ఆంటిగ్వా అండ్ బార్బుడా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 239: పంక్తి 239:


==బయటి లింకులు==
==బయటి లింకులు==
{{Countries of North America}}

[[వర్గం:ఆంటిగ్వా మరియు బార్బుడా]]
[[వర్గం:ఆంటిగ్వా మరియు బార్బుడా]]
[[వర్గం:ద్వీప దేశాలు]]
[[వర్గం:ద్వీప దేశాలు]]

13:25, 27 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు

Antigua and Barbuda

Flag of Antigua and Barbuda
జండా
Coat of arms of Antigua and Barbuda
Coat of arms
నినాదం: "Each Endeavouring, All Achieving"

Location of Antigua and Barbuda
Location of Antigua and Barbuda
రాజధానిSt. John's
17°7′N 61°51′W / 17.117°N 61.850°W / 17.117; -61.850
అధికార భాషలుEnglish
జాతులు
(1996)
89% Black
4.4% Mixed
2.4% White
2.5% Other
పిలుచువిధంAntiguan
Barbudan
ప్రభుత్వంParliamentary democracy under constitutional monarchy
• Monarch
Elizabeth II
Rodney Williams
Gaston Browne
శాసనవ్యవస్థParliament
• ఎగువ సభ
Senate
• దిగువ సభ
House of Representatives
Independence
27 February 1967
• from the United Kingdom
1 November 1981
విస్తీర్ణం
• మొత్తం
440 km2 (170 sq mi) (195th)
• నీరు (%)
negligible
జనాభా
• 2014 estimate
91,295 (199th)
• 2011 census
81,799
• జనసాంద్రత
186/km2 (481.7/sq mi)
GDP (PPP)2016 estimate
• Total
$2.159 billion[1]
• Per capita
$23,922[1]
GDP (nominal)2016 estimate
• Total
$1.332 billion[1]
• Per capita
$14,753[1]
హెచ్‌డిఐ (2014)Increase 0.783[2]
high · 58th
ద్రవ్యంEast Caribbean dollar (XCD)
కాల విభాగంUTC-4 (AST)
వాహనాలు నడుపు వైపుleft
ఫోన్ కోడ్+1-268
ISO 3166 codeAG
Internet TLD.ag
  1. "God Save the Queen" is the official national anthem, but is generally used only on regal and vice-regal occasions.

ఆంటిగ్వా మరియు బార్బుడా అనేవి కరేబియన్ సముద్రంలో ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య ఉన్న రెండు ద్వీపాల కలిగిన దేశం. ఇది కరేబియన్ సముద్రం మరియు అట్లాంటిక్ సముద్రం మద్యన ఉంది. ఇందులో ఉత్తర అమెరికా ఖండానికి చెందిన 'ఆంటిగ్వా మరియు బార్బుడా అనే రెండు మానవనివాసిత ద్వీపాలు మరియు పలు ఇతర ద్వీపాలు (గ్రేట్ బర్డ్స్, గ్రీన్, గునియా, లాంగ్, మైదెన్ మరియు యోర్క్ ఐలాండ్ దక్షిణతీరంలో రెడోండా ) ఉన్నాయి. ఇవి బ్రిటీష్ పాలన నుండి 1981 నవంబరు 1 వ తేదిన స్వతంత్రం పొందినవి. ఇవి పూర్వం బ్రిటీష్ వెస్ట్ ఇండీస్ లో భాగముగా ఉండేవి. వీటి వైశాల్యం : 442 చదరపు కిలోమీటర్లు, జనాభా : 2011 గణాంకాల ఆధారంగా శాశ్వత పౌరసత్వం కలిగిన ప్రజల సంఖ్య 81,799, రాజధాని మరియు పెద్ద నగరం : సెయింట్ జాన్స్(ఆంటిగ్వా ద్వీపం) కరెన్సీ : ఈస్టరన్ కరేబియన్ డాలర్, భాషలు : ఇంగ్లీష్, పటోయిస్, మతం : క్రైస్తవము. వ్యవసాయం ప్రధాన వృత్తి. పంచదార, ప్రత్తి ప్రధాన ఎగుమతులు. టూరిజం ప్రధాన పరిశ్రమ.

ఒకదానికొకటి కొన్ని నాటికల్ మైళ్ళదూరంలో ఉన్న ఆంటిగ్వా మరియు బార్బుడా దీవులు " లీవార్డ్ ద్వీపాలు " మద్య ఉన్నాయి.ఇవి షుమారుగా భూమద్యరేఖకు 17 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉన్నాయి. 1493 లో " క్రిస్టోఫర్ కొలంబస్ " ఈద్వీపాలను కనుగొని వీటికి సెవెల్లె కాథడ్రల్ లోని " వర్జిన్ ఆఫ్ లా ఆణ్టిగ్వా " గౌరవార్ధం ఈ పేరు నిర్ణయించాడు. దేశానికి " లాండ్ ఆఫ్ 365 బీచెస్ " అనే ముద్దుపేరు ఉంది.ఈదేశం పాలన, భాష తీవ్రమైన బ్రిటిష్ సాంరాజ్యం ప్రభావం ఉంది. ఇది గతంలో బ్రిటిష్ సాంరాజ్యంలో భాగంగా ఉండేది.

A map of Antigua and Barbuda.

పేరువెనుక చరిత్ర

ఆంటిగ్వా అంటే స్పానిష్ భాషలో పురాతన అని అర్ధం. బార్బుడా అంటే గడ్డపు అని అర్ధం. అరక్వాస్ ఆటిక్వా ద్వీపాన్ని " వా లాడ్లి " అని పిలిచేవారు. స్థానికులు ప్రస్తుతం ఈదీవిని వడాడ్లి అని పిలుస్తున్నారు.కరేబియన్లు ఈ దీవిని మయోమొని అని పిలిచేవారు. 1493లో " క్రిస్టోఫర్ కొలంబస్ " ఈదీవిని చేరిన తరువాత శాంటా మారియా లా ఆంటిగ్వా " అని నామకరణం చేసాడు.

చరిత్ర

ఆంటిగ్వా ప్రాంతంలో మొదటిసారిగా " ఆర్చియాక్ ఏజ్ హంటర్ - గేదర్ అమరిండియన్ " ప్రజలు నివసించారు. [3] " రేడియో కార్బన్ డేటింగ్ " ఆధారంగా క్రీ.పూ. 3,100 సంవత్సరాల ముందు ఈప్రాంతంలో ఆరంభకాల మానవ ఆవాసాలు ఆరంరంభించబడ్డాయని భావిస్తున్నారు.వారి తరువాత ఈప్రాంతంలో సెరామిక్ యుగానికి చెందిన ప్రీ కొలంబియన్ అరవాక్ భాష మాట్లాడే సలడోయిక్ ప్రజలు నివసించారు. వీరు లోవర్ ఒరినొకొ నదీప్రాంతంలో నివసిస్తూ అక్కడి నుండి ఇక్కడికి వచ్చి చేరారు.అరవాక్ ప్రజలు ఈప్రాంతంలో వ్యవసాయం ప్రవేశపెట్టారు.ఈ ప్రాంతంలో ఆటిగ్వా బ్లాక్ ఫైనాఫిల్, మొక్కజొన్న, చిలగడదుంప, పచ్చిమిరపకాయలు, జామ, పొగాకు మరియు ప్రత్తి పంటలు పండించబడుతున్నాయి. స్థానిక వెస్ట్ ఇండియంస్ అద్భుతమైన సీగోయింగ్ వెసెల తయారుచేసి అట్లాంటిక్ మరియు కరేబియన్ సముద్రంలో పయనించారు. ఫలితంగా కరేబియన్లు మరియు అర్వాకులు దక్షిణ అమెరికాలోని అధికప్రాంతాలలో వలసరాజ్యాలు ఏర్పరిచారు.వారి సతతికి చెందిన వారు ఇప్పటికీ బ్రెజిల్,వెనెజులా మరియు కొలంబియా దేశాలలో నివసిస్తున్నారు. క్రీ.శ.1100 లలో అర్వాకులు అధికసంక్యలో ఆంటిగ్వాను వదిలివెళ్ళారు.మిగిలిన వారి మీద " ఐలాండ్ కరేదియన్లు " దాడి చేసారు." కాథలిక్ ఎంసైక్లోపీడియా " ఆధారంగా కరేబియన్ అత్యాధునిక ఆయుధాలు వారిని వెస్ట్ ఇండియన్ అరవాకుల మీద విజయంసాధించడానికి అనుమతించాయి. తరువాత వారిని బానిసలుగా చేయడం మరియు వధించి భక్షించడం చేసారు.

Antigua in 1823

" కాథలిక్ ఎంసైక్లోపీడియా " ఆధారంగా యురేపియన్ దాడులలో వారికి ఎదురైన స్థానికులలో ఉన్న విబేధాలను గుర్తించడంలో యురేపియన్లు విఫలం అయ్యారు. ఇక్కడ నివసిస్తున్నట్లు భావిస్తున్న రెండుజాతులేకాక ఇక్కడ అధికసంఖ్యలో స్థానిక జాతులు ఉన్నాయని భావిస్తున్నారు. యురేపియన్ వ్యాధులు, పోషకాహార లోపం మరియు బానిసత్వం స్థానిక ప్రజలు అధికసంఖ్యలో మరణించడానికి కారణం అయింది. స్మాల్ ఫాక్స్ వ్యాధి కూడా అధిక సంఖ్యలో స్థానికులు మరణించడానికి కారణం అయింది. [4] కొంతమంది చరిత్రకారులు బానిసత్వం కారణంగా స్థానికులలో ఏర్పడిన వత్తిడి కారణంగా స్థానికంగా బానిసలుగా మార్చినవారు అధికసంఖ్యలో మరణించారని భావిస్తున్నారు. మరికొందరు స్టార్చ్, వారికి సముద్రం నుంచి విస్తారంగా లభించిన బలవర్ధకమైన మాంసాహారానికి బదులుగా తక్కువ ప్రొటీన్ ఉన్న ఆహారం అందించడం కూడా మరణాలకు కారణం అయింది.[5]ఉద్రేకపూరితమైన కరేబియన్ల కంటే మంచినీటి లభ్యత లోపం కారణంగా స్పెయిన్ దాడికారులు ఆంటిగ్వాలో రాజ్యస్థాపన కొరకు ప్రయత్నించలేదు.క్రీ.పూ. 1632లో ఆంగ్లేయులు ఆంటిగ్వాలో మరియు 1684లో బార్బుడాలో రాజ్యస్థాపన చేసారు. చెరుకు తోటలలో పనిచేయడానికి ఇక్కడ 1684లో బానిసత్వం ఆరంభమై 1834లో రద్దు చేయబడింది. బ్రిటిష్ ప్రభుత్వం 1632 నుండి 1981 వరకు పాలన చేసారు.మద్యకాలంలో 1666 లో అతి స్వల్పకాలం ఫ్రెంచి దాడికారులు ఈప్రామాన్ని పాలించారు.

1981 నవంబర్‌ 1న ఈ ద్వీపాలు కామంవెల్త్ దేశంగా స్వతంత్రప్రతిపత్తి కలిగిన దేశంగా అవరరించింది. ఆంటిగ్వా మరియు బార్బుడా ద్వీపాలకు మొదటి పాలనాధిపతిగా రెండవ ఎలిజబెత్ రాణిగా ఉంది. " వెరె కార్ంవెల్ బర్డ్ " మొదటి ప్రధానమంత్రిగా నియమించబడ్డఆడు.

భౌగోళికం

English Harbour, Antigua

ఆంటిగ్వా మరియు బార్బుడా రెండుద్వీపాలూ " లో లైయింగ్ ఐలాండ్ " గా వర్గీకరించబడ్డాయి. దీవులలో వోల్కానిక్ ఏక్టివిటీ కంటే లైం స్టోన్ ప్రభావం అధికంగా ఉంది. ఆటిగ్వా దీవిలో ఎత్తైన శిఖరంగా " ఒబామా పర్వతం " (గతంలో బాగీ పీక్ అని పిలువబడింది) గుర్తించబడుతుంది.దీవులలో సముద్రతీరాలలో మడుగులు (లాగూన్లు) మరియు సహజసిద్ధమైన నౌకాశ్రయాలు అధికంగా ఉన్నాయి.సముద్రతీరంలో సూదంటురాతి తిన్నెలు మరియు ఇసుకతిన్నెలు తిన్నెలు ఉన్నాయి.రెండు ద్వీపాలలో అవసరానికి సరిపడినంత భూగర్భజలాలు లేవు.

ద్వీపాలు

ఆటిగ్వా

బ్లాక్ ఐలాండ్

బార్బుడా

వాతావరణం

ఆంటిగ్వాలో సరాసరి వార్షిక వర్షపాతం 990 మి.మీ.సాధారణంగా సెపెంబర్ నుండు నవంబర్ వరకు వర్షపాతం అధికంగా ఉంటుంది.ద్వీపాలలో గాలిలోతేమ అధికంగా ఉంటుంది. అందువలన తరచుగా కరువు సంభవిస్తూ ఉంటుంది.సంవత్సరానికి ఒకమారైనా హరికేన్ సంభవిస్తూ ఉంటుంది.సాధారణ ఉష్ణోగ్రత 27 సెంటీగ్రేడ్ డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. శీతాకాల ఉష్ణోగ్రత 21 సెంటీగ్రేడ్ డిగ్రీల సెల్షియస్ మరియు వేసవి మరియు హేమంతకాల ఉష్ణోగ్రత 30 సెంటీగ్రేడ్ డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు చలి అధికంగా ఉంటుంది.గాలిలోతేమ తక్కువ ఉన్న కారణంగా ఈద్వీప దేశం ప్రపంచ ఉష్ణదేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది.

పర్యావరణం

ద్విపాలలోని అధికభూభాగం ఇసుక మట్టి భూములు ఉన్నందున ఇక్కడ పొదలమొక్కలు అధికంగా ఉన్నాయి. వోల్కానిక్ మట్టి అధికంగా ఉన్న మద్యభూభాగపు మైదానాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి. అకాసియా మహోగనీ రెడ్ మరియు సెడార్ చెట్లతో ఆటిగ్వాద్వీపంలో 11% భూభాగంలో చెట్లు విస్తరించి ఉన్నాయి. ఇవి ఉన్నందున మట్టిసంరక్షణ మరియు నీటిరక్షణ సాధ్యమైంది.

నిర్వహణా విభాగాలు

Antigua and Barbuda is divided into six parishes and two dependencies:

Parishes of Antigua

ఆర్ధికరంగం

A proportional representation of Antigua and Barbuda's exports.

దేశ ఆర్ధికరంగం జి.డి.పిలో సగంకంటే అధికంగా పర్యాటకరగం ద్వారా లభించే ఆదాయం ఆధిఖ్యత చేస్తుంది. ఆంటిగ్వా విలాసవంతమైన రిసార్టులకు ప్రసిద్ధిచెందింది.2000 లలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధికమాంధ్యం కారణంగా దేశ ఆర్ధికరగం బలహీన పడినప్పటికీ ప్రభుత్వం ఇతర మార్గాల కొరకు అణ్వేషిస్తుంది.

బ్యాంకింగ్ రంగ పెట్టుబడులు మరియు ఆర్ధికసేవలు ఆర్ధికరంగంలో ప్రధానపాత్రవహిస్తున్నాయి.ఆటిగ్వాలో ప్రధాన ప్రపంచబ్యాంకుల కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా మరియు స్కూటియాబ్యాంక్ కార్యాలయాలు స్థాపించాయి. ఫైనాషియల్ - సర్వీసెస్ ఆంటిగ్వా లోని ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్‌తో కలిసి పనిచేస్తుంది. [7]

వ్యవసాయరంగం

రెండుద్వీపాల దేశం దేశీయమార్కెట్ లక్ష్యంగా వ్యవసాయ ఉత్పత్తి చేస్తుంది. నిర్మాణరంగం మరియు పర్యాటకరంగం నుండి లభిస్తున్న ఆకర్షణీయమైన వేతనాలకారణంగా వ్యవసాయరంగానికి శ్రామికుల కొరత మరియు దీవులలో నీటికొరత వ్యవసాయరంగానికి సమస్యలుగా పరిగణించాయి.

పారిశ్రామిక రంగం

ఎగుమతులకు అనుకూలంగా పారిశ్రామికరగం అభివృద్ధిచేయడానికి ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి.హస్థకళా ఉత్పత్తులు మరియు ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులు పారిశ్రామికరంగంలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. 2003 లో పారిశ్రామికవేత్త నెయిల్ సైమన్ ఆటిగ్వాలో " అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆంటిగ్వా కాలేజ్ ఆఫ్ మెడిసన్ స్థాపించాడు. విశ్వవిద్యాలయం ఆంటిక్వాలోని ప్రజలకు అధికసంఖ్యలో ఉపాధిసౌకర్యం కల్పించింది.

గణాంకాలు

Antigua & Barbuda's population (1961-2010). Number of inhabitants in thousands.

సంప్రదాయ సమూహాలు

ఆంటిగ్వా జనసంఖ్య 85,632. వీరిలో అధికంగా పశ్చిమ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డం మరియు పోర్చుగీసు(మడెరియన్) దేశాలకు చెందిన సంతతిప్రజలు ఉంటారు. వీరిలో 91% నల్లజాతీయులు, 4.4% మిశ్రితజాతి ప్రజలు,1.7% శ్వేతజాతీయులు మరియు 2.9% ఇతరులు (ఈస్ట్ ఇండియన్లు మరియు ఆసియన్లు) ఉన్నారు.శ్వేతజాతీయులు అధికంగా ఐరిష్ మరియు బ్రిటిష్ సంతతికి చెందినవారై ఉన్నారు. మిగిలినవారిలో క్రిస్టియన్ లెవాంటైన్ అరబ్బులు మరియు స్వల్పసంఖ్యలో ఆసియన్లు మరియు సెఫర్డిక్ యూదులు నివసిస్తున్నారు.

ఆంటిగ్వా ప్రజలలో యునైటెడ్ కింగ్డం (ఆంటిగ్వియన్ బ్రిటన్లు), యునైటెడ్ స్టేట్స్ మరియు డోమినికన్ రిపబ్లిక్ సెయింట్ వింసెంట్ అండ్ ది గ్రెనాడైంస్ మరియు నైజీరియన్ దేశాలలో నివసిస్తున్నవారు అధికసంఖ్యలో ఉన్నారు. 4,500 మంది అమెరికన్లు ఆటిగ్వా మరియు బార్బుడాలను తమనివాసంగా మార్చుకున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే తూర్పు కరేనియన్లలో అమెరికన్లు ప్రధమస్థానంలో ఉన్నారు.[8]

భాషలు

ఆంటిగ్వాలో ఇంగ్లీష్ అధికారభాషగా ఉంది. ఆంటిగ్వాకంటే బార్బుడా భాష స్వల్పబేధంగా ఉంటుంది. ఆటిగ్వా మరియు బార్బుడాలకు స్వతంత్రం ఇవ్వడానికి ముందుగా ఆగ్లభాష వాడుకలో ఉంది.ఆంటిగ్వా యాసలో వాడే మాటలు అధికంగా బ్రిటిష్ ఇంగ్లీష్ మరియు ఆఫ్రికన్ భాషలకు చెందినవై ఉంటాయి.స్పానిష్ భాషకు 10,000 మంది వాడుకరులు ఉన్నారు. [9]

మతం

St. John's Cathedral, St. John's

74%

[10] ఆంటిగ్వాలోని క్రైస్తవులలో 44% ఆఫ్రికన్ సంతతికి చెందిన క్రైస్తవులు. మిగిలిన క్రైస్తవులు బాప్టిస్టులు[11] ప్రెస్‌బైటెరియన్లు [12][13] మరియు రోమన్ కాథలిక్కులు ఉన్నారు.క్రైస్తవేతర ఆంటిగ్వా ప్రజలు రస్టాఫరి మూవ్మెంట్, ఇస్లాం, జ్యూడిజం మరియు బహై ఫెయిత్‌కు చెందినవారై ఉన్నారు.

విద్య

ఆంటిగ్వా బార్బుడా దేశం అక్షరాశ్యత 90%. 1998 లో ఆంటిగ్వా మరియు బార్బుడా కరేబియన్ సముద్రంలో మెడికల్ సర్వీసులను అందించడం ప్రారంభించి వైద్యసేవలను అందిస్తున్న మొదటి కరేబియన్ దేశంగా అవతరించింది.అందులో భాగంగా అత్యాధునిక సౌకర్యాలు కలిగిన హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం, ది ఎం.టి. ఎస్.టి. జాన్ మెడికల్ సెంటర్ ఏర్పాటు చేయడం మొదలైన చర్యలు చేపట్టింది.ప్రస్తుతం ద్వీపంలో ప్రాఫిట్ ఎజ్యుకేషన్ ఆఫ్ షోర్ మెడికల్ స్కూల్స్, ది అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆంటిగ్వా (అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆంటిగ్వా )(2004) [14] మరియు ది యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైంసెస్ ఆంటిగ్వా (1982) అనే రెండు విద్యాసంస్థలు ఉన్నాయి.[15] మెడికల్ స్కూల్స్‌లో అధికంగా విదేశీ విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నప్పటికీ విద్యాసంస్థలు ప్రాంతీయ ఆర్ధిక మరియు ఆరోగ్యరక్షణకు సహకారం అందిస్తూ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది.

ఆంటిగ్వాలో ప్రభుత్వానికి స్వంతమైన కాలేజి ఉంది. అలాగే ఆంటిగ్వా మరియు బార్బుడా ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇంఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఆంటిగ్వా మరియు బార్బుడా హాస్పిటాలిటీ ట్రైనింగ్ మొదలైన విద్యాసంస్థలు ఉన్నాయి.ప్రాంతీయవాసులు యూనివర్శిటీ విద్యను కొనసాగించడానికి వీలుగా " ది యూనివర్శిటీ ఆఫ్ ది వెస్టిండీస్ " శాఖ ఒకటి ఆంటిక్వాలో స్థాపించబడింది.

ప్రాధమిక విద్య

ఆంటిగ్వాలో రెండు ఇంటర్నేషనల్ ప్రైమరీ/సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. సి.సి.ఎస్.ఇ.టి ఇంటర్నేషనల్ ఒంటారియా సెకండరీ స్కూల్ డిప్లొమా అందజేస్తుంది.ఐలాండ్ అకాడమీ ఉంది.కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ సిలబస్ అనుసరించి విద్యాబోధ చేస్తున్నాయి.ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ డిగ్రీలు అందజేస్తున్నాయి.

సంస్కృతి

ఆంటిగ్వా సంస్కృతి మీద ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికన్ మరియు బ్రిటిష్ సంస్కృతుల ప్రభావం ఉంది.ఆంటిగ్వా మరియు బార్బుడా దేశానికి క్రికెట్ జాతీయక్రీడగా ఉంది. ఆంటిగ్వా మరియు బార్బుడా వీవన్ రిచర్డ్స్, ఆండర్సన్ ఆండీ రాబర్ట్స్ మరియు రిచర్డ్స్ రిచీ రిచర్డ్సన్ మొదలైన అంతర్జాతీయ ఖ్యాతి వహించిన క్రికెట్ క్రీడాకారులను అందించింది.

.ఆంటిగ్వా మరియు బార్బుడాలో అమెరీఅన్ సంస్కృతి ప్రభావం కూడా అధికంగా ఉంది. దేశలోని మాధ్యం ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ మాధ్యమం ఆధిఖ్యత కలిగి ఉంది.చాలామంది ఆంటిగ్వా ప్రజలు షాపింగ్ చేయడానికి శాన్ జుయాన్, ప్యూర్టో రికోకు పోతుంటారు.

ఆంటిగ్వియన్ల జీవితాలలో మతం మరియు కుటుంబం ప్రధానపాత్ర పోషిస్తుంటాయి. చాలామంది ప్రజలు ఆదివారాలలో మతసంబంధిత సేవలు అందించడానికి హాజరౌతూ ఉంటారు.అయినప్పటికీ సమీపకాలంలో చాలామంది " సెవెంత్ డే అడ్వెంటిస్టు " కు పోతున్నారు.

కలిప్సో సంగీతం మరియు సోకా సంగీతం రెండింటి జన్మస్థానం ట్రినిడాడ్. ఇది ఆంటిగ్వా మరియు బార్బుడాలో ప్రాబల్యత సంతరించుకున్నాయి.[16]

పండుగలు

ప్రతిసంవత్సరం ఆగస్టుమాసంలో " ది నేషనల్ కార్నివల్ " నిర్వహించబడుతుంది.ఈ ఉత్సవంలో నిర్వహించే ప్రదర్శనలు, పోటీలు మరియు ఇతర కార్యక్రమాలు పర్యాటక ఆకర్షణగా ఉంటాయి.

ఆహారసంస్కృతి

మొక్కజొన్న మరియు చిలగడ దుంపలు ఆంటిగ్వా ప్రజల ఆహారంలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. ఆంటిగ్వాలో ప్రబలమైన దుకునా అనే స్వీట్ చిలగడదుంపలను తురిము, పిండి మరియు స్పైసెస్ కలిపి చేస్తారు.ఆంటిగ్వా ప్రధాన ఆహారాలలో ఒకటైన ఫంగి అనే గుజ్జును మొక్కజొన్న పిండి మరియు నీటిని కలిపి చేస్తారు.

మాధ్యమం

There are two daily newspapers: the "Daily Observer" and "Caribbean Times". Besides most American television networks, the local channel ABS TV 10 is available (it is the only station which shows exclusively local programs). There are also several local and regional radio stations, such as V2C-AM 620, ZDK-AM 1100, VYBZ-FM 92.9, ZDK-FM 97.1, Observer Radio 91.1 FM, DNECA Radio 90.1 FM, Second Advent Radio 101.5 FM, Abundant Life Radio 103.9 FM, Crusader Radio 107.3 FM, Nice FM 104.3

క్రీడలు

The Antigua Recreation Ground.

" ది ఆంటిగ్వా అండ్ బార్బుడా నేషనల్ క్రికెట్ టీం " దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ " 1988 కామంవెల్త్ గేంస్ " లో పాల్గొన్నది.ఆంటిగ్వన్ క్రికెట్ క్రీడాకారులు " లీవార్డ్ ఐలాండ్ క్రికెట్ టీం " డొమెస్టిక్ మాచులు మరియు వెస్టిండీస్ క్రికెట్ టీం " క్రీడలలో పాల్గొంటూ ఉంటారు." ది 2007 క్రికెట్ వరల్డ్ కప్ " క్రీడలకు మార్చి 11 నుండి ఏప్రెల్ 28 వరకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చింది.


ఆంటిగ్వా లోని " సర్ వివన్ రిచర్డ్స్ స్టేడియం " 8 మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ 20,000 మంది క్రీడలను వీక్షించడానికి సౌకర్యం కల్పించబడుతుంది. ఆంటిగ్వా " స్టాన్‌ఫోర్డ్ ట్వంటీ - 20 - ట్వంటీ 20 క్రికెట్ " లను ఆలెన్ స్టాన్‌ఫోర్డ్ 2006లో ప్రారంభించాడు. ఈప్రాంతీయ క్రికెట్ క్రీడలో కరేనియన్ ద్వీపాల క్రీడాకారులు పాల్గొంటున్నారు.

అసోసియేషన్ ఫుట్‌బాల్

అసోసియేషన్ ఫుట్‌బాల్ (సాకర్) కూడా ఆంటిగ్వాలో చాలా ప్రచుర్యం పొందింది. " ఆంటిగ్వా అండ్ బార్బుడా నేషనల్ ఫుట్‌బాల్ టీం " 1974-1986 టోర్నమెంటులలో వరల్డ్ కప్ అర్హత పొంఫింది.2011లో దేశంలో ప్రొఫెషనల్ టీం ఏర్పడింది.ఆంటిగ్వా బార్బుడా ఫుట్‌బాల్ టీం యు.ఎస్.ఎల్ ప్రొ క్రీడలలో పాల్గొన్నది.

అథ్లెటిక్ క్రీడలు

ఆటిగ్వా మరియు బార్బుడాలో అథ్లెటిక్ క్రీడలు ప్రాబల్యత కలిగి ఉన్నాయి.నైపుణ్యం కలిగిన అథ్లెటిక్ క్రీడాకారులకు చిన్నవయసు నుండే శిక్షణ ఇవ్వబడుతుంది. ఆంటిగ్వాలోని గ్రేస్ ఫాం నుండి వచ్చిన జానిల్ విలియంస్ అథ్లెటిక్ క్రీడలలో రాణిస్తున్నాడు.సోనియా విలియంస్ మరియు హీదర్ శామ్యుయేల్ ఆంటిగ్వా మరియు బార్బుడా తరఫున ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నారు.ఇతర క్రీడాకారులలో బ్రెండన్ క్రిస్టియన్ (100 మీ -200 మీ), డానియల్ బెయిలీ (100 మీ- 200 మీ) మరియు జేంస్ గ్రేమన్ (హైజంప్) మొదలైన క్రీడాకారులు అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉన్నారు.

మూలాలు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

  1. 1.0 1.1 1.2 1.3 "Antigua and Barbuda". International Monetary Fund. 2016. Retrieved 1 April 2016.
  2. (PDF) http://hdr.undp.org/sites/default/files/hdr_2015_statistical_annex.pdf. {{cite web}}: Missing or empty |title= (help) |title=2015 Human Development Report |date=2015 |accessdate=14 December 2015 |publisher=United Nations Development Programme |
  3. "Introduction ::Antigua and Barbuda".
  4. Austin Alchon, Suzanne (2003). A pest in the land: new world epidemics in a global perspective. University of New Mexico Press. pp. 62–63. ISBN 0-8263-2871-7.
  5. Rogozinski, Jan (September 2000). A Brief History of the Caribbean. Penguin Putnam, Inc.
  6. http://www.oecs.org/publications/Fdoc_download/450-north-east-marine-management-area-management-plan
  7. Krauss, Clifford; Creswell, Julie; Savage, Charlie (21 February 2009). "Fraud Case Shakes a Billionaire's Caribbean Realm". The New York Times. Retrieved 14 April 2010.
  8. "Background Note: Antigua and Barbuda". Archived from the original on 14 August 2007. Retrieved 23 August 2007. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  9. Bernadette Farquhar - The Spanish Language in Antigua and Barbuda: Implications for Language Planning and Language Research Archived 15 జూలై 2013 at the Wayback Machine
  10. "Antigua and Barbuda: International Religious Freedom Report 2006". 15 September 2006. Archived from the original on 21 November 2006. Retrieved 23 August 2007. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  11. [1] [dead link]
  12. An Introduction to Southern Presbyterian History (1611-2001)
  13. Mark A. Noll (1992). A History of Christianity in the United States and Canada - Mark A. Noll. Wm. B. Eerdmans Publishing Company. ISBN 9780802806512.
  14. "American University of Antigua, College of Medicine". Archived from the original on 22 August 2007. Retrieved 23 August 2007. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  15. "University of Health Sciences Antigua". Retrieved 23 August 2007.
  16. "Antigua & Barbuda - Carnival & Music". www.geographia.com. Retrieved 2016-11-09.