స్వాతి కిరణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కు → కు (4), గా → గా (3), తో → తో (2), గాయిని → గాయని, using AWB
చి వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 99: పంక్తి 99:
* {{imdb title|id=0250012|tiltle=స్వాతి కిరణం}}
* {{imdb title|id=0250012|tiltle=స్వాతి కిరణం}}
* [http://www.raaga.com/channels/telugu/movie/A0000059.html రాగా.కాంలో స్వాతి కిరణం పాటలు వినండి.]
* [http://www.raaga.com/channels/telugu/movie/A0000059.html రాగా.కాంలో స్వాతి కిరణం పాటలు వినండి.]

[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]]


[[en:Swati Kiranam]]
[[en:Swati Kiranam]]

10:34, 23 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

స్వాతి కిరణం
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాధ్
నిర్మాణం వి మధుసుదన రావు
కథ కె. విశ్వనాథ్
చిత్రానువాదం కె. విశ్వనాథ్
తారాగణం మమ్మూట్టి ,
రాధిక,
మంజునాథ్
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన వెన్నెలకంటి,
సిరివెన్నెల సీతారామశాస్త్రి
సి. నారాయణ రెడ్డి
సంభాషణలు జంధ్యాల
నిర్మాణ సంస్థ స్వాతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన వాడు గురువు. తల్లిదండ్రులను గురువును దైవంగా భావించాలి. ఇది మన సాంప్రదాయం. శిష్యులకు మార్గదర్శకుడు గురువు. తాము చూపిన మార్గంలో ప్రజ్ఞాపాటావాలలో తమను అధిగమిస్తే గురువుకు అంత కంటే గర్వకారణం ఇంకేముంది..ప్రతిభ ఒకరి స్వంతం కాదు.. ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని ప్రోత్సహించాలి..దానికి పదును పెట్టాలి..కొత్తతరానికి పాత తరం దారి చూపాలి..దారి ఇవ్వాలి.. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో గొప్పతనం ఉంది.. కానీ శిష్యుల ఉన్నతిని కోరని గురువులు, తమని మించి పోతారనే భావనతో శిష్యుల భవిష్యత్తును సమాధి చేస్తారు.. శిష్యుల ప్రజ్ఞను తమ ప్రగతికి సోపానంగా మార్చుకునే గురువులూ ఉన్నారు.. వారు ఏకలవ్యుని బొటన వ్రేలుని గురుదక్షిణ కోరిన ద్రోణుడికి ప్రతి రూపాలు.. ఆ కోవకి చెందిన సంగీత విద్వాంసుడు అనంత రామశర్మ.. బాల మేధావి గంగాధరం..గంగాధరాన్ని మాతృభావంతో చేరదీసే అనంతరామశర్మ భార్య.. వీరి మధ్యనడచిన కథ స్వాతికిరణం.

చిత్రకథ

దేశాలు పట్టి తిరుగుతూ ఉంటే ఒక దేశదిమ్మరి (మమ్ముట్టి) ని పిల్లలను పట్టుకు పోయేవాడని భ్రమించిన పల్లె వాసులు అతణ్ని పోలీస్ స్టేషన్లో అప్పజెబుతారు..అక్కడ సబ్ ఇన్సపెక్టర్ (అచ్యుత్) దేశదిమ్మరిని అనంత రామశర్మగా పోలుస్తాడు.

గతంలోకి వెళితే అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న బాల సంగీత విద్వాంసుడు గంగాధరం (మాస్టర్ మంజునాధ్). అతని తల్లి దండ్రులు (ధర్మవరపు సుబ్రహ్మణ్యం, డబ్బింగ్ జానకి) ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ ఉంటారు. పక్షితీర్ధం మామ్మ (జయంతి) గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు గంగాధరం. స్థానిక దేవాలయంలో ఉత్సవాలకు వచ్చిన అనంత రామశర్మకు ఆధిత్యం ఇచ్చే అవకాశం వస్తుంది పక్షితీర్ధం మామ్మగారికి. గంగాధరం ప్రతిభ గమనించిన పక్షితీర్ధం మామ్మగారు గంగాధారాన్ని అనంత రామశర్మకి శిష్యునిగా చేద్దామను కుంటుంది. కానీ బాల చాపల్యంతో, దేవాలయంలో అనంత రామాశర్మగారు మంత్రపుష్పాన్ని చదివిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష సూక్తాన్ని ఆకతాయి తనంతో పాడతాడు. ఆగ్రహిస్తాడు అనంత రామశర్మ. గణపతి సచ్చినాంద స్వాముల వారు వారి ఆశ్రమంలో ఉన్న సరస్వతీ స్తోత్రాలను స్వర పరిచే అవకాశం అనంత రామశర్మకు దక్కుతుంది. ఇంతలో కాలేజిలో జరిగే ఆడిషన్ కి గంగాధరాన్ని తీసుకు వస్తారు పక్షితీర్ధం మామ్మగారు. ఆ సందర్భంగా అనంత రామశర్మ ఇంటికి వచ్చిన గంగాధరం, అనంత రామశర్మ స్వర పరచిన పాట వింటాడు. కాలేజిలో ఆడషన్ లో మరో స్వరంతో అదే పాట వినిపిస్తాడు. అనంత రామశర్మ గంగాధరం దరఖాస్తుని తిరస్కరిస్తాడు. అనంత రామశర్మ నిస్సంతు. అతని భార్య (రాధిక) గంగాధరాన్ని తమ వద్ద ఉంచుకుందామంటుంది. గంగాధరం ప్రతిభకు లోకమంతా నీరాజనం పట్టినా అనంత రామశర్మ గంగాధరానికి ఇంకా శిక్షణ కావాలంటూ ఉంటాడు. అనంత రామశర్మ వలన కాని స్వర రచనను గంగాధరం ప్రయత్నిస్తాడు. ఆ స్వరరచన ఆమోదయోగ్యంగా లేదంటునే ఆ స్వరాలను భద్రపరచుకుంటాడు. తనని అధిగమిస్తాడనే అభద్రతా భావంతో రగిలి పోతున్నాడని పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ గా సెలక్టై ట్రైనింగ్ అవుతున్న పక్షితీర్ధం మామ్మగారి మేనల్లుడు గ్రహిస్తాడు. అనంత రామశర్మ అసూయతో గంగాధరం మరణానికి కారణ భూతమవుతాడు.ఈ సంఘటనతో అనంత రామశర్మ భార్యకు మతి భ్రమిస్తుంది.

అనంత రామశర్మను పక్షితీర్ధం మామ్మగారి ఇంటి దగ్గర దించిన తరువాత అతనికి స్వస్థత చేకూరుతుంది. కోలుకున్న అనంత రామశర్మ భార్య గంగాధరం పేరు మీద సంగీత అకాడమీ స్థాపిస్తుంది. భార్య సంగీతం నేర్పుతూ ఉంటే తరగతిలో శిష్యులలో కూర్చొంటాడు అనంత రామశర్మ. పాఠాన్ని సాధన చేస్తూ ఉన్న అనంత రామశర్మను శృతి సరి చేసుకోమంటుంది సంగీతం నేర్చుకుంటున్న బాలిక. దానితో సినిమా ముగుస్తుంది.

చిత్రవిశేషాలు

ఏ విధంగా చూసినా ఇది చాలా గొప్ప సినిమా..తెలుగు సినిమా లలోనే కాదు యావత్తూ సినిమాలను ఎంతగా కాచి వడపోసి ఆణిముత్యాలని ఏ కొద్ది పాటి సినిమాలను ఏరినా ఈ సినిమాకు స్ధానం దక్కాలి..ఏదో దురభిమానంతోనో లేదా ఇతర సంకుచితిత్వంతోనో చెప్పడం కాదు. కథాంశం, పాత్రల రూపకల్పన, నటీనటుల అద్వీతయ నటన, మధురాతి మధురమైన పాటలు అన్నీ అంత గొప్పగా సమకూరేయి.. అనంత రామశర్మగా ముమ్ముటి, అతని భార్యగా రాధిక, గంగాధరంగా మాస్టర్ మంజునాధ్ పాత్రలలో ఇమిడి పోయేరు.. పక్షితీర్ధం మామ్మగారిగా జయంతి, గంగాధరం తండ్రిగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తల్లిగా జానకి, పక్షితీర్ధ మామ్మగారి మేనల్లుడిగా అచ్యుత్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.. ఆనతి నీయరా హరా పాటకు రాధిక, మమ్ముటి ఆహబావాలు చెప్పనలవి కావు.. అనంత రామశర్మను శివునిగా, అతని భార్యను పార్వతిగా, గంగాధరాన్ని బాలగణపతిగా పోల్చి రూపకాలంకారంతో జాలిగా జాబిలమ్మ పాట రచించిన తీరు, స్వరకల్పన, చిత్రీకరణ, నటీనటుల నటన అన్నీ అద్వీతయం. కె.వి.మహదేవన్ స్వర రచన మహోన్నతం.. ఆనతి నీయరా పాటకు వాణీ జయరాంకు జాతీయ స్ధాయిలో ఉత్తమ గాయనిగా ఎన్నికైంది..ఇంత గొప్ప చిత్రానికికళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకులు, కథా రచయిత.. ఆయన కీర్తికిరీటంలో ఈ సినిమా కలికితురాయి..మరొక విశేషం ఈ చిత్రంలో గణపతి సచ్చిదానందస్వామి దర్శనమిస్తారు.

యాంటీ సెంటిమెంట్

బలమైన పతాక సన్నివేశం కోసం కథ ముగింపు ఈ విధంగా చేసి ఉంటారు కానీ, గంగాధరం మరణం ప్రేకక్షులకు ఏ మాత్రం నచ్చలేదు..యాంటీ సెంటిమెంటయ్యింది..దానితో ప్రజాదరణ పొందలేదు.. చిత్రంలో కనిపించే గణపతి సచ్చిదానాంద స్వామి ద్వారా అనంత రామశర్మలో పరివర్తన తీసుకు వచ్చినట్లు కథ మార్చి ఉంటే ప్రజల ఆమోదం పొంది ఉండేదా.. ఏమో.. ఏమైనా, ఎంతో గుర్తింపు, ఎన్నో అవార్డులు రావలసిన సినిమా..కావలిసినంత గుర్తింపు దక్కకపోడవడం నిస్సంశయంగా నిరాశ పరిచే విషయం..శంకరాభరణం సినిమా లాగా మోత మోగ లేదు.. మబ్బుల చాటు సూర్య బింబమై పోయింది..కనీసం, ఈ చిత్రానికి జాతీయ స్ధాయిలో ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు దక్కక పోవడం సోచనీయం..

పాటలు

All music is composed by కె.వి.మహదేవన్.

పాటలు
సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."ఆనతినీయరా హరా"సిరివెన్నెలవాణీ జయరాం 
2."ఓం గురు" (శ్లోకం)   
3."కొండా కోనల్లో లోయల్లో"వెన్నెలకంటివాణీ జయరాం 
4."జాలిగా జాబిలమ్మ"సిరివెన్నెలవాణీ జయరాం 
5."తెలి మంచు కురిసిందీ"సిరివెన్నెలవాణీ జయరాం 
6."ప్రణతి ప్రణతి"సి.నా.రెఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 
7."ప్రణతి ప్రణతి"సి.నా.రెవాణీ జయరాం 
8."వైష్ణవి భార్గవి"సిరివెన్నెలవాణీ జయరాం 
9."శివానీ భవనీ"సిరివెన్నెలఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 
10."శివానీ భవనీ"సిరివెన్నెలవాణీ జయరాం 
11."శృతి నీవు గతి నీవు"సి.నా.రెవాణీ జయరాం 
12."సంగీత సాహిత్య సమలంకృతే"సి.నా.రెఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 

పురస్కారాలు

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1992 వాణీ జయరాం ("ఆనతినీయర హార" గానమునకు) జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయని గెలుపు

బయటి లింకులు