దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం (3), రూ. → రు., బోదన → బోధన using AWB
చి తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచార పెట్టె దక్షిణ భారతము}}
{{సమాచార పెట్టె దక్షిణ భారతము}}
'''దక్షిణ భారతదేశము''' దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]], [[కర్నాటక]] మరియు [[కేరళ]] రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు [[పాండిచ్చేరి]] (పుదుచ్చేరి)ల సముదాయము (లక్ష దీవులు, అండమాన్ నికోబార్ దీవులు చాలా దూరముగా ఉన్నవి). భారత [[ద్వీపకల్పము]]లో [[వింధ్య పర్వతము]]లకు దక్షిణమున ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశము. ఉత్తరమున [[నర్మదా నది]], [[మహానది]] పడమటన [[అరేబియా సముద్రము]], దక్షిణమున [[హిందూ మహాసముద్రము]], తూర్పున [[బంగాళాఖాతము]] ఉన్నాయి. దక్షిణాన చివరి స్థానం [[కన్యాకుమారి]]. ఇరువైపులా ఉన్న [[తూర్పు కనుమలు]], [[పడమటి కనుమలు]] మధ్య [[దక్కన్ పీఠభూమి]]లతో దక్షిణ భారతదేశము భౌగోళికంగా కూడా వైవిధ్యము ఉంది. [[తుంగభద్ర]], [[కావేరి (నది)|కావేరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[గోదావరి]] ఇచ్చటి ముఖ్యనదులు.
'''దక్షిణ భారతదేశము''' దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]], [[కర్నాటక]] మరియు [[కేరళ]] రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు [[పాండిచ్చేరి]] (పుదుచ్చేరి)ల సముదాయము (లక్ష దీవులు, అండమాన్ నికోబార్ దీవులు చాలా దూరముగా ఉన్నవి). భారత [[ద్వీపకల్పము]]లో [[వింధ్య పర్వతము]]లకు దక్షిణమున ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశము. ఉత్తరమున [[నర్మదా నది]], [[మహానది]] పడమటన [[అరేబియా సముద్రము]], దక్షిణమున [[హిందూ మహాసముద్రము]], తూర్పున [[బంగాళాఖాతము]] ఉన్నాయి. దక్షిణాన చివరి స్థానం [[కన్యాకుమారి]]. ఇరువైపులా ఉన్న [[తూర్పు కనుమలు]], [[పడమటి కనుమలు]] మధ్య [[దక్కన్ పీఠభూమి]]లతో దక్షిణ భారతదేశము భౌగోళికంగా కూడా వైవిధ్యము ఉంది. [[తుంగభద్ర]], [[కావేరి (నది)|కావేరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[గోదావరి]] ఇచ్చటి ముఖ్యనదులు.


== ఉపోద్ఘాతం ==
== ఉపోద్ఘాతం ==

01:10, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

దక్షిణ భారతదేశము

పెచిపరై డ్యామ్ కన్యాకుమారి యొక్క సుందర దృశ్యం.
పెచిపరై డ్యామ్ కన్యాకుమారి యొక్క సుందర దృశ్యం.
పెచిపరై డ్యామ్ కన్యాకుమారి యొక్క సుందర దృశ్యం.

దక్షిణ భారతదేశ రాజకీయపటము

Thumbnail map of India with South India highlighted
టైంజోన్ IST (UTC+5:30)
వైశాల్యం 635,780 km² 
రాష్ట్రాలు, ప్రాంతాలు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, లక్షద్వీపాలు*
అత్యధిక జనావాస ప్రాంతాలు (2008) బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాదు, మధురై, విశాఖపట్నం
అధికార భాషలు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, ఉర్దూ, ఆంగ్లము, ఫ్రెంచి
జనాభా 233,000,000
జనసాంద్రత 337/km²
జనన రేటు 20.4
మరణ రేటు 7.7
శిశుమరణ రేటు 48.4
Non-numbered Footnotes:

దక్షిణ భారతదేశము దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక మరియు కేరళ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు పాండిచ్చేరి (పుదుచ్చేరి)ల సముదాయము (లక్ష దీవులు, అండమాన్ నికోబార్ దీవులు చాలా దూరముగా ఉన్నవి). భారత ద్వీపకల్పములో వింధ్య పర్వతములకు దక్షిణమున ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశము. ఉత్తరమున నర్మదా నది, మహానది పడమటన అరేబియా సముద్రము, దక్షిణమున హిందూ మహాసముద్రము, తూర్పున బంగాళాఖాతము ఉన్నాయి. దక్షిణాన చివరి స్థానం కన్యాకుమారి. ఇరువైపులా ఉన్న తూర్పు కనుమలు, పడమటి కనుమలు మధ్య దక్కన్ పీఠభూమిలతో దక్షిణ భారతదేశము భౌగోళికంగా కూడా వైవిధ్యము ఉంది. తుంగభద్ర, కావేరి, కృష్ణ మరియు గోదావరి ఇచ్చటి ముఖ్యనదులు.

ఉపోద్ఘాతం

దక్షిణ భారతీయులు ముఖ్యంగా ద్రవిడ భాషలు మాట్లాడెదరు అనగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.కానీ కొన్నిచోట్ల కొంకణి, తుళు వంటి భాషలు కూడా మట్లాడెదరు. దక్షిణ భారతాన్ని ఎందరో రాజులు పరిపాలించారు. అందులో ముఖ్యులు శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, చోళులు, పాండ్యులు, చేరులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయసల మరియు విజయనగర రాజులు. దక్షిణ భారత రాజవంశాలు శ్రీలంక మరియు శ్రీవిజయలను జయించడం వలన ఇప్పటికీ దక్షిణ భారత సాంస్కృతిక ప్రభావం వారి జీవన విధానాలలో కనిపిస్తుంది.

ఇచట వ్యవసాయం ప్రధాన వృత్తి. మొత్తం స్థూల ఉత్పత్తిలో వ్యవసాయానిదే మొదటి స్థానం. సాఫ్టువేరు రంగం ఇచట చాలా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని సాఫ్టువేరు ఉత్పత్తిలో అధికశాతం దక్షిణ భారతదేశంలోని నగరాలలోనే తయారవుతోంది. చలన చిత్ర రంగంలో కూడా దక్షిణాది తనదైన ప్రత్యేకతతో ప్రపంచం లోని వివిధ దేశాల ప్రజలను అలరిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు దేశంలోని మిగిలిన ప్రజలకన్నా విద్యారంగంలో ముందుండి అత్యధిక తలసరి ఆదాయం కలిగియున్నారు. ఇచటి విద్యారంగం మరియు వ్యవసాయం రెండు వేల సంవత్సరాలుగా తన వైశిష్ట్యాన్ని, ప్రత్యేకతను చూపుతున్నాయి. ఇచటి రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం అధికం.

దక్షిణ భారతానికి ఆంగ్లంలో ఉన్న సౌత్ ఇండియా (South India) అనే కాక సంస్కృత పదం దక్షిణం వలన డెక్కన్ (Deccan) అని కూడా పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం డెక్కన్ అన్న పదం దక్కను పీఠభూమికి మాత్రమే పరిమితమైంది. కర్ణాటక (Carnatic) అను పదం "కరునాడు" అనగా నల్లని దేశం అన్న పదం నుండి పుట్టింది. ద్రవిడనాడు అనునది దక్షిణ భారతానికి ఉన్న మరొక పేరు. అలాగే వివిధ రాష్టాలలోని ప్రజలను వారి వారి భాషను బట్టి కూడా పిలుస్తారు. ఉదాహరణకు తెలుగు మాట్లాడు వారిని ఆంధ్రులు అని, మలయాళం మాట్లాడువారిని మలయాళీలు అని పిలుస్తారు.

చరిత్ర

చోళ, చేర మరియు పాండ్య రాజ్యాలు.
క్రీ.శ.640లో రెండవ పులకేశి పాలనలో చాళుక్య రాజ్యము
క్రీ.శ.1014లో చోళ సామ్రాజ్యము
1909లో మద్రాసు ప్రెసిడెన్సీ, మైసూరు రాజ్యము మరియు ట్రావెన్కూర్ రాజ్యము

కొత్తరాతియుగమునకు సంబంధించిన కొన్ని శిలలపై కార్బన్ డేటింగ్ ద్వారా దక్షిణ భారతదేశపు ఉనికిని క్రీస్తుపూర్వం 8000కి చెందినదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. రాతి ఆయుధాలు, మరియు కొన్ని రాగి పాత్రలు ఈ ప్రాంతమునందు లభించాయి. క్రీస్తు పూర్వం 1000 నాటికి ఇనుప యుగం ఈ ప్రాంతంలో ప్రాబల్యం పొందినది. అయినా ఈ ఇనుప యుగానికి ముందు బాగా అభివృద్ధి చెందిన ఇత్తడి యుగం ప్రాచుర్యం పొందినట్లు ఆధారాలు లేవు [1]. దక్షిణ భారతదేశం మధ్యధరా ప్రాంతాన్ని మరియు తూర్పు ప్రాంతాన్ని కలిపే కూడలి వంటిది. కార్వార్ నుంచి కొడంగళూర్ వరకు గల దక్షిణ తీర ప్రాంతం ప్రాంతీయులకు మరియు విదేశీ వ్యాపారస్థులకు ప్రధానమైన వాణిజ్య కూడలిగా ఉండేది[2]. మలబార్ ప్రాంతం వారు మరియు సంగం ప్రాంతానికి చెందిన తమిళులు గ్రీకులు, రోమన్లు, అరబ్బులు, సిరియన్లు, చైనీయులు, యూదులు మొదలైన వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. వీరికి ఫోయనీషియన్లతో కూడా సంపర్కముండేది[3]. దక్షిణ భారతదేశాన్ని పేరెన్నికగన్న అనేక మంది రాజులు మరియు వంశాలు పరిపాలించాయి. అమరావతిని రాజధానిగా పాలించిన శాతవాహనులు, బనవాసి కదంబులు, పశ్చిమ గంగ వంశము, బాదామి చాళుక్యులు, చేర వంశము, చోళులు, హోయసాలులు, కాకతీయ వంశపు రాజులు, పల్లవులు, పాండ్యులు, మణ్యకేతమునకు చెందిన రాష్ట్ర కూటులు మొదలైన చాలామంది రాజులు పరిపాలించారు. మధ్య యుగం నాటికి దక్షిణ భారతంలో మహమ్మదీయుల పెత్తనం పెరిగింది. 1323లో ఢిల్లీ సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ సేనలు ఓరుగల్లును పరిపాలిస్తున్న కాకతీయులను ఓడించడంతో చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. గుల్బర్గాకు (తరువాతి కాలంలో బీదర్కు మార్పు) చెందిన బహమనీ సామ్రాజ్యం, మరియు విజయనగర సామ్రాజ్యానికి (ఇప్పటి హంపి) చెందిన రాజులకు జరిగిన ఆధిపత్య పోరాటాలు చరిత్రలో చెప్పుకోదగ్గవి. విజయనగర రాజుల పతనం మరియు బహమనీ సుల్తానుల చీలిక వల్ల హైదరాబాదు, గోల్కొండకు చెందిన కుతుబ్ షాహి వంశస్తులు ప్రధాన రాజులయ్యారు. ఔరంగజేబు నాయకత్వంలోని మొఘాలాయి సేనలు దక్షిణ ప్రాంతాన్ని ముట్టడించేవరకు (7వ శతాబ్దం మధ్యవరకూ) వీరి ఆధిపత్యం కొనసాగింది. అయితే ఔరంగజేబు మరణం తర్వాత మొఘలాయిల ఆధిపత్యం సన్నగిల్లింది. దక్షిణ భారతదేశపు రాజులు ఢీల్లీ నుంచి స్వయం ప్రతిపత్తిని సంపాదించుకున్నారు. మైసూరు సామ్రాజ్యానికి చెందిన ఒడయార్లు, హైదరాబాదుకు చెందిన ఆసఫ్ జాహీలు, మరాఠీలు అధికారాన్ని పొందగలిగారు.

పద్దెనిమిదవ శతాబ్దం మధ్య భాగంలో అటు ఆంగ్లేయులు, ఇటు ఫ్రెంచి వారు దక్షిణ భారతదేశము యొక్క సైనికాధికారానికి దీర్ఘకాలిక పోరు సాగించారు. యూరోపియన్ సైన్యాలకు కొన్ని ప్రాంతీయ శక్తులకు ఏర్పడిన సంబంధాల వలన, అన్ని పక్షాలచే ఏర్పాటు చేయబడ్డ కిరాయి సైన్యాలు దక్షిణ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాయి. ఆంగ్లేయులతో నాలుగు సార్లు జరిగిన మైసూరు యుద్ధం, మూడు సార్లు జరిగిన మరాఠా యుద్ధం వలన మైసూరు, పూణె, హైదరాబాద్ వంటి నగరాలు కొన్ని బ్రిటిష్ వారితోనూ, కొన్ని ఫ్రెంచి వారితోనూ సంబంధం కుదుర్చుకొన్నాయి. బ్రిటిష్ వారి పరిపాలనలో దక్షిణ భారతదేశాన్ని, మద్రాసు ప్రెసిడెన్సీ, హైదరాబాదు, మైసూరు, తిరువిత్తంకూర్ ('ట్రావెంకూర్' అని కూడా వ్యవహరిస్తారు), 'కొచి' (కొచ్చిన్ లేదా పెరంపదపు స్వరూపం), విజయనగరం మరియు ఇతర చిన్న చిన్న రాజ్యాలుగా విభజించారు. రాజుల కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆంగ్ల పరిపాలకులు కొన్ని ముఖ్యమైన రాష్ట్ర రాజధానులలో నివాసం ఉండేవారు.

స్వాతంత్ర్యానంతరం చాలావరకు దక్షిణ భారతదేశం మద్రాసు రాష్ట్రంలో ఉండేది. మద్రాసు రాష్ట్రంలో మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతం, బనగానపల్లి, పుదుకోట్టై, సందూరు మొదలైన ప్రాంతాలు కలిసి ఉండేవి. 1953, అక్టోబరు 1న, మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రధానంగా మాట్లాడే ఉత్తర ప్రాంత జిల్లాల పోరాటం మూలంగా భారతదేశంలో మొట్ట మొదటి సారిగా భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. నెల్లూరు జిల్లాకు చెందిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ కావించారు. ఆ తరువాత 1956లో వచ్చిన రాష్ట్రాల పునర్విభజన చట్టం క్రింద భాషా ప్రాతిపదికన అనేక భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తరువాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా పేరు మార్చారు. మలయాళం మాట్లాడే వారి కోసం ప్రత్యేక కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 1956 తరువాత తమిళులు అధికంగా నివసించే ప్రాంతం కాబట్టి మద్రాసు రాష్ట్రం 1968లో తమిళనాడుగా రూపాంతరం చెందింది. 1972లో మైసూరు, కర్ణాటకగా మార్పు చెందింది. పోర్చుగీసు వారి స్థావరమైన గోవా 1961లో భారతదేశంలో కలపబడింది. 1987లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఇంకా ఫ్రెంచి వారి స్థావరాలైన ప్రాంతాలు 1950 నుంచి పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంగా పిలవబడుతున్నాయి.

భౌగోళిక స్వరూపం

2003, జనవరి 31న నాసా ఉపగ్రహము తీసిన దక్షిణ భారతదేశ ఛాయాచిత్రము.

దక్షిణ భారతం త్రికోణాకృతిలో ఉన్న ద్వీపకల్పం. ఎల్లలుగా తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం మరియు ఉత్తరాన వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి. సాంస్కృతిక పరంగా దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి నర్మదా మరియు మహానదులు ఎల్లలుగా ఉన్నాయి. నర్మద నది వింధ్య మరియు సాత్పుర పర్వత లోయల మధ్య పడమర దిశగా ప్రవహిస్తుంది. సాత్పుర పర్వతాలు డెక్కను పీఠభాగానికి ఉత్తరం వైపు ఎల్లగా వుంది. అలాగే పశ్చిమ కనుమలు (Western Ghats) మరొకవైపు ఎల్లలుగాను ఉన్నాయి. పశ్చిమకనుమలు మరియు అరేబియా సముద్రం మధ్య ప్రాంతాన్ని కొంకన్ అని నర్మదానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని గోవా అని అంటారు. పశ్చిమ కనుమలు దక్షిణం వైపు వ్యాపించి, కర్ణాటక తీరప్రాంతం వెంబడి మలనాడ్, కెనరా ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, తూర్పు దిశగా విస్తరించిన నీలగిరి పర్వతాలతో అంతమౌతాయి. నీలగిరినే ఊటి అని కూడా పిలుస్తారు. నీలగిరి అర్థచంద్రకారంలో ఉండి తమిళ నాడు,కేరళ, కర్ణాటక సరిహద్దుగా ఉన్న పాలక్కాడ్ మరియు వేనాడ్ కొండలు, ఇంకా సత్య మంగళం అడవులు, వీటి కంటే తక్కువ ఎత్తులో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గల తూర్పు కనుమలలోకి కూడా వ్యాపించి ఉన్నాయి. తిరుపతి మరియు అన్నామలై కొండలు కూడా ఈ పర్వత శ్రేణులకే చెందుతాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక భూభాగాన్ని కప్పి ఉండే దక్కన్ పీఠభూమి అన్నింటి కంటే ఎత్తైన భూతలం. దీనికి పైన పేర్కొన్న పర్వత శ్రేణులన్నీ కలిపి ఆంగ్లాక్షరం C ఆకారంలో సరిహద్దులు ఏర్పరుస్తున్నాయి. ఈ పీఠభూమికి తూర్పు వైపు ఏ సరిహద్దూ లేదు. పశ్చిమ కనుమల నుంచి ఎత్తు నెమ్మదిగా తగ్గుతూ తూర్పు తీరంలో కలిసిపోతుంది. గోదావరి మరియు కృష్ణ నదులు ఇక్కడ ముఖ్య నీటి వనరులు. ఇంకా పెన్నా మరియు కృష్ణా నదికి ముఖ్య ఉపనదియైన తుంగభద్ర ఇతర ప్రధాన నదులు.

కావేరి నది కర్ణాటకకు చెందిన కొడగు జిల్లాలోని పశ్చిమ లోయలయందు ఉద్భవించి దక్కన్ పీఠభూమి గుండా ప్రవహించి తమిళనాడు తూర్పు తీరాన మంచి సారవంతమైన మరియు విశాలమైన డెల్టా భూములను ఏర్పరుస్తుంది. దక్షిణ భారతదేశంలో ప్రధానమైన నదులైన కావేరి, గోదావరి మరియు కృష్ణ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇవి సస్యశ్యామలం చేసే ప్రాంతాన్ని అన్నపూర్ణ అని వ్యవహరిస్తారు. పశ్చిమాన అరేబియన్ సముద్రం వైపు ప్రవహించే నదుల్లో పెరియార్, నేత్రావతి, మాండోవి, తపతి మరియు నర్మద ముఖ్యమైనవి.

ప్రాంతాలు

దక్షిణ భారతంలోని 4 ముఖ్య రాష్టాలు భాషాపరమైన ప్రాంతీయ హద్దులు కలిగివున్నాయి. ప్రాంతీయ పరంగా హద్దులు ఉన్నప్పట్టికీ, సాంస్కృతికంగా లేక చారిత్రికంగా లిఖించబడని ప్రాంతాలు పలుచోట్ల కనిపిస్తాయి. ఉదాహరణకు:

తీర ప్రాంతం కంటే తక్కువ ఎత్తులో ఉండే లక్షదీవులుకు చెందిన పగడపు దీవులు, నైరుతీ తీరానికి దూరంగా ఉంటాయి. శ్రీలంక ఆగ్నేయ తీరం వైపుకు పాక్ జలసంధి మరియు రామ సేతు వంతెనతో భారతదేశం నుంచి వేరు చేయబడి ఉంది. అండమాన్ నికోబార్ దీవులు భారత తూర్పు తీరానికి దూరంగా బర్మా తీరమైన టెనాసెరీంకి దగ్గరగా ఉంటాయి. హిందూ మహాసముద్రం ఒడ్డున గల కన్యాకుమారి భారతదేశానికి దక్షిణం వైపు కొన భాగం.

ప్రకృతి (వృక్ష సంపద మరియు జంతు సంపద)

శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, తిరుమల, తిరుపతి

దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగం ఉష్ణ మండల ప్రాంతమే. సతత హరితారణ్యాలు, మరియు ఆకురాల్చు అడవులు పశ్చిమ లోయ ప్రాంతం పొడవునా కనిపిస్తాయి.

(Deccan Scrub Forests) ఉష్ణమండలపు పొడి అడవులు, నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌

దక్కన్ పీఠభూమిలో ఉష్ణమండలపు పొడి అడవులు (Tropical Dry Forests), దక్షిణ దక్కన్ పీఠభూమి ఆకురాలు అడవులు, దక్కన్ చిట్టడవులు అధికంగా కనుపిస్తాయి. పశ్చిమ కనుమలలోని ఎత్తైన ప్రాంతాలలో నైఋతి పడమటికనుమల వర్షారణ్యాలు ఉన్నాయి. మలబారు తీరపు చిత్తడి అడవులు తీరమైదానాలలో కనిపిస్తాయి.[4] పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికి ప్రధాన కేంద్రాలు.[5]

ప్రఖ్యాతి గాంచిన కొన్ని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు కొన్ని దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. పెరియార్ జాతీయ వనం, సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం, నాగార్జున సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మొదలైనవి పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్దాయి. రంగనతిట్టు పక్షుల సంరక్షణా కేంద్రం, కుమరకోమ్ పక్షుల సంరక్షణా కేంద్రం, నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం, పులికాట్ పక్షుల సంరక్షణా కేంద్రం మొదలైనవి పక్షుల సంరక్షణకై ఉద్దేశించినవి. ఇక్కడ మనం అనేక రకాలైన ప్రాంతీయ పక్షులను మరియు వలస పక్షులను సందర్శించవచ్చు.

పశ్చిమ కనుమలకు చెందిన అన్నామలై కొండలు, నీలగిరి కొండలు, ఆంధ్రప్రదేశ్‌లో గల పులికాట్ సరస్సు, తమిళనాడుకు చెందిన పిఛావరం, కేరళకు చెందిన వెంబనాడు, అష్టముది సరస్సు, మరియు కాయంకుళం సరస్సు ముఖ్యమైన పర్యావరణ పరిరక్షక కేంద్రాలు. కర్ణాటక, తమిళనాడు, కేరళ సరిహద్దులోగల ముడుమలై జాతీయ వనం,బందిపూర్ జాతీయ ఉద్యానవనం, నాగర్‌హోల్ జాతీయ ఉద్యానవనం, మరియు వేనాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మొదలైనవి నీలగిరి అభయారణ్యాలు కిందకి వస్తాయి.

జనాభా వివరాలు

ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మరియు తమిళనాడు లతో కూడిన దక్షిణ భారతదేశం మొత్తం మీద 233 మిలియన్ జనాభా ఉన్నారు.[6]. ఇది వివిధ రకాలైన జాతుల, మతాల, భాషలకు పుట్టినిల్లు. వీరిలో ఆంధ్రులు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరియు కొంకణీయులు అత్యధిక శాతం. మొత్తం జనాభాలో 83% మంది హిందువులు, 11% మంది ముస్లింలు, 5% మంది క్రైస్తవులు. భారతదేశంలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో దక్షిణ భారతదేశం కూడా ఒకటి. రోమన్ కాథలిక్, ఇండియన్ ఆర్థోడాక్సు, సిరియన్ జాకోబైట్, ప్రొటెస్టంట్లు, సైరో-మలబార్, మరియు మర్తోమా మొదలైనవి కొన్ని క్రైస్తవ సంప్రదాయాలు. జైనులు, బౌద్ధులు, యూదులు, మరియు ఇతర మతాల వారు 1% కంటే తక్కువగా ఉంటారు.

సాంప్రదాయక 'నూనె-దీపం' కేరళ)

దక్షిణ భారతదేశం సగటు అక్షరాస్యతా శాతం దాదాపు 73%.ఇది భారతదేశపు సగటుకన్నా ఎక్కువ (60%).[7] కేరళ 91% అక్షరాస్యతా శాతంతో దేశంలో అగ్రస్థానాన్ని అలంకరించింది. ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి 997 (అనగా ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు). దేశంలోకల్లా ఒక్క కేరళలో మాత్రమే ఈ నిష్పత్తి వెయ్యి కంటే ఎక్కువగా ఉంది.[6]. ఈ ప్రాంతంలో జనాభా సాంద్రత సుమారుగా 463. జనాభాలో 18% షెడ్యూల్డు కులాలు మరియు తెగలకు చెందిన వారు. వ్యవసాయం ప్రధాన జీవనాధారం. 47.5% మంది వ్యవసాయ సంభందమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు. 60% మంది ప్రజలు శాశ్వత గృహ వసతి కలిగి ఉన్నారు. 47.8% శాతం మంది రక్షిత మంచినీటిని పొందగలుగుతున్నారు. ఊట బావులు కూడా చాలామందికి నీటిని సరఫరా చేస్తాయి. 31% శాతం మందికి ముఖ్య ప్రయాణ సాధనం సైకిలే. 36.7% శాతం మంది టివి వీక్షించగలరు. రాష్ట్ర ప్రభుత్వంచే నడుపబడే దూర దర్శన్ మరియు ఇతర ప్రాంతీయ ఛానళ్ళు చాలా ఉన్నాయి.

ప్రధాన భాషలు


 
 
 
 
ప్రోటో-ద్రవిడియన్
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ప్రోటో దక్షిణ-ద్రవిడియన్
 
ప్రోటో సెంట్రల్ ద్రవిడియన్
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ప్రోటో తమిళ-కన్నడం
 
 
 
ప్రోటో తెలుగు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ప్రోటో తమిళ-తోడ
 
ప్రోటో కన్నడ
 
ప్రోటో తెలుగు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ప్రోటో తమిళ-కోడగు
 
కన్నడ
 
తెలుగు
 
 
 
 
 
 
ప్రోటో తమిళ-మళయాలం
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ప్రోటో తమిళం
 
మలయాళం
 
 
 
 
 
తమిళం


పై వంశ వృక్ష చిత్రం ప్రాథమిక దక్షిణ భారత భాషల అభివృద్ధిని తెలుపుతుంది.

దక్షిణ భారతంలో ద్రవిడ భాషలు ప్రధానమైనవి. ద్రవిడ భాషలు సుమారుగా 73 ఉన్నాయి.[8]. ద్రవిడ భాషల పుట్టుక మరియు వివిధ భాషలతో సంబంధం గురించి వివిధ బాషా శాస్త్రజ్ఞులు వేరు వేరు రకాలుగా చెపుతారు. 1816 లో బ్రిటిష్ అధికారి అయిన ఫ్రాన్సిస్ ఎలిస్ (Francis W. Ellis) ద్రవిడ భాషలను ఏ ఇతర భాషా సమూహానికి చెందని భాషలుగా అభివర్ణించాడు. ద్రవిడ భాషల్లో ప్రధానమైనవి తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం. ద్రవిడ భాషలను దక్షిణ ద్రవిడ భాషలు, దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించవచ్చు. తమిళం, మలయాళం, కన్నడ మరియు తులు భాషలను దక్షిణ ద్రవిడ భాషలుగాను; తెలుగు మరియు గోండి లను దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించారు. 1956 లో ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలుగా విభజించారు.

2001 జనాభా లెక్కల ప్రకారం తెలుగు 8 కోట్లతో హిందీ తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. 6.4 కోట్లతో తమిళం, 5 కోట్లతో కన్నడ మరియు 3.57 కోట్లతో మలయాళం తరువాతి స్థానాలు ఆక్రమించాయి. తెలుగు,తమిళం,కన్నడ,సంస్కృతం భాషలను భారత దేశ ప్రభుత్వం ప్రాచీన భాషలుగా (Classical Languages) గుర్తించింది. ఈ నాలుగు భాషలను జాతీయ భాషలుగా గుర్తించారు. ఇండో-ఆర్యన్ సమూహానికి చెందిన కొంకణి భాషను గోవా, కోస్తా కర్ణటక, కేరళ మరియు మహారాష్ట్రల యందు విరివిగా మాట్లాడుతారు. కొంకణి భాష మీద కన్నడ మరియు మలయాళం భాషల ప్రభావం ఎక్కువగా వుండి ఈ రెండు భాషలనుండి చాలా పదాలను అరువు తెచ్చుకుంది. ఉత్తర దక్కను మరియు కొంకణ్ ప్రాంతాలలో మరాఠి ఎక్కువగా మాట్లాడుతారు. బార్కూరు సమీపంలో తులు బాషలో వున్న శాసనాలు (inscriptions) లభ్యమయ్యాయి. వీటిని జాగ్రత్త పరచడం ఎంతైనా అవసరం.

ఆదాయ వనరులు

ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ఉన్న తేడాలు
ఉత్తర భారతం దక్షిణ భారతం
తలసరి ఆదాయం (రూ.లలో) 8433 13629
అక్షరాస్యతా శాతం (%) 59 74
ప్రజారోగ్యంపై తలసరి వ్యయం (Rs.) 92 127
విద్యుత్ సౌకర్యం కల ఇళ్ళ శాతం (%) 49 74
Source: Business Today, January 2005

దక్షిణ భారతదేశంలో దాదాపు 50% ప్రజలు వ్యవసాయం ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు.[6] భారతదేశం లోని ఇతర ప్రాంతాల వ్యవసాయదారుల మాదిరిగా ఇక్కడి రైతులు కూడా ప్రధానంగా నీటి కొరకు వర్షపాతం ముఖ్యంగా ఋతుపవనాల మీదనే ఆధార పడతారు. వరి, వేరుశనగ, చెరకు, పత్తి, రాగి, మిరియాలు, పప్పుదినుసులైన మినుములు, కందులు, శనగలు మొదలగునవి ఇక్కడ పండే కొన్ని ముఖ్యమైన పంటలు. ఇంకా కాఫీ, తేయాకు, వెనీలా, రబ్బారు మొదలైన పంటలను కొండ ప్రాంతాలలో పెంచుతారు. కోస్తా ప్రాంతాలలో కొబ్బరి తోటలు విస్తారంగా పెరుగుతాయి. వరి పంట పండించడంలో ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం లోనే మొదటి స్థానంలో వుంది.,[9]. భారతదేశంలోని కాఫీ పంట సాగులో కర్ణాటక 70% శాతాన్ని ఆక్రమించింది. ఎడతెరిపిలేని కరువుల వలన ఉత్తర కర్ణాటక, రాయలసీమ, మరియు తెలంగాణా ప్రాంత రైతులు అప్పుల పాలై ఉన్న ఆస్తులు అమ్ముకుని, చివరికి కొద్ది మంది ఆత్మ హత్యలు కూడా చేసుకున్నారు.[10] ఇక్కడ వేసవి కాలంలో నీటి ఎద్దడి కూడా ఎక్కువే.

ఇక పరిశ్రమల విషయానికొస్తే చెన్నైలో వాహనాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు చాలా ఉన్నాయి. బెంగుళూరులో భారీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో సమాచార సాంకేతిక రంగం (ఐటి) బాగా అభివృద్ధి చెందడంతో ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా బెంగుళూరును భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. ఐటికి ఇదే ప్రధాన కేంద్రం. ఇక్కడ 200 వరకు చెప్పుకోదగిన కంపెనీలు ఉన్నాయి. 1992 మరియు 2002 మధ్యలో కర్ణాటక రూ 21,566 మిలియన్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది దేశంలో నాలుగో అత్యధిక మొత్తం. 2005-06 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుంచి సుమారు 64000 కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరిగాయి.[11]

తమిళనాడు యొక్క నికర రాష్ట్ర ఉత్పత్తి చాలా రాష్ట్రాల నికర రాష్ట్ర ఉత్పత్తి కన్నా ఉన్నత స్థానంలో ఉంది.[12]. పారిశ్రామికీకరణ విషయానికొస్తే కేరళ కొద్దిగా వెనుకబడి ఉన్నా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి. అక్కడి తలసరి ఆదాయంలో 20% విదేశీ మారకం ద్వారా వస్తున్నదే. దీనినే కేరళ అభివృద్ధి నమూనాగా తరచూ వ్యవహరించడం జరుగుతుంది.

గత కొద్ది కాలం నుంచి ఐటి కంపెనీల వేతనాలు భారీగా ఉండటం మూలాన, వాటిలో పని చేసే విద్యావంతులైన యువత మంచి ఆదాయాలు గడిస్తున్నారు. మరొక వైపు పేదవారు తమ కనీస అవసరాలు తీరక అవస్థ పడుతున్నారు. మహానగరాల్లో బహుళ అంతస్తుల భవంతుల మధ్య ఇళ్ళు లేని వారు వేసుకొన్న చిన్న చిన్న గుడారాలు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. తమ పిల్లలను కనీసం పాఠశాలకు కూడా పంపలేక అలాగే పేదరికంలో మగ్గుతున్న వారు ఉన్నారు. [ఆధారం చూపాలి]

రాజకీయాలు

కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ర్యాలీ.

దక్షిణ భారతదేశంలో, కొన్ని ప్రాంతీయ పార్టీలు మరియు జాతీయ పార్టీలైన భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, మరియు కమ్యూనిస్టు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. కర్ణాటకను మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలలోనూ కనీసం రెండు రాజకీయ పార్టీలు ప్రభలంగా ఉన్నాయి.

దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు మద్రాసు ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ లే కీలక పాత్ర పోషించేవి. పెరియార్ ఉద్యమం ప్రారంభించిన పెరియార్ రామసామి 1938 లో జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1944లో దీని పేరు ద్రవిడర్ కజగంగా మార్పు చెందింది. దీని ప్రారంభ లక్ష్యం స్వతంత్ర భారతదేశం నుంచి ప్రత్యేక ద్రవిడ నాడు ఏర్పరచడం.[13]. స్వాతంత్ర్యానంతరం పెరియార్ తమ పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోదని తేల్చి చెప్పడంతో, అతని అంతరంగిక అనుచరులు కూడా ఆయనతో విభేదించక తప్పలేదు. 1948 లో పెరియార్ అనుచరుడు, మరియు ద్రవిడర్ కజగం పార్టీ ప్రధాన కార్యదర్శియైన అన్నాదురై ఆ పార్టీ నుంచి వేరుపడి ద్రవిడ మున్నేట్ర కజగం అనే పార్టీని నెలకొల్పాడు.[13].

డిఎంకె పార్టీ మొట్ట మొదటి సారిగా 1968లోనూ మరలా 1978 లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తరువాతి సంవత్సరమే ఎం జి రామచంద్రన్ డిఎంకె నుంచి విడిపోయి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలే తమిళనాడులో 60% శాతం వోటుబ్యాంకును కలిగి ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్లో మెజారిటీ కుసస్థులు కమ్మ (కమ్మ నాయుడు), రెడ్డి మరియు కాపు, కర్నాటకలో వొక్కలిగ మరియు లింగాయతులు, కేరళలో నాయర్ లేదా ఎలవ, మహారాష్ట్రలో కుంబి. సాధారణంగా ఈ కులస్థుల వారే ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తారు. తమిళనాడులో మెజారిటీ కులస్థులు వెన్నియార్లు, కొంగువెల్లలార్లు మరియు తేవార్లు. పి.యం.కే. అధ్యక్షుడు డా.రామదాస్, తమిళనాడునూ, బీహార్-జార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ లా విభజించాలని, సోనియా గాంధీని సూచించాడు.[14]

బెంగలూరు లోని కర్నాటక అసెంబ్లీభవనం విధాన సౌధ.

1980 వ దశకంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పటంతో రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యానికి అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ ఆధిక్యాన్ని సవాలు చేస్తూ మొత్తం నాలుగు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 1995లో భారీ మెజారిటీతో గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఆయనకు, భార్య లక్ష్మీ పార్వతి మరియు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాధాల వలన తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చింది. చాలామంది పార్టీ సభ్యులు రామారావు అల్లుడైన నారా చంద్రబాబు నాయుడును సమర్థించడంతో తర్వాత ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నాయుడు సమాచార సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో విశేష కృషి చేశారు. మిగతా ప్రభుత్వాలకు మార్గదర్శకుడిగా నిలిచాడు. ఇటీవలి కాలంలో తెలంగాణా ప్రాంతంలో తెలంగాణా రాష్ట్ర సమితి ప్రత్యేక తెలంగాణా నినాదంతో ప్రభావాన్ని పుంజుకుంటోంది. ఈ పార్టీ ముఖ్య లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణా ప్రాంతాన్ని వేరు చేయడమే. అది జరిగితే అప్పుడు దక్షిణాదిలో ఇంకో రాష్ట్రం ఏర్పాటవుతుంది. 1990వ దశకంలో ఫ్యాక్షనిజంతో సతమతమైన కాంగ్రెస్ పార్టీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వై. యస్. రాజశేఖర రెడ్డి నాయకత్వంలో, తెలంగాణా రాష్ట్ర సమితితో వ్యూహాత్మక సంధి కుదుర్చుకుని భారీ మెజారిటీతో గెలుపొంది, తెలుగుదేశం పార్టీని గద్దె దించడంలో సఫలీకృతమైంది.

జనతాదళ్ ఇప్పటిదాకా దేశ రాజకీయాలలోకన్నా, కర్ణాటకలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, మరియు బిజెపిలు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఎక్కువగా విజయాలను చవిచూస్తున్నాయి. కర్ణాటక రాజకీయాలను ఒక్కలిగ మరియు లింగాయతులు అనే రెండు కులాలు శాసిస్తున్నాయి.[15]. 1980లలో జనతాదళ్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశంలో, రామక్రిష్ణ హెగ్డే ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే అతని రాజకీయ ప్రత్యర్థి ఐన హెచ్ డి దేవెగౌడ (అప్పటి కర్ణాటక ముఖ్య మంత్రి) ప్రధాని అయ్యాడు.

ఇక కేరళ విషయానికొస్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వంలోని, ఐక్య ప్రజాతంత్ర కూటమి (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్), మరియు లెఫ్ట్ నాయకత్వం లోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధానమైనవి. లెఫ్ట్ కంచుకోటల్లో కేరళ కూడా ఒకటి. కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు ఒకరు మార్చి ఒకరు అధికారంలోకి రావడం ఇక్కడ విశేషం.

సంస్కృతి వారసత్వ సంపద

కర్ణాటక సంగీతములో త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజు.

దక్షిణ భారతీయులు భాషాపరంగా, సాంస్కృతిక పరంగా మిగతా భారతదేశము కంటే భిన్నముగా ఉంటారు. కాని భారతీయుల మధ్య ఉన్న సంబంధాలు, భారతదేశము మొత్తము పై బడ్డ విదేశీయుల ప్రభావము వలన సంస్కృతి పై కూడా ప్రభావము కనపడుతుంది. కొంతమంది నిపుణుల అభిప్రాయము ప్రకారము దక్షిణ భారతీయుల "ప్రపంచ దృష్టి" (వెల్టన్‌షవాంగ్ (weltanschauung) శరీర సౌందర్యమును మాతృత్వమును ఆస్వాదించడము ద్వారా అనంతమైన విశ్వమును అస్వాదించడము. ఇది వారి నృత్యము, వస్త్రధారణ, శిల్పకళల ద్వారా వ్యక్తమవుతున్నది.[16]

దక్షిణ భారతీయ వనితలు చీరను, పురుషులు లుంగీ లాగ కాని, పంచ లాగ కాని, జరీ (బేటిక్) ఉన్న ఒక పెద్ద వస్త్రమును (సరాంగ్) ను ధరిస్తారు. చీర ఎక్కడా కుట్లు లేకుండా నడుము భాగము కనపడుతూ ఉంటుంది.

భారతీయ తత్వ శాస్త్రం ప్రకారం బ్రహ్మ యొక్క నాభి (బొడ్డు) సకల జీవ సృష్టికి ఆధార భూతమైనది. దీని వెనుక ఉన్న కారణం చాలామందికి తెలియనప్పటికీ నాభి భాగాన్ని, పొట్టనూ మూసి వేయకుండా అలాగే వదిలి వేస్తారు. ప్రాచీన నాట్యశాస్త్రం వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం ఈ విధంగా నాభి భాగాన్ని కప్పుకోకుండా వదలి వేయడం వలన ఆంగికం భువనం యస్య ( భగవంతుని శరీరమే ప్రపంచమనే భావన) ఈ సంప్రదాయంలో ప్రతిఫలిస్తుంది.[16] స్ర్తీలు సాంప్రదాయంగా చీరను ధరిస్తారు, అలాగే పురుషులు లుంగీ లేదా ముండును ధరిస్తారు.[17]

దక్షిణ భారతదేశ సంగీతాన్ని కర్ణాటక సంగీతం అని వ్యవహరిస్తారు. ఇది పురందర దాసు, కనక దాసు, త్యాగరాజు, అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి, సుబ్బరాయ శాస్త్రి, మైసూరు వాసుదేవాచార్యులు, మరియు స్వాతి తిరునాళ్ వంటి వాగ్గేయ కారులు ఏర్పరచిన తాళ, లయగతులతో కూడిన సంగీతం. సమకాలిక గాయకుల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కె.జె. యేసుదాసు (జేసుదాసు), శ్రీమతి పట్టమ్మాళ్, కర్ణాటక సంగీతంలో ప్రముఖులు. భారత రత్నకీ.శే.ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, కీ.శే.మహరాజపురం విశ్వనాథన్, కీ.శే.మహరాజపురం సంతానం, కీ.శే.చెంబై వైద్యనాధభాగవతార్, కీ.శే.శంభంగుడి శ్రీనివాస అయ్యర్ ప్రభృతులు కర్ణాటక సంగీతాన్ని తారాపథానికి తీసికెళ్ళిన నిన్నటి తరపు విద్వాంసులలో కొందరు.

దస్త్రం:Gandharva.jpg
యేసుదాస్, కర్నాటక సంగీతంలో దిట్ట.

తరతరాలుగా వస్తున్న దక్షిణ భారతదేశ ఆచారాలనూ, సంప్రదాయాలనూ, మార్పులనూ, నాగరికతనూ, ప్రజల ఆశయాలనూ ప్రతిబింబిస్తూ ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. 1986లో పద్మరాజన్ తీసిన నమ్ముక్కుపార్కాన్, 1984లో జి వి అయ్యర్ తీసిన ఆది శంకర, 1990లో పెరుంతాచన్ తీసిన అజయన్, 1984 లో విశ్వనాథ్ తీసిన శంకరాభరణం ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఈ సినిమాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి.

కూచిపూడి కళాకారిణి.
భరతనాట్యం కళాకారిణి.

దక్షిణ భారతదేశం వివిధ నాట్యరీతులకు ఆల వాలమైంది. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, యక్షగానం, తెయ్యం, ఒట్టంతుళ్ళ, ఒప్పన, కేరళ నటనం, మరియు మొహినీ అట్టం ఇందులో ప్రధానమైనవి. భరత నాట్యం భువనైక సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. భరతనాట్య కళాకారులు, కళాకారిణులలో చక్కటి శరీరాకృతి, సౌష్టవమైన శరీరం, సన్నని నడుము, పొడవైన కేశాలు, ఎత్తైన జఘనాలకు (వంపు సొంపులకు) ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.[18] వీరు నాట్య శాస్త్రం యొక్క తత్వానికి జీవం పోస్తారు. సగం కూర్చున్నట్లు కనిపించే అరైమండి అనే భంగిమలో మోకాళ్ళు పక్కకి వంగి ఉంటాయి. ఈ ప్రాథమిక భరతనాట్య భంగిమలో తల నుంచి నాభి వరకు ఉన్న దూరం, నాభి నుంచి భూమికి ఉన్న దూరానికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా చాచిన రెండు చేతుల మధ్య దూరం, తలనుంచి నాభి వరకు ఉన్న దూరానికి సమానం. ఇది జీవము మరియు పుట్టుక కలయికయైన్ నాట్యపురుషుని వ్యక్తీకరిస్తుంది.[16]

అరటి ఆకులపై భోజనం వడ్డించే సాంప్రదాయం (ముఖ్యంగా పండుగ దినాలలో)

ఇక్కడి ప్రజల ప్రధానమైన ఆహారం అన్నము. చేపలు, కోస్తా ప్రాంతాలలో నివసించేవారి ఆహారంలో ఒక అంతర్భాగం. కేరళ వంటకాలలో కొబ్బరి, ఆంధ్ర వంటకాలలో పచ్చళ్ళు, కారంతో కూడిన కూరలు సర్వ సాధారణం. దోశ, ఇడ్లీ, ఊతప్పం మొదలైనవి కొన్ని ప్రసిద్ధి చెందిన వంటకాలు. దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో విస్తారమైన కాఫీ తోటలు ఉన్నాయి.

దక్షిణ భారతదేశంలో రెండు ప్రధానమైన వాస్తు శిల్పకళా రీతులు ఉన్నాయి. ఒకటి తమిళనాడుకు చెందిన సంపూర్ణ ద్రవిడ విధానం కాగా మరొకటి కర్ణాటకకు చెందిన వేసర శిల్పకళ. హంపి, బాదామి, భట్టిప్రోలు, పట్టాడక, అహోబిలం,బేలూరు, హళిబేడు, లక్కుండి, శ్రావణబెళగొళ, మహాబలిపురం, తంజావూరు, మధురై మొదలైన దేవాలయాలలోగ శిల్పకళ ఇక్కడి శిల్పుల నైపుణ్యానికి, కళాభిరుచికీ చక్కటి నిదర్శనాలు. రాజా రవివర్మ గీసిన చిత్రాలు దక్షిణ భారతదేశ సంప్రదాయాన్ని,పురాణాల్నీ చక్కగా ప్రతిబింబిస్తాయి. ఎట్టమునూర్ లో గల శైవ క్షేత్రం, మరియు మాతంచేరి దేవాలయంలో గల చిత్రాలు ద్రవిడ దేశపు కుడ్యచిత్రాలకు కొన్ని ఉదాహరణలు. దక్షిణ భారతదేశంలో 5 నుంచి 26 దాకా చరిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన స్థలాలు ఉన్నాయి.[19]

కర్నాటక లోని గోమఠేశ్వర వద్ద, జైనుల తీర్థాంకరుడు 'బాహుబలి' ఏకశిలా శిల్పం. (978-993 నాటిది).
తంజావూరు లోని బృహదీశ్వరాలయం ప్రధాన విమానం.

నృత్యం తరువాత శిల్పకళ ఇక్కడ కళలలో ప్రసిద్ధి గాంచింది. ఈ మాధ్యమంలో నిజస్వరూపాలను మూర్తులుగా మలచడం తక్కువ సమయంలోనే సాధ్యమౌతుంది. సాంప్రదాయిక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడం బొడ్డు నుంచి ప్రారంభిస్తాడు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంగమాన్ని ప్రతిబింబిస్తూ బొడ్డు శిల్పానికి సరిగ్గా కేంద్ర స్థానంలో ఉన్న విషయం తెలుస్తుంది. దేవాలయాలకు నలు వైపులా ఉన్న భవనాలు వివిధ రకాల శిల్పాలు, వివిధ రకాల భంగిమలలో అలంకరించబడి ఉన్నాయి. ఈ రకమైన నాట్య భంగిమల చిత్రణ వివిధ రకాలైన నాట్య రీతులను తరువాతి తరాల వాళ్ళకు అందజేస్తాయి.[20]

దక్షిణ భారతదేశానికి 2000 సంవత్సరాల స్వతంత్రమైన సాహిత్య చరిత్ర ఉంది. వీటిలో మొట్టమొదట పేర్కొనదగ్గవి 2000-1500 ఏళ్ళ క్రితం తమిళంలో రాయబడ్డ సంగం కవితలు. 850 CE కి చెందిన ఒకటవ అమోఘవర్షుడు రచించిన కవిరాజమార్గ అనే రచనలో ఐదవ శతాబ్దానికి చెందిన దుర్వినీతుడు అనే రాజు యొక్క రచనల గురించి ప్రస్తావించాడు. పదవ శతాబ్దానికి చెందిన తమిళ బౌద్ధుడు నెమ్రినాథం నాలుగవ శతాబ్దానికి చెందిన కన్నడ రచనలను ప్రస్తావించాడు. తరువాత శతాబ్దాలలో మలయాళం, తెలుగు సాహిత్య సంప్రదాయాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఇలంగో ఆదిగళ్ రచించిన శిలప్పాధికారం (దీనినే సిలప్పాటికారం అనికూడా అంటారు) లాంటి రచనలు గమనిస్తే దక్షిణ భారతదేశ వాసులు ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో అవగతమౌతుంది. తొల్కప్పియార్ రచించిన తొల్కప్పియం, మరియు తిరువళ్ళువర్ రచించిన తిరుకురల్ కూడా చెప్పుకోదగిన రచనలు. ఇక్కడి సాహిత్యంలో మరియు తత్వ శాస్త్రంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. వివాహితయైన మహిళ శుభసూచకంగా, ఆదిశక్తి స్వరూపంగా, భర్తనూ, పిల్లలనూ కంటికి రెప్పలా కాపాడుకొనే తల్లిలా భావించి గౌరవిస్తారు.

భిన్నత్వం

హైదరాబాదు లోని చార్మినారు.

కొన్ని శతాబ్దాల క్రిందట జైనమతం ప్రభావం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం దక్షిణ భారతదేశంలో హిందూ మత శాఖలైనటువంటి శైవ భక్తులు, వైష్ణవులు ప్రధానమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలు. కర్ణాటకలో గల శ్రావణబెళగొళ జైనులకు ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం. అదే విదంగా కర్ణాటకలోనే కల కొడగు అతి పెద్ద బౌద్ధారామాల్లో ఒకటి. చైనాలో కమ్యూనిస్టులు చెలరేగినపుడు వారి ఆగడాలను భరించలేక టిబెట్ నుంచి పారిపోయి వచ్చిన చాలామంది బౌద్ధులు ఈ మఠంలోనే తలదాచుకున్నారు. ముస్లిం జనాభా కూడా ఇక్కడ కొంచెం ఎక్కువే. ప్రాచీన కాలంలో, కేరళ తీర ప్రాంతమైనటువంటి మలబారు తీరం ప్రజల్లో, ఒమన్ మరియు ఇతర అరబ్బు దేశాలు వ్యాపార సంబంధాలు కలిగి ఉండటం వలన ఇక్కడ ముస్లిం జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటుంది. ఇంకా తమిళనాడులో నాగపట్టణం (నాగూరు అని కూడా అంటారు) కూడా మహమ్మదీయుల సంఖ్య బాగానే ఉంది. ఈ పట్టణంలో పురాతన కాలానికి చెందిన నాగూర్ దర్గా కూడా ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు దక్షిణ భారతదేశ మహమ్మదీయ సంస్కృతికి చారిత్రక కేంద్రం. చార్మినార్, పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో చాలావరకు ముస్లింలే నివసిస్తుంటారు. సెయింట్ థామస్ కేరళకు వచ్చి సిరియన్ క్రైస్తవ సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం వలన దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాలలో క్రైస్తవ మతస్తులు అధికంగానే ఉంటారు. వీరినే సిరియన్ క్రైస్తవులు లేదా సిరియన్ మలబార్ నజ్రానీలు అని కూడా అంటారు.[21]. సిరియన్ రైట్ క్రైస్తవులు, సైరో-మలబార్ చర్చి, సైరో-మలంకరా క్యాథలిక్ చర్చి,మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి, మార్థోమా చర్చి మొదలైనవి ఈ సాంప్రదాయం కిందకే వస్తాయి.[21]. The two Eastern Catholic Churches have their Holy See in Kerala. క్యానయా అనే క్రైస్తవ-యూదు జాతి సైరో-మలబార్ చర్చి, మరియు మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి సంప్రదాయాల నుంచి ఉద్బవించింది.[22]

క్నానయ, సిరియన్ మలబార్ నస్రానీ (క్రిస్టియన్) దేవాలయం, కొట్టాయం, ఇందులో పురాతన మార్ థోమా క్రాస్ మరియు సస్సానిదుల పహ్లవీ లిపులు.

అంతేకాకుండా కేరళలో లాటిన్ సంప్రదాయానికి చెందిన రోమన్ క్యాథలిక్కులు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వివిధ ప్రొటెస్టంట్ విభాగాలన్నింటినీ కలిపి 1947లో దక్షిణ భారతదేశంలో ఒక స్వతంత్ర ప్రొటెస్టంట్ చర్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఇక్కడ యూదు జాతికి చెందిన ప్రజలు కూడా కొద్ది మంది నివసిస్తున్నారు. వీరు సాల్మన్ చక్రవర్తి కాలంలో మలబార్ తీరానికి వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.[23] కేరళ లోని కొచ్చిన్లో గల యూదుల చర్చి సినగాగ్, భారత్ లో అతి ప్రాచీనమైనది.

నోట్స్

  1. Agarwal, D.P."Urban Origins in India", 2006. Archaeology and Ancient History, Uppsala Universitet
  2. T.K Velu Pillai, 1940; Wilfred Schoff 1912 "Periplus Maris Erythraei" (trans) 1912, Menachery, G 1998; James Hough 1893; K.V. Krishna Iyer 1971
  3. (Bjorn Landstrom, 1964; Miller, J. Innes. 1969; Thomas Puthiakunnel 1973; & Koder S. 1973; Leslie Brown, 1956
  4. "Indo-Malayan Terrestrial Ecoregions". Retrieved April 15, 2006.
  5. "Biodiversity Hotspot - Western Ghats & Sri Lanka, Conservation International". Retrieved April 15, 2006.
  6. 6.0 6.1 6.2 "Census India Maps". Retrieved 2006-04-11.
  7. "CIA factbook". Retrieved 2006-04-11.
  8. Language Family Trees - Dravidian. Ethnologue.
  9. "Andhra Pradesh Online". Retrieved 2006-04-10.
  10. "BBC". Retrieved 2006-04-10.
  11. "BusinessLine article on Tamil Nadu Software Exports". Retrieved 2006-10-05.
  12. "India Budget" (PDF). Retrieved 2006-04-10.
  13. 13.0 13.1 ""Periyar Movement- Periyar.org"". Retrieved 19 April. {{cite web}}: Check date values in: |accessdate= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
  14. Harris, Wyatt. "The Changing Politics of Tamil Nadu in the 1990s". Political Mobilisation and Political Competition. Dec 2004.
  15. Price, Pamela. " Ideological Elements in Political Instability in Karnataka...". University of Oslo
  16. 16.0 16.1 16.2 Beck, Brenda. 1976; Bharata, 1967; Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss, 2002; Wadley, Susan, ed. 1980 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "beck" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  17. Boulanger, Chantal; 1997
  18. Kallarasa Virachita Janavasya Ed: G.G. Manjunathan. Kannada Adhyayana Samsthe, University of Mysore, 1974.
  19. World Heritage Listed Sites in India. URL accessed on April 12, 2006.
  20. Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss; 2002
  21. 21.0 21.1 Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956
  22. Menachery G; 1973, 1998; Leslie Brown, 1956; Vellian Jacob 2001; Weil, S. 1982; Poomangalam C.A 1998
  23. David de Beth Hillel, 1832; Lord, James Henry, 1977; Thomas Puthiakunnel 1973; Koder S. 1973

మూలాలు మరియు రచనలు

  • Beck, Brenda. 1976. “The Symbolic Merger of Body, Space, and Cosmos in Hindu Tamil Nadu." Contributions to Indian Sociology 10 (2): 213-43.
  • Bharata (1967). The Natyashastra [Dramaturgy], 2 vols., 2nd. ed. Trans. by Manomohan Ghosh. Calcutta: Manisha Granthalaya.
  • Boulanger, Chantal; (1997) Saris: An Illustrated Guide to the Indian Art of Draping, Shakti Press International, New York. ISBN 0-9661496-1-0
  • Craddock, Norma. 1994. Anthills, Split Mothers, and Sacrifice: Conceptions of Female Power in the Mariyamman Tradition. Dissertation, U. of California, Berkeley.
  • Danielou, Alain, trans. 1965. Shilappadikaram (The Ankle Bracelet) By Prince Ilango Adigal. New York: New Directions. ISBN 0-8112-0001-9
  • Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss (2002) The Sensuous and the Sacred: Chola Bronzes from South India. ISBN 0-295-98284-5
  • Hart, George, ed. and trans. 1979. Poets of the Tamil Anthologies: Ancient Poems of Love and War. Princeton: Princeton U. Press
  • Kallarasa Virachita Janavasya Ed: G.G. Manjunathan. Kannada Adhyayana Samsthe, University of Mysore, Mysore 1974.
  • Gover, Charles. 1983 (1871). Folk-songs of Southern India. Madras: The South India Saiva Siddhanta Works Publishing Society.
  • Nagaraju, S. 1990. “Prehistory of South India.” In South Indian Studies, H. M. Nayak and B. R. Gopal, eds., Mysore: Geetha Book House, pp. 35–52.
  • Trawick, Margaret. 1990a. Notes on Love in a Tamil Family. Berkeley: U. of California Press.
  • Wadley, Susan, ed. 1980. The Powers of Tamil Women. Syracuse: Syracuse U. Press.
  • Zvelebil, Kamil. 1975. Tamil Literature. Leiden: Brill. ISBN 90-04-04190-7
  • Economy referenced from the Encyclopaedia Britannica online.
  • Some economic statistics from Union Budget and Economic Survey, Government of India. URL accessed April 10th, 2006.
  • Menachery G (1973) The St. Thomas Christian Encyclopedia of India, Ed. George Menachery, B.N.K. Press, vol. 2, ISBN 81-87132-06-X, Lib. Cong. Cat. Card. No. 73-905568; B.N.K. Press
  • Mundalan, A. Mathias. (1984) History of Christianity in India, vol.1, Bangalore, India: Church History Association of India.
  • Leslie Brown, (1956) The Indian Christians of St. Thomas. An Account of the Ancient Syrian Church of Malabar, Cambridge: Cambridge University Press 1956, 1982 (repr.)
  • Podipara, Placid J. (1970) "The Thomas Christians". London: Darton, Longman and Tidd, 1970.
  • Menachery G (ed); (1998) "The Indian Church History Classics", Vol. I, The Nazranies, Ollur, 1998. [ISBN 81-87133-05-8].
  • David de Beth Hillel (1832) "travels"; madras publication;
  • Menachery G (ed) (1982) The St. Thomas Christian Encyclopedia of India, B.N.K. Press, vol. 1;
  • Lord, James Henry (1977) "The Jews in India and the Far East"; Greenwood Press Reprint; ISBN 0-8371-2615-0).
  • Poomangalam C.A (1998) The Antiquities of the Knanaya Syrian Christians; Kottayam, Kerala.
  • James Hough (1893) "The History of Christianity in India".
  • K.V. Krishna Iyer (1971) Kerala’s Relations with the Outside World, pp. 70, 71 in "The Cochin Synagogue Quatercentenary Celebrations Commemoration Volume", Kerala History Association, Cochin.
  • Periplus Maris Erythraei "The Periplus of the Erythraean Sea", (trans). Wilfred Schoff (1912), reprinted South Asia Books 1995 ISBN 81-215-0699-9
  • Miller, J. Innes. (1969). The Spice Trade of The Roman Empire: 29 B.C. to A.D. 641. Oxford University Press. Special edition for Sandpiper Books. 1998. ISBN 0-19-814264-1.
  • Thomas Puthiakunnel, (1973) "Jewish colonies of India paved the way for St. Thomas", The Saint Thomas Christian Encyclopedia of India, ed. George Menachery, Vol. II., Trichur.
  • Koder S. 'History of the Jews of Kerala". The St. Thomas Christian Encyclopaedia of India, Ed. G. Menachery,1973.
  • Vellian Jacob (2001) Knanite community: History and culture; Syrian church series; vol. XVII; Jyothi Book House, Kottayam
  • Weil, S. (1982) "Symmetry between Christians and Jews in India: The Cananite Christians and Cochin Jews in Kerala. in Contributions to Indian Sociology,16.
  • Bjorn Landstrom (1964) "The Quest for India", Double day English Edition, Stockholm.
  • T.K Velu Pillai, (1940) "The Travancore State Manual"; 4 volumes; Trivandrum
  • Caldwell, R (1998) "A comparative grammar of the Dravidian or South-Indian family of languages" 3rd ed. rev. and edited by J.L. Wyatt, T. Ramakrishna Pillai. New Delhi : Asian Educational Services. ISBN 81-206-0117-3
  • Bloch, J. (1954) "The grammatical structure of Dravidian Languages". tr. of 'Structure grammaticale des langues Dravidiennes' (1946) Poona: Deccan College Handbook Series.