ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 78: పంక్తి 78:
|-
|-
|2014
|2014
|[[చింతర రామచంద్రరెడ్డి]]
|[[చింతల రామచంద్రరెడ్డి]]
|బి.జె.పి
|బి.జె.పి
|దానం నాగేందర్
|దానం నాగేందర్

03:27, 5 మార్చి 2017 నాటి కూర్పు

హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలలో ఒకటైన ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖమైనది. పునర్విభజనకు పూర్వం ఈ నియోజకవర్గం జనాభా పరంగా, ఓటర్ల పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం అనేక శాసనసభ నియోజకవర్గాలుగా విడిపోయింది.

ఎన్నికైన శాసనసభ్యులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1967 బి.వి.గురుమూర్తి కాంగ్రెస్ పార్టీ ఎస్.శంకరయ్య ఇండిపెండెంట్
1972 ఎన్.కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ ఇ.వి.పద్మనాభన్
1978 పి.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆలె నరేంద్ర జనతా పార్టీ
1983 ఎం.రామచందర్ రావు తెలుగుదేశం పార్టీ పి.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 పి.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1989 పి.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ
1994 పి.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బి.విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ
1999 కె.విజయరామారావు తెలుగుదేశం పార్టీ పి.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 పి.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.విజయరామారావు తెలుగుదేశం
2008 విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.శ్రీనివాస్ రావు లోక్‌సత్తా పార్టీ
2009 దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కె.విజయరామారావు తెలుగుదేశం
2014 చింతల రామచంద్రరెడ్డి బి.జె.పి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు

2004 శాసనసభ ఎన్నికలలో ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ అభ్యర్థి పి.జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి కె.విజయరామారావుపై 32419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పి.జనార్థన్ రెడ్డి 157600 ఓట్లు సాధించగా, విజయరామారావుకు 125181 ఓట్లు లభించాయి.

2008 ఉప ఎన్నికలు

పి.జనార్థన్ రెడ్డి మరణం వలన జరిగిన ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి సమీప లోక్‌సత్తా పార్టీకి చెందిన అభ్యర్థి కె.శ్రీనివాస్ రావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఈ స్థానం నుంచి ముందుగా కుదిరిన అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీ పోటీకి దిగలేదు. [1] విష్ణువర్థన్ రెడ్డి 2,54,676 ఓట్లు సాధించగా, శ్రీనివాస్ రావు 58,407 ఓట్లు పొందినాడు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి అరీఫుద్దీన్ 54,134 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.

నియోజకవర్గ ప్రముఖులు

పి.జనార్థన్ రెడ్డి
ఖైరతాబాదు నియోజకవర్గంలో పి.జనార్థన్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా పేరుగాంచినాడు. మొత్తం 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొంది పార్టీలో ప్రముఖ స్థానం పొందినాడు. 1978లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టగా, 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో ఓడిపోయాడు. ఆ తరువాత 1985, 1989 మరియు 1994లలో వరుసగా 3 సార్లు విజయం సాధించాడు. 1999లో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయరామారావు చేతిలో ఒడిపోగా, 2004లో విజయరామారావును ఓడించి మళ్ళీ తన స్థానాన్ని చేజిక్కించుకొని మరణించే వరకు నియోజకవర్గానికి తన సేవలందించాడు. 2008లో ఉపఎన్నిక జరిగిన ఈ స్థానం నుంచి ఇతని కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి విజయం పొందినాడు.



గుణాంకాలు

మూలాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=05
  1. ఈనాడు దినపత్రిక, తేది జూన్ 2, 2008