తిరుపతి వేంకట కవులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పడక సీను ౼౼౼ పడక సన్నివేశం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గాధ → గాథ (3) using AWB
పంక్తి 120: పంక్తి 120:
# దేవీ భాగవతం, 1896
# దేవీ భాగవతం, 1896
# శివలీలలు, 1896
# శివలీలలు, 1896
# పురాణ గాధలు, 1896
# పురాణ గాథలు, 1896
# వ్రత కథలు, 1896
# వ్రత కథలు, 1896
# శ్రీనివాస విలాసము, 1896-1897
# శ్రీనివాస విలాసము, 1896-1897
పంక్తి 140: పంక్తి 140:
# శ్రవణానందము (1893-1897; 1897-1898)
# శ్రవణానందము (1893-1897; 1897-1898)
# పాణిగృహీత
# పాణిగృహీత
#'''లక్షణా పరిణయము''' (1897-1901)- [[లక్షణ]]తో [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] వివాహాన్ని గురించిన భాగవత గాధ.
#'''లక్షణా పరిణయము''' (1897-1901)- [[లక్షణ]]తో [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] వివాహాన్ని గురించిన భాగవత గాథ.
#'''ఏలా మహాత్మ్యము''' (1898-1900) ఏలా నది గురించి.
#'''ఏలా మహాత్మ్యము''' (1898-1900) ఏలా నది గురించి.
#'''జాతక చర్య''' (1899-1930), '''ఇటీవలి చర్య''' (1930-1950) - తన జీవిత విశెషాలను జ్యోతిష పరంగా వర్ణించిన వెంకట శాస్త్రి విశిష్ట రచనలు.
#'''జాతక చర్య''' (1899-1930), '''ఇటీవలి చర్య''' (1930-1950) - తన జీవిత విశెషాలను జ్యోతిష పరంగా వర్ణించిన వెంకట శాస్త్రి విశిష్ట రచనలు.
పంక్తి 156: పంక్తి 156:
#'''పతివ్రత''' ఒక పడతికి ఒక పాముతో పెళ్ళి జరిగిన జానపద కథ ఆధారంఘఅ.
#'''పతివ్రత''' ఒక పడతికి ఒక పాముతో పెళ్ళి జరిగిన జానపద కథ ఆధారంఘఅ.
#'''సుశీల''' is a work dealing with social customs like divine dispensation.
#'''సుశీల''' is a work dealing with social customs like divine dispensation.
#'''పూర్వ హరిశ్చంద్ర చరిత్రము''' పురాణ గాధ.
#'''పూర్వ హరిశ్చంద్ర చరిత్రము''' పురాణ గాథ.
# దైవ తంత్రము
# దైవ తంత్రము
#'''సతీ స్మృతి''' తన భార్య మరణానంతరం వేంకటశాస్త్రి రచించిన విషాద రచన.
#'''సతీ స్మృతి''' తన భార్య మరణానంతరం వేంకటశాస్త్రి రచించిన విషాద రచన.

04:25, 9 అక్టోబరు 2016 నాటి కూర్పు

కడియం జెడ్.పి.ఉన్నత పాఠశాల ఆవరణలో తిరుపతి వేంకట కవుల విగ్రహాలు

దివాకర్ల తిరుపతి శాస్త్రి (Divakarla Tirupati Sastry) (1872-1919) మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry) (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.

దివాకర్ల తిరుపతి శాస్త్రి
జననంమార్చి 26, 1872
భీమవరం
మరణంనవంబరు, 1920
ఇతర పేర్లు"తిరుపతి వేంకట కవులు"
ప్రసిద్ధితెలుగు కవిత్వం,
నాటకాలు, అవధానం
తండ్రివెంకట అవధాని
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి
జననంఆగస్టు 8, 1870
కడియం
మరణం1950
ఇతర పేర్లు"తిరుపతి వేంకట కవులు"
ప్రసిద్ధితెలుగు కవిత్వం,
నాటకాలు, అవధానం

వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.

  • బావా ఎప్పుడు వచ్చితీవు..,
  • చెల్లియో చెల్లకో..,
  • జెండాపై కపిరాజు..

వంటి పద్యాలు ఆరంభ పదాలు తెలియని తెలుగువారు అరుదు.[1]

దివాకర్ల తిరుపతి శాస్త్రి

దివాకర్ల తిరుపతి శాస్త్రి ప్రజోత్పత్తి సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమి బుధవారం అనగా 1872 మార్చి 26న పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకటావధాని కూడా గొప్ప వేదపండితుడు, సూర్యోపాసకుడు. తిరుపతి శాస్త్రి విద్యాభ్యాసం బూర్ల సుబ్బారాయుడు, గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రిల వద్ద సాగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రికి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తోడయ్యాడు. 1898లో తిరుపతి శాస్త్రి వివాహం జరిగింది.

మధుమేహం వ్యాధి కారణంగా ఆయన 1920 నవంబరులో మరణించాడు.

చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి

చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి ప్రమోదూత సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం అనగా 1870 ఆగస్టు 8న తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణతిలక విలాసము అనే మహాద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉన్నాయి. తరువాత వారు యానాంకు మకాం మార్చారు. యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.

18 ఏండ్ల వయసులో యానాం వేంకటేశ్వర స్వామి గురించి వ్రాసిన శతకంలో వ్యాకరణ దోషాల గురించి స్థానిక పండితులు విమర్శించారు. అది అవమానంగా భావించిన వేంకటశాస్త్రి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికి వారాణసి వెళ్ళాలని నిశ్చయించుకొన్నాడు. కాని ఆర్థికమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పై ఆయనకు పుట్టుకనుండి ఒక కన్నుకు సంబంధించిన సమస్య ఉండేది.

తరువాత వేంకట శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది.

వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులైనవారిలో కొందరు - విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి సుందరరామ మూర్తి, పింగళి లక్ష్మీకాంతం

జంట కవులు

చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి చిత్రపటం

మొదటినుండి తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది.

వేంకట శాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగి వచ్చినాక కాకినాడలో జంటగా శతావధానం ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.

ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.

పోలవరం జమీందారు వారి ప్రతిభ గురించి తెలిసికొని ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన లైట్ ఆఫ్ ఆసియా గ్రంథాన్ని తెలుగులోకి అనువదించమని వారిని కోరాడు. తన సంస్థానంలో కవులుగా చేరమని అర్ధించాడు. ఆ విధమైన కట్టుబాట్లకు వేంకట శాస్త్రి వెనుకాడినా తిరుపతి శాస్త్రి ఆయనను ఒప్పించాడు. ఫలితంగా వారు 1901లో కాకినాడకు నివాసం మార్చారు. 1889లో పిఠాపురం రాజు ప్రారంభించిన 'సరస్వతి' అనే సాహితీ పత్రిక నిర్వహణా బాధ్యతలు వారికి అప్పగింపబడ్డాయి. ఈ పత్రిక కోసం 'బాల రామాయణం', 'ముద్రారాక్షసం', 'మృచ్ఛఘటికం' గ్రంథాలను వీరు సంస్కృతంనుండి తెలుగులోకి అనువదించారు.

1918లో పోలవరం జమీందార్ మరణం వారిని ఇబ్బందులలో పడవేసింది. అయితే గోలంక వీరవరం జమీందార్ రావు రామాయమ్మ వీరికి భరణం ఏర్పాటు చేసింది.

అవధానాలు

వీరు తమ గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ప్రోత్సాహంతో కాకినాడలో మొట్టమొదటిసారి జంటగా అష్టావధానాన్ని, ఆ తర్వాత 1890 అక్టోబరులో ఒక శతావధానాన్ని చేశారు. అయితే చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అంతకు ముందే కాశీయాత్ర కోసం అవసరమైన డబ్బు కొరకు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు, గుండుగొలను గ్రామాలలోను, కాశీనుండి తిరిగి వచ్చిన తర్వాత గంగా సంతర్పణ కోసం ముమ్మిడివరం, అయినవిల్లి గ్రామాలలో అష్టావధానాలు చేశాడు. కాకినాడ అవధానాల తర్వాత వీరిరువురూ చెలరేగి పల్లెల్లో, పట్టణాలలో, రాజాస్థానాలలో వందలకొద్దీ అవధానాలు చేశారు. కాకినాడ, అమలాపురం, ఏలూరు, బందరు, నెల్లూరు, విశాఖపట్నం, బెజవాడ, మద్రాసు, గుంటూరు, రాజమండ్రి మొదలైన పట్టణాలలోను, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, వెంకటగిరి, విజయనగరం, నూజివీడు, కిర్లంపూడి మొదలైన సంస్థానాలలోను శతావధానాలు, అష్టావధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు చేశారు. ఈ అవధానాలన్నింటిలోను తిరుపతిశాస్త్రి ఒక పాదం చెబితే వేంకటశాస్త్రి మరొక పాదం చెప్పేవాడు[2].

వీరి అవధానాలలో వెలువడిన కొన్ని పద్యాలు:

  • సమస్య: మానవతీలలామ కభిమానమె చాలును జీరయేటికిన్

పూరణ:

ఓ నవనీతచోర కృపయుంచి పటమ్ముల నిచ్చి వేగ మా
మానము గావుమన్న వ్రజమానిని పల్కుల కెంతొ వింతన
వ్వాననసీమఁ దోఁపఁ గమలాక్షుడుఁ దానిటు పల్కె, మానినీ
మానవతీలలామ కభిమానమె చాలును జీరయేటికిన్

  • వర్ణన: లక్ష్మీపార్వతుల సంవాదము

పూరణ:

గంగాధరుడు నీ మగండని నవ్వంగ
వేషధరుండు నీ పెన్మిటనియె
నెద్దు నెక్కును నీదు నెమ్మెకాఁడని నవ్వ
గ్రద్ద నెక్కును నీ మగండటనియె
వల్లకాడిల్లు నీ వల్లభున కనంగ
నడిసంద్ర మిల్లు నీ నాథున కనె
నాట్యంబుసేయు నీ నాయకుండన నంగు
గావించు వెన్క నీ కాంతుఁడనియె

ముష్టి కెక్కడి కేగె నీ యిష్టుఁడనిన
బలి ముఖంబున కేగెనో లలన! యనియె
నిట్టు లన్యోన్యమర్మంబు లెంచుకొనెడు
పర్వతాంభోది కన్యలఁ బ్రస్తుతింతు

  • వర్ణన: పకోడి

పూరణ:

సెనగపిండి యుల్లిపాయ చిన్నిమిర్పకాయలుం
జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్దచేసియున్
అనలతప్తమైన నేతియందు వైచి వేచినం
జనుఁ బకోడి యనెడు పేరఁ జక్కనైన ఖాద్యమై

  • దత్తపది: గోలకొండ - పూలదండ - మాలముండ - క్ర్తొత్తకుండ అనే పదాలతో రామాయణార్థంలో పద్యం.

పూరణ:

 ఏటికీగోల కొండపై నేల డాఁగ
నొక్కమొగిగాఁగ సత మాలముండఁబోదు
దనుజనాయక! నీ పూలదండ వాడు
కొడుకు చేతికి వచ్చులే క్రొత్తకుండ

పురస్కారాలు

రచనలు

సంస్కృతంలో స్వతంత్ర రచనలు
  1. ధాతు రత్నాకర చంపు (1889-1893) ఇది రామాయణం కథ ఇతివృత్తంగా సాగిన ఒక చంపూ కావ్యము. సంస్కృతంలో పాణిని వ్యాకరణంలోని ధాతువుల క్రియారూపాలు ఇందులో పొందుపరచబడ్డాయి.
  2. శృంగార శృంగాటక (1891)- శృంగారపరంగా సాగిన చిన్న వీధినాటిక.
  3. కాళీ సహస్రం (1891-1894)- లక్ష్మీ సహస్ర్రం లాగా కాళికా మాత నుద్దేశించిన స్తుతి. మూడు వందల శ్లోకాలతో ఇది అసంపూర్ణ రచనగా మిగిలిపోయింది.
  4. మూల స్థానేశ్వర స్తుతి (1893-1894) నెల్లూరు 'మూల స్థానేశ్వర స్వామి'ని స్తుతిస్తూ ఆర్య వృత్తాలలో చేసిన రచన.
  5. అష్టకములు (కాళికాది స్తోత్రాలు), 1889-1890
  6. శుక రంభ సంవాదము (1893-1894) - శుకునికి, రంభకు మధ్య సాగిన వాదము. ఆనందమంటే వేదాంతజ్ఞానమని శుకుడూ, కాదు శృంగారానుభవమని రంభా వాదిస్తారు.
  7. నమశ్శివాయ స్తోత్రం (1914-1915) భక్తి స్తోత్రం.
  8. క్షమాపణం (1914-1915)
  9. పిష్టపేషణం (1914-1915)
  10. శలభ లభణం (1914-1915)

సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం

  1. దేవీ భాగవతం, 1896
  2. శివలీలలు, 1896
  3. పురాణ గాథలు, 1896
  4. వ్రత కథలు, 1896
  5. శ్రీనివాస విలాసము, 1896-1897
  6. రశికానందము, 1893-1894
  7. శుక రంభ సంవాదము (1893-1894) - వారి సంస్కృత రచనకు తెలుగు అనువాదము.
  8. బుద్ధ చరిత్రము, 1899-1900
  9. అప్పయ దీక్షితుల వైరాగ్య శతకము, 1899-1900
  10. రాజశేఖరుని బాల రామాయణము, 1901-1912
  11. విశాఖ దత్తుని ముద్రారాక్షసము, 1901-1912
  12. శూద్రకుని మృచ్ఛకటికము, 1901-1912
  13. బిల్హణుని విక్రమదేవ చరిత్రము, 1901-1912
  14. వీర నంది చంద్రప్రభా చరిత్రము, 1901-1912
  15. బాణుని హర్ష చరిత్రము, 1901-1912

ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం

  1. రవీంద్రనాధ టాగూరు కథలు

తెలుగులో స్వతంత్ర కవితా రచనలు

  1. శ్రవణానందము (1893-1897; 1897-1898)
  2. పాణిగృహీత
  3. లక్షణా పరిణయము (1897-1901)- లక్షణతో శ్రీకృష్ణుని వివాహాన్ని గురించిన భాగవత గాథ.
  4. ఏలా మహాత్మ్యము (1898-1900) ఏలా నది గురించి.
  5. జాతక చర్య (1899-1930), ఇటీవలి చర్య (1930-1950) - తన జీవిత విశెషాలను జ్యోతిష పరంగా వర్ణించిన వెంకట శాస్త్రి విశిష్ట రచనలు.
  6. దివాకరాస్తమయము (1920) తన సహచరుడు దివాకరశాస్త్రి దివంగతుడైనపుడు రచించిన నివాళి.
  7. ఐదవ జార్జి పట్టాభిషేక పద్యాలు (1912) King George V పట్టాభిషేక సందర్భంగా.
  8. బొబ్బిలి పట్టాభిషేకం (కావ్యము) (1929) బొబ్బిలి మహారాజు పట్టాభిషేక సందర్భంగా.
  9. కామేశ్వరీ శతకం (1901)
  10. ఆరోగ్య కామేశ్వరి స్తుతి (1922)
  11. ఆరోగ్య భాస్కర స్తవము (1929-1930)
  12. మృత్యుంజయ స్తవము
  13. సౌభాగ్య కామేశ్వరీ స్తవము (1938-1941)
  14. సీతా స్తవము
  15. శివ భక్తి
  16. గో దేవి ఆవుకు, పులికి మధ్య జరిగిన సంభాషణ.
  17. పతివ్రత ఒక పడతికి ఒక పాముతో పెళ్ళి జరిగిన జానపద కథ ఆధారంఘఅ.
  18. సుశీల is a work dealing with social customs like divine dispensation.
  19. పూర్వ హరిశ్చంద్ర చరిత్రము పురాణ గాథ.
  20. దైవ తంత్రము
  21. సతీ స్మృతి తన భార్య మరణానంతరం వేంకటశాస్త్రి రచించిన విషాద రచన.
  22. కృష్ణ నిర్యాణము (1918) పోలవరం రాజా మరణం తరువాత నివాళి.
  23. సూర్యనారాయణ స్తుతి (1920) తన అనారోగ్య సమయంలో తిరుపతి శాస్త్రి చేసిన స్తుతి .
  24. పోలవరం రాజాగారి శని మహాదశ (1918) తనకు ఆప్తుడు, పోషకుడు ఐన పోలవరం రాజా గారి ఇబ్బందుల గురించి .
  25. సుఖ జీవి ఈదర వెంకట్రావు పంతులు సుగుణాల గురించి.

తెలుగు నాటకాలు

  1. పండితరాజము
  2. ఎడ్వర్డ్ పట్టాభిషేక నాటకము
  3. పాండవ జననము (1901-1917)
  4. పాండవ ప్రవాసము
  5. పాండవ రాజసూయము
  6. పాండవ ఉద్యోగము
  7. పాండవ విజయము
  8. పాండవ అశ్వమేధము
  9. అనర్ఘ నారదము
  10. దంభ వామనము
  11. సుకన్య
  12. ప్రభావతీ ప్రద్యుమ్నము (1920-1922)
  13. గజానన విజయము (1901-1912)

స్వతంత్ర తెలుగు వచన రచనలు

  1. భారత వీరులు
  2. విక్రమ చెళ్ళపిళ్ళము
  3. షష్టిపూర్తి
  4. సతీ జాతకము

ఆత్మకూరు సంస్థానాధికారిపై లఘుకృతి

మహబూబ్ నగర్ జిల్లా లోని సంస్థానాలలో ఒకటైన ఆత్మకూరు సంస్థానాన్ని తిరుపతి కవులు సందర్శించారు. ఇక్కడి ప్రభువులను కలుసుకోవాలనే వారి కోరికకు ధర్మాధికారిగా పనిచేసే ఒక పండితకవి అడ్డుతగిలాడు. వారికి వీరికి వాదన జరిగింది. పండితకవి ప్రభువులకు చాడీలు చెప్పి, వీరికి ప్రభువుల సత్కారాన్ని దూరం చేశాడు. దీనితో ఆగ్రహించిన జంటకవులు ఆ అధికారిని అధిక + అరి అని చమత్కరిస్తూ, అన్యోపదేశంగా నిందిస్తూ 27 పద్యాలతో కూడిన లఘుకృతిని రచించారు. దీనికి శనిగ్రహం అని పేరు పెట్టారు. అందులో ఒక పద్యం....

ధరణీ నాయకుడుత్తముండవని నిన్ ధర్మాధికారమ్మునం
దు రహిన్నిల్పుట తుచ్చ బుద్ధివయి క్రిందున్ మీదునుం గాన కె
ల్లరి కార్యమ్ములు పాడుసేయుటకె? నీ లక్ష్యమ్ము మా బోటు తెం
చరు చండాల! శనిగ్రహంబ! యిక మా సామర్థ్యం ముంజూడుమా!

[3]

రచనలనుండి ఉదాహరణలు

అమ్మా! సరస్వతీ! నీ దయవలన మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన పద్యం:

ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స
న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర
జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!

కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, వీరు చెప్పిన పద్యం. దమ్మున్న కవులు ఎవరైనా మమ్ములను గెలిస్తే మీసాలు తీసి మొక్కుతామని:

దోసమటంచెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కలిగినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.
పాండవోద్యోగ విజయాలు - పడక సన్నివేశం
బావా! యెప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమంబై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్
బావ! ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరులున్ సుఖులే కదా?
ఎసోభాఖులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగనున్నవారే ?
భుజసాలి వృకోదరుడు అగ్రజాగ్య్నకున్ దక్కగా నిల్చి
శాంతు గతి తానూ చరించునే తెలుపుము అర్జునా, ఎక్కడి నుండి రాక?
పాండవోద్యోగ విజయాలు - రాయబారం
చెల్లియొ చెల్లకొ తమకు జేసినయెగ్గులు సైచిరందరున్
తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ
పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!
జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ
క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్

వనరులు, మూలాలు

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  • Tirupati Venkata Kavulu: Makers of Indian Literature, Salva Krishnamurthy, Sahitya Akademi, New Delhi, 1985.
  • ప్రసిద్ధ తెలుగు పద్యాలు - పి.రాజేశ్వరరావు సంకలనం

శ్రీ వేపచేదు విద్యా పీఠము, మన సంస్కృతి, నవంబరు 2000

  1. పద్య నాటకానికి పట్టాభిషేకము...(వ్యాసం):చాట్ల శ్రీరాములు, కందిమళ్ళ సాంబశివరావు:ఆంధ్రభూమి:ఆగస్టు 26, 2010
  2. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 119–128. {{cite book}}: |access-date= requires |url= (help)
  3. తెలుగులో తిట్టుకవిత్వం,రచన:విద్వాన్ రావూరి దొరసామిశర్మ, ఎమెస్కో,మద్రాస్,1968, పుట-198