పరుగు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి PhysicsScientist, పేజీ పరుగు (2008 సినిమా) ను పరుగు (సినిమా) కు తరలించారు
పంక్తి 36: పంక్తి 36:
* [[ప్రకాష్ రాజ్]] .... నీలకంఠ
* [[ప్రకాష్ రాజ్]] .... నీలకంఠ
* చిత్రం శ్రీను .... శ్రీను
* చిత్రం శ్రీను .... శ్రీను
* [[సప్తగిరి (నటుడు)|సప్తగిరి]]
*[[శ్రీనివాస రెడ్డి]]
*[[శ్రీనివాస రెడ్డి]]
*[[ధనరాజ్]]
*[[ధనరాజ్]]

10:59, 26 డిసెంబరు 2016 నాటి కూర్పు

పరుగు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం భాస్కర్
నిర్మాణం దిల్ రాజు
రచన భాస్కర్
తారాగణం అల్లు అర్జున్
షీలా
పూనమ్ బజ్వా
ప్రకాష్ రాజ్
శ్రీనివాస రెడ్డి
సంగీతం మణిశర్మ
ఛాయాగ్రహణం విజయ్ చక్రవర్తి
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
పంపిణీ గీతా ఆర్ట్స్
విడుదల తేదీ మే 1, 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పరుగు, 2008లో విడుదలైన ఒక తెలుగు సినిమా.

కథ

రామచంద్రాపురంలో నీలకంఠం (ప్రకాష్ రాజ్) ఇంటిలో అతని పెద్ద అమ్మాయి సుబ్బలక్ష్మి (పూనం బజ్వా) పెళ్ళి జరిగే సీనుతో చిత్రం మొదలవుతుంది. ఎర్రబాబుని ప్రేమించిన సుబ్బలక్ష్మి ఆ రోజే అతనితో లేచిపోతుంది. ఆగ్రహంతో ఎర్రబాబు స్నేహితులందరినీ కిడ్నాప్ చేయిస్తాడు నీలకంఠం. హైదరాబాదులో సరదాగా కాలం గడిపే కృష్ణ (అల్లు అర్జున్) కూడా అతని స్నేహితుడే కావటంతో అతన్ని కూడా కిడ్నాప్ చేయిస్తాడు నీలకంఠం. అక్క పై ఉన్న కోపాన్ని మొత్తం ఇంటిల్లిపాదీ తన పైన చూపిస్తుండటంతో బాధ పడుతూ ఉంటుంది మీనా (షీలా దీక్షిత్).

ఒకరోజు తప్పించుకు పారిపోబోతున్న కృష్ణకి మీనా కనిపిస్తుంది. తొలిచూపు లోనే మీనాని ప్రేమిస్తాడు కృష్ణ. ఇంతలో నీలకంఠం మనుషులకు దొరికిపోతాడు. హైదరాబాదులో పెద్ద కూతురు ఉంది అని తెలుసుకున్న నీలకంఠం చిన్న కూతురుని వెంటబెట్టుకుని, కృష్ణ స్నేహితుల బృందంతో వెదికిస్తూ ఉంటాడు.

నీలకంఠానికి తన పెద్ద కూతురు కనిపించి, పారిపోయి వచ్చిన తమను కుక్కల్లా వెంటాడ వద్దని మందలిస్తుంది. ఆ మాటలకి బాధ పడ్డ నీలకంఠం, తన కూతుళ్ళు అంటే తనకి చాలా ప్రేమ అని, పరమ కోపిష్టి అయిన తాను తన కూతుళ్ళ కొరకే శాంత స్వభావాన్ని అలవర్చుకొన్నాడని కృష్ణతో చెబుతాడు. పిల్లల పట్ల పెద్దలు ఎంత ప్రేమని పెంచుకొంటారో కృష్ణ అప్పుడు అర్థం చేసుకుంటాడు.

ఇంతకీ సుబ్బలక్ష్మి, ఎర్రబాబులకు సహాయపడినది ఎవరు? మీనా కూడా తనని ప్రేమిస్తోందని తెలుసుకున్న కృష్ణ ఏంచేసాడు? నీలకంఠాన్ని నొప్పించేలా మీనాతో పారిపోయాడా, లేక పిల్లల పై పెద్దల ప్రేమని అర్థం చేస్కొని తన ప్రేమని త్యాగం చేశాడా అన్నదే చిత్రంలోని తరువాతి కథ.

నటీనటులు

పాటలు

పాట గాయకులు నిడివి రచన విశేషాలు
పరుగులు తీయకె పసిదానా రంజిత్ 04:20 సిరివెన్నెల
నమ్మవేమో గానీ సాకేత్ 04:49 అనంత్ శ్రీరాం
ఎలగెలగా కైలాష్ ఖేర్, సైంధవి 04:23 అనంత్ శ్రీరాం
ఛల్ ఛల్ ఛలో రంజిత్ 04:37 చంద్రబోస్
హృదయం ఓర్చుకోలేనిదీ హేమచంద్ర 03:49 సిరివెన్నెల
ఎన్నెన్నెన్నో ఊహలు రాహుల్ నంబియార్ 04:40 అనంత్ శ్రీరాం

విశేషాలు