Coordinates: 16°39′43″N 82°00′48″E / 16.6620488°N 82.0132452°E / 16.6620488; 82.0132452

అయినవిల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., తరువాత కాలంలో → తరువాతి కాలంలో, → (4) using AWB
చి →‎బయటి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 152: పంక్తి 152:
{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}
{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}
{{అయినవిల్లి మండలంలోని గ్రామాలు}}
{{అయినవిల్లి మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]

02:20, 23 అక్టోబరు 2017 నాటి కూర్పు

అయినవిల్లి
—  రెవిన్యూ గ్రామం  —
అయినవిల్లి is located in Andhra Pradesh
అయినవిల్లి
అయినవిల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°39′43″N 82°00′48″E / 16.6620488°N 82.0132452°E / 16.6620488; 82.0132452
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం అయినవిల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
వైశాల్యం [1]
 - మొత్తం 10.22 km² (3.9 sq mi)
జనాభా (2011)[1]
 - మొత్తం 8,336
 - పురుషుల సంఖ్య 4,069
 - స్త్రీల సంఖ్య 4,000
 - గృహాల సంఖ్య 1,964
పిన్ కోడ్ 533 211
ఎస్.టి.డి కోడ్

అయినవిల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామము.[2] పిన్ కోడ్: 533 211 . కోనసీమగా ప్రసిధ్ది చెందినది. ఈ గ్రామం పరిసర ప్రాంతాలు చాలా అందం ఉంటాయి. కోబ్బరి తోటలు, గోదావరి నది ఒడ్డు, పచ్చని పోలాలు, కాలువలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఐనవల్లి కాకినాడకు 72 కి.మీ. ( వయా యానాం, అమలాపురం, ముక్తేశ్వరం),రాజమండ్రికి 55 కి.మీ. ( వయా రావులపాలెం,కొత్తపేట,వనపల్లి), అమలాపురానికి 12 కి.మీ. ( వయా ముక్తేశ్వరం) దూరం లోఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ప్రాంతం దేవాలయాలు ఉండడానికి చాలా అనువైన ప్రదేశం. ఎందువలననంటే ఈ ప్రదేశం చుట్టు పర్వతశ్రేణులు, నదులు కలుస్తున్న స్థలం. వర సిద్దివినాయక వినాయకుని దేవాలయం చాలా ప్రసిధ్ది చెందినది.

స్థలపురాణం

ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. స్వయంభువ వినాయకక్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు.మరొక కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారత దేశ యాత్ర ప్రారంభసమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు.

ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనది స్థలపురాణం వివరిస్తుంది. పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది.. ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడనీ తరువాతి కాలంలో వారే మూగ, చెవిటి,గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థలపురాణం వివరిస్తుంది.

ఆలయప్రశస్థి

అయినవిల్లి గ్రామంలోని వినాయక దేవాలయం

సువిశాలమైన ఆవరణలో ఎతె్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాల యంలో శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ప్రతీ దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయి తే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహాద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, గృహాలు సంవృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢవిశ్వాసం. రెండు గోపురాలతోచూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవునికి, శివునికి, శ్రీఅన్నపూర్ణాదేవికి, శ్రీకాలభైరవస్వామికి ఉపాయాలు ఉన్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తున్నారు.ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. దక్షిణ గోపురం ద్వారా ఆలయానికి చేరితే వినాయకుడిని దర్శనం చెసుకోవచ్చు. ఇక్కడ స్వామి దక్షిణ ముఖుడై ఉన్నాడు. ప్రధాన ఆలయంలోని విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి తూర్పు గోపురం నుండి ప్రవేశించవచ్చు. ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయం లోనే శ్రీదేవి, భూదేవి సమేతుడైన కేశవ స్వామి ఉన్నారు. అన్నపూర్ణా దేవి ఆలయం కూడా ఈ ఆలయ సన్నిధిలో ఉంది. ఆలయానికి క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు గుడి కూడా ప్రధానాలయ ప్రాంగణం లోనే ఉంది. ఈ ఆలయానికి వివిధ ప్రదేశాలనుండి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకొంటారు. ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమశాస్త్రానుసారంగా జరుగుతాయి.

ప్రత్యేక పూజలు

ఈ ఆలయంలో ప్రతీనెలా కృష్ణపక్ష మరియు శుక్లపక్ష చవితి తిధులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో సిద్ధివినాయకునికి విశేషార్చనలు జరుపుతారు. ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికా యలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకొ నడం విశేషం. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని విశ్వసిస్తున్నారు. అయినవిల్లి సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతోపాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తున్నారు.

ఈ క్షేత్రంలో భాద్రపద శుద్ధ చవితి,కార్తీక మాసంలో మొదటి సోమవారం, నాలవ సోమవారం, కృష్ణాష్టమి రోజున గ్రామోత్సవం నిర్వహిస్తారు. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాలవారు సైతం పాల్గొనే ఈ ఉత్సవం చూడటానికి అనేకాంది భక్తులు వస్తుంటారు.

పండుగలు

ఆలయ చిరునామా

శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం
అయినవిల్లి గ్రామం మరియు మండలం,
తూర్పు గోదావరి జిల్లా.
పిన్-533 211,
టెలిఫోన్ సంఖ్య:08856 - 225812.

గ్రామము.[3].లోని ప్రముఖులు (నాడు/నేడు)

  1. పుల్లెల శ్రీరామచంద్రుడు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,069.[4] ఇందులో పురుషుల సంఖ్య 4,069, మహిళల సంఖ్య 4,000, గ్రామంలో నివాసగృహాలు 1,964 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. 1.0 1.1 "District Census Handbook - East Godavari" (PDF). Census of India. pp. 16, 414. Retrieved 1 April 2017.
  2. "Mandal wise list of villages in Srikakulam district" (PDF). Chief Commissioner of Land Administration. National Informatics Centre. Archived from the original (PDF) on 21 January 2015. Retrieved 7 March 2016.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; censusindia.gov.in అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14

బయటి లింకులు