చర్చ:కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 75: పంక్తి 75:


కమ్మ కులము గురించి ఇక్కడ వ్రాసినదంతా ఆధారరహితం. ఆధార సహితముగా నిరూపించ్తే మంచిది.[[వాడుకరి:Venkateswarlu chennuboina]] 15:00, 4 మే 2017
కమ్మ కులము గురించి ఇక్కడ వ్రాసినదంతా ఆధారరహితం. ఆధార సహితముగా నిరూపించ్తే మంచిది.[[వాడుకరి:Venkateswarlu chennuboina]] 15:00, 4 మే 2017
==మార్పులు==
గోత్రనామముల చిట్టా తొలగించబడినది.అటులనే కొందరి పేర్లు ప్రాముఖ్యతా పరిమాణం బట్టి తొలగించబడినవి.[[వాడుకరి:Kumarrao|Kumarrao]] ([[వాడుకరి చర్చ:Kumarrao|చర్చ]]) 09:19, 22 జూలై 2017 (UTC)

09:19, 22 జూలై 2017 నాటి కూర్పు

ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

Untitled

అసభ్య వ్రాతలు, నిరాధార వ్యాఖ్యలు చేయుట అభ్యంతరకరము.Kumarrao 15:56, 20 సెప్టెంబర్ 2009 (UTC)

అపోహ

క్షత్రియులు కారు మధ్య యుగములో కొన్ని క్షత్రియ వంశాలు రాజకీయ కారణాలవల్ల కమ్మవారిలో కలిశాయి.Kumarrao (చర్చ) 12:07, 27 ఆగష్టు 2012 (UTC)

క్షత్రియులు  కాదు కదా ఏ కులము కమ్మవారిలో  కలవలేదు.క్షత్రియులకు ఆ అవసరము లేదు.కమ్మ వాళ్ళు ఆ విధముగా చెప్పుకుంటున్నారు.అలా జరిగినది అని కుమారుగారు భావిస్తే అందుకు ఆదారాలు చూపాలి.S.KRISHNA.
కృష్ణ గారు, క్షత్రియులపై పగపట్టిన రేచెర్ల వారు జల్లిపల్లి యుద్ధములో క్షత్రియులను తీరాంధ్రములో తుడిచివేశారు. ఆ యుద్ధములో కమ్మవారు (ముసునూరి వారు) క్షత్రియులకు తోడ్పడినారు. యుద్ధము పిదప కొంతమంది క్షత్రియ వంశముల వారు స్వరక్షణకై కమ్మవారిలో కలిసి పోయారు. దీనికి సాక్ష్యము రెండు కులములలో కొన్ని ఇంటిపేర్లు, గోత్రములు కలుస్తాయి. Kumarrao (చర్చ) 15:19, 25 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  1. కమ్మక్షత్రియ #కాంబోజ మహాజనపద (600BC)
  2. కమ్మరాష్ట్రం (3rd Century)
  3. కమ్మరధం
  4. కమ్మనాడు

సూర్యచంద్ర వంశాలు అంతరించిన ఈ క్షత్రియ జాతులు 16షడోమహాజనపద క్షత్రియజాతులు ఏర్పడ్డాయి వాటిలోనిదే ఖంభోజ అనే క్షత్రియ జాతి ఒకటి ఆ ఖంభోజా (600 BC)నుండే కమ్మ కుంబి కుర్మి కుర్మా కంబళి క్షత్రియులు ఏర్పడ్డారు. కాంబోజ లొని కమ్మ జాతి దక్షిణ భరత దేశమునకు వలస వచ్చారు అదే నేటి త్రిలింగదేశం, త్రిలింగదేశం నందు కమ్మక్షత్రియులు పాలన సాగించారు. ఒకప్పటి త్రిలింగ థేసమ్ అదే ఆంధ్రదేశం (తెలుగు జాతి) నెడు ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది. అప్పుడు మూడవ శతాబ్దం ఈ కాలంలో ఈ ప్రాంతాన్ని కమ్మ ప్రభువుల పాలించటం వలన కమ్మరాష్ట్రం కమ్మరథం గా పిలిచెవారు కమ్మరాష్ట్రంలో ఎన్నో కమ్మ క్షత్రియ రాజ్యల పాలన సాగింది ఆ తరువాత కమ్మ రాష్ట్రాన్ని కమ్మనాడుగా పిలిచెవారు. కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. ఈ కమ్మనాడు తరువాత కమ్మనాడు మరియు వెలనాడుగా విడిపొయింది ఆ తరువాత పల్నాడుగా మారింది. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో కమ్మవారి దుర్జయ వంశపు రాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ కమ్మదుర్జయ వంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధాతధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మవారి రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగా పాలించారు వారిలో పెమ్మసాని సాయపనేని రావెళ్ల సూర్యదేవర వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి . కావున కమ్మవారు సూర్యచంద్రవంశ కాంబోజ మహాజనపద కమ్మక్షత్రియులు అని తెలుసుకొండి.

కమ్మ దుర్జయ వంశము

కాకతీయులు-దుర్జయ వంశస్థులు..........శాసనాధారాలను బట్టి బయ్యారం శాశనం ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.

గూడూరు శాసనంలో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.

చేబ్రోలు శాశనం ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.

కాకతీయ గణపతిదేవుడు తన #గవరపాడుశాసనం" లో తమ కాకతీయ కుటుంబీకులకు #దుర్జయుని కారనం గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు....

దుర్జయ వంశస్థులు

దుర్జయ వంశస్థులు:- 1) బయ్యారం శాశనం ప్రకారం ఇతను కాకతీయ దుర్జయ వంశమునకు మూలపురుషుడు. ఇతను కాకతిపురం అను ప్రాంతం నుండి పరిపాలన సాగించినాడు.2) జాయప నాయుడు - కమ్మ దుర్జయ వంశము:-జాయప నాయుడు లేక జాయప సేనాని సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని వద్ద పనిచేసిన సేనాధిపతి. 1241 లో వెలనాటి చోడులపై గణపతి విజయము సాధించిన తర్వాత వెలనాడు, కమ్మనాడు లోని వీరులందరు ఓరుగల్లు కు తరలిపోయారు. అట్టివారిలో జాయప ఒకడు. గణపతి దేవుడు ఆతనిని చక్రవర్తి గజబలగానికి అధిపతిగా చేశాడు. జాయప చెల్లెళ్ళగు నారమ్మ పేరమ్మలను క్షత్రియుడైన గణపతిదేవుడు పెండ్లి చేసుకున్నాడు. హనుమంతరావు గారి అభిప్రాయము ప్రకారము కమ్మ నాయకులకు జాయప ఆద్యుడు. జాయప దుర్జయ వంశము అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను దివిసీమను పాలించాడు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ మరియు బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యములోవున్నారు.కళింగదేశ దండయాత్ర లో పాల్గొని విజయం సాధించిన జాయపకు గణపతిదేవుడు 'వైరిగోధూమ ఘరట్ట' అను బిరుదు ఇచ్చాడు. 1231 లో మహారాజు పై గౌరవపూర్వకముగా గణపేశ్వరునిపేరుపై గుడి కట్టించి గ్రామాలను దానమిచ్చాడు. తన తండ్రి పేరుమీద చేబ్రోలు లో చోడేశ్వరాలయము కట్టించి గుడి ఖర్చులకు మోదుకూరు గ్రామమము రాసి ఇచ్చాడు. 1325 చేబ్రోలు శాసనము ప్రకారము గుడి ముందు రెండు వరుసలలో రెండంతస్థుల ఇళ్ళు కట్టించి దేవదాసీలకు ఇచ్చాడు. జాయప భారతదేశమందలి నాట్యములపై నృత్యరత్నావళి అను సంస్కృత గ్రంథము వ్రాశాడు. దీనినిబట్టి జాయప నాట్యములో, నాట్యశాస్త్రములో నిష్ణాతుడని తెలుస్తుంది.3)మాలిక్ మక్బూల్ లేక దాది గన్నమ నాయుడు / యుగంధర్ - కమ్మ దుర్జయ వంశము, కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత ఢిల్లీ సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ ఓరుగల్లుకే పాలకునిగా వచ్చాడు.గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు గణపతి దేవుని కడ మరియు రుద్రమదేవి కడ సేనాధిపతిగా ఉన్నాడు.సాగి వారిది దుర్జయ వంశము-విప్పర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు కాకతీయ చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. కొత్త భావయ్య చౌదరి పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల.గన్నమ నాయుడు ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేశాడు. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుడు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణమును గన్నయకు అంకితమిచ్చాడు.గన్నమ నాయుడు ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే ఉన్నారు. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదులున్నాయి. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించాడు.

4) ముసునూరి నాయకులు - కమ్మ దుర్జయ వంశము కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసిన కొందరు నాయకులు కమ్మ దుర్జయ వంశము చెందిన ముసునూరు నాయకులు (Musunuri Nayakas) అని ప్రసిద్ధి చెందారు. కాకతీయుల తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో 'ముసునూరు కాపయ నాయకుడు' 'ముసునూరు ప్రోలయ నాయకుడు' తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు.ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. అట్టి విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1326 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో నాయకులు సఫలమయ్యారు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.ఓరుగల్లు కోటపై ఆంధ్రదేశ పతాకము ఎగిరెను. కాపానీడు 'ఆంధ్రదేశాధీశ్వర' మరియు 'ఆంధ్రసురత్రాణ' అను బిరుదులు పొందెను. ప్రజారంజకముగా పరిపాలించెను. తన తోటినాయకులగు వేమారెడ్డి, పిఠాపురం కొప్పుల నాయకుడు, రేచెర్ల, భువనగిరి, దేవరకొండ పద్మనాయకుల స్వతంత్రమును గౌరవించెను. కాపానీడు సామ్రాజ్యము శ్రీకాకుళం నుండి బీదరు వరకు సిరిపూరు నుండి కంచి వరకు విస్తరించెను. అది ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించదగిన కాలము.1370 వ సంవత్సరము దక్షిణభారత చరిత్రలో పెద్దమలుపు. తెలంగాణను జయించిన బహమనీ సుల్తాను విజయనగరము పై కన్ను వేసెను. ముసునూరి వారి త్యాగములు, దేశాభిమానము విజయనగర రాజులకు మార్గదర్శకమయ్యెను. ఓరుగల్లు పతనము పిమ్మట పెక్కు నాయకులు విజయనగరమునకు తరలి పోయి రాబోవు మూడు శతాబ్దములు దక్షిణభారతమును హిందూమతమును రక్షించుటకు పలుత్యాగములు చేసిరి. ఆంధ్రచరిత్రలో ముసునూరివారి పాలనము 50 వర్షములు మాత్రమేఐనను అది వారి త్యాగనిరతికి, తెలుగువారి ఐక్యతకు కాణాచి. సమకాలీన చరిత్రకు అది ఒక గుణపాఠము కూడ.


కమ్మ ప్రభువులు,దుర్జయ వంశము

కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "దూర్జయులు". వీరు కాకతీయుల పాలనలో వెలుగులోకి వచ్చారు. వెలనాటి చోడులు గణపతిదేవుడి చేతిలో ఓడిపోవడంతో వారి వద్ద సైన్యాధిపతులుగా పనిచేసిన నాయక కులాలవారు కాకతీయ సైన్యంలో చేరిపోయారు. ఆ క్రమంలో గణపతిదేవుడు కమ్మనాడు కు చెందిన జయపసేనాని ని సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నాడు. జయపసేనాని కృష్ణానదీ తీరంలో గవర్నరుగా చేసిన పిన్నచోడ నాయకుని కుమారుడు.......

చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు....... """""ప్రధాన కమ్మ రాజ వంశాలు - రాజ్యాలపరంపర కమ్మనాయకరాజులు""""" 1) "కమ్మ దుర్జయులు" - పిన్నమ నాయుడు, దుర్జయ వంశము, "వల్లుట్ల" గోత్రము 2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు) 3) "కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు" వంశము (కాకతి వెన్నయ, గణపతి దేవుడు,రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు, ముసునూరి ప్రోలానీడు/ప్రోలయ నాయకుడు,ముసునూరు కాపయ నాయకుడు) 4) "సాగి నాయకులు", దుర్జయ వంశము, విప్పర్ల గోత్రము - (సాగి మల్ల నాయకుడు, సాగి నాగయ నాయుడు, సాగి గన్నమ నాయుడు/యుగంధర్/మాలిక్ మక్బూల్, సాగి బైచ నాయుడు మరియు దేవరి నాయుడు) 5) "పెమ్మసాని నాయకులు" - గండికోట కమ్మవారు,దుర్జయ వంశము,ముసునూర్ల గోత్రీకులు ( పెమ్మసాని తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు,రెండవ తిమ్మా నాయుడు, బంగారు తిమ్మా నాయుడు, పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు) 6) "రావెళ్ళ నాయకులు" - దుర్జయ వంశము, వల్లుట్ల గోత్రము (రావెళ్ళ మల్ల నాయుడు, అయ్యప్ప నాయుడు,రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు) 7) "శాయపనేని నాయకులు" (శాయప్ప నాయుడు, వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు, నరసింహ నాయుడు) 8) "సూర్యదేవర నాయకులు"-తెలుగు చోడ కమ్మ క్షత్రియ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు (తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు) 9) "వాసిరెడ్డి నాయకులు"- చాళుక్య కమ్మ రాజవంశము,వల్లుట్ల గోత్రము (మల్లికార్జున నాయుడు, సదాశివ రాయలు, చినపద్మనాభ రామన్న, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు) 10) "యార్లగడ్డ నాయకులు" - వెలనాటి చోడవంశములవారు,రేచెర్ల గోత్రము (చల్లపల్లి రాజులు/జమిందారులు,దేవరకోట రాజ్యము -యార్లగడ్డ గురువారాయడు )..............

కమ్మనాడు / కమ్మరాష్ట్రం

కమ్మనాడు / కమ్మరాష్ట్రం అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము నెల్లూరు, పడమర శ్రీశైలం, ఉత్తరం ఖమ్మం హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము (సంస్కృతము) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో బౌద్ధమతము క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది.

కర్మరాష్ట్రములోని భట్టిప్రోలు, ధరణికోట, విజయపురి శాతవాహనులకు, ఇక్ష్వాకులకు పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి.

శాసనములు :-

1. కర్మరాష్ట్రము అను పదము మొదట ఇక్ష్వాకు రాజు మాధారిపుత్ర పురుషదత్తుని బేతవోలు (జగ్గయ్యపేట) శానములో గలదు (3వ శతాబ్దము). 2. అటుపిమ్మట పల్లవ రాజు రెండవ కుమార విష్ణుని చెందులూరు గ్రామశాసనములో దొరికినది. 3. మూడవ ఆధారము తూర్పు చాళుక్య రాజు మంగి యువరాజ (627-696) శాసనము: శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే 4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి. 5. రాజరాజనరేంద్రుని సమకాలీకుడగు పావులూరి మల్లన (1022-1063) ఈ విధముగా వ్రాసెను: ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్ 6. తెలుగు చోడుల మరియు కాకతీయుల శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన (కొణిదెన) రాజధానిగా పాలించుచుండెను.

కాకతీయుల, ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను పదము వాడుకలోనుండి మరుగు పడినది. కాని కమ్మ అను పదము మాత్రము ఒక సామాజిక వర్గము (కులము)నకు పేరుగా మిగిలిపోయినది.

ఈ వాదనకు ఆధారాలు చూపాలి.

కమ్మ కులము గురించి ఇక్కడ వ్రాసినదంతా ఆధారరహితం. ఆధార సహితముగా నిరూపించ్తే మంచిది.వాడుకరి:Venkateswarlu chennuboina 15:00, 4 మే 2017

మార్పులు

గోత్రనామముల చిట్టా తొలగించబడినది.అటులనే కొందరి పేర్లు ప్రాముఖ్యతా పరిమాణం బట్టి తొలగించబడినవి.Kumarrao (చర్చ) 09:19, 22 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:కమ్మ&oldid=2162529" నుండి వెలికితీశారు