మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొన్ని సవరణలు
పంక్తి 46: పంక్తి 46:
* [[బాలభారతం]]
* [[బాలభారతం]]


{{hidden infoboxes|info=
==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://neetikathalu.wordpress.com/tag/mahabharatam/ మహాభారతము లోని నీతికథలు]
*[http://neetikathalu.wordpress.com/tag/mahabharatam/ మహాభారతము లోని నీతికథలు]
పంక్తి 72: పంక్తి 73:
* [http://www.claysanskritlibrary.org Clay Sanskrit Library]
* [http://www.claysanskritlibrary.org Clay Sanskrit Library]
* [http://mahabharata-resources.org భారతాన్ని గూర్చి వనరులు]
* [http://mahabharata-resources.org భారతాన్ని గూర్చి వనరులు]
}}
[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:మహాభారతం]]
[[వర్గం:పురాణాలు]]
[[వర్గం:పురాణాలు]]

08:50, 16 అక్టోబరు 2007 నాటి కూర్పు

మహాభారతం పంచమ వేదముగా పరిగణించే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒక్కటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగు లోకి అనువదించారు.

కావ్య ప్రశస్తి

మహాభారతాన్ని "పంచమవేదము" అని కూడా గౌరవిస్తారు. "యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.

ఈ కావ్యవైభవాన్ని నన్నయ ఇలా చెప్పాడు:

దీనిని ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్చయమనీ కొనియాడుతారు. వివిధ తత్వవేది, విష్ణు సన్నిభుడు ఐన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.

మహాభారతాన్ని వ్యాసుడు ప్రప్రథమంగా ఈ గదాను తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం జరుగుతున్నప్పుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడ వచ్చిన ఋషులకు చెప్పాడు.

మహాభారతంలోని విభాగాలు

మహాభారతంలో 18 విభాగాలు ఉన్నాయి. వీటిని "పర్వాలు" అంటారు. మొత్తం 18 పర్వాలలో జరిగే కథాక్రమం ఇలా ఉంటుంది:

  1. ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
  2. సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
  3. వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
  4. విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
  5. ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
  6. భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  7. ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  8. కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  9. శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
  10. సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
  11. స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
  12. శాంతి పర్వము: 86-88 యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
  13. అనుశాసన పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
  14. అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
  15. ఆశ్రమవాసిక పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
  16. మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
  17. మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
  18. స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.

హరివంశ పర్వము: శ్రీకృష్ణుని జీవితగాథ

తెలుగు సినిమాలలో భారతగాథ

మహాభారత కథ ఇతివృత్తంగా ఎన్నో తెలుగు సినిమాలు వెలువడ్డాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యం కారణంగా వాటిలో చాలా సినిమాలు చిరస్థాయిగా జనాదరణ పొందాయి. వాటిలో కొన్ని

"https://te.wikipedia.org/w/index.php?title=మహాభారతం&oldid=195947" నుండి వెలికితీశారు