బుద్ధఘోషుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 6: పంక్తి 6:


===బుద్ధఘోషుడు తెలుగువాడు===
===బుద్ధఘోషుడు తెలుగువాడు===
మహావంశం గ్రంధం ప్రకారం బుద్ధఘోషుడు ఉత్తర భారత దేశంలోని బోధిగయ క్షేత్రానికి సమీపంలో జన్మించాడని తెలుస్తుంది. అయితే ఆతను తెలుగువాడనే ఒక వాదన కూడా వుంది. అనురాధపురంలోని మహావిహారంలోని పెద్ద బిక్షువులు బుద్ధఘోషుని వ్యాఖ్యాన పటిమను ప్రశంసిస్తూ అతనిని ‘మోరండఖేటకా’ అని పిలవడం జరిగింది. మోరండఖేటక పదం పాళీకరణం చేయబడిన తెలుగు పదం. అదే విధంగా అతని రచన 'విసుద్ధిమగ్గ'లో పది పన్నెండు వరకు అచ్చ తెలుగు పదాలు సైతం దొర్లాయి. దీని ప్రకారం ప్రకారం బుద్ధఘోషుడు తెలుగువాడని భావించవచ్చు. ఆ ప్రకారంగా చూస్తె అతని జన్మస్థలం గుంటూరు జిల్లాలోని కోట నెమలిపురం కావచ్చు. లేదా నెమలి గుడ్లపల్లి లేదా నెమలి గుడ్లూరు కావచ్చు.
మహావంశం గ్రంధం ప్రకారం బుద్ధఘోషుడు ఉత్తర భారత దేశంలోని బోధిగయ క్షేత్రానికి సమీపంలో జన్మించాడని తెలుస్తుంది. అయితే ఆతను తెలుగువాడనే ఒక వాదన కూడా వుంది. అనురాధపురంలోని మహావిహారంలోని పెద్ద బిక్షువులు బుద్ధఘోషుని వ్యాఖ్యాన పటిమను ప్రశంసిస్తూ అతనిని ‘మోరండఖేటకా’ అని పిలవడం జరిగింది. మోరండఖేటక పదం పాళీకరణం చేయబడిన తెలుగు పదం. అదే విధంగా అతని రచన 'విసుద్ధిమగ్గ'లో పది పన్నెండు వరకు అచ్చ తెలుగు పదాలు సైతం దొర్లాయి.<ref>{{cite book|last1=బోధచైతన్య|title=శీలం - ధ్యానం|publisher=ధర్మదీపం ఫౌండేషన్|location=హైదరాబాద్|page=4|edition=2012 ఆగస్ట్}}</ref> దీని ప్రకారం ప్రకారం బుద్ధఘోషుడు తెలుగువాడని భావించవచ్చు. ఆ ప్రకారంగా చూస్తె అతని జన్మస్థలం గుంటూరు జిల్లాలోని కోట నెమలిపురం కావచ్చు. లేదా నెమలి గుడ్లపల్లి లేదా నెమలి గుడ్లూరు కావచ్చు.


==ప్రధాన రచనలు-అనువాదాలు==
==ప్రధాన రచనలు-అనువాదాలు==

00:08, 23 జూన్ 2017 నాటి కూర్పు

ఆచార్య బుద్ధఘోషుడు క్రీ.శ. 5 వ శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ భారతీయ థేరవాద బౌద్ధ పండితుడు. పాళీ భాషా విద్వాంసుడు. దేశ విదేశీ పండితులచే థేరవాద సంప్రదాయంలో గొప్ప వ్యాఖ్యాతగా గుర్తించబడ్డాడు. బౌద్ధ పాళీ వాజ్మయంలో బహు గ్రంధ రచయితగా ప్రసిద్ధికెక్కాడు. జన్మతా భారతీయుడైన బుద్ధఘోషుడు సింహళ దేశానికి (శ్రీలంకకు) తరలిపోయి అక్కడి అనురాధాపురంలోని మహావిహారంలో బౌద్ధ ఆచార్యుడిగా స్థిరపడ్డాడు. అక్కడే ఉంటూ సింహళ భాషలో ఉన్న అట్టకథలను (Commentaries), జాతక కథలను పాళీ భాషలోనికి అనువదించాడు. ఇతని వ్యాఖ్యానాలలో సమంతపాసాదికా, సుమంగళ విలాసిని, జాతకట్టకథా ముఖ్యమైనవి. ఇతను రచించిన ‘విసుద్ధిమగ్గ‘ (Path of Purification) (సంస్కృతంలో ‘విశుద్ధిమార్గ’) అనే గ్రంథం త్రిపీటకాలను అవగతం చేసుకునేందుకు కీలకమైంది. బుద్ధుని విమోచన మార్గాన్ని సమగ్రంగా వివరించిన ఈ గ్రంధం థేరవాదంలో అత్యంత ప్రామాణిక బౌద్ధ గ్రంధంగా నిలిచింది. తన జీవిత చరమాంకంలో భారతదేశానికి తిరిగి పయనమై బౌద్ధగయ క్షేత్రంలో మరణించాడు.

జీవిత విశేషాలు

సింహళ దేశానికి చెందిన మహావంశం గ్రంధం ప్రకారం బుద్ధఘోషుడు ఉత్తర భారత దేశంలోని బోధిగయ క్షేత్రానికి సమీప గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో ప్రతిభావంతుడిగా, మహా బుద్ధిశాలిగా పేరు తెచ్చుకొన్నాడు. యవ్వనంలో భారతదేశమంతటా కలియ తిరుగుతూ తన వాదనా పటిమను ప్రదర్శించేవాడు. ఒక సందర్భంలో దక్షిణ భారత దేశంలోని రేవతుడు అనే బొద్ద బిక్షువుతో వాదనకు దిగి అనంతరం అతనికి శిష్యుడైనాడు. రేవతుని వద్ద ప్రవ్రజ్య స్వీకరించి బుద్ధఘోషునిగా పిలువబడ్డాడు. రేవతుని శిక్షణలో బౌద్ధ త్రి పీటకాలు అధ్యయనం చేసాడు. తన గురువు వల్ల జ్ఞానోదయం అయినందుకు కృతజ్ఞతగా జ్ఞానోదయం అనే గ్రంధం రచించాడు. శ్రీలంకలో భద్రపరిచివున్న అట్టకథలను సింహళ భాష నుండి పాళీ భాషలోనికి అనువదించమని కోరిన గురువు రేవంతుని అభిమతానుసారం శ్రీలంకకు ప్రయాణమయ్యాడు. శ్రీలంకలో అనురాధాపురంలోని విఖ్యాతికేక్కిన మహావిహారంలో చేరుకొని అక్కడి పెద్ద బౌద్ధబిక్షువులకు తన వ్యాఖ్యాన పటిమకు తార్కాణంగా త్రిపీటకాలలోని సారమంతా రంగరించి విసుద్దిమార్గ అనే గ్రంధం రాసి చూపించి అక్కడి పెద్ద బౌద్ధ బిక్షువుల ప్రశంసలు పొందాడు. అనంతరం అనురాధాపురంలోని మహావిహారంలో బౌద్ధ ఆచార్యుడిగా స్థిరపడ్డాడు. అక్కడే నివసిస్తూ సింహళ భాషలో ఉన్న 13 అట్టకథలను (Commentaries), జాతక కథలను పాళీ భాషలోనికి అనువదించాడు. తన జీవిత చరమాంకంలో భారతదేశానికి తిరిగి పయనమై బౌద్ధగయ క్షేత్రం వద్ద మరణించాడు.

బుద్ధఘోషుడు తెలుగువాడు

మహావంశం గ్రంధం ప్రకారం బుద్ధఘోషుడు ఉత్తర భారత దేశంలోని బోధిగయ క్షేత్రానికి సమీపంలో జన్మించాడని తెలుస్తుంది. అయితే ఆతను తెలుగువాడనే ఒక వాదన కూడా వుంది. అనురాధపురంలోని మహావిహారంలోని పెద్ద బిక్షువులు బుద్ధఘోషుని వ్యాఖ్యాన పటిమను ప్రశంసిస్తూ అతనిని ‘మోరండఖేటకా’ అని పిలవడం జరిగింది. మోరండఖేటక పదం పాళీకరణం చేయబడిన తెలుగు పదం. అదే విధంగా అతని రచన 'విసుద్ధిమగ్గ'లో పది పన్నెండు వరకు అచ్చ తెలుగు పదాలు సైతం దొర్లాయి.[1] దీని ప్రకారం ప్రకారం బుద్ధఘోషుడు తెలుగువాడని భావించవచ్చు. ఆ ప్రకారంగా చూస్తె అతని జన్మస్థలం గుంటూరు జిల్లాలోని కోట నెమలిపురం కావచ్చు. లేదా నెమలి గుడ్లపల్లి లేదా నెమలి గుడ్లూరు కావచ్చు.

ప్రధాన రచనలు-అనువాదాలు

ఆచార్య బుద్దఘోషుడు ఈ క్రింది పేర్కొన్న 13 అట్టకథలను సింహళ భాష నుండి పాళీ భాషకు అనువదించాడని చెప్పబడింది.[2] విసుద్దిమార్గ తో కలిపి ఇన్ని అట్టకథలను బుద్ధఘోషుడు ఒక్కడే రాసినాడన్న విషయం భాష, శైలి తదితర అంశాల దృష్ట్యా సందేహాస్పదంగా వుంది.[3]

త్రిపీటిక బుద్ధఘోషుడు రాసిన వ్యాఖ్య (Commentary)
వినయ పీటిక నుండి వినయ సమంతపాసాదికా 
ప్రాతిమోక్ష కంఖావితరణి
సుత్త పీటిక నుండి దీఘ నికాయ సుమంగళవిలాసిని
మజ్జిమ నికాయ పాపంచసూదని
సంయుత్త నికాయ సారత్తప్పకాసిని
అంగుత్తర నికాయ మనోరధపూరణి
ఖుద్దక నికాయ నుండి ఖుద్దకపాఠ పరమత్తజోతిక I
దమ్మపదం ధమ్మపద అట్టకథ
సుత్తనిపాఠ పరమత్తజోతిక II,  సుత్తనిపాత అట్టకథ
జాతక జాతకథావన్నన, జాతక అట్టకథ
అభిదమ్మ పీటిక నుండి ధమ్మసంగణి అట్టసాలిని
విభంగ సమ్మోహనవినోదని
ధాతుకథ పంచపకరణ అట్టకథ
పుగ్గలపన్నత్తి
కథావత్తు
యమక
పత్తన

త్రిపీటకాలలోని సారమంతా రంగరించి ఇతను రాసిన ‘విసుద్ధిమగ్గ‘(Path of Purification) అనే గ్రంథం త్రిపీటకాలను అవగతం చేసుకునేందుకు కీలకమైంది. బుద్ధుని విమోచన మార్గాన్ని సమగ్రంగా వివరించిన ఈ గ్రంధం థేరవాదంలో అత్యంత ప్రామాణిక బౌద్ధ గ్రంధంగా నిలిచింది. ఈ గ్రంధంలో సింహళ మహావిహార సంప్రదాయ సిద్ధాంతం మొత్తం చెప్పబడింది.బుద్ధఘోషుని తొలి గ్రంధం 'జ్ఞానోదయం' తప్ప మిగిన గ్రంధాలన్నీ ఇప్పటికీ నిలిచి వున్నాయి.

రిఫరెన్సులు

మూలాలు

  1. బోధచైతన్య. శీలం - ధ్యానం (2012 ఆగస్ట్ ed.). హైదరాబాద్: ధర్మదీపం ఫౌండేషన్. p. 4.
  2. Table based on (Bullitt 2002) For translations see Atthakatha
  3. బోధచైతన్య. శీలం - ధ్యానం (2012 ఆగస్ట్ ed.). హైదరాబాద్: ధర్మదీపం ఫౌండేషన్. p. 5.