వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి పధ్ధతిని పద్ధతిగా మార్చుతున్నా! |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
{{Guideline}} |
{{Guideline}} |
||
{{శైలి}} |
{{శైలి}} |
||
రచనలను ఒక |
రచనలను ఒక క్రమపద్ధతిలో, చదవడానికి చక్కగా వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ '''శైలి మాన్యువల్'''. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పద్ధతి ఇతర పద్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తే, [[వికీపీడియా]] చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం: |
||
:ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి. |
:ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి. |
||
14:59, 16 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
వికీపీడియా శైలి సహాయం |
---|
శైలి |
దిద్దుబాటు మార్గదర్శకాలు |
వర్గీకరణ |
ఇతర మార్గదర్శకాలు |
పదకోశం |
రచనలను ఒక క్రమపద్ధతిలో, చదవడానికి చక్కగా వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ శైలి మాన్యువల్. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పద్ధతి ఇతర పద్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తే, వికీపీడియా చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం:
- ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి.
రచన ఎలా అందంగా తీర్చి దిద్దాము అనేదానికంటే, అది ఎంత స్పష్టంగా, సమాచార సహితంగా, పక్షపాత రహితంగా ఉంది అనేది ముఖ్యం. రచయితలు ఈ నియమాలేవీ పాటించవలసిన అవసరం లేదు.
వ్యాసం పేరు
ప్రధాన వ్యాసం: నామకరణ విధానం
వీలయినంత వరకు వ్యాసం పేరు వ్యాసం యొక్క మొదటి వాక్యం లోనే వచ్చేలా ఉండాలి. పేరు మొదటిసారి వ్యాసంలో కనిపించేటపుడు, దానిని బొద్దుగా చెయ్యండి. ఉదాహరణ చూడండి: '''వ్యాసం పేరు'''
ఇది ఇలా కనిపిస్తుంది వ్యాసం పేరు. పేరులో లింకులు పెట్టరాదు.
పేరును ఇటాలిక్స్ లో పెట్టదలిస్తే, పేరు మొత్తాన్ని పెట్టాలా లేక కొంత భాగాన్ని మాత్రమే పెట్టాలా అనే విషయమై ఇటాలిక్స్ నియమాలను పాటించండి.
భాష
మందార మకరంద మాధుర్యమును బోలు అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో చక్కటి తెలుగు పదాలతో వ్యాసం రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంబించండి.
- వ్యావహారిక భాషలో రాయండి.
- సరళ గ్రాంథికంలో రాయవద్దు. ఉదాహరణకు.. "వెళ్ళుచుండెను" "వెళ్ళుచున్నాడు" "వెళ్తున్నాడు" వంటి క్రియాప్రయోగాలు భాషలో ఉన్నాయి. మొదటి రెండు ప్రయోగాలు గతకాలపు రచనల్లో కనిపిస్తాయిగానీ, ఇప్పటి రచనల్లో వాడుకలో లేదు. వికీపీడియా వ్యాసాల్లో కూడా అలాంటి ప్రయోగాలు ఉండకూడదు.
- ము, అనుస్వారాల (సున్నా) వాడుకలో వికీపీడియా విధానం
- ము తో అంతమయ్యే పదాల విషయంలో ము స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ప్రపంచము, అంధకారము, అనికాక ప్రపంచం, అంధకారం అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. అలాగే అనుస్వారంతో అంతమయ్యే పదాలకు బహువచనాలు రాయడంలో అనుస్వారం లుప్తమైపోయి, దాని ముందరి అక్షరం దీర్ఘమై చివర్లో లు చేరుతుంది. విధానం అనే పదం యొక్క బహువచనరూపం విధానాలు అవుతుంది.
వ్యక్తుల పేర్లు
వ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు కింది పద్ధతులను పాటించాలి.
- బాగా ఎక్కువగా వాడుకలోనున్న పేరును వాడాలి. ఉదాహరణకు విజయవాడను బెజవాడ అని కూడా అంటారు. కానీ, విజయవాడ అనే పేరే ఎక్కువగా వాడుకలో ఉంది కనుక అదే వాడాలి.
- ఒక్కోసారి రెండు పేర్లు కూడా బాగా వ్యాప్తిలో ఉండవచ్చు; ఆ సందర్భాల్లో ఏది వాడాలనే విషయమై సందిగ్ధత రావచ్చు. ఉదాహరణకు, నందమూరి తారక రామారావు విషయంలో, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు అనే రెండు పేర్లూ ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అప్పుడు ఒక పేరుతో పేజీ సృష్టించి, దానిని లక్ష్యంగా చేసుకుని రెండవ పేరుతో ఒక దారిమార్పు పేజీని సృష్టించాలి.
- పేర్ల చివర ఉండే సాంప్రదాయక/కుల సూచికలు: పేర్లకు చివర ఉండే రావు, రెడ్డి, శాస్త్రి, మాదిగ, నాయుడు, చౌదరి పేర్లను వ్యక్తి పేరుతో కలిపి రాయాలా లేక విడిగా రాయాలా అనే విషయమై కింది విధానం పాటించాలి.
- వ్యక్తి పేరు, కులసూచికను కలిపి రాయాలి, ఉదాహరణకు: రామారావు, సీతారామరాజు, చంద్రశేఖరశాస్త్రి, కృష్ణమాదిగ, రాజశేఖరరెడ్డి.
- ఇంటి పేర్లను ఎల్లప్పుడూ విడిగానే రాయాలి.
గమనిక: ఏ పేరు వాడాలనే విషయంలో సందిగ్ధత ఉంటే ఒకపేరుతో పేజీ సృష్టించి, రెండో దానితో దారిమార్పు పేజీని సృష్టించండి.
- పొడి అక్షరాలు రాసేటపుడు ఇలా రాయాలి:
- ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి.)
గౌరవ వాచకాలు
వ్యక్తుల గురించి రాసేటపుడు, శ్రీ, గారు వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. వచ్చారు, అన్నారు, చెప్పారు వంటి పదాలను కాక వచ్చాడు, అన్నాడు, చెప్పాడు అని రాయాలి.
సముదాయం నిర్ణయాలు
తెవికీ సముదాయం శైలికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి నిరణయాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఆయా నిర్ణయాలను ఇక్కడ చేరుస్తూ ఉంటాం. కొన్న్ని నిర్ణయాలు ఇక్కడ:
తేదీ ఆకృతి
తేదీ ఆకృతి తెలుగు భాషకు సహజమైన yyyy month dd రూపంలో రాయాలి. ఉదాహరణకు, 1980 మే 12 ఐ రాయాలి. ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చను చూడండి.
నెలల పేర్లు
ఇంగ్లీషు నెలల పేర్లను తెలుగు సహజమైన అజంత రూపంలో రాయాలి. ఏప్రిల్ జూన్ నెలలు దీనికి మినహాయింపు. నెలల పేర్లు ఇలా ఉండాలి: జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చను చూడండి.
కిలోమీటర్లు పొట్టి పదం
కిలోమీటర్లు వంటి కొలమానాల పొట్టి పదాలను కింది విధంగా రాయాలి కిలోమీటర్లు: కి.మీ. మీటర్లు: మీ. లీటర్లు: లీ. మిల్లీ లీటర్లు:మి.లీ. మిల్లీ మీటర్లు: మి.మీ.
గమనిక: పొట్టిపదాల్లో చుక్కలున్నాయి. చుక్క ముందు, తరవాతా కూడా స్పేసు ఇవ్వలేదు. ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చను చూడండి.
విభాగాలు, శీర్షికలు
ప్రధాన వ్యాసం: శైలి మాన్యువల్
విభాగాల శీర్షికల కొరకు ==
వాడండి, '''
(బొద్దు) వాడవద్దు. ఉదాహరణ:
==ఇది విభాగం శీర్షిక==
ఈ వాక్యం ఇలా కనపడుతుంది..
- ఇది విభాగం శీర్షిక
శీర్షికలను ఇలా పెడితే, విషయ సూచిక ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. అభిరుచులలో నిశ్చయించుకోవడం ద్వారా విభాగాలకు సంఖ్యలు వచ్చే విధంగా చేసుకోవచ్చు. శీర్షికల వలన వ్యాసాన్ని చదవడం తేలికగా ఉంటుంది.
- శీర్షికలలో లింకులు పెట్టవద్దు.
- మరీ ఎక్కువగా ఉప శీర్షికలు పెట్టవద్దు.
ఇటాలిక్స్
ఈ విధంగా రాయాలి: ''
. ఉదాహరణ:
''ఇది ఇటాలిక్.''
ఇది ఇలా కనిపిస్తుంది
- ఇది ఇటాలిక్.
కొన్ని పదాలను నొక్కి చెప్పేందుకు ఇటాలిక్స్ ను వాడతాము. ఈ కింది సందర్భాలలో కూడా వీటిని వాడవచ్చు.
శీర్షిక పేరు
కింది వాటి పేర్లకు ఇటాలిక్స్ ను వాడాలి:
- బాక్టీరియా, జెనస్-స్పీసీస్ గా రాసినపుడు. ఉదాహరణకు: బాసిల్లస్ సబ్‌టైలిస్
- పుస్తకాలు
- కంప్యూటరు, వీడియో గేములు
- కోర్టు కేసులు
- సినిమాలు
- పద్యాలు
- సంగీత అల్బములు
- రైలు బళ్ళు
- సంగీత పదాలు
- వార్తా పత్రికలు, ఇతర పత్రికలు
- నాటకాలు
- ఓడలు
- టెలివిజను ధారావాహికలు
- కళా రూపాలు
సాధారణంగా పెద్ద వాటికి ఇటాలిక్స్ ను వాడతారు. చిన్న వాటికి డబల్ కొటేషను గుర్తులు వాడాలి. ఉదాహరణకు:
- వ్యాసాలు
- పుస్తకం లోని అధ్యాయాలు
- టెలివిజను ధారావాహిక లోని ఒక భాగం
- చిన్న పద్యాలు
- చిన్న కథలు
- పాటలు
కొన్ని సందర్భాలలో పేర్లు ఇటాలిక్స్ లో గాని, డబల్ కొటేషను గుర్తుల్లో గాని ఉండకూడదు. అవి:
- పురాతన శాసనాలు
- చట్టపరమైన, రాజ్యాంగ పరమైన దస్తావేజులు
పదాల్లాగా పదాలు
పదాల గురించి పదాల లాగా, అక్షరాల గురించి అక్షరాల లాగా రాస్తున్నపుడు ఇటాలిక్స్ వాడండి. ఉదాహరణకు:
- స్నానము చేసి అనే రెండు పదాలతో కూడిన క్రియను ఒకే పదంగా - స్నానించి అని ప్రయోగించాడు, వడ్డెర చండీదాస్.
- ౠ అక్షరం యొక్క ఉపయోగం క్రమేణా తగ్గిపోతున్నది.
అరువు పదాలు
ఇతర భాషల నుండి తెలుగు లోకి తెచ్చిన పదాలను ఇటాలిక్స్ లో రాయాలి. అయితే తెలుగులో ఒదిగిపోయిన రైలు వంటి పదాలకు ఇటాలిక్స్ వాడరాదు. ఇటాలిక్స్ అనే పదాన్ని గమనించండి, ఇది ప్రతిచోటా ఇటాలిక్స్ లోనే ఉంది. ఆది అరువు పదం కనుక అలా ఉంది. గొప్ప వ్యాసం రాయడం ఎలా ప్రకారం, ఇతర భాషా పదాలు అరుదుగా, వేరే పదం లేనప్పుడు మాత్రమే వాడాలి.
సూక్తులు, సుభాషితాలు, ఉటంకింపులు, ఉదహరింపులు
వ్యాఖ్యలను ఉదహరించేటపుడు ఇటాలిక్స్ వాడవలసిన పని లేదు, ఆ వాక్యాలకు ప్రత్యేకంగా అవసరమైతే తప్ప.
వ్యాకరణ చిహ్నాలు
మామూలుగా వ్యాకరణ చిహ్నాలను ఎలా వాడుతామో అలాగే వాడండి.
కొటేషను గుర్తులు
సాధారణంగా డబల్ కొటేషను గుర్తులను వాడండి—చదివేటపుడు సులభంగా ఉంటుంది. — కొటేషన్ల లోపల కొటేషన్లు అవసరమైనపుడు సింగిలు కొటేషను గుర్తులను వాడండి.
గమనిక: ఏదైనా పదం 'ఇలా' సింగిలు కొటేషను గుర్తుల్లో ఉంటే, అన్వేషణ జరిపేటపుడు సింగిలు కొటేషను గుర్తులను కూడా ఆ పదంలో భాగంగానే గుర్తిస్తుంది. అన్వేషణలో పదంతో పాటు కొటేషన్లను కూడా ఇస్తేనే, ఆ పదాన్ని పట్టుకుంటుంది. డబల్ కోట్లను వాడటానికి ఇది మరో కారణం, ఎందుకంటే, దాని విషయంలో ఈ ఇబ్బంది రాదు.
ఇతరత్రా..
ఈ పేజీలో మీకు అవసరమైనది దొరక్కపోతే
ఈ పేజీలో శైలికి సంబంధించి మీకు అవసరమైన సమాచారం దొరక్కపోతే, మీకు నచ్చిన వ్యాసం ఒకదానికి వెళ్ళి, దాని మార్చు పేజీకి వెళ్ళండి. ఆక్కడ రచయితల శైలి ఎలా ఉందో చూడండి. తరువాత పేజీని భద్రపరచకుండా వదిలేయండి. దాదాపు ప్రతీ వ్యాసాన్ని కూడా మెరుగుపరచవచ్చు.
అతిగా అలంకరణ కూడదు
మీ వ్యాసంలో మరీ ఎక్కువ మార్కప్ లను వాడకుండా ఉంటే మీకు, వ్యాసం చదివేవారికి కూడా సులభంగా ఉంటుంది. మీరు వ్యాసంలో పెట్టిన మార్కప్ అంతా వ్యాసంలో కనపడుతుందని అనుకోకండి. మార్కప్ లను అవసరమైన మేరకే - వ్యాసాన్ని సులభంగా చదవటానికి అవసరమైనంత వరకే - వాడండి. అతిగా వాడి, క్లిష్టతరం చెయ్యవద్దు. HTML, CSS మార్కప్ లను తక్కువగా వాడండి. విజ్ఞాన సర్వస్వం ఉపయోగకరంగా ఉండాలనేది మొదటి లక్ష్యమైతే, దానిలో దిద్దుబాట్లు చెయ్యడం సులభంగా ఉండటమనేది మరో ముఖ్య లక్ష్యం.
మరీ నిర్దుష్టంగా, float
లేదా line-height
లను వాడితే కొన్ని బ్రౌజర్లు సరిగా చూపించవు.
వ్యాఖ్యానాలను కనపడనీయకండి
వ్యాసం అసంపూర్తిగా ఉందనీ, మరింత పని జరగాల్సి ఉందనీ ఎత్తి చూపకండి. అసలు విషయం లేకుండా, ఉత్త శీర్షికలతో పాఠకుడికి ఉపయోగమేమీ ఉండదు.
మామూలు పాఠకుడికి కాకుండా, దిద్దుబాట్లు చేసే సభ్యులకు ఏమైనా సందేశం ఇవ్వదలిస్తే, ఆ సందేశాన్ని కింది గుర్తుల మధ్య పెడితే సరిపోతుంది.
<!--
మరియు -->
.
ఉదాహరణకు:
హలో <!-- ఇదొక వ్యాఖ్య. --> లోకం
ఇలా కనిపిస్తుంది:
- హలో లోకం
వ్యాఖ్య, దిద్దుబాటు చేసే వారికి మాత్రమే కనిపిస్తుంది.
సంబోధన కూడదు
విజ్ఞాన సర్వస్వంలోని వ్యాసాల్లో మిమ్మల్ని గాని, పాఠకుడిని గాని మీరు సంబోధించరాదు. అంటే - నేను, మేము, మీరు, మనం వంటి పదాలు రాకూడదు. ఉదాహరణకు నేను అనుకునేదాని ప్రకారం.., దాన్ని మనం ఇలా అర్ధం చేసుకోవచ్చు.. వంటి వాక్యాలు రాయకూడదు.
ఇంకా చూడండి
- Style guide, the Wikipedia entry on "style guides". Contains links to the online style guides of some magazines and newspapers.
- వికీపీడియా:Annotated article - the article contains annotations that show how it should be edited preferentially.
- వికీపీడియా:Avoiding common mistakes gives a list of common mistakes and how to avoid them.
- వికీపీడియా:Be bold in updating pages should define your attitude toward page updates.
- వికీపీడియా:Cite sources explains process and standards for citing references in articles.
- వికీపీడియా:దిద్దుబాటు విధానం has even more editing guidelines.
- వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి is a short primer on editing pages.
- వికీపీడియా:పరిచయము is a gentle introduction to the world of Wikipedia.
- వికీపీడియా:Perfect stub article shows what you should aim for at a minimum when starting a new article.
- వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు - విధానాలు మార్గదర్శకాల కోసం.
- Wiki markup explains the mechanics of what codes are available to you when editing a page, to do things like titles, links, external links, and so on.
- వికీపీడియా:వికీప్రాజెక్టు sets out boilerplates for certain areas of knowledge.
- Meta:Reading level (discussion)