కీటకము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే , బడినది. → బడింది. using AWB
పంక్తి 52: పంక్తి 52:
}}
}}


'''కీటకాలు''' ([[ఆంగ్లం]]: '''Insects''') ఇప్పటివరకు జీవించిన అన్ని జీవులకంటె అతి విజయవంతమైన సమూహం. ఇవి [[ఆర్థ్రోపోడా]] (Arthropoda) ఫైలంలో [[ఇన్సెక్టా]] (Insecta) తరగతికి చెందిన జీవులు. కీటక జాతుల సంఖ్య మిగిలిన అన్ని జంతుజాతుల సంఖ్య కంటె ఎక్కువ.
'''కీటకాలు''' ([[ఆంగ్లం]]: '''Insects''') ఇప్పటివరకు జీవించిన అన్ని జీవులకంటె అతి విజయవంతమైన సమూహం. ఇవి [[ఆర్థ్రోపోడా]] (Arthropoda) ఫైలంలో [[ఇన్సెక్టా]] (Insecta) తరగతికి చెందిన జీవులు. కీటక జాతుల సంఖ్య మిగిలిన అన్ని జంతుజాతుల సంఖ్య కంటే ఎక్కువ.


== సామాన్య లక్షణాలు ==
== సామాన్య లక్షణాలు ==
పంక్తి 83: పంక్తి 83:


కీటకాలు మనకు ఉపయోగపడే [[తేనె]], [[మైనం]], [[లక్క]], [[పట్టు]] మొదలైన వివిధ పదార్ధాల్ని అందిస్తున్నాయి. [[తేనెటీగ]]లను కొన్ని వేల సంవత్సరాల నుండి మానవులు తేనె కోసం పెంచుతున్నారు. [[పట్టుపురుగు]]లు మానవ చరిత్రను మార్చాయి. [[పట్టు రహదారి]] (Silk Road) [[చైనా]]ను మిగతా ప్రపంచానికి కలపడానికి ఇదే కారణం. [[ఈగ]] లార్వాలు (maggots) ప్రాచీనకాలంలో గాయాల చికిత్సలో ఉపయోగించారు. కొన్ని కీటకాలు, లార్వాలు చేపల ఎరగా ఉపయోగిస్తారు.
కీటకాలు మనకు ఉపయోగపడే [[తేనె]], [[మైనం]], [[లక్క]], [[పట్టు]] మొదలైన వివిధ పదార్ధాల్ని అందిస్తున్నాయి. [[తేనెటీగ]]లను కొన్ని వేల సంవత్సరాల నుండి మానవులు తేనె కోసం పెంచుతున్నారు. [[పట్టుపురుగు]]లు మానవ చరిత్రను మార్చాయి. [[పట్టు రహదారి]] (Silk Road) [[చైనా]]ను మిగతా ప్రపంచానికి కలపడానికి ఇదే కారణం. [[ఈగ]] లార్వాలు (maggots) ప్రాచీనకాలంలో గాయాల చికిత్సలో ఉపయోగించారు. కొన్ని కీటకాలు, లార్వాలు చేపల ఎరగా ఉపయోగిస్తారు.
[[దస్త్రం:Chorthippus biguttulus f 8835.jpg|thumb|left|''Chorthippus biguttulus'', a grasshopper]] ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో కీటకాల్ని [[ఆహారం]]గా భుజిస్తారు; అయితే మరికొన్ని దేశాలలో ఇది నిషిద్ధించబడినది.
[[దస్త్రం:Chorthippus biguttulus f 8835.jpg|thumb|left|''Chorthippus biguttulus'', a grasshopper]] ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో కీటకాల్ని [[ఆహారం]]గా భుజిస్తారు; అయితే మరికొన్ని దేశాలలో ఇది నిషిద్ధించబడింది.


చాలా కీటకాలు ముఖ్యంగా బీటిల్స్ (beetles) మృత జీవాలు మరియు వృక్షాలపై జీవించి జీవావరణ పరిరక్షణలో భాగస్వాములుగా ప్రాముఖ్యం వహించాయి. ఇవి భూమి మీద పైపొరలోని జీవచక్రాన్ని రక్షిస్తున్నాయి.<ref>Gullan and Cranston, 3, 218–228.</ref> అందువలననే ప్రాచీన [[ఈజిప్టు]] దేశాలలో [[పేడ పురుగు]]లను పూజించేవారు.
చాలా కీటకాలు ముఖ్యంగా బీటిల్స్ (beetles) మృత జీవాలు మరియు వృక్షాలపై జీవించి జీవావరణ పరిరక్షణలో భాగస్వాములుగా ప్రాముఖ్యం వహించాయి. ఇవి భూమి మీద పైపొరలోని జీవచక్రాన్ని రక్షిస్తున్నాయి.<ref>Gullan and Cranston, 3, 218–228.</ref> అందువలననే ప్రాచీన [[ఈజిప్టు]] దేశాలలో [[పేడ పురుగు]]లను పూజించేవారు.

16:48, 22 అక్టోబరు 2016 నాటి కూర్పు

కీటకాలు
కాల విస్తరణ: Devonian - Recent
Western honey bee (Order Hymenoptera)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
కీటకాలు

క్రమాలు

Subclass Apterygota

Subclass Pterygota

Superorder Exopterygota
Superorder Endopterygota

For fossil groups and possible future splits, see below

కీటకాలు (ఆంగ్లం: Insects) ఇప్పటివరకు జీవించిన అన్ని జీవులకంటె అతి విజయవంతమైన సమూహం. ఇవి ఆర్థ్రోపోడా (Arthropoda) ఫైలంలో ఇన్సెక్టా (Insecta) తరగతికి చెందిన జీవులు. కీటక జాతుల సంఖ్య మిగిలిన అన్ని జంతుజాతుల సంఖ్య కంటే ఎక్కువ.

సామాన్య లక్షణాలు

  • శరీరం తల, వక్షం, ఉదరం అనే మూడు భాగాలుగా విభాజితమై ఉంటుంది.
  • తల ఆరు ఖండితాల కలయికతో ఏర్పడి, సంయుక్త నేత్రాలు, స్పర్శశృంగాలు, హనువులు, జంభికలు, ద్వంద్వంకాని అధరం కలిగి ఉంటుంది.
  • వక్షంలో మూడు ఖండితాలుంటాయి. దీనికి మూడు జతల కాళ్ళు ఉంటాయి. అందువల్ల ఇన్సెక్టాను 'షట్పాది' అని కూడా అంటారు.
  • సాధారణంగా వక్షానికి రెండు జతల రెక్కలు ఉంటాయి. కొన్నిటిలో ఒక జత రెక్కలుంటాయి. లెపిస్మాలాంటి కీటకాలలో రెక్కలు ఉండవు.
  • ప్రౌఢజీవి ఉదరానికి ఉపాంగాలు లేవు. డింభక దశలో ఉదరానికి ఉపాంగాలుంటాయి.
  • ఉదరం 9-11 ఖండితాలతో ఉంటుంది.
  • శ్వాస నిర్మాణాలు వాయునాళాలు. వీటి చివరి శాఖలను వాయునాళికలంటారు. ఇవి కణజాలం వరకు తిన్నగా చేరతాయి.
  • విసర్జక అవయవాలు మాల్ఫీజియన్ నాళికలు. ముఖ్య నత్రజని విసర్జక వ్యర్థ పదార్థం యూరిక్ ఆమ్లం.
  • ఒకే జనన రంధ్రం ఉదరానికి పరాంతాన ఉంటుంది
  • పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. ఇందులో డింభకదశలు, వాటి రూపవిక్రియ ఉంటుంది.

ముఖభాగాలు

కీటకాల ముఖభాగాలు నోటిని ఆవరించి ఉండి ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు. ఓష్టం, హనువులు, జంభికలు, అధరం, అధోగ్రసని అనేవి కీటకాల ముఖభాగాలు. వివిధ కీటకాలలో వివిధ ముఖభాగాలుంటాయి.

గుచ్చి పీల్చే ముఖభాగాలు

ఇవి ఆడదోమ, సీసీ ఈగ, నల్లి వంటి రక్తాన్ని పీల్చుకొనే కీటకాలలో ఉంటాయి.

స్పంజికా ముఖభాగాలు

ఇవి ఈగలలో ఉంటాయి.

చూషక ముఖభాగాలు

ఇవి సీతాకోకచిలుకలు, మాత్ లలో ఉంటాయి.

మానవులతో సంబంధాలు

Aedes aegypti, a parasite, and vector of dengue fever and yellow fever

చాలా కీటకాలు మానవులకు చీడపురుగులు (Pests) గా సుపరిచితులు. కీటకాలలో దోమ, పేను, నల్లి వంటి కొన్ని పరాన్నజీవులు (Parasites), ఈగలు, దోమలు వంటి కొన్ని వ్యాధుల్ని కలుగజేస్తాయి, చెదపురుగులు నిర్మాణాల్ని, మిడతలు మొదలైనవి పంటల్ని పాడుచేస్తాయి. అయినా చాలామంది కీటక పరిశోధకులు కీటక నాశక మందుల (Insectisides) కంటే జీవసంబంధ చీడపురుగుల నివారణ పద్ధతుల (Biological pest control methods) నే ఉపయోగాన్ని సమర్ధిస్తున్నారు.

చాలా కీటకాలు పర్యావరణానికి మరియు మానవులకు ఉపయోగకరమైనవి. కందిరీగ, తేనెటీగ, సీతాకోకచిలుకలు, చీమలు మొదలైన కొన్ని కీటకాలు పుష్పాలను పుప్పొడి రేణువులచే ఫలదీకరణం జరుపుతాయి. దీనిమూలంగా మొక్కల వృద్ధికి తోడ్పడుతున్నాయి. కీటకాల నాశనం మూలంగా ప్రస్తుత కాలంలో వీటిని వర్ధనం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.

కీటకాలు మనకు ఉపయోగపడే తేనె, మైనం, లక్క, పట్టు మొదలైన వివిధ పదార్ధాల్ని అందిస్తున్నాయి. తేనెటీగలను కొన్ని వేల సంవత్సరాల నుండి మానవులు తేనె కోసం పెంచుతున్నారు. పట్టుపురుగులు మానవ చరిత్రను మార్చాయి. పట్టు రహదారి (Silk Road) చైనాను మిగతా ప్రపంచానికి కలపడానికి ఇదే కారణం. ఈగ లార్వాలు (maggots) ప్రాచీనకాలంలో గాయాల చికిత్సలో ఉపయోగించారు. కొన్ని కీటకాలు, లార్వాలు చేపల ఎరగా ఉపయోగిస్తారు.

Chorthippus biguttulus, a grasshopper

ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో కీటకాల్ని ఆహారంగా భుజిస్తారు; అయితే మరికొన్ని దేశాలలో ఇది నిషిద్ధించబడింది.

చాలా కీటకాలు ముఖ్యంగా బీటిల్స్ (beetles) మృత జీవాలు మరియు వృక్షాలపై జీవించి జీవావరణ పరిరక్షణలో భాగస్వాములుగా ప్రాముఖ్యం వహించాయి. ఇవి భూమి మీద పైపొరలోని జీవచక్రాన్ని రక్షిస్తున్నాయి.[1] అందువలననే ప్రాచీన ఈజిప్టు దేశాలలో పేడ పురుగులను పూజించేవారు.

కీటకాలన్నింటిలోని ఉపయోగమైనవి ఇతర కీటకాల్ని ఆహారంగా తినేవి. ఈ పద్ధతి కీటకాల జనాభాను నియంత్రించడానికి ముఖ్య కారణము. ఇదే గనక లేకపోతే వీటి జనాభా భూమినంతా ఆక్రమించేవి.[2]

కీటక సంహార పరికరాలు

కీటక సంహార పరికరాలు కీటకాలను సంహరించుటకు మానవుడు తయారుచేసుకున్న పరికరాలు. పురాతన కాలం నుండి మానవునికి కీటకాల నుండి హాని కలుగుతున్నది. వీటి బారినుండి రక్షించుకునుటకు వీటి తయారీని ప్రారంభించాడు. మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వివిధ పరికరాలను తయారు చేసుకున్నాడు.

మూలాలు

  1. Gullan and Cranston, 3, 218–228.
  2. Gullan and Cranston, 328–348.
"https://te.wikipedia.org/w/index.php?title=కీటకము&oldid=1995153" నుండి వెలికితీశారు