కూచిమంచి తిమ్మకవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:


==కుటుంబం==
==కుటుంబం==
ఇతడు ఆరువేల నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రిగారి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య. దెందులూరి లింగయ్య ఇతనికి గురువు.
ఇతడు [[ఆరువేల నియోగి]]. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రిగారి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య. దెందులూరి లింగయ్య ఇతనికి గురువు.



==చారిత్రక విశేషాలు==
==చారిత్రక విశేషాలు==

11:58, 9 జనవరి 2017 నాటి కూర్పు

కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దపు తెలుగు కవి. తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు.


కుటుంబం

ఇతడు ఆరువేల నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రిగారి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య. దెందులూరి లింగయ్య ఇతనికి గురువు.

చారిత్రక విశేషాలు

తిమ్మకవి పిఠాపురం సంస్థానంలోని కందరాడ గ్రామానికి కరణమట. ఇతడు ప్రతిదినము పిఠాపురానికి వచ్చి కుక్కుటేశ్వరడుని సేవించేవాడు. సహస్రమాస జీవి. పిఠాపురాన్ని పరిపాలించిన ప్రభువులలో రావు పెదమాధవరావు, రావు నరసింహారావు, రావు వేంకటరావు, రావు వేంకటకృష్ణారావు, రావు చినమాధవరావు పాలనాసమయంలో ఇతడు జీవించి వున్నాడు. రావు చినమాధవరావు తిమ్మకవికి "కవి సార్వభౌమ" అనే బిరుదాన్నిచ్చాడు. అయినా తిమ్మకవి తన గ్రంథాలను పిఠాపురపు కుక్కుటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఇతని చివరిదశలో భార్యావియోగంతో సన్యాసం స్వీకరించి శేషజీవితాన్ని పిఠాపురంలోని కుక్కుటేశ్వరాలయంలోనే గడిపాడు.[1]

రచనలు

  1. అచ్చతెలుగు రామాయణము
  2. రుక్మిణీ పరిణయము (1715)
  3. సింహాచల మహాత్మ్యము (1719)
  4. నీలాసుందరీ పరిణయము[2]
  5. సారంగధర చరిత్ర
  6. రాజశేఖర విలాసము (1705)
  7. రసికజన మనోభిరామము (1750)
  8. సర్వలక్షణసార సంగ్రహము (1740)
  9. సర్పపురీ మహాత్మ్యము (1754)
  10. శివలీలా విలాసము (1756)[3]
  11. కుక్కుటేశ్వర శతకము
  12. శ్రీ భర్గ శతకము (1729)
  13. భర్గీ శతకము
  14. చిరవిభవ శతకము

బిరుదులు

  • అభినవ వాగనుశాసనుడు
  • కవిసార్వభౌమ

మూలాలు

  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973
  2. డిజిటల్ లైబ్రరీలో నీలాసుందరీ పరిణయము కావ్యం.
  3. భారత డిజిటల్ లైబ్రరీలో శివలీలా విలాసము కావ్యం