Coordinates: 17°05′00″N 77°50′00″E / 17.0833°N 77.8333°E / 17.0833; 77.8333

దోమ మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q5289785
పంక్తి 72: పంక్తి 72:
{{దోమ (రంగారెడ్డి) మండలంలోని గ్రామాలు}}
{{దోమ (రంగారెడ్డి) మండలంలోని గ్రామాలు}}
{{రంగారెడ్డి జిల్లా మండలాలు}}
{{రంగారెడ్డి జిల్లా మండలాలు}}

[[new:दोम मण्डल, रंगारेड्डी जिल्ला]]

07:29, 1 ఆగస్టు 2016 నాటి కూర్పు

దోమ
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి, దోమ స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి, దోమ స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి, దోమ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°05′00″N 77°50′00″E / 17.0833°N 77.8333°E / 17.0833; 77.8333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రం దోమ
గ్రామాలు 9493
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,224
 - పురుషులు 24,168
 - స్త్రీలు 24,056
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.49%
 - పురుషులు 52.40%
 - స్త్రీలు 28.63%
పిన్‌కోడ్ {{{pincode}}}

దోమ, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండలము పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో వికారాబాదు రెవెన్యూ డివిజన్‌లో భాగము. పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దును కలిగిన ఈ మండలము దక్షిణాన మరియు ఆగ్నేయాన రంగారెడ్డి జిల్లాకు కుల్కచర్ల మండలము, ఉత్తరాన మరియు ఈశాన్యాన పరిగి మండలము సరిహద్దుగా కలిగిఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలము గుండా వెళుతుంది.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు

మండల జనాభా (2011) - మొత్తం 48,224 - పురుషులు 24,168 - స్త్రీలు 24,056

అక్షరాస్యత (2011) - మొత్తం 40.49% - పురుషులు 52.40% - స్త్రీలు 28.63%

గ్రామ జనాభా(2001) మొత్తం 4481 పురుషులు 2250, స్త్రీలు 2231, గృహాలు 819 విస్తీర్ణము 769 హెక్టార్లు, ప్రజల భాష. తెలుగు.

సమీప గ్రామాలు/మండలాలు

బాచ్ పల్లి 4 కి.మీ. దోర్నాల్ పల్లి 4 కి.మీ. బోంపల్లి 5 కి.మీ. ఐనాపూర్ 5 కి.మీ. ఊట్ పల్లి 6 కి.మీ దూరములో వున్నవి. మండలాలు. ఉత్తరాన పర్గి మండలము, దక్షినాన కుల్కచెర్ల మండలము, పడమరన బొంరాస్పల్లి మండలం, పడమరన కోస్గి మండలాలున్నవి.

రవాణా సౌకర్యాలు

ఇక్కడికి సమీప టౌన్ వికారాబాద్. ఇది 42 కి.మీ దూరములో వున్నది. ఇక్కడికి రోడ్డు వసతి వుండి బస్సు సౌకర్యమున్నది.

ఇక్కడికి 10 కి.మీ. లోపు రైలు వసతి లేదు. కాని వికారాబాది లో రైలు వసతి వున్నది. ఇక్కడికి హైదరాబాద్ రైల్వే స్టేషను 81 కి.మీ.

విద్యాసంస్థలు

1.జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) 2.కస్తూర్బా బాలికల పాఠశాల, దోమ, 3.జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, దోమ, 4.చైతన్య పబ్లిక్ స్కూల్ దోమ, 5.క్రాంతి విద్యాలయము దోమ.[1]

ఉపగ్రామాలు

ఎల్ రెడ్దిపల్లి, గుడుగన్ పల్లి, పెద్ద తండ, ఐలాబాద్ తండ, గుండల్ తండ, రూప్ నాయక్ తండ, ఉద్దండరావు తండ, ఎంకేపల్లి, బాట్లకుంట, కమ్మనాచారం, లింగంపల్లి.

మూలాలు

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు

మూస:దోమ (రంగారెడ్డి) మండలంలోని గ్రామాలు


  1. "http://www.onefivenine.com/india/villages/Rangareddi/Doma/Doma". Retrieved 4 July 2016. {{cite web}}: External link in |title= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=దోమ_మండలం&oldid=1924302" నుండి వెలికితీశారు