Coordinates: 16°31′09″N 80°37′50″E / 16.5193°N 80.6305°E / 16.5193; 80.6305

విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 462: పంక్తి 462:
===ప్రముఖ వ్యక్తుల చిత్రమాలిక===
===ప్రముఖ వ్యక్తుల చిత్రమాలిక===
<gallery>
<gallery>
Saandip.jpg|సినీ నేపథ్య గాయకుడు '''సాందీప్'''
Saandip.jpg|సినీ నేపథ్య గాయకుడు '''[[సాందీప్]]'''
Chetan.jpg|భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు '''చేతన్ ఆనంద్'''
Chetan.jpg|భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు '''చేతన్ ఆనంద్'''
Malladi kameswara rao.jpg|'''మల్లాది కామేశ్వర రావు''' - జర్నలిస్ట్
Malladi kameswara rao.jpg|'''మల్లాది కామేశ్వర రావు''' - జర్నలిస్ట్

11:59, 16 డిసెంబరు 2016 నాటి కూర్పు

  ?విజయవాడ
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
విజయవాడ నగర వీక్షణం, కనకదుర్గమ్మ దేవాలయం, అక్కన్న మాదన్న గుహలు, విజయవాడ రైల్వే స్టేషన్ మరియు వీ.యం .సీ స్థూపం - పై నుంచి గడియారపు ముల్లు తిరిగే దిశలో చూడండి.
విజయవాడ నగర వీక్షణం, కనకదుర్గమ్మ దేవాలయం, అక్కన్న మాదన్న గుహలు, విజయవాడ రైల్వే స్టేషన్ మరియు వీ.యం .సీ స్థూపం - పై నుంచి గడియారపు ముల్లు తిరిగే దిశలో చూడండి.
విజయవాడ నగర వీక్షణం, కనకదుర్గమ్మ దేవాలయం, అక్కన్న మాదన్న గుహలు, విజయవాడ రైల్వే స్టేషన్ మరియు వీ.యం .సీ స్థూపం - పై నుంచి గడియారపు ముల్లు తిరిగే దిశలో చూడండి.
అక్షాంశరేఖాంశాలు: 16°30′58″N 80°36′58″E / 16.516°N 80.616°E / 16.516; 80.616
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 61.88 కి.మీ² (24 చ.మై)[1]
జిల్లా (లు) గుంటూరు జిల్లా
జనాభా
జనసాంద్రత
10,34,358[2] (2011 నాటికి)
• 16,716/కి.మీ² (43,294/చ.మై)
అధికార భాష తెలుగు
ప్రణాళికా సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము
పురపాలక సంఘం విజయవాడ నగర పాలక సంస్థ
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 520 0xx
• ++91-866
వెబ్‌సైటు: https://www.ourvmc.org/


Vijayawada
విజయవాడ
బెజ్జంవాడ, బెజవాడ, రాజేంద్రచోళపురం
—  Metropolis  —
విజయవాడ నగర వీక్షణం, కనకదుర్గమ్మ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మరియు వీ.యం .సీ స్థూపం - పైన ఉన్న చిత్రాలు కుడి నుంచి గడియారపు ముల్లు తిరిగే దిశలో చూడండి.
విజయవాడ నగర వీక్షణం, కనకదుర్గమ్మ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మరియు వీ.యం .సీ స్థూపం - పైన ఉన్న చిత్రాలు కుడి నుంచి గడియారపు ముల్లు తిరిగే దిశలో చూడండి.
విజయవాడ నగర వీక్షణం, కనకదుర్గమ్మ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మరియు వీ.యం .సీ స్థూపం - పైన ఉన్న చిత్రాలు కుడి నుంచి గడియారపు ముల్లు తిరిగే దిశలో చూడండి.
ముద్దు పేరు: విక్టరీ ప్లేస్ - విజయ వాటిక
Vijayawada is located in Andhra Pradesh
Vijayawada
Vijayawada
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విజయవాడ ప్రాంతము
అక్షాంశ రేఖాంశాలు: 16°31′09″N 80°37′50″E / 16.5193°N 80.6305°E / 16.5193; 80.6305{{#coordinates:}}: cannot have more than one primary tag per page
Country India
State ఆంధ్ర ప్రదేశ్
District కృష్ణా
వ్యవస్థాపకులు Arjuna
Named for Victory
ప్రభుత్వం
 - Type Mayor–Council
 - శాశనసభ్యులు
ఎం.ఎల్.ఏ.లు జాబితా
 - ఎం పి కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని
 - మున్సిపల్ కమీషనర్
 - మేయరు కోనేరు శ్రీధర్
వైశాల్యం [1]
 - Metropolis 61.88 km² (23.9 sq mi)
 - మెట్రో 110.44 km² (42.6 sq mi)
ఎత్తు [3] 23 m (75 ft)
జనాభా (2011)[2][5][6]
 - Metropolis 10,48,240
 - సాంద్రత 16,939/km2 (43,871.8/sq mi)
 - మెట్రో 14,91,202
PIN 520 XXX
Area code(s) +91–866

విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరం[7]. కృష్ణా జిల్లా లో, కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారకేంద్రం. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతి పెద్ద కూడలి. భారత దేశం లోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఇక్కడ ఉన్న అనేక కార్పొరేటు విద్యాసంస్థల వలన దీనికి విద్యలవాడ అనే పేరు కూడా వచ్చింది. ఎండాకాలములో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నాడట.

విజయవాడ, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది. కృష్ణా జిల్లాలో 61.8 చదరపు కి.మీ. విస్తీర్ణములో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 851,282. అంతేకాదు విజయవాడ కృష్ణా జిల్లాకు వర్తక/వాణిజ్య రాజధాని.

స్థల నామకరణ

విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఇలా సాగుతుంది: పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు, వారిని వేదవ్యాసుడు కలిసి, వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి ఆర్జునుడిని ఎన్నుకొంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై (ఇంద్రకీలాద్రి) ఒంటికాలిపై, చేతులు పైకెత్తి, పంచాగ్నుల మధ్య (నాలుగు సృష్టించినవి ఐదవది సాక్షాత్తూ సూర్య భగవానుడు), ఘోరమయిన తపస్సు చేసాడు. శివుడు, అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడయిన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి బాణము విసురుతాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న శివుడు కూడా బాణము విసిరుతాడు. ఈ రెండు బాణములు ఒకేసారి తగిలి, ఎలుగుబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకి దిగుతారు. మాటలు కాస్తా యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్పవీరుడయినా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా ఆలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగము మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండటం గమనించి, సాక్షాత్తూ శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై, అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి. రాళ్ళ కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచారు.

చరిత్ర

విజయవాడ కృష్ణా నది సమీపంలో తెలుగు తల్లి శిల్పం

విజయవాడ చరిత్ర వ్యాసం చూడండి

కృష్ణానది తీరాన విజయవాడ - 1943 నాటి చిత్రం (మాగంటి బాపినీడు కూర్చిన "ఆంధ్ర సర్వస్వము" అనే పుస్తకం నుండి)
  • 1509 వరకూ ఆంధ్ర క్షత్రియులులో వశిష్ట గోత్రానికి చెందిన పూసపాటి రాజ వంశస్తులు విజయవాడ (బెజవాడ) నగరాన్ని పాలించారు [8].
  • నాగార్జున సాగరు నుండి మచిలీపట్నము వరకు గల కృష్ణా పరీవాహక ప్రాంతములలో రాతి యుగపు మానవుల సంచారము యొక్క ఆనవాళ్ళు లభించడం వలన, ఇక్కడ ప్రాచీన మానవులు నివసించారని భావిస్తున్నారు.
  • అర్జునుడు వేటగాని రూపములో ఉన్న శివుడిపై సాధించిన విజయానికి చిహ్నముగా ఇక్కడ విజయేశ్వరుడి (మల్లేశ్వర స్వామి లేదా జయసేనుడు)ని ప్రతిష్ఠించాడని పురాణగాథ. పురాణాలలో విజయవాడను విజయవాత అని పెలిచేవారు. దీని గురించి రాజేంద్రచోళ పురాణములో కూడా పేర్కొన్నారు.
  • హిందువులకు మరియు బౌద్ధులకు విజయవాడ ఒక ముఖ్య ఆధ్యాత్మిక స్థలము. కళ్యాణి చాళుక్యులు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. కీ.శ. 638 సంవత్సరములో ఇక్కడ బౌద్ధ మతము బాగా ప్రాచుర్యములో ఉన్నప్పుడు చైనా దేశపు యాత్రికుడైన హుయాన్ త్సాంగ్ (Huan-tsang) ఈ ప్రాంతాన్ని దర్శించాడు.
  • బ్రిటీషువారు పరిపాలిస్తున్న రోజులలో ఈ ప్రాంతము చాలా అభివృద్ధిని చవిచూసింది. వారి కాలంలో కృష్ణానదిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. దానితో వ్యవసాయాభివృద్ధి జరిగి, తద్వారా విజయవాడ పట్టణం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రోజులలో సినిమా వ్యాపారానికి కూడా విజయవాడ ఒక కూడలి అని చెప్పవచ్చు.

ఆర్ధికం

ఎం.జి రోడ్డు పైన ఉన్న పి.వి.పి మాల్

చుట్టుప్రక్కల సారవంతమైన నేల, మంచి నీటివనరులు, ప్రగతిశీలురైన రైతులు కారణంగా విజయవాడ ముఖ్యమైన వ్యవసాయ వర్తక కేంద్రమైంది. చెరకు, వరి, మామిడి పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్యకేంద్రం. ఇందుకు తోడు వినియోగదారుల అవుసరాలను తీర్చే వర్తకం, రవాణా, ప్రయాణ, విద్య, వైద్య సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇంకా మోటారు వాహనాల విడిభాగాలు (ఆటోనగర్), ఇనుప సామాను, గృహనిర్మాణ సామగ్రి, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అధికంగా వ్యాపారం పాత నగర భాగం (వన్ టౌన్), కాళేశ్వరరావు మార్కెట్‌లలో జరుగుతుంది. గవర్నర్ పేట, బీసెంట్‌రోడ్‌లు దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గృహ వినియోగ వస్తువుల వ్యాపారానికి కేంద్రాలు. లబ్బీపేట, ఎమ్.జి.రోడ్‌లలోను, మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి.

కోస్తా ఆంధ్ర ప్రాంతంలో (ముఖ్యంగా నాలుగు జిల్లాలకు) హోల్‌సేల్ వ్యాపారం విజయవాడనుండి పెద్దయెత్తున జరుగుతుంది. వస్త్రాలు, ఇనుప సామానులు, పప్పుధాన్యాలు, ఎరువులు, మందులు వంటివి ఇక్కడినుండి సరఫరా చేయబడుతాయి.

విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్.

నగర పాలన

విజయవాడ నగరపాలక సంస్థ 50 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో కేసీపీ వారి స్తూపం, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బస్ స్టాండ్ రైల్వే స్టేషను లకు మధ్యన
విజయవాడ నగరం-విహంగ దృశ్యం-గుణదల కొండ మీద నుండి

విజయవాడ నగరం ఆంధ్ర ప్రదేశ్‌లో మూడవ పెద్ద నగరమైనాగాని ఆ జిల్లా (కృష్ణా జిల్లా) పరిపాలనా కేంద్రం కాదు. విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతాయి.[9]. నగరంలోని 59 వార్డులనుండి ఒక్కో కార్పొరేటర్ ఎన్నికోబడుతారు. నగరానికి ఒక మేయర్‌ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం ఒక మునిపల్ కమిషనర్‌ను నియమిస్తుంది. విజయవాడ నగరంలో ఒక సబ్-కలెక్టర్ ఉంటాడు.కృష్ణాజిల్లాలోని 15 గ్రామాలతో కలిపి గ్రేటర్ విజవాడ ఏర్పాటు కాబోతున్నది.ప్రక్కనే కృష్ణానదికి అవతలివైపున 3కి.మీ.దూరంలోఉన్న తాడేపల్లి మునిసిపాలిటీనికూడా గ్రేటర్ లో కలపాలని తాడేపల్లి ప్రజలు కోరారు కానీ అది గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నందున గ్రేటర్లో కలిపేందుకు అధికారులు ప్రతిపాదించలేదు.వి.జి.టి.ఎం.వుడా విజయవాడ ద్వారా నగరంలో పచ్చదనం పార్కులు రహదారులు ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి.

గ్రేటర్ విజయవాడ

విజయవాడలో కలుపదలచిన కృష్ణాజిల్లాలోని 15 సమీప గ్రామాలు:

రవాణా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన గరుడ బస్సు

రోడ్డు, రైలు మార్గాల ద్వారా విజయవాడ నగరం మంచి రవాణా సౌకర్యాలు కలిగి ఉంది.

రైలు

చెన్నై-హౌరా, చెన్నై-ఢిల్లీ రైలు మార్గాల కూడలిగా ఉన్న ఉన్నాయి.యవాడ జంక్షన్ దేశంలో అధికంగా రద్దీగా ఉండే రైలు స్టేషనులలో ఒకటి. [1]. నగరం బయటి ప్రాంతాలలో ఉన్న చిన్న స్టేషన్లు - మధురానగర్, గుణదల, రామవరప్పాడు. విజయవాడ నగరానికి 65 కి.మీ. దూరంలో ఉన్న మచిలీపట్నం రేవును అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి. [10]

రోడ్డు

విజయవాడ నుండి ఇతర ముఖ్య పటణాలకు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి బస్సులు నడపబడుచున్నవి. వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. విజయవాడలోని పండిత నెహ్రూ ప్రయాణ ప్రాంగణము దేశంలో అతి పెద్ద బస్సు స్టాండులలో ఒకటి. నగరం లోపలి ప్రయాణాలకు సిటీ బస్సులు, ఆటోలు, రిక్షాలు ఇంకా ప్రైవేటు వాహనాలు (మోటారు సైకిళ్ళు, కారులు, సైకిళ్ళు వంటివి) అధికంగా వాడుతారు. సరకుల రవాణాకు లారీలు సప్లై చేసే కంపెనీలు నగరంలో చాలా ఎక్కువ ఉన్నాయి. నవత, క్రాంతి మరియు కేశినేని వంటి పేరొందిన రవాణా సంస్థల ప్రధాన కార్యాలయాలు విజయవాడలో ఉన్నాయి.

ఉడా ఇన్నర్ రింగ్ రోడ్డు

నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. జాతీయ రహదారి-5 (చెన్నై-కొలకత్తా), జాతీయ రహదారి-9 (మచిలీపట్నం-ముంబై), జాతీయ రహదారి-221 (విజయవాడ-జగదల్‌పూర్) - ఇవి విజయవాడ మీదుగా ఉన్నాయి. విజయవాడనుండి రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు మార్గాలు:

ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు

  • బైపాస్‌ రోడ్డు గొల్లపూడి మైలురాయి సెంటర్‌ నుంచి సితార సెంటర్‌ వరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 40 నుండి 200 అడుగులుగా వెడల్పు చెయ్యాలి.
  • బెంజ్ సర్కిల్
    గతంలో తాడేపల్లి మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై పెదవడ్లపూడి, నూతక్కి గ్రామాల మీదుగా కృష్ణానది దాటి విజయవాడ, మచిలీపట్నం (ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో నిడమానూరు వద్ద కలుస్తుంది.

బైపాస్ రోడ్డు విస్తరణ

బైపాస్‌ రోడ్డు గొల్లపూడి మైలురాయి సెంటర్‌ నుంచి సితార సెంటర్‌ వరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 40 నుండి 200 అడుగులుగా వెడల్పు చెయ్యాలి.బైపాస్‌ రోడ్డుకు ఇరువైపులా భారీ వ్యాపార కూడళ్లు ఉన్నాయి. మహాత్మాగాంధీ హోల్‌సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో 18 హోల్‌సేల్‌ సంఘాల ద్వారా 499 టోకు వ్యాపారులు వ్యాపారం సాగిస్తున్నారు. రోడ్డు పక్కనే రాష్ట్రంలోనే పెద్దదైన ఐరన్‌ మార్కెట్‌ యార్డు, ఆర్టీసీ డిపోఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ద్వారా నడుపబడే బస్సులు ఇతర పట్టణాలకు, ప్రధాన రవాణా మరియు ప్రయాణ సాధనాలు.

చుక్కలనంటిన భూముల ధరలు

ఇక్కడ పదేళ్ళ క్రితం గజం రూ.500 అన్నా కొనే నాధుడుండే వాడు కాదు. నేడు రోడ్డు వెంబడి ఉన్న స్థలం గజం రూ.15వేల నుంచి రూ.20వేల ఉంటే, వెనుక ఉన్న స్థలాలు గజం రూ.15వేల వరకు పెరిగాయి. జాతీ య రహదారికి అనుసంధానంగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాలకు మహర్దశ తీసుకొచ్చింది.

విమానం

విజయవాడ విమానాశ్రయం (గన్నవరం) నుండి ఇతర ప్రధాన నగరాలకు విమాన సౌకర్యము ఉంది. విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, ముంబై, జైపూర్, వైజాగ్, తిరుపతి మరియు ఢిల్లీ నగరములకు విమాన సౌకర్యము ఉంది. విజయవాడ విమానాశ్రయం స్పైస్ జెట్, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ కోస్టా,ట్రూ జెట్ మరియు ఎయిర్ ఇండియా సంస్థల ద్వారా సేవలు అందిస్తుంది. వార్షికంగా, 380,000 మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుండి ప్రయాణీకులు ప్రయాణించడానికి ఉపయోగపడుతున్నది. విమానాశ్రయం విస్తరణ కోసం, పెద్ద విమానాల ల్యాండింగ్, రాత్రి ల్యాండింగ్ (ప్రస్తుతము ఉంది.) తదితర సౌకర్యాల మెరుగుదల కోసం ఒక బృహత్ ప్రణాళిక ప్రతిపాదించబడింది. విజయవాడలో ఎయిర్ కోస్టా, దాని కార్యకలాపాలు ప్రారంభించింది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, విశాఖపట్నం, మధురై మరియు జైపూర్ అక్టోబర్ 2013 నుండి మరియు వెంటనే పూణే, గోవా, త్రివేండ్రంకు ప్రారంభించాలని యోచిస్తోంది.

విజయవాడకు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, రాజమండ్రి, విశాఖపట్నం నగరాలకు విమాన సర్వీసులున్నాయి.జెట్ ఎయిర్ వెస్, ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీల వారు రోజువారీ సర్వీసులు నడుపుతున్నారు. స్పైస్ జెట్ జూన్ 2011 నుంచి హైదరాబాదుకు విమానసర్వీసు నడపనున్నది.[11][12]

నగర దృశ్యం

విజయవాడ నగర దృశ్యం

విజయవాడలో చూడదగిన ప్రదేశములు

  • రాజీవ్‌ గాంధీ పార్కు
  • మొగల్రాజపురం గుహలు
  • భవానీ ద్వీపం
  • అమరావతి
  • బీసెంట్ రోడ్డు
  • సొరంగం
  • సత్యనారాయణ స్వామి ఆలయం
  • విజయవాడలో అనేక సినిమా ధియేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న జనాభాకి వినోదానికి కొదవలేదు. అధునాతన షాపింగ్ మాల్స్ లో అంతర్జాతీయ ఉత్పత్తులు. జ్యూవెలరీ దుకాణాలకు ఇక్కడ మహాత్మా గాంధీ రోడ్డు (బందరు రోడ్డు) ప్రసిద్ధమైనది.

భౌగోళికం, జనవిస్తరణ

[13] సముద్రమట్టానికి 19 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

  • ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ రెండవ పెద్ద నగరం. 2001 జనగణన ప్రకారం నగర జనాభా 8,51,282 (పరిసర ప్రాంతాలతో కలిపితే 1,039,518). 2006 లెక్కల ప్రకారం ఈ సంఖ్యలు 1,025,436 మరియు 1,411,152.నగరంలో 136 గుర్తింపు పొందిన మురికివాడలున్నాయి. ఈ మురికివాడల్లో మొత్తం 2.21 లక్షల మంది జనాభా ఉన్నారు

2011 జనాభాలెక్కలు

2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ పట్టణ జనాభా వివరాలు:

గడపలు స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య మొత్తం జనాభా
2,31,759 5,12,211 5,27,307 10,39,518

జనాభా వివరాలు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
1871 8,206—    
1881 9,366+14.1%
1891 20,224+115.9%
1901 24,224+19.8%
191132,867+35.7%
192144,159+34.4%
193160,427+36.8%
194186,184+42.6%
19511,61,198+87.0%
19612,34,360+45.4%
19713,44,607+47.0%
19815,43,008+57.6%
19918,45,756+55.8%
200110,39,518+22.9%
201114,91,202+43.5%
1871 నుంచి, విజయవాడ పట్టణ పరిధికి చెందిన జనాభా యొక్క వివరము ఈ విధముగా ఉంది

Sources: Rao, Kondapalli Ranga; 1. Rao, M. S. A. (1984). Cities and Slums: A study of a Squatters' Settlement in the City of Vijayawada. Concept Publishing Company. p. 12.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)

2. Provisional Population Totals, Census of India 2011 City Name:VIJAYAWADA
  • భౌగోళికంగా విజయవాడ నగరం కృష్ణానది తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల.
  • నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.

సంస్కృతి

ఆంధ్ర ప్రదేశ్ కోస్తా జిల్లాలలోని పెద్ద నగరమైనందున విజయవాడలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల సంస్కృతి ప్రముఖంగా ఉంది. కాని నగరం విస్తరిస్తున్న కొద్దీ నాగరికతలో ఆధునిక జీవన ధోరణులు ప్రబలుతున్నాయి. ఇంతే కాకుండా వ్యాపారం లేదా ఉద్యోగం లేదా చదువు రీత్యా దేశంలోని పలు ప్రాంతాలనుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన లేదా తాత్కాలికంగా ఉంటున్న జనాభా కూడా గణనీయంగా ఉంది. అలాగే ప్రధానంగా హిందువులు ఉన్న నగరమైనా గాని క్రైస్తవులు, మహమ్మదీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతే కాకుండా కులాల మధ్య పెచ్చుపెరిగిన వైషమ్యాల ప్రభావం కూడా విజయవాడలో ప్రబలంగా ఉంది.

విద్య

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ

ఎన్.టి.ఆర్. ఆరోగ్య వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయం.

దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం. విజయవాడ పెద్దగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. కాని ఇంటర్మీడియట్ స్థాయిలో విజయవాడ రాష్ట్రంలో పెద్ద విద్యా కేంద్రంగా స్థానం సాధించింది. ఇబ్బడి ముబ్బడిగా స్థాపించబడిన ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇందుకు దోహదం చేశాయి.

విద్యా సంస్థలు

సిద్ధార్థ పబ్లిక్ స్కూలు విజయవాడ మొగల్రాజపురములో ఉంది. సిద్ధార్థ ఎకాడెమీ వారిచే 1977లో స్థాపించబడింది. వీరమాచినేని పద్దయ్య దానమిచ్చిన సుమారు 8 ఎకరాలలో రేకుల షెడ్డు, 8 మంది టీచర్లతో ప్రారంభించబడింది. 1982 లో స్కూలు నిల్డింగు సమకూరినది. 1987 లో జిమ్నాజియం నిర్మించబడింది. 1995లో ప్రాథమిక తరగతుల కోసం ప్రత్యేక భవనం నిర్మంచబడింది. ప్రస్తుతము 2500 విద్యార్థుల తో, 120 టీచర్ల తో, గత 25 ఏళ్ళ నుండి 100 % 10వ తరగతి సీ బీ ఎస్ సీ బోర్డు పరీక్షా ఉత్తీర్ణత సాధిస్తూ ఉంది.

చలనచిత్ర ప్రదర్శన శాలలు

ఆసుపత్రులు మరియు వైద్యశాలలు

సత్రములు

వృద్ధాశ్రమములు

బ్యాంకులు

విజయవాడ ప్యాకర్లు మరియు రవాణ దారులు

మూస:విజయవాడ ప్యాకర్లు మరియు రవాణ దారులు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కార్యాలయములు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క రాజధాని కార్యాలయములు విజయవాడ లోను మరియు చుట్టుప్రక్కల ప్రాంతములలో ఈ క్రింద విధముగా ఉన్నాయి. మూస:ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కార్యాలయములు

మీడియా

బెంజి సర్కిల్ దగ్గర ట్రెండ్‌సెట్ మాల్

విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ప్రముఖ వాణిజ్య, రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రము. ఇక్కడ ప్రచురణ మరియు ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. ప్రముఖ పాత్రికేయులు మరియు జర్నలిస్టులు -- కాశీనాధుని నాగేశ్వరరావు.... శివలెంక శంభుప్రసాదు...... ముట్నూరి కృష్ణారావు..... మోటూరి హనుమంతరావు..... మద్దకూరి చంద్రసేఖరరావు... తుర్లపాటి కుటుంబరావు..... నండూరి రామ్మోహనరావు.....కూచిమంచి సత్యసుబ్రమణ్యం...... . సీ. రాఘవాచారి... వీఆర్ బొమ్మారెద్డ్ది... ఎకేఆర్ బీ కోటేస్వరరావు... పరకాల పట్టాభిరామారావు... తెలకపల్లి రవి... ఉపేంద్ర బాబు.... సయ్యద్ అక్బర్..... ఎ.ఎమ్.ఖాన్ యజ్దాని..... ఖాదర్ మొహియుద్దీన్..... ముహమ్మద్ వజీరుద్దీన్.... శ్రీరాములు.... కుచ్చి గోపాలకృష్ణ.... తిలక్... ఎస్.వెంకటరావు.. ముత్యాల ప్రసాదు... యు. రామకృష్ణ... ఎం.బి.నాథన... సత్య ప్రకాశ్ .... ఆర్. రాంప్రసాద్,.... ఈవీ బాలాజీ .... షేకు బాబు... ఎంబి వర్థన్..... అన్నవరపు బ్రమ్మయ్య.... చలపతిరావు.... రాజేంద్రప్రసాదు.... కలీముల్లా... పోలు అజయ కుమారు... ఫాజిలు ... వడ్లమూడి పద్మ... టీ.ఎడుకొండలు.... విజయవాడ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్లుగా సీ రాఘవాచారి. వీఆర్ బొమ్మారెడ్డి.. veeraji,ఎకే ఆర్ బీ కోటేస్వరరావు... ఎస్.వెంకటరావు.. పోలు అజయకుమారు..... ఎం బి వర్థన్..... అన్నవరపు బ్రమ్మయ్య...chava ravi, ముత్యాల ప్రసాదు తదితరులు పనిచేసారు.. విజయవాడలో ప్రధానంగా రెండు యూనియన్లు ఉన్నాయి. అవి 1. ఎపియుడబ్ల్యుజె.. 2.ఎపిడబ్ల్యుజె ఎఫ్. తుర్లపాతి కుటుంబరావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

రేడియో

విజయవాడలో ఎఫ్.ఎమ్. రేడియో స్టేషన్లు : ఏ.ఐ.ఆర్ (AIR) రెయిన్‌బౌ కృష్ణవేణి ఎఫ్‌ఎమ్ (102.2 MHz), రేడియో మిర్చి ఎఫ్‌ఎమ్ (98.3 MHz) మరియు రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5 MHz).

ముద్రణా

విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం మరియు ప్రచురితమౌతున్నాయి. గ్రంథోత్సవాలు ఇక్కడ సర్వసాధారణం. భారతదేశంలోని ప్రచురణ కర్తలు ఇక్కడ హాజరవ్వడమూ సర్వసాధారణమే.
విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే కోల్కతా తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం. విశాలాంధ్ర... ప్రజాశక్తి... నవోదయ... జయంతి... అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.

గ్రంథాలయాలు

విజయవాడలో కవి సామ్రాట్ విశ్వనాథసత్యనారాయణ ఇంటి ప్రాంగణములో వారు పుత్రునితో ముచ్చట

శ్రీ రామమోహన గ్రంథాలయం

1911వ సంవత్సరంలో నాటి స్వాత్రంత్య సమరయోధులు, దేశభక్తులు బందరు రోడ్డులోస్థాపించిన ఈ చారిత్రాత్మక గ్రంథాలయానికి సుమారు అర ఎకరం భూమి ఉంది.రెండువేల గజాలు కలిగిన ఈ గ్రంథాలయ భూమిని, భవనాన్ని అమ్మడానికి వీలు లేకుండా, ఇతర అవసరాలకు ఉపయోగించకుండా, దాతలు వీలునామా రాశారు.గ్రంథాలయం భూముల విలవ రూ. 20కోట్లుపై మాటే. ఇందులో కొంత భాగం కబ్జాదారుల ఆక్రమణలో ఉంది.నగరంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒకరు రూ. 70 లక్షలతో శిథిలావస్థకు వచ్చిన భవంతి స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి ఇస్తానని ముందుకొచ్చారు.

కొండపల్లి అడవులు

విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 కి.మీ.² (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.[3].కొ౦డపల్లి అడవులు 2% ఆక్సిజన్ ను విజయవాడ ప్రజలు పీల్చుకుంటోరు.

రాజకీయాలు

విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ కు 'రాజకీయ రాజధాని' వంటిది. ఇక్కడి ఓటర్లు రాజకీయంగా క్రియాశీలత మరియు పరిపక్వత గలవారు. ఇక్కడి మేజర్ రాజకీయపార్టీలు తెలుగుదేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ మరియు అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు. క్రితంలో ఈ ప్రాంతం కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి.ఈ నగరంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య మరియు విజయవాడ తూర్పు. ఈనగరంలో పాక్షికంగా పెనమలూరు, మైలవరం మరియు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాలున్నవి. విజయవాడకు ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

ఈ నగరంలో విద్యారంగం తగిన స్థాయిలో వున్ననూ ఐ.టీ. రంగంలో అంత ముందంజలో లేదు. ఈనగరంలో దాదాపు 20 ఐ.టీ. సంస్థలున్నాయి, 2006-07 ఆర్థిక సంవత్సరంలో ఇవి 42 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఆం.ప్ర.ఐ.ఐ.సి. సంస్థ గన్నవరంలో ఐ.టీ. పార్కు మరియు ఎస్.ఇ.జెడ్. (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు చేసింది. వీటి నిర్మాణాలకోసం ఎల్.‍& టి. కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది, దీని బడ్జెట్ 300 కోట్ల రూపాయలు. ఈ ఐ.టీ. పార్కులు దాదాపు 10,000 మంది ఐ.టీ. ప్రొఫెషనల్స్ కు ఉద్యోగావకాశాలు కలుగజేస్తుంది. ఇంకో ఐ.టీ.పార్కు, మంగళగిరిలో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నవి.

దేవాలయాలు

కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

విజయవాడ – కనక దుర్గ అమ్మ వారి దేవాలయం
కనక దుర్గ అమ్మ వారి దేవాలయం
కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువున్న అలయము. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.

మరకత రాజరాజేశ్వరీ దేవాలయం - పటమట

దస్త్రం:MarakataRajarajeswari.jpg
మరకత రాజరాజేశ్వరి

ఆధునిక యుగంలో అపురూపమైన శిల్పకళతో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో (పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చే ఈ గుడి కుంభాభిషేకం మరియు ప్రతిష్ఠ జరుపబడింది.

వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం - లబ్బీపేట

  • విజయవాడలో పేరుగాంచిన దేవాలయము. ఇందిరా గాంధీ స్టేడియం దగ్గరగా ఉంది. బెంజి సర్కిల్ నుండి రెండు కిలోమీటర్ల దూరములో ఉంది.
  • ఇది బందరు రోడ్డులో ఉంది. విజయవాడలో 3 ముఖ్యమయిన రోడ్లు మర్చిపోకూడనివి. 1 - ఏలూరు రోడ్డు, 2 - బందరు రోడ్డు, 3 - 5వ నంబరు రూట్ రోడ్డు. వేంకటెశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే, బందరు రోడ్డులో, పశువుల ఆస్పత్రి దగ్గరనుంచి వెళ్ళవలెను.
  • ఆంజనేయస్వామి వారి దేవాలయం - మాచవరం
  • క్షిప్రగణపతి దేవాలయం - పటమట
  • త్రిశక్తి పీఠం===

విజయవాడ కొత్త బస్టాండు దగ్గరగా ఉంది. శ్రీ మహా సరస్వతి దేవిని ఆవాహన చేశారు.

  • రామలింగేశ్వర స్వామి దేవాలయం - యనమలకుదురు ===

స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న పర్వతం పైన ఉంది. బెంజి సర్కిల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములో ఉందీ విజయవాడలో పేరుగాంచిన దేవాలయము.శీవిరాత్రి పర్వదినాన ఘనంగా స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజు జరిగె ఉత్సవాలులో ఉ౦డె ప్రభలు చుడడానికి చుట్టుపక్కల గ్రామాల ను౦చె గాక రాష్ర్ట౦ నలుమూలల ను౦చి జన౦ వస్తారు.

సమీప దేవాలయాలు

మురుగునీటితో క్రిస్టల్ వాటర్

నగరంలో నాలుగు (ఎస్‌టీపీ) సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు శివారు ప్రాంతాల్లో మరికొన్ని సీవేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సంప్‌లకు వివిధ ప్రాంతాల్లోని మురుగునీరు వచ్చి చేరుతుంది. సంప్‌ల నుంచి ఎస్‌టీపీలకు మురుగునీరు చేరుతుంది.అక్కడ మురుగునీరు శుద్ధి అవుతోంది. నగరంలో సాగునీటిని విడుదల చేసే కాలువలు ప్రధానంగా మూడు ఉన్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రెయినేజి నీరు ఈ కాలువలలోకి పోతోంది. డ్రెయినేజి కాలవలలోకి కలిసే విధానాన్ని రూపుమాపి, మురుగునీరంతా ప్రాజెక్టుకు మళ్ళిస్తారు.నగరంలోని మురుగునీటినంతటిని సంగ్రహించి పలు దశ ల్లో గ్రేడింగ్, ప్యూరిఫయింగ్ చేస్తారు. ముగుగునీరంతా పూర్తిగా శుద్ధి అయి రిజర్వాయర్‌లోకి వెళుతుంది. ఇక్కడ మళ్ళీ మంచినీటిని వివిధ దశల్లో శుభ్ర పరిచిన తర్వాత రా వాటర్‌గా మరొక రిజర్వాయర్‌లోకి మళ్ళిస్తారు. చివరకు క్రిస్టల్ వాటర్ దశకు తీసుకొస్తారు.ఆ నీటిని గార్డెన్ల పెంపకానికి, పంట పొలాలకు, ఇండస్ట్రీలకు ఉపయోగిస్తారు.[14]

భవాని ద్వీపం

కృష్ణానదీ గర్భంలో విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్యలో సహజసిద్ధంగా 1340 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇంతటి ప్రకృతి సోయగాలున్న భవానీద్వీపం ఆలనా పాలనా పట్టించుకోని పర్యాటక శాఖాధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడినా, ఈ ద్వీపాన్ని ప్రైవేటుపరం చేసేందుకు సమాయత్తం అయిన ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రహదారి దూరము

విజయవాడ నగరం నుండి భారత దేశము లోని ప్రధాన (కొన్ని) ప్రాంతాల మధ్యన దూరం (.కిలోమీటర్లలో) [4]

నగరం /పట్టణము దూరము (కి.మీ.) నగరం /పట్టణము దూరము (కి.మీ.) నగరం /పట్టణము దూరము (కి.మీ.) నగరం /పట్టణము దూరము (కి.మీ.)
అగర్తలా 2928 ఆగ్రా 1563 అహ్మదాబాదు 1475 ఐజ్వాల్ 2554
అకోలా 766 అలహాబాదు 1423 అమృతసర్ 2212 బెంగుళూరు 633
కలకత్తా 1248 అజ్మీర్ 1829 ఢిల్లీ 1766 గయ 1581
ముంబై 978 మైసూరు 772 వారణాసి 1417 విశాఖపట్నం 382
హైదరాబాదు 267 కాకినాడ 223 నాగపూర్ 687 తిరుపతి 409

ప్రముఖ వ్యక్తులు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

  • విజయవాడ సిటీ ఎల్లో పేజీలు
  • విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్
  • విజయవాడ
  • విజయవాడ.కామ్
  • కనక దుర్గ అమ్మవారు
  • విజయవాడలో దేవాలయాలు
  • వి.జి.టి.ఎమ్.వుడా
  • సిద్దార్థ ఇన్స్తిటూట్ ఆఫ్ టెక్నోలజి
  • విజయవాడ సిటీ మ్యాప్
  • "Vijayawada tourism". AP Tourism Department. Retrieved 3 August 2014.
  • "Vijayawada Municipal Corporation". Ourvmc.org. Retrieved 30 January 2012.
  • "Elevation for Vijayawada". Veloroutes. Retrieved 3 August 2014.
  • "Cities having population 1 lakh and above, Census 2011" (pdf). The Registrar General & Census Commissioner, India. Retrieved 25 June 2014.
  • "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (pdf). censusindia. The Registrar General & Census Commissioner, India. Retrieved 25 June 2014.
  • "Amidst land rush, malls vacant". Deccan Chronicle. 9 September 2014. Retrieved 22 September 2014.
  • "Yes, It's Vijayawada. Andhra Pradesh Has a New Capital".
  • "It’s official: Vijayawada is Andhra’s capital".
  • "Vijayawada set to regain pre-eminence as Andhra Pradesh's capital". 4 September 2014. Retrieved 22 September 2014.
  • "About Vijayawada". vgtmuda. Retrieved 21 June 2014.
  • "Former name of city". thefreedictionary. Retrieved 20 June 2014.
  • "Global cities of the future: An interactive map | McKinsey & Company". Mckinseyquarterly.com. 13 March 2013. Retrieved 8 August 2013.
  • "Economy of the City" (pdf). City Development Initiative For Asia. Retrieved 31 July 2014.
  • "RANK OF CITIES ON SANITATION 2009-2010: NATIONAL URBAN SANITATION POLICY". Press Information Bureau. National Informatics Centre. Retrieved 22 September 2014.
  • "Vijayawada is Andhra Pradesh’s new capital". Deccan Chronicle. 5 September 2014. Retrieved 22 September 2014.
  • "Andhra Pradesh government forms panel on shifting of offices to Vijayawada". The Times of India (The Economic Times). 13 September 2014. Retrieved 22 September 2014.
  • Ayyar, P. V. Jagadisa (1993). South Indian Shrines (Rev. and enl. ed. ed.). New Delhi [u.a.]: Asian Educational Services. ISBN 81-206-0151-3. Retrieved 4 August 2014.
  • Sculptures in a cavern at Bezawara [Vijayawada] supposed to belong to the Jain Religion. 21 August 1815, retrieved 2 September 2013
  • Vijayawada history, retrieved 29 April 2014
  • "Andhra Pradesh / Vijayawada News : Canal bunds hot beds for growth of slums spotlight". The Hindu. 23 August 2007. Retrieved 8 August 2013.
  • "Vijayawada weather". deccanchronicle. 4 June 2014. Retrieved 25 June 2014.
  • "Climate: Vijayawada – Climate graph, Temperature graph, Climate table". Climate-data.org. Retrieved 22 September 2014.
  • "Sex Ratio". The Registrar General & Census Commissioner, India. Retrieved 2 September 2014.
  • "Chapter–3 (Literates and Literacy rate)" (PDF). Registrar General and Census Commissioner of India. Retrieved 2 September 2014.
  • "Seat allocation: Muslims a miffed lot in Vijayawada". http://www.thehindu.com. Retrieved 14 March 2014.
  • Isher Judge Ahluwalia. "Vijayawada's inclusive expansion". The Indian Express. Retrieved 28 September 2011.
  • "The rapidly growing, stable markets of southern India – Economy and Politics". livemint.com. 7 September 2009. Retrieved 30 January 2012.
  • ET (31 August 2012). "Despite slowdown, housing prices bullish across cities – Economic Times".
  • Articles.economictimes.indiatimes.com. Retrieved 8 August 2013.
  • "Economy of Vijayawada". vijayawadaonline. Retrieved 25 June 2014.
  • "APHMEL". Andhra Pradesh Heavy Machinery & Engineering Limited. Retrieved 25 June 2014.
  • "Industrial Scenario" (pdf). apind.gov.in. p. 12. Retrieved 25 June 2014.
  • "BRTS services in city". Vijayawada Municipal Corporation. Retrieved 2 June 2014.
  • "Andhra Pradesh / Vijayawada News: Plans to develop railway station". The Hindu. 24 March 2008. Retrieved 30 January 2012.
  • Air Costa to start flights from Vijayawada | Deccan Chronicle
  • "Parks in Vijayawada". ourvmc. Retrieved 27 June 2014.
  • Vijayawada Tourism
  • "Andhra Pradesh / Vijayawada News: Presence of leopards, wild dogs detected in Krishna forests". The Hindu. 25 May 2006. Retrieved 30 January 2012.
  • "MBA Colleges in Vijayawada, Top B Schools in Vijayawada". Maps of India. Retrieved 22 September 2014.
  • "Vijayawada cricket stadium". Content-ind.cricinfo.com. Retrieved 30 January 2012.
  • "Andhra Pradesh / Vijayawada News: Keeping home turf in top shape". The Hindu. 4 February 2007. Retrieved 30 January 2012.

మూలాలు

  1. 1.0 1.1 "Vijayawada: A Profile" (PDF). Vijayawada Municipal Corporation. p. 1. Retrieved 11 December 2015.
  2. 2.0 2.1 "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts".
  3. "Maps, Weather, and Airports for Vijayawada, India". fallingrain.com.
  4. http://www.census2011.co.in/census/city/408-vijayawada.html
  5. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 2 July 2016.
  6. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 2 July 2016.
  7. https://en.wikipedia.org/wiki/List_of_cities_in_Andhra_Pradesh_by_population
  8. No. 45. (A.R. No. 491 of 1906.) Pulivendla, Pulivendla Taluk, Cuddapah District. On a slab set up at the entrance of the Ranganathasvamin temple. Krishnaraya, AD 1509. This is dated Saka 1431, Sukla, Kartika su. 12, corresponding to AD 1509, October 24, which was, Wednesday. It records a gift of the village Kunddal Kundu to the god Sri Ranga Raju of Pulivindla by Narasayya Deva Maharaju, brother of Basava Raju, son of Tamma Raju, grandson of Valla Bharaya and great-grandson of Bejawada Madhava Varma of Vasishtha-gotra and Surya-vamsa. The gift village is said to be situated in Pulivindalasthala, a subdivision of Mulkinadu in Gandhi Kotasima of Udayagiri Rajya.
  9. VMC
  10. The Hindu Business Line : Maytas consortium to develop Machilipatnam port at new site
  11. Air Deccan to launch Bangalore-Vijayawada service - India Airline News, Airport developments, Aviation, A380, B787, Kingfisher, Deccan, Jet Airways, Air India, Indian Airlines, Spicejet
  12. "(Gannavaram-Vijayawada) aerodrome". Retrieved 2006-08-20.
  13. "http://www.onefivenine.com/india/villages/Krishna/Vijayawada/Vijayawada". Retrieved 18 June 2016. {{cite web}}: External link in |title= (help)
  14. జూలై 16, 2010 ఆంధ్రజ్యోతి విజయవాడ అనుబంధం

చిత్రమాలిక

ప్రముఖ వ్యక్తుల చిత్రమాలిక

మూసలు, వర్గాలు

"https://te.wikipedia.org/w/index.php?title=విజయవాడ&oldid=2038583" నుండి వెలికితీశారు