ఎం. ఎస్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 144: పంక్తి 144:
|-
|-
|[[నేను పెళ్ళికి రెడీ]]
|[[నేను పెళ్ళికి రెడీ]]
|
|
|-
|[[శ్రీరామచంద్రులు]]
|
|
|
|

17:17, 2 మార్చి 2018 నాటి కూర్పు

ఎమ్. ఎస్. నారాయణ

జన్మ నామంమైలవరపు సూర్యనారాయణ
జననం (1951-04-16)1951 ఏప్రిల్ 16 / ఏప్రిల్ 16, 1951
మరణం 2015 జనవరి 23(2015-01-23) (వయసు 63)
ప్రముఖ పాత్రలు ఆనందం
నువ్వు నాకు నచ్చావ్
శివమణి
ఇడియట్
అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి
యమదొంగ
దేశముదురు

ఎమ్. ఎస్. నారాయణ (ఏప్రిల్ 16, 1951 - జనవరి 23, 2015) గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు.వీరు ఇంతవరకు దాదాపు 700 [1] చిత్రాలలో నటించారు. కొడుకు మరియు భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు.

నేపథ్యం

గతంలో ఈయన భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. శ్రీకాంత్, కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యాడు. అంతకుముందు సినీ కథా రచయితగా పనిచేశాడు. కథా రచయితగా పేరుపడ్డ తొలిచిత్రం వేగుచుక్క పగటిచుక్క.[2]

వ్యక్తిగత జీవితము

బాల్యం, విద్యాభ్యాసం

వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు. వీరిది మధ్యతరగతి రైతు కుటుంబము. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు. ఏడుగురు అబ్బాయిలు మరియు ముగ్గురు అమ్మాయిలు. వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంవల్ల పొలంపనులకు వెళ్ళవలసి వచ్చేది. ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా ఇల్లందులో చదువు కొనసాగించారు. పదవ తరగతి పూర్తి అయిన తరువాత నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు.

వీరిది కులాంతర ప్రేమ వివాహము. భార్య కళాప్రపూర్ణ, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగులు వేశారు. మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. వీరి కుమారుడు విక్రం కొడుకు చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

పేరు పడ్డ సంభాషణలు

తాగుబోతు పాత్రలతో ప్రసిద్ధులు

ఎమ్మెస్ నారాయణ తన నట జీవితంలో 5 నంది అవార్డులు ( రామసక్కనోడు, మానాన్నకు పెళ్ళి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు), 2 సినీ గోయెర్స్ అవార్డులు పొందారు. దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయారు. గ్లాస్ చేతిలో పట్టుకున్న ప్రతిపాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. అదేవిధంగా పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్‌ శీను తదితర చిత్రాల్లో పేరడీ, నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.

చలన చిత్ర ప్రస్థానము

నటించిన చిత్రాల పాక్షిక జాబితా

సంవత్సరం పేరు పాత్ర ఇతరత్రా విశేషాలు
2015 పటాస్ సునామీ సుభాష్
2014 పాండవులు పాండవులు తుమ్మెద nayak 2014
2013 మిస్టర్ పెళ్ళికొడుకు
షాడో (2013 సినిమా)
దూకుడు (సినిమా)
2011 తెలుగమ్మాయి
2010 తిమ్మరాజు
నాగవల్లి (2010 సినిమా) పాములు పట్టే వ్యక్తి
మనసారా
ఏమైంది ఈవేళ
సరదాగా కాసేపు
తకిట తకిట
2008 భజంత్రీలు దర్శకుడు
యమదొంగ అతిథి పాత్ర
2006 భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఈ చిత్రం హిందీ చిత్రమైన మాలామాల్ వీక్లీ కి అనువాదము.
2005 ఎవడి గోల వాడిది పూర్తి హాస్య చిత్రం
2004 నేనున్నాను
2003 అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి
నేను పెళ్ళికి రెడీ
శ్రీరామచంద్రులు
శివమణి అతిథి పాత్ర
మిస్సమ్మ (2003 సినిమా)
2002 ఇడియట్ అధ్యాపకుడు
2001 నువ్వు నాకు నచ్చావ్

పురస్కారాలు

నంది పురస్కారం

మరణం

అనారోగ్య కారణాలతో మొదట ఏపీలోని భీమవరం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరం కొండాపూర్‌లో గల కిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ 2015, జనవరి 23 న మృతిచెందారు.

మూలాలు

  1. ""ఎంఎస్ నారాయణ ఇకలేరు.."". www.sakshi.com. సాక్షి. 23 జనవరి 2015. Retrieved 23 జనవరి 2015.
  2. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్. "...హాస్యంలో ఉత్తముడు - తోటపల్లి మధు". తోటపల్లి మధు. Retrieved 27 February 2018.

బయటి లింకులు