Coordinates: 15°37′20″N 80°01′23″E / 15.62221°N 80.023014°E / 15.62221; 80.023014

మద్దిపాడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 159: పంక్తి 159:
==గ్రామ విశేషాలు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో ఒక సేంద్రియ ఎరువుల కుటీరం నిర్మించెదరు. [10]
ఈ గ్రామములో ఒక సేంద్రియ ఎరువుల కుటీరం నిర్మించెదరు. [10]
===కళాక్షేత్రం===
మద్దిపాడు ప్రధాన కూడలిలో 1938 లో తెలుగు చలనచిత్ర దిగ్గజాలు ఎస్.వీ.రంగారావు, భానుమతి. అక్కినేని నాగేశ్వరరావు, రాజనాల తదితర పెద్ద కళాకారులు ఇక్కడ నాటకాలు ప్రదర్సించేవారు. దొడ్డవరం గ్రామానికి చెందిన భానుమతి, తమ ప్రదర్శనలకు మద్దిపాడులో కళాక్షేత్రం ఏర్పాటుచేయాలని సమాయత్తం చేసినారు. 1940 లో అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా దీనిని ప్రారంభించినారు. నాటినుండి ఇక్కడ లెక్కలేనన్ని ప్రదర్శనలు నిర్వహించినారు. మద్దిపాడు కళాక్షేత్రం అన్ని రంగాలకు నిలయంగా ఉండేది. గ్రామములో ఎటువంటి కార్యకలాపాలు జరగాలన్నా వేదికగా ఉండేది. ఈ కళాక్షేత్రంలో నాటకాలు, నాటికలూ చాలా ప్రదర్శించి, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు గుర్తింపు పొందినారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా, పంచాయతీ ప్రాంగణంలోని ఈ కళాక్షేత్రాన్ని పూర్తిగా తొలగించినారు. దీనికి తగింజ పరిహారం కూడా అందజేసినారు. మూడు సంవత్సరాలుగా కళాక్షేత్రం నిర్మించెదమని హామీలు ఇచ్చుచున్నా గానీ ఒక్క అడుగు కూడా పని ముందుకు సాగుటలేదు. దీనితో ఈ కట్టడాల స్థలాలు ఆక్రమణలకు గురి అగుచున్నవి. కొందరు దుకాణాలు గూడా ఏర్పాటు చేసుకున్నారు. []


==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==

13:45, 12 మార్చి 2017 నాటి కూర్పు

మద్దిపాడు
—  మండలం  —
ప్రకాశం పటంలో మద్దిపాడు మండలం స్థానం
ప్రకాశం పటంలో మద్దిపాడు మండలం స్థానం
ప్రకాశం పటంలో మద్దిపాడు మండలం స్థానం
మద్దిపాడు is located in Andhra Pradesh
మద్దిపాడు
మద్దిపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో మద్దిపాడు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°37′20″N 80°01′23″E / 15.62221°N 80.023014°E / 15.62221; 80.023014
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రం మద్దిపాడు
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 49,473
 - పురుషులు 25,349
 - స్త్రీలు 24,124
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.98%
 - పురుషులు 75.70%
 - స్త్రీలు 51.68%
పిన్‌కోడ్ 523211
మద్దిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
మద్దిపాడు is located in Andhra Pradesh
మద్దిపాడు
మద్దిపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°37′20″N 80°01′23″E / 15.62221°N 80.023014°E / 15.62221; 80.023014{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం మద్దిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,480
 - పురుషుల సంఖ్య 2,449
 - స్త్రీల సంఖ్య 2,264
 - గృహాల సంఖ్య 1,108
పిన్ కోడ్ 523 211
ఎస్.టి.డి కోడ్

మద్దిపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.[1].పిన్ కోడ్: 523 211., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ చరిత్ర

ఈ గ్రామంలో కళాకారులూ చాలామంది నివసించారు.వారిలో ఈమని రాఘవయ్య,భూసురపల్లి ఆదిశేషయ్య ముఖ్యులు.[2]

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

పెదకొత్తపల్లి 2 కి.మీ, ఏడుగుండ్లపాడు 3 కి.మీ, గుండ్లపల్లి 4 కి.మీ, బసవన్నపాలెం 4 కి.మీ, ఇనమనమెల్లూరు 4 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన సంతనూతలపాడు మండలం, తూర్పున నాగులుప్పలపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన చీమకుర్తి మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

  1. కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల.
  2. నాగార్జున పాఠశాల.
  3. సరస్వతీ విద్యా నికేతన్.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

బ్యాంకులు

  1. భారతీయ స్టేట్ బ్యాంకు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ

మండల తహసీల్దారు కార్యాలయo

గ్రామములోని మండల తహసీల్దారు కార్యాలయ భవనం, రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేసినారు. నూతన భవన నిర్మాణం ప్రారంభించారు. అందులో ఆయా సిబ్బందికి సరిపడేలాగ ప్రత్యేక గదులు, వివిధ పనులకోసం వచ్చేవారికోసం నిరీక్షణ గదులు నిర్మించుచున్నారు. [11]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

  1. ఆదెన్న చెరువు.
  2. వీరప్ప కుంట చెరువు

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ జి.నరసింహారావు ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

  1. ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2014,జూన్-12, గురువారం నాడు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుణ్యాహవచనం, తీర్ధ ప్రసాదాల వితరణ జరిగింది. ఈ వేడుకలలో పలువురు భక్తులు పాల్గొన్నారు. [2]
  2. ఈ ఆలయంలో నెలకొన్న స్వామివారి గ్రామోత్సవం నిర్వహించుటకై, కడియాల వంశీకులు, 2015,మే నెల-22వ తేదీ శుక్రవారంనాడు, ఈ ఆలయానికి ఒక రథం బహుకరించారు. ఈ సందర్భంగా రథాన్ని, మండలంలోని అన్ని గ్రామాలలోనూ ఊరేగించారు. చివరకు మద్దిపాడు గ్రామంలోని పలువీధులలో, స్వామివారి రథాన్ని, మేళతాళాలతో ఊరేగించి, ఆలయంలోనికి చేర్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [8]

శివాలయం

జాతీయరహదారి విస్తరణలో భాగంగా ఈ పురాతన ఆలయంలో కొంత భాగాన్ని తొలగించడంతో, 2015,ఫిబ్రవరి-25వ తేదీనాడు, తి.తి.దె.అర్చకుల ఆధ్వర్యంలో, ఈ ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టినారు. శివాలయంలోని ధ్వజస్తంభం, నవగ్రహాలు, యాగస్థానం పోవడంతో, గ్రామానికి ఎలాంటి కీడు రాకుండా ఈ కార్యక్రమం చేపట్టినారు. నూతన శివాలయ నిర్మాణం కోసం, విరాళాలు సేకరించుచున్నారు. [6]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

స్థానిక పడమరపాలెంలో శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 2014, జూన్-22, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన శ్రీ పాలుబోయిన వీరయ్య, నారాయణమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారులు, శ్రీ మురళీకృష్ణ, చైతన్యకృష్ణ ల ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగినవి. [3]

శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం

మద్దిపాడు గ్రామంలోని యాదవపాలెంలో వేంచేసియున్న ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యాలు సమర్పించారు. గ్రామంలోని యువకులు ప్రభలు ఏర్పాటుచేసి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. [4]

శ్రీ రామాలయం

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతి రోజూ ఆలయంలో వసంతనవరాత్రులూ, సుందరకాండ ప్రవచనాలు, నైవేద్యాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [7]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

శ్రీ భూసురపల్లి ఆదిశేషయ్య

వీరు సామాన్య కుటుంబంలో జన్మించి, స్వయంకృషితో డోలు వాయిద్య కళాకారుడిగా రాణించి, అంతర్జాతీయస్థాయిలో తెలుగువారి ఖ్యాతిని వాటిచెప్పిన విద్వాంసులు. వీరు నాదస్వర విద్వాంసులు పద్మశ్రీ షేక్ మౌలానాసాహెభ్ మరియు శ్రీ ఈమని రాఘవయ్యతో అనేక కచ్చేరీలు చేసి, ప్రభుత్వం ద్వారా "లయబ్రహ్మ" అను బిరుదు పొందిన గొప్ప విద్వాంసులు. [9][2]

శ్రీ కడియాల యానాదయ్య

వీరు, స్వాతంత్ర్యోద్యమంలో ఉద్యమకారులు ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేసిన చిరస్మరణీయులు. మోతుబరిరైతుగా నిరుపేదలకు ఇళ్ళపట్టాలను అందజేసిన ఉదారశీలి. విద్యార్థుల చదువులకు పాఠశాల ప్రాంగణాన్ని ఉచితంగా అందజేసి, విద్యాదాతగా పేరుపొందినారు. స్థానిక కళాశాలలో 2016,ఫిబ్రవరి-10వ తేదీనాడు, వీరి సంతాపసభ నిర్వహించారు. [12]

గ్రామ విశేషాలు

ఈ గ్రామములో ఒక సేంద్రియ ఎరువుల కుటీరం నిర్మించెదరు. [10]

కళాక్షేత్రం

మద్దిపాడు ప్రధాన కూడలిలో 1938 లో తెలుగు చలనచిత్ర దిగ్గజాలు ఎస్.వీ.రంగారావు, భానుమతి. అక్కినేని నాగేశ్వరరావు, రాజనాల తదితర పెద్ద కళాకారులు ఇక్కడ నాటకాలు ప్రదర్సించేవారు. దొడ్డవరం గ్రామానికి చెందిన భానుమతి, తమ ప్రదర్శనలకు మద్దిపాడులో కళాక్షేత్రం ఏర్పాటుచేయాలని సమాయత్తం చేసినారు. 1940 లో అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా దీనిని ప్రారంభించినారు. నాటినుండి ఇక్కడ లెక్కలేనన్ని ప్రదర్శనలు నిర్వహించినారు. మద్దిపాడు కళాక్షేత్రం అన్ని రంగాలకు నిలయంగా ఉండేది. గ్రామములో ఎటువంటి కార్యకలాపాలు జరగాలన్నా వేదికగా ఉండేది. ఈ కళాక్షేత్రంలో నాటకాలు, నాటికలూ చాలా ప్రదర్శించి, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు గుర్తింపు పొందినారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా, పంచాయతీ ప్రాంగణంలోని ఈ కళాక్షేత్రాన్ని పూర్తిగా తొలగించినారు. దీనికి తగింజ పరిహారం కూడా అందజేసినారు. మూడు సంవత్సరాలుగా కళాక్షేత్రం నిర్మించెదమని హామీలు ఇచ్చుచున్నా గానీ ఒక్క అడుగు కూడా పని ముందుకు సాగుటలేదు. దీనితో ఈ కట్టడాల స్థలాలు ఆక్రమణలకు గురి అగుచున్నవి. కొందరు దుకాణాలు గూడా ఏర్పాటు చేసుకున్నారు. []

మండలంలోని గ్రామాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,713.[3] ఇందులో పురుషుల సంఖ్య 2,449, స్త్రీల సంఖ్య 2,264, గ్రామంలో నివాస గృహాలు 1,108 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,193 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. 2.0 2.1 20 వ శతాబ్దపు తెలుగు వెలుగులు. హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయము.
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-13; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-23; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగష్టు-25; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-14; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఫిబ్రవరి-26; 1వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చ్-18; 3వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-23; 1వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,జూన్-18; 2వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,సెప్టెంబరు-23; 2వపేజీ. [11] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,డిసెంబరు-16; 3వపేజీ. [12] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-11; 2వపేజీ.