గబ్బిట వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1997 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 22: పంక్తి 22:


[[వర్గం:1928 జననాలు]]
[[వర్గం:1928 జననాలు]]
[[వర్గం:1997 మరణాలు]]

17:34, 3 మార్చి 2017 నాటి కూర్పు

గబ్బిట వెంకటరావు ప్రముఖ రంగస్థల, సినిమా రచయిత.

జననం

ఈయన దక్షిణామూర్తి, లక్ష్మీ నరసమ్మ దంపతులకు 1928, మార్చి 15పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో జన్మించారు.[1]

వివాహం - పిల్లలు

కృష్ణా జిల్లా ఆకిరిపల్లి లోని చల్లా శ్రీరాములు, పేరమ్మ దంపతుల కుమార్తెన అన్నపూర్ణమ్మ ను వివాహం చేసుకున్నారు. వీరికి మధుమోహన్, ఉమకుమార్ శేషాద్రి, సాయినాథ్, లక్ష్మీ ప్రసన్న, దక్షిణా మూర్తి, గౌరీ విజయ లక్ష్మి.

సినీరంగ ప్రస్థానం

సీనియర్ సముద్రాల, జగ్గయ్య ల ప్రేరణతో సినీ రంగప్రవేశం చేసి బాపు గారి కోరికపై శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రానికి కథామాటలు పాటలు పద్యాలు స్క్రీన్ ప్లే రాశారు. ఎన్.టి.రామారావు నటించిన బొబ్బిలి యుద్ధం, మాయా మశ్చీంద్ర చిత్రాలకు స్క్రీన్ ప్లే కధ మాటలు రాశారు. బి.ఏ. సుబ్బారావు దర్శకత్వం చేసిన మోహినీ భస్మాసుర కూ సంభాషణలు రాశారు. శ్రీమద్భగవద్గీత లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్య సహితంగా రచించి సుసర్ల దక్షిణా మూర్తిగారి చే, స్వర కల్పన చేయించి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిచే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేశారు. సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కథా, పాటలు, సంభాషణలు, పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .

ఒరియా భాషలో సి.ఎస్.రావు దర్శకత్వం వహించిన సత్య హరిశ్చంద్ర సినిమాను నిర్మించారు. ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు. మళయాళ చిత్రంను కొండవీటి మొనగాడు గా అనువాదం చేశారు, భక్త అంబరీష మాటలు సమకూర్చారు.

నాటకరంగ ప్రస్థానం

వెంకటరావు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే హనుమద్రామ సంగ్రామం అనే నాటకం రాశారు. అల్లూరి సీతారామ రాజు, మనోహర, వరూధిని వంటి ప్రసిద్ధ నాటకాలు రాశారు.

మరణం

ఈయన 1997, అక్టోబర్ 11న తన 69వ ఏట మద్రాస్ లో మరణించారు.

మూలాలు

  1. సరసభారతి ఉయ్యూరు. "బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు". sarasabharati-vuyyuru.com. Retrieved 3 March 2017.