జయప్రభ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''జయప్రభ''' ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.
'''జయప్రభ''' ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.
==విశేషాలు==
==విశేషాలు==
ఈమె [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] నగరంలో [[1957]], [[జూలై 29]]న జన్మించింది. ఈమె విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో గడిచింది. ఈమె తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదివింది. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు నాటకంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించింది. ఈమె ప్రస్తుతం [[సికిందరాబాదు]]లో నివసిస్తున్నది<ref>http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en15345853.htm</ref>. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు ''కొండవీటి సత్యవతి''తో కలిసి సంపాదకత్వం వహించింది. ఈమె కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి [[పి.వి.నరసింహారావు]] Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు.<ref>http://archive.thedailystar.net/2006/01/07/d601072106112.htm </ref>
ఈమె [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] నగరంలో [[1957]], [[జూలై 29]]న జన్మించింది. ఈమె విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో గడిచింది. ఈమె తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదివింది. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు నాటకంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించింది. ఈమె ప్రస్తుతం [[సికిందరాబాదు]]లో నివసిస్తున్నది<ref>http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en15345853.htm</ref>. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు ''కొండవీటి సత్యవతి''తో కలిసి సంపాదకత్వం వహించింది<ref>[http://maagodavari.blogspot.in/2012/11/blog-post_2.html మహిళలు నడుపుతున్న పత్రికలు నాడు-నేడు]</ref>. ఈమె కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి [[పి.వి.నరసింహారావు]] Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు.<ref>http://archive.thedailystar.net/2006/01/07/d601072106112.htm </ref>


==రచనలు==
==రచనలు==

05:52, 13 మార్చి 2017 నాటి కూర్పు

జయప్రభ ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.

విశేషాలు

ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్ నగరంలో 1957, జూలై 29న జన్మించింది. ఈమె విద్యాభ్యాసం విశాఖపట్నంలో గడిచింది. ఈమె తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదివింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు నాటకంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించింది. ఈమె ప్రస్తుతం సికిందరాబాదులో నివసిస్తున్నది[1]. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు కొండవీటి సత్యవతితో కలిసి సంపాదకత్వం వహించింది[2]. ఈమె కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు.[3]

రచనలు

  1. ది పబ్ ఆఫ్ వైజాగపట్నం
  2. యశోధరా వగపెందుకే
  3. చింతల నెమలి
  4. యుద్ధోన్ముఖంగా...
  5. క్షణ క్షణ ప్రయాణం
  6. ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?
  7. భావకవిత్వంలో స్త్రీ
  8. వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమున కాకలివేసినది
  9. వామనుడి మూడోపాదం
  10. నాలుగో గోడ

రచనల నుండి ఉదాహరణ

ఈమె రచనాశైలిని తెలుసుకోవడానికి మచ్చుకు ఒక కవిత[4]:

అంతా అంతే!

కాలంతో పాటు కాకినాడ మారినట్టే
జ్ఞాపకాలూ మారిపోతాయి
భావనారాయణుడి గుళ్ళో
నిశ్చింతగా గూడు కట్టిన పక్షులు
వరి కంకుల కోసం పోయి పోయి
వరదలో చిక్కుకున్నట్టు - అంతా అంతే!

వెక్కిరించాడంటే సమాజాన్ని
వెంకటచలానిదా తప్పు!

నేరేడు చెట్టు కిమ్ద పళ్ళేరుకుందికి
పందెం వేసుకుని పరుగులు పెట్టిన
కాలేజీ అమ్మాయిలు ఎందరో
నవ్వులన్నీ ఇగిరి పోయి
ఉప్పుమళ్ళై పెలిపోయి
వంట రుచుల్లో కరిగిపోయారు.

వెయ్యగా వెయ్యగా గులకరాళ్ళు
నీళ్ళెప్పటికో పైకొస్తాయని
వెతుకుతూ వెతుకుతూ వెర్రి కాకులమై
ఎండ పడ్డ కలలతో
ఎంత దాహంతో ఉన్నాం! ఏమై పోతున్నాం!

మామిడి తోటలొదిలేసి
ఇసక మేటాలొదిలేసి
ఓ అయ్య చేతిలో పెట్టి
ఇల్లు కట్టుకోమన్నారని కదా
ఇంత దూరాలొచ్చేసాం?

ఏం చేస్తున్నారంటే
పిల్లలతో గిన్నెలతో
మారు మాత్రం ఏం చెప్తార్లెండి!
మన ఆశలు కాలవగట్టు పొలాలు కావుగా
ఏటి పొడవుతా పచ్చగా ఏదో ఒకటి పండటానికి!
మరెలాగంటే చెప్పలేం.
పొడుపు కథలు విప్పలేం!

ఏమీ తెలియని తనంలో ఎంత సుఖం!
సపోటా చెట్ల మీద చదువుకి సన్నాహాలు
సర్పవరం పూతోటాల్లో పుప్పొడి సరాగాలు
ఏమర్రా!
చండామార్కుల వారింకా ట్యూషన్లే చెబుతున్నారా?
మెక్లారిన్ హైస్కూలు మలుపులూ
గోదావరి కాలవ దాటి
పాత జగన్నాథ పురంలో
తాతల నాటి సందులూ!
వెంట బడిన కుర్రాళ్ళని చూసి వెక్కిరింతలూ
కంటి కొనల కవ్వింతలూ కేరింతలూ

అంతేలే!
పారిపోయిన పదహారో ఏడు మరి తిరిగి రాదు.
తన పని తాను చేసుకుంటూ
బల్ల కట్టు మాదిరి ఆ గట్టూ ఈ గట్టూ తిరుగుతుంది జీవితం!

తొలి యవ్వనం మళ్ళి పోయింది.
కాలంతో పాటు కాకినాడ మారినట్టే
జ్ఞాపకాలూ మారిపోయాయి!

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=జయప్రభ&oldid=2080036" నుండి వెలికితీశారు