదించినారు. [14]
  6. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ ఆదిరాల డేవిడ్ కుమార్, జాతీయ సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) పురస్కారం అందుకున్నారు. దళితుల అభివృద్ధికి పాటుబడే రచయితలనూ, సేవారంగంలో కృషిచేసినవారినీ ప్రోత్సహించే భారతీయ దళిత సాహిత్య అకాడమీ, 2012-13 సంవత్సరానికి గాను వీరిని ఎంపికచేసింది. న్యూఢిల్లీలోని పంచశీల ఆశ్రమంలో, 2013,డిసెంబరు-12న జరిగిన, 29వ జాతీయ దళిత రచయితల మహాసభలలొ, జాతీయ అకాడమీ అధ్యక్షులు దా.ఎస్.పి.సమనాక్షర్ చేతులమీదుగా, జాతీయస్థాయి సాహిత్య అకాడమీ అవార్డు అయిన, "డా.బి.ఆర్.అంబేడ్కర్ ఫెలోషిప్" ను అందుకున్నారు. [5]

మొవ్వ ఇంటిపేరుతో ప్రసిద్ధులు:- మొవ్వా వృషాధ్రిపతి.

గ్రామ విశేషాలు

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[4]

క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అవురుపూడి 338 1,300 655 645
2. అయ్యంకి 852 3,096 1,594 1,502
3. బర్లపూడి 187 616 312 304
4. భట్లపెనుమర్రు 901 3,206 1,581 1,625
5. చినముత్తేవి 693 2,435 1,224 1,211
6. గుడపాడు 295 1,081 520 561
7. కాజ 2,246 8,222 4,165 4,057
8. కోసూరు 1,579 5,625 2,809 2,816
9. కూచిపూడి 1,010 3,615 1,766 1,849
10. మొవ్వ 1,673 6,277 3,174 3,103
11. నిడుమోలు 1,640 6,350 3,227 3,123
12. పలంకిపాడు 209 701 356 345
13. పెదముత్తేవి 1,138 3,825 1,876 1,949
14. పెదపూడి 862 3,667 1,673 1,994
15. పెడసనగల్లు 1,019 3,512 1,796 1,716
16. వేములమాడ 495 1,721 824 897
17. యద్దనపూడి 354 1,280 636 644

గ్రామాలు

వనరులు

  1. ఈనాడు నవంబరు 23, 2011- 11వ పేజీ మరియు ది హిందూ దినపత్రిక ఏప్రిల్ 15, 2012, పేజీ-3
  2. ఈనాడు జూన్ 3, 2012, హాయ్ బుజ్జి పేజీ., ది హిందూ జూన్ 2, 2012, 14వ పేజీ.
  3. http://co107w.col107.mail.live.com /default.aspx?wa=wsignin1.0
  4. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

వెలుపలి లింకులు

[5] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-17; 11వపేజీ. [6] ఈనాడు విజయవాడ; 2014,ఏప్రిల్.1, 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2014,సెప్టెంబరు-3; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,మే నెల-12వతేదీ; 38వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,జూన్-6; 37వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,జూన్-19; 38వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-26; 23వపేజీ. [13] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-31; 15వపేజీ. [14] ఈనాడు అమరావతి; 2016,జనవరి-10; 27వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2016,జనవరి-20; 23వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మొవ్వ&oldid=1820193" నుండి వెలికితీశారు