Coordinates: 15°34′55″N 79°52′05″E / 15.581992°N 79.868066°E / 15.581992; 79.868066

చీమకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 207: పంక్తి 207:
[14] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చ్-24,25&26.
[14] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చ్-24,25&26.
[15] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-26; 2వపేజీ.
[15] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-26; 2వపేజీ.
[16] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-14; 1వపేజీ.
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
{{చీమకుర్తి మండలంలోని గ్రామాలు}}
{{చీమకుర్తి మండలంలోని గ్రామాలు}}

13:39, 18 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

చీమకుర్తి
—  మండలం  —
ప్రకాశం పటంలో చీమకుర్తి మండలం స్థానం
ప్రకాశం పటంలో చీమకుర్తి మండలం స్థానం
ప్రకాశం పటంలో చీమకుర్తి మండలం స్థానం
చీమకుర్తి is located in Andhra Pradesh
చీమకుర్తి
చీమకుర్తి
ఆంధ్రప్రదేశ్ పటంలో చీమకుర్తి స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°34′55″N 79°52′05″E / 15.581992°N 79.868066°E / 15.581992; 79.868066
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రం చీమకుర్తి
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 64,590
 - పురుషులు 32,779
 - స్త్రీలు 31,811
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.29%
 - పురుషులు 69.53%
 - స్త్రీలు 46.73%
పిన్‌కోడ్ 523226
చీమకుర్తి
—  రెవిన్యూ గ్రామం  —
చీమకుర్తి is located in Andhra Pradesh
చీమకుర్తి
చీమకుర్తి
అక్షాంశ రేఖాంశాలు: 15°34′55″N 79°52′05″E / 15.581992°N 79.868066°E / 15.581992; 79.868066{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చీమకుర్తి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 30,279
 - పురుషుల సంఖ్య 11,296
 - స్త్రీల సంఖ్య 10,746
 - గృహాల సంఖ్య 4,928
పిన్ కోడ్ 523 226
ఎస్.టి.డి కోడ్ 08592

చీమకుర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక [[గ్రామము.[1].]], మండలము. పిన్ కోడ్ నం. 523 226., ఎస్.టి.డి.కోడ్ నం. 08592.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

కె.వి.పాలెం 2 కి.మీ, పులికొండ 5 కి.మీ, చండ్రపాడు 6 కి.మీ, మంచికలపాడు 7 కి.మీ, తొర్రగుడిపాడు 7 కి.మీ, పల్లామల్లి 9 కి.మీ.

సమీప మండలాలు

తూర్పున సంతనూతలపాడు మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, దక్షణాన కొండపి మండలం, తూర్పున మద్దిపాడు మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామంలో విద్యా సౌకర్యాలు

  1. ప్రభుత్వ జూనియర్ కళాశాల:- ఈ కళాశాల 1982 లో ప్రారంభమైనది. ఈ కళాశాలలో దాతల సహకారంతో మద్యాహ్న భోజన పథకం అమలుచేయుచున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో, విద్యార్ధుల సంఖ్యాపరంగా ఈ కళాశాల, మొదటి ఐదు కళాశాలల జాబితాలో నిలుచుచున్నది. [15]
  2. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  3. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, గాంధీనగర్.
  4. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, రాంనగర్.
  5. ఎస్.కె.ఆర్.బధిరుల పాఠశాల.
  6. లయన్స్ అంధుల పాఠశాల.

గ్రామంలో మౌలిక సదుపాయాలు

వైద్య సౌకర్యం

  1. ప్రభుత్వ వైద్యశాల.
  2. దిన్నేపురం అంగనవాడీ కేంద్రం.

బ్యాంకులు

  1. ఆంధ్రా బ్యాంక్.
  2. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. బ్రాంచ్ కోడ్ = 2339., ఐ.ఎఫ్.ఎస్.సి.కోడ్ = IOBA0002339.
  3. స్టేట్ బ్యంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08592/273499. సెల్ = 8374448580.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి దేవస్థానం:- చీమకుర్తి ఇసుకవాగు ప్రాంతంలో పునర్నిర్మాణం చేసిన ఈ దేవస్థానంలో ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు 2014,మార్చ్-18, మంగళవారం నుండి ప్రారంభమైనవి. ఈ సందర్భంగా పంచాహ్నిక దీక్షా కార్యక్రమం నిర్వహించినారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర పూజలు నిర్వహించినారు. విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం, 2014,మార్చ్-22, శనివారం నాడు, వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా, ఉదయం నుండి ఆలయంలో వేదపండితులు ప్రత్యేకపూజలు చేశారు. పది గంటలకు భక్తుల జయజయ ధానాలమధ్య, విగ్రహ, ధ్వజస్థంభాల ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆరు వేలకు మందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2] & [3]
  2. శ్రీ హరిహర క్షేత్రo:- చీమకుర్తి గ్రామములోని శ్రీ హరిహర క్షేత్ర 8వ వార్షికోత్సవ వేడుకలు, శ్రీ శిద్దా వెంకటేశర్లు,వెంకటసుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో, 2014,ఏప్రిల్-13, ఆదివారం నాడు, వైభవంగా ప్రారంభమైనవి. ఆ రోజున మహాగణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, మండపారాధన, మహాపడిపూజలు నిర్వహించినారు. సోమవారం నాడు శ్రీ హరిహరసుత అయ్యప్ప, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, వాసవీ కన్యకా పరమేశ్వరి, పార్వతీ సమేత నగరేశ్వరస్వామి, ప్రసన్నాంజనేయస్వామివార్ల విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా దేవాలయంలో రంగురంగుల విద్యుద్దీపాలంకరణ చేశారు. శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా మే నెలలో, రెండు రోజులపాటు వేడుకలు నిర్వహించెదరు. [4] & [5]
  3. శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక శిద్దావారి వీధిలోని ఈ ఆలయంలోని శివలింగాన్ని, 2015,మార్చ్-17వ తేదీ మంగళవారం ఉదయం 6-40 ప్రాంతాలలో భానుని కిరణాలు తాకినవి. రెండు రోజుల క్రితం గూడా ఈ రీతిలో సూర్యకిరణాలు, గర్భాలయంలోని శివలింగాన్ని తాకినవి. ఈ నేపథ్యంలో పలువురు భక్తులు ఆలయాన్ని సందర్శించినారు. [13]
  4. శ్రీ సాక్షి రామలింగేశ్వరస్వామివారి ఆలయం.
  5. శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం.
  6. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- చీమకుర్తి పట్టణంలోని రచ్చమిట్ట ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ నిర్మాణానికి, దాత శ్రీ మారం వెంకటసుబ్బారెడ్డి, స్థలాన్ని విరాళంగా అందజేసినారు. దాతల విరాళాలతో ఆలయ నిర్మాణం జరిగినది. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమాలు 2014,జూన్-9 వ తేదీ మద్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభం చేసెదరు. విఘ్నేశ్వరపూజ, మంగళస్నానాలు, అనంతరం పాలరాతితో చేసిన శ్రీ షిర్డీసాయినాధుని మూలవిరాట్టుకు గ్రామోత్సవం నిర్వహించెదరు. ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని మూడురోజులపాటు మహాకుంభాభిషేకాన్ని నిర్వహించుచున్నారు. 72 మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. 13వ తేదీ ఉదయం 7=21 గంటలకు శ్రీ షిర్డీ సాయినాధ, దత్తాత్రేయ, గణపతి,శిఖర ప్రతిష్ఠ నిర్వహించెదరు, ఈ సందర్భంగా 25 వేలమందికి అనందానం నిర్వహించెదరు. [6]&[7]
  7. శ్రీ కృష్ణమందిరం:- చీమకుర్తిలోని ఇసుకవాగు ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో 2014, ఆగష్టు-1వ తేదీ శుక్రవారం నాడు, ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా, ఆలయంలో ప్రత్యేకపూజలు, స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. [8]
  8. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామివార్ల ఆలయం:- చీమకుర్తి గ్రామ శివారులో దిన్నేపురంలో ఉన్న ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-8, రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా, వరలక్ష్మీ వ్రత మహోత్సవాన్ని నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వరుణయాగం నిర్వహించెదరు. ఈ ఆలయంలో, 2015,మార్చ్-4వ తేదీ బుధవారం నాడు, స్వామివార్ల రథోత్సవం నిర్వహించినారు. 5వ తేదీ గురువారం, ఫాల్గుణ పౌర్ణమి నాడు, మహిళా భక్తులు పొంగళ్ళు వండి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, మొక్కుబడులు తీర్చుకున్నారు. [9]&[12]
  9. శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- చీమకుర్తి పట్టణంలోని పల్లపోతువారి వీధిలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఉత్సవాలు, మూడురోజులపాటు, వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో, 2014,డిసెంబరు-7వ తేదీ ఆదివారం, మార్గశిర బహుళ పాడ్యమి నాడు, సుదర్శనమూర్తి, ఆంజనేయస్వామి వారల పంచలోహ విగ్రహ ప్రతిష్టను వేడుకగా నిర్వహించినారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో నగరోత్సవం, కలశాభిషేకం, హోమాలు. పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టినారు. నూతన విగ్రహాలకు ప్రాణప్రతిష్ట, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించినారు. ఈ విగ్రహాలను పల్లపోతు వంశస్థులు సమకూర్చినారు. విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంతో పట్టణంలో పండుగ వాతావరణo నెలకొన్నది. [10]
  10. శ్రీ రామాలయం, కొత్తకుమ్మరిపాలెం.
  11. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, గాంధీనగర్.
  12. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం చీమకుర్తిలోని కె.అగ్రహారంలో ఉన్నది.
  13. శ్రీ మోక్షరామలింగేశ్వరస్వామివారి ఆలయం:- చీమకుర్తి మండలం, ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని రామతీర్ధం క్షేత్రంలోని ఈ ఆలయ ప్రాంగణంలో, పునర్నిర్మాణం చేసిన మండపంలో, ఆదిత్యాది నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మార్చ్-23,సోమవారo నాడు ప్రాంభించినారు. ఈ విగ్రహాల దాతలు, మాజీ ఎం.ఎల్.ఏ. శ్రీ బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ దంపతులు. 25వ తేదీ బుధవారం నాడు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించినారు. మేళతాళాల మధ్య విగ్రహాల ఊరేగింపు ఘనంగా సాగినది. ప్రతిష్ఠా మహొత్సవం అనంతరం, శివపార్వతుల కళ్యాణం వేడుకగా నిర్వహించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు పెద్ద యెత్తున అన్నదానం నిర్వహించినారు. ఈ కారక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చినారు. [14]
  14. శ్రీ భద్రావతీ సమేత భావనారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి తిర్య్నాళ్ళు, కళ్యాణోత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [16]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

  1. పరిశ్రమలు:- చీమకుర్తిలో గ్రానైట్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన గ్రానైట్ చాలావరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నది. అనేక రాష్ట్రాలనుండి వచ్చినవారు కూడా ఇక్కడ గ్రానైట్ పరిశ్రమలో పని చేస్తున్నారు.
  2. కరాటేలో ప్రతిభచూపుచున్న అక్కాతమ్ముళ్ళు, దొంతు నవ్యకృతి & దొంతు శ్రీహర్షనేత, జాతీయస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఎంపికైనారు. ఇటీవల కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో వీరిద్దరూ తమ ప్రతిభ ప్రదర్శించి, త్వరలో కోల్ కతాలో నిర్వహించు జాతీయస్థాయిపోటీలలో పాల్గొనుటకు ఎంపికైనారు. చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుచున్న శ్రీహర్ష, అండర్-17 విభాగంలో జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటాడు. నూజివీడులోని ఐ.ఐ.ఐ.టి. లో రెండవ సంవత్సరం పి.యు.సి. చదువుచున్న నవ్యకృతి, అండర్-19 విభాగంలో, జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [11]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 22,042.[2] ఇందులో పురుషుల సంఖ్య 11,296, మహిళల సంఖ్య 10,746, గ్రామంలో నివాస గృహాలు 4,928 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,788 హెక్టారులు.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మార్చ్-19; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మార్చ్-23; 2వపేజీ. [4] ఈనాడు,ప్రకాశం/సంతనూతలపాడు; 2014;ఏప్రిల్-14;1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014.మే-23; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-5, 2వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-9; 2వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగష్టు=1; 1వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగష్టు-7; 1వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-8; 1వపేజీ. [11] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-25; 2వపేజీ. [12] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చ్-6; 2వపేజీ. [13] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చ్-18; 1వపేజీ. [14] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చ్-24,25&26. [15] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-26; 2వపేజీ. [16] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-14; 1వపేజీ.