బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
+ వర్గాలు
పంక్తి 4: పంక్తి 4:
==మూలాలు==
==మూలాలు==
<references/>
<references/>

[[వర్గం:1922 జననాలు]]
[[వర్గం:ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శులు]]
[[వర్గం:ఈజిప్టు ప్రముఖులు]]


[[en:Boutros Boutros-Ghali]]
[[en:Boutros Boutros-Ghali]]

20:33, 26 డిసెంబరు 2007 నాటి కూర్పు

బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ (Boutros Boutros-Ghali) 1922, నవంబర్ 14న ఈజిప్టు రాజధాని నగరం కైరోలో జన్మించినాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు ఐక్యరాజ్య సమితికి 6 వ ప్రధానా కార్యదర్శిగా 1992జనవరి నుంచి 1996 డిసెంబర్ వరకు పదవిని నిర్వహించినాడు.

బౌత్రోస్ ఘలి 1946లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. 1949లో పారిస్ విశ్వవిద్యాలయం నుమ్చి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. 1977 నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొని మాసాముల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించినాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అద్యక్షుడు అన్వర్ సాదత్ కు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మద్య శాంతి ప్రయత్నాలు కొనసాగించినాడు [1]. 1991లో బౌత్రోస్ ఘలీ ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు. ఇతని పదవీకాలం సంక్లిష్తంగా గడిచిమ్ది. ముఖ్యంగా 1994 లో సంభవించిన ర్వాండా దమనకాండలో 9 లక్షల మందికి పైగా హత్యకు గురైనారు. ఈ విషయంలో బౌత్రోస్ ఘలీ తీవ్రంగా విమర్శల పాలైనాడు. అంగోలా అంతర్యుద్ధం, యుగొస్లావ్ యుద్ధాలు కూడా ఈ కాలంలోనే జరిగాయి. 1996లో రెండో పర్యాయం కొరకు ఈజిప్టు, గినియా బిస్సౌ, బోట్స్‌వానాతో సహా భద్రతా మండలి లోని 10 తాత్కాలిక దేశాలు ప్రతిపాదించిననూ అమెరికా వీటో ఉపయోగించి మరో పర్యాయం బఒత్రోస్ ఘలీకి అవకాశం ఇవ్వలేదు. రెండో పర్యాయం ఎన్నిక కాని మొదటి వ్యక్తిగా చరిత్రలో నిల్చిపోయినారు. అతని తర్వాత కోఫీ అన్నన్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టినాడు.

మూలాలు

  1. Boutros Boutros-Ghali: The world is his oyster