బిరుదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 12: పంక్తి 12:
కవులను, రచయితలను వారు చేస్తున్న సాహిత్య కృషికి అభినందనీయంగా బిరుదులను ఇవ్వటం పరిపాటి. అవి మరింత ప్రోత్సాహాన్నిచ్చి మరింత కృషికి బాటలు వేస్తాయన్న ఉద్దేశ్యంతో బిరుదులను ఇవ్వడం సాంప్రదాయం.
కవులను, రచయితలను వారు చేస్తున్న సాహిత్య కృషికి అభినందనీయంగా బిరుదులను ఇవ్వటం పరిపాటి. అవి మరింత ప్రోత్సాహాన్నిచ్చి మరింత కృషికి బాటలు వేస్తాయన్న ఉద్దేశ్యంతో బిరుదులను ఇవ్వడం సాంప్రదాయం.

== బిరుదులు-స్వభావం ==
సాధారణంగా బిరుదులన్నీ గౌరవాన్ని పెంచటానికి ఇచ్చేవే. అవి పొందినవారికి సంతోషాన్ని హెచ్చించేవే. కవి సార్వభౌముడు, కవిచక్రవర్తి బిరుదులు ఇలాంటివే. కాని కొన్ని వీటికి భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉండటం కూడా ఒకటీ అరా గమనించవచ్చు. సాహితీ కృషీవల, తెనుగులెంక వంటి కొన్ని బిరుదులు వినయాన్ని, ఒదిగి ఉండటానికి ప్రతీకలుగా నిలిచాయి. కొన్ని బిరుదులు వ్యంగ్యంతో తగిలించినవి, మరికొన్ని విపరీతార్థంతో అంటించినవీ ఉన్నాయి.
== బిరుదులు-రకాలు ==
== బిరుదులు-రకాలు ==
# సామ్య బిరుదులు: పూర్వ కవులు, పురాణపురుషులు,చారిత్రక పురుషులు, విదేశీ కవి,రచయితలు, పరభాషా పండితులు, పక్షులు, జంతువులు, సూర్యచంద్రులు, నదీసముద్రాలు, రత్నాలు మొదలగు వాటితో పోల్చి ఇచ్చే బిరుదులు.
# వయసును సూచించే బిరుదులు: తరుణ,బాల, యువ, ప్రౌడ వంటి వయసుతో ప్రారంభమయ్యే బిరుదులు ఉన్నాయి.
# ప్రాంతాలతో ముడిపడిన బిరుదులు: నల్గొండ కాళోజీ, వెల్లంకి వేమన మొదలగువాటిలాగా ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించే బిరుదులు ఉన్నాయి.
# సంబంధ బాంధవ్య బిరుదులు: మిత్ర, పుత్ర, బంధువు, పితా వంటి సంబంధాలతో ఇచ్చే బిరుదులు ఉన్నాయి.

== ఇవీ చూడండి ==
== ఇవీ చూడండి ==
*[[తెలుగు కవులు - బిరుదులు]]
*[[తెలుగు కవులు - బిరుదులు]]

16:35, 2 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

బిరుదు అనునది ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి, వారి ప్రతిభా సామర్థ్యాన్ని బట్టి అందించు ఔచిత్యనామం. వీటి ప్రధానం అనేది మిగిలిన రంగాల కన్నా సాహిత్య రంగంలో అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు.

నిర్వచనం

బిరుదు అను పదానికి 'సామర్థ్య చిహ్నం' అని నిఘంటు అర్థం[1]. పట్టం, పవాడం, బిరుదం అనునవి బిరుదు పదానికి పర్యాయపదాలు[2]. ఆంగ్లంలో టైటిల్‌, కన్నడంలో ప్రశస్తి, తమిళంలో పెరుమైక్కురి అనునవి దీనికి సమానార్థక పదాలుగా కోడీహళ్ళి మురళీమోహన్ తన పుస్తకం 'ఆంధ్ర సాహిత్యములో బిరుదునామములు ' లో పేర్కొన్నాడు.

బిరుదు ప్రదాతలు

బిరుదులను ప్రాచీన కాలంలో తమ ఆస్థానంలో ఉండే కవులకో, తమ ఆస్థానికి వచ్చి మెప్పించిన కవులకో రాజులు ఇచ్చేవారు. విజయనగర రాజులు, తంజావూరు రాజులు ఈ కోవకు చెందినవారే. తరువాత వీరి సంప్రదాయాన్ని సంస్థానాధీశులు, జమీందారులు కొనసాగించారు. గద్వాల సంస్థాన ప్రభువులు సత్కవులను ఎందరినో ఆదరించి, తమ ప్రాంతానికి విద్వద్గద్వాలగా కీర్తిని ఆర్జించిపెట్టారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాకా ఈ పనిని ప్రభుత్వాలు, అవి ఏర్పాటుచేసిన అకాడమీలు ఇస్తూ వచ్చాయి. మరికొన్ని సాహిత్య సంస్థలు, సాహిత్యాభిలాషులు బిరుదులు ఇవ్వడమనే ఈ పనిని తమ భుజాల మీదికి వేసుకున్నారు. ఆధ్యాత్మిక మఠాలు, పీఠాధిపతులు తమ భావజాలాన్ని ప్రచారం చేసే తమ కవులకు బిరుదులు ఇస్తున్నాయి[3]. ఇక మరి కొందరు కవులు తమకు తామే బిరుదులను తగిలించుకొని ఊరేగుతున్నారు.

బిరుదు గ్రహీతలు

బిరుదులను గ్రహించువారి జాబితాలో కవులు, రచయితలదే ప్రముఖ స్థానం. అసాధారణ ప్రతిభ కనబరిచే కవులను, పండితులను, రచయితలను బిరుదులు వరించాయి. ప్రభువులను మెప్పించటం వలన, ప్రజల నోళ్ళలో నానే రచనలు చేయడం వలన కవులు, రచయితలు బిరుదు గ్రహీతలుగా నిలిచిపోయారు. అర్హత లేని వారు సైతం ఇటీవల వీటిని పొందటం మామూలైపోయింది. అది వేరే విషయం!

బిరుదు ప్రదాన హేతువులు

కవులను, రచయితలను వారు చేస్తున్న సాహిత్య కృషికి అభినందనీయంగా బిరుదులను ఇవ్వటం పరిపాటి. అవి మరింత ప్రోత్సాహాన్నిచ్చి మరింత కృషికి బాటలు వేస్తాయన్న ఉద్దేశ్యంతో బిరుదులను ఇవ్వడం సాంప్రదాయం.

బిరుదులు-స్వభావం

సాధారణంగా బిరుదులన్నీ గౌరవాన్ని పెంచటానికి ఇచ్చేవే. అవి పొందినవారికి సంతోషాన్ని హెచ్చించేవే. కవి సార్వభౌముడు, కవిచక్రవర్తి బిరుదులు ఇలాంటివే. కాని కొన్ని వీటికి భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉండటం కూడా ఒకటీ అరా గమనించవచ్చు. సాహితీ కృషీవల, తెనుగులెంక వంటి కొన్ని బిరుదులు వినయాన్ని, ఒదిగి ఉండటానికి ప్రతీకలుగా నిలిచాయి. కొన్ని బిరుదులు వ్యంగ్యంతో తగిలించినవి, మరికొన్ని విపరీతార్థంతో అంటించినవీ ఉన్నాయి.

బిరుదులు-రకాలు

  1. సామ్య బిరుదులు: పూర్వ కవులు, పురాణపురుషులు,చారిత్రక పురుషులు, విదేశీ కవి,రచయితలు, పరభాషా పండితులు, పక్షులు, జంతువులు, సూర్యచంద్రులు, నదీసముద్రాలు, రత్నాలు మొదలగు వాటితో పోల్చి ఇచ్చే బిరుదులు.
  2. వయసును సూచించే బిరుదులు: తరుణ,బాల, యువ, ప్రౌడ వంటి వయసుతో ప్రారంభమయ్యే బిరుదులు ఉన్నాయి.
  3. ప్రాంతాలతో ముడిపడిన బిరుదులు: నల్గొండ కాళోజీ, వెల్లంకి వేమన మొదలగువాటిలాగా ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించే బిరుదులు ఉన్నాయి.
  4. సంబంధ బాంధవ్య బిరుదులు: మిత్ర, పుత్ర, బంధువు, పితా వంటి సంబంధాలతో ఇచ్చే బిరుదులు ఉన్నాయి.

ఇవీ చూడండి

మూలాలు

  1. శబ్ధరత్నాకరం,సంకలనం:బి.సీతారామాచార్యులు,ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్,న్యూఢిల్లీ,1996, పుట-495
  2. ఆంధ్ర సాహిత్యంలో బిరుదనామములు, కూర్పు:కోడీహళ్ళి మురళీమోహన్,పుట-3
  3. ఆంధ్రసాహిత్యంలో బిరుదనామములు, కూర్పు: కోడీహళ్లీ మురళీమోహన్, పుట-3
"https://te.wikipedia.org/w/index.php?title=బిరుదు&oldid=1824714" నుండి వెలికితీశారు