ముద్దుల జానకి పెళ్ళికి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32: పంక్తి 32:
సరిగమ వినిపించి||
సరిగమ వినిపించి||


</poem>
[[వర్గం : తెలుగు సినిమా పాటలు]]
[[వర్గం : తెలుగు సినిమా పాటలు]]
[[వర్గం : వడ్డేపల్లి కృష్ణ రచించిన పాటలు]]
[[వర్గం : వడ్డేపల్లి కృష్ణ రచించిన పాటలు]]

06:04, 21 జూలై 2016 నాటి కూర్పు

ఈ పాటని పెద్దరికం సినిమా కోసం వడ్డేపల్లి కృష్ణ రచించారు.


ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే
మురిపాల తేలించ ముని మాపులో
దివి నుండి రేరాజు దిగి వచ్చులే||

తొలకరిలా వలపంతా కురిసేనులే
తీయని ఉహాలు చిగురు తొడిగెను
నింగిని తాకే పందిరి వేసి
పచని పల్లెను పీటగా జేసి
బంగారు రంగులు వేయించ రారే
మురిపాల పెళ్లి జరిపించ రారే
వధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు బిగిసె
కనివిని ఎరుగని కమ్మని భావన
కధలుగా కనిపించే||

తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్నీ రాగాలు తీసే
చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే
కదలి రావమ్మ నేడే
కలలు పండేటి వేళ
వేచియున్నాడు వరుడే
సందె సరసాల తేల
సరసపు వయసున ఒంపుల సొంపుల
సరిగమ వినిపించి||