కైకాల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాషా సవరణలు, +లింకులు
పంక్తి 31: పంక్తి 31:
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ [[మద్రాసు]] వెళ్ళాడు. ఆయన్ని మొదట గుర్తించింది [[డి.యల్.నారాయణ]]. [[1959]] లో నారాయణ [[సిపాయి కూతురు]] అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, ఆయన రూపు రేఖలు [[యన్.టి.ఆర్]] ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడ ఈయన్ని గమనించారు. [[1960]] లో యన్.టి.ఆర్ తన [[సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి]] లో ఈయనకి ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు [[యస్.డి.లాల్]]. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.

సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది [[విఠాలాచార్య]]. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా [[కనక దుర్గ పూజా మహిమ]] లో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో ఆయన ప్ర్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.
సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది [[విఠలాచార్య]]. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా [[కనక దుర్గ పూజా మహిమ]] లో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో ఆయన ప్ర్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.

ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ కారెక్టర్ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయన్ని సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ లాంటి ఒక విలక్షణ నటుడు దొరకటం ఒక వరం. ఈయన వెయ్యని పాత్ర అంటూ లేదు. ఆయన ఏపాత్ర వేసినా ఆ పాత్రలో జీవించాడు. ఆయన [[యమగోల]] మరియు [[యమలీల]] చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. [[కృష్ణుడు|కృష్ణుడి]]గా, [[రాముడు|రాముడి]]గా యన్.టి.ఆర్ ఎలానో, [[యముడు|యముడిగా]] సత్యనారాయణ అలా!

17:19, 25 అక్టోబరు 2007 నాటి కూర్పు

కైకాల సత్యనారాయణ
జననంజూలై 25 ,1935
కౌతారం, ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లునవరస నటసార్వభౌమ
ప్రసిద్ధిసినిమాలు, రాజకీయం
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
మతంహిందూమతం
భార్య / భర్తనాగేశ్వరమ్మ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు.

వ్యక్తిగత జీవితం

సత్యనారాయణ కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఇద్దరు కొడుకులు.

సినీ జీవితం

తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. ఆయన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959 లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, ఆయన రూపు రేఖలు యన్.టి.ఆర్ ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడ ఈయన్ని గమనించారు. 1960 లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి లో ఈయనకి ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.

సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనక దుర్గ పూజా మహిమ లో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో ఆయన ప్ర్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.

ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ కారెక్టర్ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయన్ని సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ లాంటి ఒక విలక్షణ నటుడు దొరకటం ఒక వరం. ఈయన వెయ్యని పాత్ర అంటూ లేదు. ఆయన ఏపాత్ర వేసినా ఆ పాత్రలో జీవించాడు. ఆయన యమగోల మరియు యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడిగా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా!

సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు. 1996 లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నుంచి పోటీ చేసి లోక్‌సభ కి ఎన్నికయ్యాడు.

చిత్ర సమాహారం

గుర్తింపులు మరియు బహుమతులు

  • నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చినది.
  • నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది
  • కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
  • నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చినది.

గణాంకాలు

  • 777 సినిమాలు ఇప్పటిదాకా
  • 28 పౌరాణిక చిత్రాలు
  • 51 జానపద చిత్రాలు
  • 9 చారిత్రక చిత్రాలు
  • 200 మంది దర్శకులతో పనిచేసాడు
  • 223 సినిమాలు 100 రోజులు ఆడాయి
  • 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి
  • 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి
  • 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవి

బయటి లింకులు