గొల్లపల్లి (నూజివీడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 133: పంక్తి 133:
#ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-4వ తేదీ నుండి 7వ తేదీవరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ పూజలను నిర్వహించెదరు. [7]
#ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-4వ తేదీ నుండి 7వ తేదీవరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ పూజలను నిర్వహించెదరు. [7]


====శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం====
====శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం====
#ఈ ఆలయం శ్రీ రఘునాథస్వామివారి ఆలయానికి ఉపాలయం. ఈ ఆలయంలో 2014,నవంబర్-9, ఆదివారం నాడు, కార్తీకమాసం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వకఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. [6]
#ఈ ఆలయం శ్రీ రఘునాథస్వామివారి ఆలయానికి ఉపాలయం. ఈ ఆలయంలో 2014,నవంబర్-9, ఆదివారం నాడు, కార్తీకమాసం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వకఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. [6]
#ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-4వ తేదీ నుండి 7వ తేదీవరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ పూజలను నిర్వహించెదరు. [7]
#ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-4వ తేదీ నుండి 7వ తేదీవరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ పూజలను నిర్వహించెదరు. [7]

15:24, 12 మార్చి 2017 నాటి కూర్పు

గొల్లపల్లి (నూజివీడు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నూజివీడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ గోగినేని శ్రీనివాసకుమార్
జనాభా (2011)
 - మొత్తం 5,196
 - పురుషుల సంఖ్య 2,676
 - స్త్రీల సంఖ్య 2,520
 - గృహాల సంఖ్య 1,344
పిన్ కోడ్ 521 111
ఎస్.టి.డి కోడ్ 08656

గొల్లపల్లి, కృష్ణా జిల్లా, నూజివీడు మండలానికి చెందిన గ్రామము, పిన్ కోడ్ నం. 521 111. యస్.టీ.డీ.కోడ్ = 08656.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

నూజివీడు మండలం

నూజివీడు మండలంలోని అన్నవరం, ఎనమడాల, గొల్లపల్లె, జంగంగూడెం, తుక్కులూరు, దేవరగుంట, నూజివీడు, పల్లెర్లమూడి, పొలసనపల్లె, పోతురెడ్డిపల్లె, బాతులవారిగూడెం, బూరవంచ, మర్రిబందం, మీర్జాపురం, ముక్కొల్లుపాడు, మొర్సపూడి, మోక్షనరసన్న పాలెం, రామన్నగూడెం, రావిచెర్ల, వెంకాయపాలెం, వేంపాడు, సంకొల్లు, సీతారాంపురం మరియు హనుమంతుని గూడెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 28 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో మోర్సపూడి, దేవరగుంట, వట్టిగుడిపాడు, రామన్నగూడెం, జంగంగూడెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

ముసునూరు, బాపులపాడు, అగిరిపల్లి, పెదపాడు

గ్రామానికి రవాణా సౌకర్యం

నూజివీడు, హనుమాన్ జంక్షన్,ఏలూరుడి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 43కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

ఎ.ఆర్కె జిల్లాపల్రిషత్ హైస్కూల్, గొల్లపల్లి

గ్రామంలోని మౌలిక వసతులు

బ్యాంకులు

ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం. 08656/222230.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గోగినేని శ్రీనివాసకుమార్ సర్పంచిగా గెలుపొందారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రఘునాధస్వామి ఆలయం

  1. ఈ ఆలయం బాగా ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో 2014, అక్టోబరు-20వ తేదీ సోమవారం నాడు, శ్రీ జయనామ సంవత్సర ఆశ్వయుజ బహుళ ద్వాదశిని పురస్కరించుకొని ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని వేదపండితులు నయన మనోహరంగా నిర్వహించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నవకలశస్నపనం, నదీజలాలతో పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అగ్నిప్రతిష్ఠాపన, సుదర్శన శాంతిహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. [5]
  2. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-28వ తేదీ శనివారం నుండి ఏప్రిల్-5వ తేదీ ఆదివారం వరకు పాంచాహ్నిక దీక్షతో నిర్వహించెదరు. 28వ తేదీన స్వామివారిని పెళ్ళికుమారుని చేయుట, 30వ తేదీనాడు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, 31వ తేదీనాడు మంగళవాయిద్యాలతో తీర్ధపు బిందె, ధ్వజారోహణ, ఏప్రిల్-1వ తేదీనాడు నిత్యహోమం, సంక్లేపరామాయణ పారాయణం, ఛావమౌళి భజన, రాత్రికి గజవాహనపై ఎదుర్కోలు ఉత్సవం, రఘునాథస్వామివారి కళ్యాణోతసవం, అనంతరం అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహించెదరు. దీనికి ముందు అన్నసమారాధన నిర్వహించెదరు. ఏప్రిల్-3వ తేదీనాడు రథోత్సవం, 4వ తేదీనాడు గరుడ వాహనంపై గ్రామోత్సవం, 5వ తేదీనాడు స్వామివారికి పవళింపుసేవతో కార్యక్రమాలు పరిసమాప్తమవుతవి. [8]
  3. ఈ ఆలయానికి వేంపాడు గ్రామంలో 3,356 ఎకరాల మాన్యం భూమి ఉంది. గొల్లపల్లి గ్రామంలో 52.77 ఎకరాల మాన్యం భూమి ఉంది. వీటిలో మొత్తం సాగుభూమి 2,798 ఎకరాలు. కానీ స్వామివారికి వచ్చే ఆదాయం మాత్రం అంతంతమాత్రమే. [4]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం

  1. ఈ ఆలయం శ్రీ రఘునాథస్వామివారి ఆలయానికి ఉపాలయం. ఈ ఆలయంలో 2014,నవంబర్-9, ఆదివారం నాడు, కార్తీకమాసం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వకఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. [6]
  2. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-4వ తేదీ నుండి 7వ తేదీవరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ పూజలను నిర్వహించెదరు. [7]

శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం

  1. ఈ ఆలయం శ్రీ రఘునాథస్వామివారి ఆలయానికి ఉపాలయం. ఈ ఆలయంలో 2014,నవంబర్-9, ఆదివారం నాడు, కార్తీకమాసం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వకఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. [6]
  2. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-4వ తేదీ నుండి 7వ తేదీవరకు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ పూజలను నిర్వహించెదరు. [7]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, మామిడి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయంం వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామంలో పుట్టిపెరిగిన చి. అవిరినేని స్నేహిత 2011 లో బి.టెక్. 86%తో ఉత్తీర్ణురాలయినది. తరువాత ఇంటర్నేషనల్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిటూట్, డిల్లీలో ఎం.బి.ఏ చదివింది. ఈమె మేక్-ఏ-డిఫరెన్స్ పోటీ నిర్వహించే హెచ్.సీ.ఎల్ ఫార్మ్ ఎక్విప్మెన్ట్ & రెంటల్ సర్వీసెస్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హెచ్.సీ.ఎల్ వారికి వివరించింది. దీని సారాంశం ఏమిటంటే: గ్రామంలో ఒక పెద్ద రైతు వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలను కొని సంస్థను ప్రారంభిస్తాడు. సంస్థలో చిన్న రైతులు తలా కొంచం పెట్టుబడులు పెట్టి భాగస్వాములవుతారు. పెద్ద రైతు రాయితీతో పరికరాలను చిన్నరైతులకు అద్దెకిస్తాడు. దీనివలన రైతులకు భారం ఉండదు. కూలీలు దొరకకపోయినా ఇబ్బందిఉండదు. ఈ వివరాలను పంపి, ఆరువేల మందికి జరిపిన ఇంటర్వ్యూలో సెలెక్టయిన 12 మందిలో ఈమె ఒకరు. తరువాత జరిగిన గ్రాండ్ ఫినాలేలో సెలక్టు అయి 5లక్షల రూపాయలు నగదు గెల్చుకొన్నది. [2]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 5,196 - పురుషుల సంఖ్య 2,676 - స్త్రీల సంఖ్య 2,520 - గృహాల సంఖ్య 1,344

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4994.[3] ఇందులో పురుషుల సంఖ్య 2552, స్త్రీల సంఖ్య 2442, గ్రామంలో నివాసగృహాలు 1082 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 504 హెక్టారులు.

మూలాలు

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Nuzvid/Gollapalli". Retrieved 20 June 2016. {{cite web}}: External link in |title= (help)
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[2] ఈనాడు వసుంధర 18-7-2013. [3] ఈనాడు కృష్ణా జూలై 25 2013. 8వ పేజీ. [4] ఈనాడు, కృష్ణా, 2014, ఆగష్టు-10; 1,2 పేజీలు. [5] ఈనాడు కృష్ణా; 2014,అక్టోబరు-21; 11వపేజీ. [6] ఈనాడు విజయవాడ; 2014,నవంబర్-9; 5వపేజీ. [7] ఈనాడు విజయవాడ; 2015,మార్చ్-3; 5వ పేజీ. [8] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-27; 11వపేజీ.