పద్మప్రియ జానకిరామన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: {{commons category|Padmapriya Janakiraman}}
పంక్తి 147: పంక్తి 147:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

{{commons category|Padmapriya Janakiraman}}


[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]

19:48, 27 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

పద్మప్రియ జానకిరామన్
పద్మప్రియ జానకిరామన్ (2008)
జననం
పద్మప్రియ జానకిరామన్

(1980-02-28) 1980 ఫిబ్రవరి 28 (వయసు 44)
వృత్తిచలనచిత్ర నటి, ప్రచారకర్త, కూచిపూడి కళాకారిణి
క్రియాశీల సంవత్సరాలు2004 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిజాస్మిన్ షా

పద్మప్రియ జానకిరామన్ భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త మరియు కూచిపూడి కళాకారిణి. 2003లో తెలుగులో వచ్చిన శ్రీనువాసంతిలక్ష్మి అనే చిత్రంద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది. అటుతర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో ప్రధాన పాత్రలను పోషించింది. 5 సంవత్సరాలకాలంలోనే తెలుగు, మలయాళం, బెంగాళీ, తమిళం, కన్నడ మరియు హిందీ చిత్రాలలో నటించడమేకాకుండా, అనేక దక్షిణ భారతదేశ బహుమతులు అందుకుంది.

జననం

పద్మప్రియ ఢిల్లీలోని తమిళ కుటుంబానికి చెందిన జానకిరామన్, విజయ దంపతులకు 1980, ఫిబ్రవరి 28న జన్మించింది. పంజాబ్ లో పెరిగింది. ఈమె డిగ్రీ వరకు సికింద్రాబాద్లో చదివింది. బెంగుళూరులో కొంతకాలం పనిచేసి తర్వాత మోడలింగ్ లో చేరి అలా సినీరంగంలో ప్రవేశించింది. 2001 లో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలుచుకుంది.[1]

సినీరంగ ప్రస్థానం

2003లో తెలుగులో వచ్చిన శ్రీనువాసంతిలక్ష్మి అనే చిత్రంద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది. పద్మప్రియ ఇప్పటివరకు దక్షిణాది భాషల్లో 48 చిత్రాలలో... హిందీ, బెంగాలీ భాషల్లో ఒక్కొ చిత్రంలో నటించింది. నేషనల్ స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. అంతేకాకుండా, వీటితోపాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు సార్లు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఒక్కసారి, మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది.[2]

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2004 శీను వాసంతి లక్ష్మి వాసంతి తెలుగు
కాజ్ఛా లక్ష్మీ మాధవన్ మళయాలం ఏసియానెట్ ఉత్తమ నూతన నటి
అమృతం సైనాబా గోపినాథన్ మళయాలం
2005 తవమై తవమిరుందు వసంతి రామలింగం తమిళం ఫిల్మ్ ఫేర్ - ఉత్తమ తొలిచిత్ర నటి (దక్షిణ)
రాజమాణిక్యం మల్లి మళయాలం
2006 వడుక్కం నాతన్ మీరా మళయాలం ఏసియానెట్ ఉత్తమ నటి (కరుతా పక్షికల్ సినిమా)
పట్టియాల్ సరోజ తమిళం
అశ్వరూదన్ సీతాలక్ష్మీ మళయాలం
భార్గవ చరితం మూనం కందన్ సోఫియా మళయాలం
కరుతా పక్షికల్ పూన్గోడి మళయాలం ఫిల్మ్ ఫేర్ - ఉత్తమ నటి – మళయాలం
ఉత్తమ ద్వితీయ నటి (కేరళ రాష్ట్ర బహుమతి) ఎస్ యువర్ హానర్ కు
ఉత్తమ నటి (ఏసియానెట్ బహుమతి) వడుక్కం నాతన్ కు
ఎస్ యువర్ హానర్ మాయా రవిశంకర్ మళయాలం ఉత్తమ ద్వితీయ నటి (కేరళ రాష్ట్ర బహుమతి) కరుతా పక్షికల్ కు
2007 అంచిల్ ఓరల్ అర్జునన్ పతివ్ర మళయాలం
వీరలిపట్టు పూజ మళయాలం
సతం పోడతే భానుమతి తమిళం
పరదేశి ఉషా మళయాలం
నాలు పెన్నుంగల్ కున్నిపెన్ను మళయాలం
టైం సుసన్ మేరి థామస్ మళయాలం
మిరుగం అజాగమ అయ్యనార్ తమిళం ఉత్తమ నటి (కేరళ రాష్ట్ర బహుమతి)
నామినేట్ (విజయ ఉత్తమ నటి బహుమతి)
2008 పచమరాతనలిల్ అను సచ్చిదానందన్ మళయాలం నామినేట్ (ఫిల్మ్ ఫేర్ - ఉత్తమ నటి)
మై మదర్స్ లాప్ టాప్ పాయల్ మళయాలం
2009 భార్య స్వంతం సుహ్రుతు శ్రీలక్ష్మీ వల్లభన్ మళయాలం
పొక్కిశం నదిరా తమిళం నామినేట్ (ఫిల్మ్ ఫేర్ - ఉత్తమ నటి - తమిళం)
నామినేట్ (విజయ్ అవార్డు - ఉత్తమ నటి)
కథ పరయుం తెరువొరం నీరజ మళయాలం
కన కన్మని మాయరాయ్ మళయాలం
పజ్హస్సి రాజా నీలి మళయాలం (ఫిల్మ్ ఫేర్ - ఉత్తమ సహాయ నటి - మళయాలం)
భూమి ఫౌజియా మళయాలం
2010 స్ట్రైకర్ మధు హిందీ
ఇరుంబుక్కోటి మురట్టు సింగం పప్పలి తమిళం
అందరి బంధువయ పద్దు తెలుగు
తమస్సు డా. శాంతి కన్నడ
కుట్టి స్రాంక్ రేవమ్మ మళయాలం
2011 ఐదోండ్ల ఐదు కన్నడ
సీనియర్స్ ఇందు మళయాలం
స్నేహవీడు సునంద మళయాలం
నాయిక గ్రేసి మళయాలం
2012 అపరాజిత తుమి కుహు బెంగాళీ
కోబ్రా షెర్లీ మళయాలం
మంజడికురు రోజా మళయాలం
బ్యాచలర్ పార్టీ ఐంటెం డాన్సర్ మళయాలం అతిథి పాత్ర
నెంబర్ 66 మధుర బస్ సూర్య పదం మళయాలం
ఇవన్ మేఘరూపన్ అమ్మిని మళయాలం
పోపిన్స్ కంత మళయాలం
2013 మాడ్ దాడ్ డా. రాసియా మళయాలం
పాపిలియో బుద్ధ కలెక్టర్ మళయాలం
లేడిస్ అండ్ జెంటిల్ మెన్ జ్యోతి మళయాలం
తంగా మీన్కల్ ఎవిత తమిళం
2014 బ్రహ్మాం తమిళం అతిథి పాత్ర
ఐయోబింటే పుస్తకం రేహల్ మళయాలం
2017 శివరంజినియుం ఇన్నుయుం సిలా పెంగలం శివరంజని తమిళం
ది ఆర్ఫన్ TBA బెంగాళీ చిత్రీకరణ
చెఫ్ TBA హిందీ చిత్రీకరణ
థియాన్ TBA మళయాలం
క్రాస్ రోడ్ TBA మళయాలం చిత్రీకరణ
ప్రేతముండే సూక్షికుక TBA మళయాలం
పటేల్ సర్ రాజేశ్వరి తెలుగు

వివాహం

పద్మప్రియ న్యూయార్క్, కొలంబియా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే జాస్మిన్ షా అనే వ్యక్తిని ప్రేమించింది. 2014, నవంబరు 12న పద్మప్రియ, జాస్మిన్ వివాహం జరిగింది.[2] వివాహం తరువాత కూడా సినిమాలలో నటిస్తుంది.[3][4]

మూలాలు

  1. టాలీవుడ్ టైమ్స్. "పద్మప్రియ". Retrieved 10 May 2017.
  2. 2.0 2.1 సాక్షి. "పద్మప్రియ ప్రేమ వివాహం". Retrieved 10 May 2017.
  3. సాక్షి. "పద్మప్రియ రీ ఎంట్రీ". Retrieved 11 May 2017.
  4. 6టీవీలైవ్. "పద్మప్రియ సెకండ్ ఇన్నింగ్స్..." Retrieved 11 May 2017.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)