లారీ డ్రైవర్: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 13: | పంక్తి 13: | ||
== కథ == |
== కథ == |
||
రంగనాయకులు అనే వ్యక్తి డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రంగనాయకులు వారిని మోసం చేస్తుంటాడు. |
రంగనాయకులు అనే వ్యక్తి డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రంగనాయకులు వారిని మోసం చేస్తుంటాడు. జయమ్మ కొంతకాలం లారీని అద్దెకు తీసుకుని తర్వాత బ్యాంకు లోను సహాయంతో తానే ఒక లారీ కొనుక్కుంటుంది. తనలాగే మిగతా డ్రైవర్లను కూడా లారీ యజమానులు కమ్మని బ్యాంకు మేనేజరుతో మాట్లాడుతుంది. అందరూ తమ భార్య దగ్గర ఉన్న పుస్తెలతో సహా అమ్మి బ్యాంకు మేనేజరు చేతిలో పెడతారు. అయితే ఆ మేనేజరు రంగనాయకులుతో కుమ్ముక్కై వారిని మోసం చేస్తాడు. బాలమురళి వెళ్ళి అతనికి ఎదురు తిరుగుతాడు. అతను తప్పించుకుని పారిపోబోతాడు కానీ బాలమురళి, డ్రైవర్లందరూ కలిసి లాయరు సహాయంతో కేసు పెడతారు. బ్యాంకు మేనేజరు వెళ్ళి రంగనాయకులు సహాయం కోరతాడు. కానీ అతను ఏమీ చేయలేనంటాడు. బ్యాంకు మేనేజరు అప్రూవరుగా మారిపోతానని వెళ్ళిపోతుండగా రంగనాయకులు దగ్గరున్న రౌడీ అతన్ని హత్య చేస్తాడు. |
||
==తారాగణం== |
==తారాగణం== |
11:26, 13 అక్టోబరు 2017 నాటి కూర్పు
లారీ డ్రైవర్ (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.గోపాల్ |
---|---|
తారాగణం | బాలకృష్ణ , విజయశాంతి, శారద, జయలలిత (నటి) |
సంగీతం | బప్పీ లహరి |
నిర్మాణ సంస్థ | జయా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
లారీ డ్రైవర్ 1990 లో బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రధారులు.
కథ
రంగనాయకులు అనే వ్యక్తి డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రంగనాయకులు వారిని మోసం చేస్తుంటాడు. జయమ్మ కొంతకాలం లారీని అద్దెకు తీసుకుని తర్వాత బ్యాంకు లోను సహాయంతో తానే ఒక లారీ కొనుక్కుంటుంది. తనలాగే మిగతా డ్రైవర్లను కూడా లారీ యజమానులు కమ్మని బ్యాంకు మేనేజరుతో మాట్లాడుతుంది. అందరూ తమ భార్య దగ్గర ఉన్న పుస్తెలతో సహా అమ్మి బ్యాంకు మేనేజరు చేతిలో పెడతారు. అయితే ఆ మేనేజరు రంగనాయకులుతో కుమ్ముక్కై వారిని మోసం చేస్తాడు. బాలమురళి వెళ్ళి అతనికి ఎదురు తిరుగుతాడు. అతను తప్పించుకుని పారిపోబోతాడు కానీ బాలమురళి, డ్రైవర్లందరూ కలిసి లాయరు సహాయంతో కేసు పెడతారు. బ్యాంకు మేనేజరు వెళ్ళి రంగనాయకులు సహాయం కోరతాడు. కానీ అతను ఏమీ చేయలేనంటాడు. బ్యాంకు మేనేజరు అప్రూవరుగా మారిపోతానని వెళ్ళిపోతుండగా రంగనాయకులు దగ్గరున్న రౌడీ అతన్ని హత్య చేస్తాడు.
తారాగణం
- బాలమురళి గా బాలకృష్ణ
- జయమ్మ గా విజయశాంతి
- కలెక్టరు గా శారద
- పోలీసు అధికారి గా విజయకుమార్
- రంగనాయకులు గా రాజా కృష్ణమూర్తి
- లాయరు గా రావు గోపాలరావు
- జయలలిత
- రామిరెడ్డి
- బ్రహ్మానందం
- దేవదాస్ కనకాల
- రాజా కృష్ణమూర్తి
- బాబూ మోహన్
- వినోద్
- బ్యాంకు మేనేజరు గా జయప్రకాశ్ రెడ్డి
- తనికెళ్ళ భరణి
- అంజు
- మాస్టర్ హరి
సాంకేతికవర్గం
- దర్శకుడు: బి.గోపాల్
- నిర్మాత: ఎస్.జయరామారావు
- రచన: పరుచూరి సోదరులు
- గేయరచన: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
- సంగీతం: కె.చక్రవర్తి
- ఛాయాగ్రహణం: స్వామి
- శిల్పం: రాజు
- నృత్యాలు: రఘురాం, సుందరం
- సంయుక్త దర్శకత్వం: గోగినేని నరసింహారావు
- సాహసాలు: రాజు
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- సమర్పణ: రావు గోపాలరావు
పాటలు
ఈ సినిమాకు బప్పీలహరి సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశాడు.
- దసరా వచ్చిందయ్యా
- రింగు రింగు జాణా
- మావా మంచమెక్కు
- బాలయ్య బాలయ్య