మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ
పంక్తి 24: పంక్తి 24:
* విజయ తోరణము - రేడియో నాటికలు
* విజయ తోరణము - రేడియో నాటికలు
* ఆంధ్ర సంస్కృతి తరంగిణి (Archaeological series) - 1976 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ
* ఆంధ్ర సంస్కృతి తరంగిణి (Archaeological series) - 1976 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ
* ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము - ప్రచురణ: ఆధునిక వాఙ్మయ కుటీరము, 22 దివాన్ రామ్ అయ్యంగార్ రోడ్డు, మద్రాసు-7, 1948, 128 పేజీలు - వెల రూ.1-8 [http://www.kosal.us/History/Andhra%20Kingdoms%20in%20Ancient%20India.html]

*[http://www.amazon.co.uk/exec/obidos/search-handle-url/026-3749180-2713267?%5Fencoding=UTF8&search-type=ss&index=books-uk&field-author=Mallampalli%20Somasekhara%20Sarma అమెజాన్.కమ్ లింకు]
*[http://www.amazon.co.uk/exec/obidos/search-handle-url/026-3749180-2713267?%5Fencoding=UTF8&search-type=ss&index=books-uk&field-author=Mallampalli%20Somasekhara%20Sarma అమెజాన్.కమ్ లింకు]

==మూలాలు, బయటి లింకులు==
==మూలాలు, బయటి లింకులు==
<references/>
<references/>

08:11, 4 డిసెంబరు 2007 నాటి కూర్పు

మల్లంపల్లి సోమశేఖర శర్మ (Mallampalli Somasekhara Sarma) సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు. ప్రసిద్ది చెందిన పురాలిపి శాస్త్రజ్ఞుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని మినిమించిలిపాడు లో 1891 జన్మించాడు . సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి [1].1963లో మరణించాడు.


అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలోమెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. కధలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించాడు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరానికి మారింది. ఆరోజులలో చరిత్ర చతురాననుడుగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి వీరభద్రరావుతో శర్మకు పరిచయమైంది. అతనికి సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశాడు. అనంతరం విజ్ఞాన సర్వస్వం కృషిలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మరియు రాయప్రోలు సుబ్బారావు వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు.


అప్పటికి ఆంధ్ర దేశంలో చరిత్ర పరిశోధన ప్రాధమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలైన శాసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మ తలకెత్తుకొన్నాడు. ఒంటరిగాను, మిత్రుడు నేలటూరి వెంకట రమణయ్యతో కలిసీ నెల్లూరు జిల్లాలోను, రాయలసీమ ప్రాంతంలోనూ అన్వేషణా యాత్రలు సాగించాడు. ఇతనిని శాసనాల శర్మ అని ప్రజలు సాదరంగా గౌరవించేవారు. ఈ అన్వేషణ ఫలితంగా అశోకుని ఎర్ర గుడిపాడు శాసనం, పల్లవ, తెలుగు చోడ, రెడ్డి, విజయనగర రాజుల కాలంనాటి ఇతర శాసనాలు వెలుగులోకి వచ్చాయి.


తాము సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ ఎపిగ్రాఫియా ఇండియా, భారతి, శారద, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాశాడు. ఘంటసాల ప్రాకృత శాసనాల గురించి శర్మ వ్రాసిన వ్యాసం అతని మరణానంతరం ప్రచురితమయ్యింది. శాసనాల లిపిని పరిశోధించడంలోనూ అఖిలభారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారుడు శర్మ మాత్రమే అనవచ్చును. ఏ సమస్యనైనా భిన్న దృక్కోణాల నుండి పరిశిలించి సమన్వయ శాస్త్రీయ దృష్టితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు వెల్లడించేవాడు[1]. అహదహనకర శాసనంలోని ఒక అక్షరాన్ని శర్మ "ఱ"గా గుర్తించగా వేటూరి ప్రభాకర శాస్త్రి దానిని "ష్జ"అని అన్నఅడు. ఈ విషయమై వారిద్దరికీ ఆసక్తికరమైన వాదోపవాదాలు నడచాయి.



సోమశేఖర శర్మ రచనలు

  • అమరావతి స్తూపము, ఇతర వ్యాసములు - 1932
  • కొన్ని చారిత్రిక వ్యాసాలు 'ఆంధ్రభారతి' వెబ్‌సైటులో చూడవచ్చును
  • నా నెల్లూరు జిల్లా పర్యటన - శాసనాన్వేషణా యాత్రలలో ఎదుర్కొన్న సమస్యలు, కష్ట నష్టాలు, ప్రజల నమ్మకాలు గురించి.
  • Corpus of inscriptions in the Telangana District part IV (Archaeological series) - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ (1973)
  • సోమశేఖర శర్మ విరచితము - ఆంధ్రవీరులు - 1920
  • రాగతరంగిణి - విచారకరమైన చిన్న కథ - 1916 - మనోరమ ప్రెస్
  • విజయ తోరణము - రేడియో నాటికలు
  • ఆంధ్ర సంస్కృతి తరంగిణి (Archaeological series) - 1976 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ
  • ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము - ప్రచురణ: ఆధునిక వాఙ్మయ కుటీరము, 22 దివాన్ రామ్ అయ్యంగార్ రోడ్డు, మద్రాసు-7, 1948, 128 పేజీలు - వెల రూ.1-8 [1]

మూలాలు, బయటి లింకులు

  1. 1.0 1.1 డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు వ్యాఖ్య. బౌద్ధము-ఆంధ్రము అనే వ్యాస సంకలనం నుండి