చర్ల గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50: పంక్తి 50:
==మూలాలు==
==మూలాలు==
*20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
*20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
*[http://www.teluguthesis.com/2016/04/charla-ganapathi-shastri-rachnalu.html చర్ల గణపతి శాస్త్రి రచనలు తెలుగుపరిశోధన లో]


[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]

06:52, 14 ఏప్రిల్ 2016 నాటి కూర్పు

చర్ల గణపతిశాస్త్రి
జననంజనవరి 1, 1909
పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకరపర్రు
మరణంఆగష్టు 16, 1996
ప్రసిద్ధివేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు.
తండ్రిచర్ల నారాయణ శాస్త్రి
తల్లివెంకమ్మ

చర్ల గణపతిశాస్త్రి (జనవరి 1, 1909 - ఆగష్టు 16, 1996) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు.

ఈయన జనవరి 1, 1909 సంవత్సరంలో చర్ల నారాయణ శాస్త్రి మరియు వెంకమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకరపర్రు గ్రామంలో జన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, కాకినాడలో విద్యార్థిదశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన వేదుల సూర్యనారాయణ మూర్తి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నాడు.

ఈయన తొలి అనువాద కావ్యం మేఘ సందేశం (సంస్కృతం) 1927లో పూర్తయింది. తరువాత కాలంలో ఈయన 150 కి పైగా ప్రాచీన సంస్కృత గ్రంథాలను, దర్శనాలను, విమర్శనలను, నాటకాలను తెలుగులోకి అనువదించాడు. ఈయన రచనలలో ముఖ్యమైనవి గణపతి రామాయణ సుధ, స్వతంత్రదీక్ష, బిల్హణ చరిత్ర, రఘువంశము,సాహిత్య సౌందర్య దర్శనం, వర్ధమాన మహావీరుడు,నారాయణీయ వ్యాఖ్యానము, భగవద్గీత, చీకటి జ్యోతి[1]. 1961లో హైదరాబాదులో లలితా ప్రెస్ ప్రారంభించాడు. లియోటాల్ స్టాయ్ ఆంగ్లంలో రచించిన నవలను చీకటిలో జ్యోతి పేరుతో తెలుగులోనికి గణపతిశాస్త్రి అనువదించారు.[2]

ఈయన జీవిత కాలమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేద పండితుడుగా, మత సంబంధ సలహా సంఘ సభ్యుడుగా మరియు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆస్థాన విద్వాంసుడుగా తన అనుభవాన్ని పంచాడు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనను కళా ప్రపూర్ణ తో గౌరవించింది. భారత ప్రభుత్వం ఈయనను పద్మ భూషణ్ పురస్కారం తో సత్కరించింది.

ఈయన ఆగష్టు 16, 1996 సంవత్సరంలో పరమపదించాడు.

మూలాలు

  1. Kartik, Chandra Dutt (1999). Who's who of Indian Writers (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమీ. p. 368. ISBN 81-260-0873-3. Retrieved 1 January 2015.
  2. గణపతిశాస్త్రి, చర్ల. చీకటిలో జ్యోతి.