గంధం నాగరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1968 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:2011 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 98: పంక్తి 98:
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:1968 జననాలు]]
[[వర్గం:1968 జననాలు]]
[[వర్గం:2011 మరణాలు]]

10:36, 26 అక్టోబరు 2016 నాటి కూర్పు

గంధం నాగరాజు
గంధం నాగరాజు
జననంగంధం నాగరాజు
ఆగష్టు 30, 1968
నరసరావుపేట, గుంటూరు జిల్లా
మరణంఏప్రిల్ 27, 2011
నివాస ప్రాంతంగుంటూరు జిల్లా నరసరావుపేట
ప్రసిద్ధికథారచయిత, నవలాకారుడు, నాటక రచయిత
తండ్రిగంధం యాజ్ఞవల్క్య శర్మ


గంధం నాగరాజు కథ, నవల, నాటక, సినిమా రచయిత.

జననం

నాగరాజు 1968 ఆగష్టు 30న గుంటూరు జిల్లా నరసరావుపేట కు చెందిన సూర్యప్రకాశరావు, రాధరుక్మిణి దంపతులకు జన్మించారు. ఈయన చిన్నతనంలోనే పెదనాన్న గారైన గంధం యాజ్ఞవల్క శర్మ ఈయన్ను దత్తత తీసుకున్నారు.

చదువు - ఉద్యోగం

ఎం.సీ.హెచ్ కోర్సును పూర్తిచేసిన నాగరాజు కుంభంమెట్టు కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేశారు.

1990లో అపరాజిత కథతో రచనను ప్రారంభించారు.

రచనలు

కథలు

  • జన్మభూమి
  • క్షమయాదరిత్రి
  • కర్మయోగి
  • సృష్టి
  • రజ్జుసర్పభ్రాంతి,
  • పునరావాసం
  • తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క
  • అపరాజిత
  • ప్రియాంక
  • జీవితానికో పుష్కరం
  • వెంకటప్పయ్య
  • ట్రామాకేర్

వంటి 18 కథలు

నవలలు

  • పసిడిలంక
  • స్థితప్రజ్ఞ

నాటకాలు

  • వలస
  • రంగులరాట్నం

నాటికలు

  • ఆలోచించండి
  • సత్యాగ్రహి
  • పాదుకాస్వామ్యం
  • చదువు
  • శేషార్ధ్హం
  • నోట్ దిస్ పాయింట్
  • మిధ్యాబింబం
  • నువ్వు ప్లస్ నేను మైనస్ ఈజ్ ఈక్వల్ టూ పెళ్లి
  • డాకట్ర్ జోసఫ్ మరకతమణి
  • అనంతం

ఆయన రాసిన నవలలు స్వాతి సపరివార పత్రికలోనూ, కథలు వివిధ వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనేక పరిషత్తుల్లో ఆయన రాసిన నాటికలు, నాటకాలు ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు పొందాయి. సత్యాగ్రహి నాటికకు ఉత్తమ రచనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది.

సినిమారంగం

రాగం చిత్రానికి సహ రచయితగా తెలుగు సినీరంగంలో తొలి అడుగు వేసిన నాగరాజుకు గమ్యం చిత్రం మలి అడుగు. ఈ చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది.

అటుతర్వాత బాణం, బెట్టింగ్ బంగార్రాజు, ఓం శాంతి ఓం, గాయం-2, ఇంకోసారి, రాగం వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు.

మరణం

ఈయన 2011, ఏప్రిల్ 27న అనారోగ్యంతో మరణించారు.