కోట సామ్రాజ్యము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 50: పంక్తి 50:


==ఇంకా చదవండి==
==ఇంకా చదవండి==
*[[కమ్మ]]
*[[క్షత్రియులు]]
*[[ఆంధ్ర క్షత్రియులు]]
*[[ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు]]
*[[ధనుంజయ గోత్రం]]
*[[గృహనామ సీసమాలిక]]
*[[కాకతీయులు]]
*[[కాకతీయులు]]



17:42, 7 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

పరిచయం

ధరణి కోట వంశము

1100–1400
స్థాయిసామ్రాజ్యము
రాజధానిధరణికోట (గుంటూరు)
సామాన్య భాషలుతెలుగు
మతం
జైన మతం
ప్రభుత్వంసార్వభౌమ(ఏకవ్యక్తి) పాలన
చరిత్ర 
• స్థాపన
1100
• పతనం
1400
గండభేరుండం

చాళుక్య, చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), తాడికొండ (గుంటూరు జిల్లా), యనమదల (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండి సుమారు 400 సంవత్సరాల పాటు పాలించారు. వీరు చంద్రవంశంలో ధనుంజయ గోత్రానికి చెందినవారు [1][2]. కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్థుడైన హరిసీమ కృష్ణుడు స్థాపించాడు[1].

విశేషాలు

కోట రాజులు మొదట్లో జైన మతాన్ని ఆచరించినా తర్వాత కాలంలో చాళుక్యుల వలె హిందూ మతాన్ని కూడా ఆచరించారు. శైవ తత్వాన్ని కూడా ప్రోత్సహించారు. వీరికి తూర్పు చాళుక్యులతోను, సూర్యవంశీయులైన కాకతీయులతోను వివాహ సంబంధాలుండేవి. కాకతీయ గణపతి దేవుని రెండవ కుమార్తె అయిన గణపాంబను కోట బేతరాజు వివాహమాడాడు. మంగళగిరి ఆనంద కవి వ్రాసిన 'విజయనందన విలాసము' లో హరిసీమ కృష్ణుడు చంద్రవంశానికి చెందినవాడని వ్రాయబడినది [3]. క్రీస్తు శకము 1182 ప్రాంతంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహాయం చేయడానికి కాకతీయ రుద్రదేవరాజు కొంత సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యం ధరణికోటను ముట్టడించి జయించింది. కోట దొడ్డభీమరాజు మరణించాడు. ఆనాటి నుండి కోట వంశీయులు కాకతీయులకు సామంతులయ్యారు. 1323 వ సంవత్సరంలో మహమ్మదీయుడైన ఉయిన్ ఖాన్ కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించాడు. ఆ సందర్భంలో కోట వంశం కూడా రాజ్యం కోల్పోయింది. ఈ వంశం వారు చెదిరిపోయి దాట్ల, పాకలపాడు, చింతలపాడు, జంపన వంటి గ్రామాలకు వెళ్ళిపోయారు [4].

కోట సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు:

  • భీమరాజు 1 - క్రీస్తు శకం 1108-1127
  • బేతరాజు 2 - క్రీస్తు శకం 1127-1148
  • బేతరాజు 3 - క్రీస్తు శకం 1148-1156
  • భీమరాజు 2 - క్రీస్తు శకం 1156-1188
  • కేత రాజు 1 - క్రీస్తు శకం 1182-1231 - ఇతడు కాకతీయ గణపతి దేవుడి రెండవ కుమార్తె గణపాంబను వివాహమాడాడు.
  • భీమరాజు 3 - క్రీస్తు శకం 1231-1234
  • కేతరాజు 2 - క్రీస్తు శకం 1234-1240
  • గణపతిదేవ - క్రీస్తు శకం 1240-1262
  • భీమరాజు 4 - క్రీస్తు శకం 1262-1268
  • దేవరాజు - క్రీస్తు శకం 1268
  • దంతులూరి గన్నభూపాలుడు - క్రీస్తు శకం 1400.

ఇతర విషయములు

కోట రాజులు ఈ క్రింది బిరుదు గద్యమును ఉత్సవ సందర్భాల్లో ఉచ్చరించేవారు:

స్వస్తి సమస్త పంచ మహా శబ్ద మహామండలేశ్వర| రాజ పరమేశ్వర| ఈశ్వర పదవీ విరాజమాన| విజయవినోద| .... మల్ల చోళ సింహ చోళ, శార్దూల| మత్త మాతంగ| హరిరాయాస్తాన గజసింహ| బౌద్ధకండకుద్దాల| పాండియరాయమగ| ధనుంజయ గోత్ర పవిత్ర| ... రాజు పేరు జగమొచ్చు గండండు| బంటు పేరు పగమెచ్చు గండండు| ఖడ్గం పేరు కాలమృత్యువు| రేవు పేరు పాప వినాశనంబు| నదిపేరు కృష్ణవేణి| దేవర పేరు అమరేశ్వర దేవుండు| పట్టణంబు పేరు ధరణాల కోట| వాటి పేరు ధన్య వాటి| వీటి పేరు గండరగండ వీడు| పడగ పేరు గండభేరుండ| .... అంబ దేవర భూపాలుండు మొదలైన శ్రీ కోట రాజుల అన్వయ ప్రశస్తి| విజయీభవ| దిగ్విజయీభవ !! [5]. గండభేరుండ పక్షి బొమ్మను రాజముద్రగా చాళుక్యులు వాడినట్టే, వీరు కూడా వాడారు.

అపోహ

కోట ప్రభువులు రాజు కులస్థులని (ఆంధ్ర క్షత్రియులు ) అని ఒక తప్పుడు అపోహ ఉంది. దీనికి కారణం వారికి కూడా కోట గృహనామం ఉండటమే. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఏలన కోట ప్రభువులు స్వయంగా "చతుర్దాన్వయ" అని శాసనం వేయించారు. దీని అర్థం సచ్చుధ్రులు అని. కమ్మవారు జైన, బౌద్ధ మతాల నుండి హిందూ మతంలోకి మారారు. అప్పుడు వారిని సచ్చుధ్రులుగా పరిగణించారు. కమ్మవారికి ఋషి గోత్రాలు లేకపోవడానికి ఇదే కారణం. కాని ఆ రోజుల్లో ఆచారం ప్రకారం పాలకులకి ఋషి గోత్రం ఉండాలి. అందుకే పదహారుఅనాలా కమ్మ ప్రభువులైన పెమ్మసాని, రావెళ్ల, మేదరమెట్ల వారికి కాశ్యప గోత్రం, కోట ప్రభువులకి ధనుంజయ గోత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ కోట ప్రభువులని రాజు కులస్తులని పరిగణించ దల్చుకుంటే వారు వారి క్షత్రియ హోదాని వొదులుకొని సచ్చుద్రులుగా అంగకరించాల్సి ఉంటుంది. మరొక విషయం ఏమంటే నేటి రాజు కులస్థులలో కోట గృహనామం కలవారికి ధనుంజయ గోత్రం లేదు. కేవలం ఊరిపేర్లు ఇంటిపేర్లుగా మారబట్టి కోట గృహనామం వారికి వచ్చింది. కోట ప్రభువులు పదహారణాల కమ్మదుర్జయ వంశ ప్రభువులు[6].

మూలాలు

  1. 1.0 1.1 శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము - బుద్దరాజు వరహాలరాజు, 1970
  2. హిస్టరీ ఆఫ్ ఆంధ్రా కంట్రీ (క్రీస్తు శకం 1000 - 1500) - శ్రీమతి యశోదా దేవి
  3. విజయనందన విలాసము - రచన: మంగళగిరి ఆనందకవి, ముద్రణ: 1919, రామవిలాస ముద్రాక్షర శాల, చిత్రాడ
  4. శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము - బుద్ధరాజు వరహాలరాజు, 1970
  5. స్టడీస్ ఇన్ సౌత్ ఇండియన్ జైనిజం, పార్ట్ 2: ఆంధ్ర - కర్ణాటక జైనిజం, బి. శేషగిరి రావు - 1922, పేజీలు 24, 25; Printers ; Hoe & Co ,
  6. Andhra Kshatriyuluagu Kammavari Charithra, Suryadevara Raghavaiah Chowdary

ఇంకా చదవండి

లంకెలు