చందా కొచ్చర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 25: పంక్తి 25:


==పురస్కారములు==
==పురస్కారములు==
[[2005]] నుండి ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం సంపాదించుకుంటూనే ఉంది. 2009 లో ఫోర్బ్స్ పత్రిక '''ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళల ''' జాబితాలో 20 వ స్థానం మరియు 2010 లో అదే జాబితాలో 10వ స్థానానికి ఎగబాకింది.
[[2005]] నుండి ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం సంపాదించుకుంటూనే ఉంది. [[2009]] లో ఫోర్బ్స్ పత్రిక '''ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళల ''' జాబితాలో 20 వ స్థానం మరియు 2010 లో అదే జాబితాలో 10వ స్థానానికి ఎగబాకింది.


బ్యాంకింగ్ రంగంలో ఈమె సేవలను గుర్తించిన rey ప్రభుత్వం 2010 లో ఈమెను [[పద్మభూషణ్]]తో సన్మానించింది.
బ్యాంకింగ్ రంగంలో ఈమె సేవలను గుర్తించిన rey ప్రభుత్వం 2010 లో ఈమెను [[పద్మభూషణ్]]తో సన్మానించింది.

12:57, 25 మే 2017 నాటి కూర్పు

చందా కొచ్చర్
2011 నవంబర్ 12 నుండి 14 వరకు జరిగిన భారత ఆర్థిక సదస్సు లో చందా కొచ్చర్
జననం (1961-11-17) 1961 నవంబరు 17 (వయసు 62)
వృత్తిముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు నిర్వహణ అధ్యక్షురాలు, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు
జీవిత భాగస్వామిపి. కె .గిర్పధీ
పిల్లలుకుమారుడు, కుమార్తె

చందాకొచ్చర్ (: 1961 నవంబరు 17) భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంకు మరియు ప్రైవేటు సెక్టార్ లో మొదటి అతి పెద్ద బ్యాంకు ఐన ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు నిర్వహణ అధ్యక్షురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.[1][2]

బాల్యము మరియు విద్యాభ్యాసము

రాజస్థాన్ లోని జోధ్‌పూర్లో 1961 లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అక్కడే సెయింట్ ఏంజెల్ సోఫియా పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత ముంబై జైహింద్ కళాశాల నుండి బి.ఎ . పూర్తి చేశారు. 1982 లో కాస్ట్ అకౌంటెంసీని పూర్తి చేశారు. తర్వాత జమునాలాల్ బజాజ్ ఇన్స్టిటూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసంలో తన ప్రతిభకు గానూ వివిధ పతకాలను గెలుచుకున్నారు.

వ్యక్తిగత జీవితము

ఈవిడ ముంబైలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ లో తన సహాధ్యాయు మరియు పవన శక్తి వ్యాపారవేత్త అయిన దీపక్ కొచ్చర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానము. ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి.

జీవన ప్రస్థానము

1984 లో ICICI (Industrial Credit and Investment Corporation Of India) సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది. ఉద్యోగ తొలినాళ్ళలో సంస్థ యొక్క జౌళి, కాగితము మరియు సిమెంటు విభాగాలలో పనిచేసింది. 1993 లో, కొత్త బ్యాంకు ప్రారంభించాలనుకున్నపుడు సంస్థ యాజమాన్యం ఈమెను సంస్థ బ్యాంకింగ్ కోర్ కమిటీకి బదిలీ చేసింది.1994 లో అసిస్టెంట్ మేనేజర్ గానూ మరియు 1996 లో డిప్యూటీ మేనేజర్ గానూ పదోన్నతి సాధించింది. 1996 లో శక్తి (Power), టెలికాం మరియు రవాణా విభాగాలలో సంస్థను బలోపేతం చేయడానికి ఏర్పాటైన బృందానికి నాయకత్వం వహించింది.1998 లో సంస్థ జనరల్ మేనేజర్ గా పదోన్నతి సాధించింది.1999 లో సంస్థ యొక్క ఈ-కామర్స్ విభాగాన్ని కూడా నిర్వహించింది. ఈమె నాయకత్వంలోనే సంస్థ రిటైల్ బ్యాంకింగ్ లో ప్రవేశించి, మనదేశంలోని ప్రైవేటు బ్యాంకులలో అగ్రగామిగా నిలిచింది. 2001 లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది.

పురస్కారములు

2005 నుండి ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం సంపాదించుకుంటూనే ఉంది. 2009 లో ఫోర్బ్స్ పత్రిక ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 20 వ స్థానం మరియు 2010 లో అదే జాబితాలో 10వ స్థానానికి ఎగబాకింది.

బ్యాంకింగ్ రంగంలో ఈమె సేవలను గుర్తించిన rey ప్రభుత్వం 2010 లో ఈమెను పద్మభూషణ్తో సన్మానించింది.

బయటి లంకెలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు

  1. India's ICICI names Chanda Kochhar CEO from May 09. Uk.reuters.com (2008-12-19). Retrieved 2012-01-29.
  2. Chanda Kochhar to head ICICI Bank. Business Standard (2008-12-19). Retrieved 2012-01-29.