క్రిమి సంహారకాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి అగాథ పేజీలనుండి వ్యాస పేరుబరికి
పంక్తి 1: పంక్తి 1:
'''క్రిమి సంహారకాలు ''' మానవులకు మరియు పంటపొలాలకు హానిచేసే క్రిములని చంపడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు.
'''క్రిమి సంహారకాలు ''' మానవులకు మరియు పంటపొలాలకు హానిచేసే క్రిములని చంపడానికి ఉపయోగించే [[రసాయన శాస్త్రము|రసాయన]] పదార్థాలు.
==దోమల సంహారకాలు==
==దోమల సంహారకాలు==
మలు కుట్టకుండా మనం శరీరంపై కొన్ని రకాల రసాయనిక సంబంధిత పేస్ట్‌లు రాసుకోవడమే కాకుండా డై మిథైల్ టోలుమైడ్, ఐకార్డిన్ లాంటి ద్రవాలను విద్యుత్ పరికరాల సాయంతో ఆవిరిగా మార్చి ఆ ఆవిరులు గదంతా వ్యాపించేటట్లు చేస్తాము. వీటిని దోమల వికర్షకాలు (mosquito repellents) అంటారు.
మలు కుట్టకుండా మనం శరీరంపై కొన్ని రకాల రసాయనిక సంబంధిత పేస్ట్‌లు రాసుకోవడమే కాకుండా డై మిథైల్ టోలుమైడ్, ఐకార్డిన్ లాంటి ద్రవాలను విద్యుత్ పరికరాల సాయంతో ఆవిరిగా మార్చి ఆ ఆవిరులు గదంతా వ్యాపించేటట్లు చేస్తాము. వీటిని దోమల వికర్షకాలు (mosquito repellents) అంటారు.

16:08, 6 ఏప్రిల్ 2016 నాటి కూర్పు

క్రిమి సంహారకాలు మానవులకు మరియు పంటపొలాలకు హానిచేసే క్రిములని చంపడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు.

దోమల సంహారకాలు

మలు కుట్టకుండా మనం శరీరంపై కొన్ని రకాల రసాయనిక సంబంధిత పేస్ట్‌లు రాసుకోవడమే కాకుండా డై మిథైల్ టోలుమైడ్, ఐకార్డిన్ లాంటి ద్రవాలను విద్యుత్ పరికరాల సాయంతో ఆవిరిగా మార్చి ఆ ఆవిరులు గదంతా వ్యాపించేటట్లు చేస్తాము. వీటిని దోమల వికర్షకాలు (mosquito repellents) అంటారు. దోమలు కుట్టి వాటికి ఆహారమైన రక్తం పీల్చుకోవడానికి, అవి తమ 'ఘ్రాణ శక్తి' (వాసన)పై ఆధారపడతాయి. అవి ముఖ్యంగా మన దేహం నుంచి వెలువడే కార్బన్‌డైఆక్సైడ్, స్వేదం వాసనలను బట్టి మన ఉనికిని పసిగడతాయి. కొందరి దేహాలు దోమలను ఎక్కువగా ఆకర్షించడానికి కారణం వారి దేహాలు వెదజల్లే ప్రత్యేకమైన వాసనలే కారణం. మనం దేహంపై రాసుకొనే దోమల వికర్షక పేస్టులు, స్ప్రేలు చర్మంపై ఉండే వేడికి ఆవిరై, ఆ ఆవిరి దోమల వాసన శక్తికి ఆటంకం కలిగిస్తాయి. దాంతో అవి మన దేహాల ఉనికిని పసిగట్టలేవు. కానీ ఈ వికర్షకాలు 4,5 గంటలకన్నా ఎక్కువ పని చేయలేవు.

రసాయన ద్రవాల ఆవిరులు కూడా అలాగే పనిచేస్తాయి. ఈ పేస్ట్‌ల, ద్రవాల గాఢత ఎక్కువైతే మనకు కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలు కూడా రావచ్చు.

ఈ వికర్షకాల కన్నా కిటికీలకు, ద్వారాలకు ప్రత్యేకమైన తెరలను అమర్చుకోవడం ద్వారా దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. అన్నిటికన్నా మనం మన పూర్వీకులు వాడుకున్నట్లే పడుకునే మంచాలకు దోమ తెరలను కట్టుకోవడం ఉత్తమం.

దోమల నివారిణులతో ముప్పేమీ లేదు

దోమల నుంచి తప్పించుకోవటానికి ఉపయోగించే 'మస్కిటో రిపల్లెంట్' వంటి నివారిణుల వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్ప్రభావం పడదని పరిశోధకులు తేల్చారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. 'మస్కిటో రిపల్లెంట్'ల తయారీలో ఉపయోగించే డీఈఈటీ అనే రసాయనం వల్ల మెదడు పనితీరుపై అననుకూల ప్రభావం పడుతుందన్న ఆందోళనలున్నాయి. ఈ నేపథ్యంలో లండన్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం జరిపారు. ఆరోగ్యంపై డీఈఈటీ చూపే ప్రభావం గురించి ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలు వెల్లడించిన వివరాలను పరిశీలించారు. డీఈఈటీతో దుష్ప్రభావం పడుతుందని చెప్పటానికి తగిన రుజువులు లేవని వీరు చివరికి తేల్చారు. అదేసమయంలో, డీఈఈటీతో తయారైన మస్కిటో రిపల్లెంట్‌లు దోమకాటును నివారించి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. డీఈఈటీతో 'ఎన్‌సెఫలోపతీ' అనే మెదడు సంబంధ అనారోగ్యం తలెత్తిన కేసులు 1957 నుంచి 14 మాత్రమే ఉన్నాయని తెలిపారు. [1]

మూలాలు

  1. http://www.dailymail.co.uk/health/article-2646624/DEET-mosquito-repellent-safe-British-scientists-say-benefits-insecticide-linked-brain-disease-outweigh-dangers.html

బయటి లంకెలు