స్టీఫెన్ హాకింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
|birth_place = [[Oxford]], England
|birth_place = [[Oxford]], England
|residence = ఇంగ్లాండు
|residence = ఇంగ్లాండు
|Death_date = 14 మార్చి 2018
|death_date = 14 మార్చి 2018
|citizenship =
|citizenship =
|nationality = బ్రిటిష్
|nationality = బ్రిటిష్

07:46, 14 మార్చి 2018 నాటి కూర్పు

స్టీఫెన్ హాకింగ్
NASA StarChild image of Stephen Hawking
జననం (1942-01-08) 1942 జనవరి 8 (వయసు 82)
Oxford, England
మరణం14 మార్చి 2018
నివాసంఇంగ్లాండు
జాతీయతబ్రిటిష్
రంగములుApplied mathematician
Theoretical physicist
వృత్తిసంస్థలుకేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
Perimeter Institute for Theoretical Physics
చదువుకున్న సంస్థలుUniversity of Oxford
University of Cambridge
పరిశోధనా సలహాదారుడు(లు)Dennis Sciama
ఇతర విద్యా సలహాదారులుRobert Berman
డాక్టొరల్ విద్యార్థులుBruce Allen
Fay Dowker
Malcolm Perry
Bernard Carr
Gary Gibbons
Raymond Laflamme
ప్రసిద్ధికాలబిలాలు
Theoretical cosmology
Quantum gravity
ప్రభావితం చేసినవారుDikran Tahtalkl
ముఖ్యమైన పురస్కారాలుPrince of Asturias Award (1989)
Copley Medal (2006)
సంతకం

స్టీఫెన్ విలియం హాకింగ్ (ఆంగ్లం: Stephen Hawking) సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.

కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం... ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. 2009లో ఆ పోస్టు నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే...

జీవిత ఘట్టాలు

అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది. అప్పుడే అంటే 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. ఆయన తండ్రి వృత్తి రీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల వల్ల స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. కొంత కాలానికి ఆయన కుటుంబం లండన్ లోని హైగేట్స్ ప్రాంతానికి తరలివచ్చింది. స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని అక్కడే ప్రారంభించాడు. తర్వాత అంటే 1950లో ఆయన తండ్రి కుటుంబాన్ని మిల్ హిల్ ప్రాంతానికి మార్చాడు. తండ్రి స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు. తన గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని దానికి వ్యతిరేకంగా తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు. తరువాత 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడు కాగలిగినా... భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు. కాస్మాలజి, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు. అప్పటి నుంచి స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారింది. అన్నం తినాలన్నా... కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా... స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. క్రిస్‌మస్ సెలవులకు ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది... తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూస పై ఇది ప్రభావం చూపుతుంది. భౌతిక శాస్త్రవేత్త వెర్నర్‌ ఇస్రయిల్‌ ‘మోజట్‌ కంపోజింగ్‌ సింఫనీ’ తెచ్చి స్టీఫెన్‌ తలకు అమర్చాడు. దాని వల్ల ఆయనకు తనను తాను వ్యక్తీకరించుకునే అవకాశం కలిగింది. దాన్ని అభ్యసించడానికి ఆయనకు కొంత సమయం పట్టినా, తర్వాత కాలంలో అది ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. 1970 నాటికి మాట పూర్తిగా పడిపోయింది. అతని హావభావాలు కుటుంబ సభ్యులకు, అతి సన్నిహితులకు మాత్రమే అర్థమయ్యేవి. 1985లో ఆయనకు నిమోనియా వచ్చింది , అప్పటి నుంచీ ఒక చక్రాల కుర్చీకి పరిమితమై తన చేతి చిటికెన వేలి కదలికల సాయంతో మాత్రమే దానికి అనుసంధానించి, రూపొందించిన ‘వాయిస్‌ సింథసైజర్‌’తో తన ఆలోచనలను శాస్త్ర లోకానికి అందిస్తున్నారు. హాకింగ్‌ చిటికెన వేలు కదలికల్ని ఒక హ్యాండ్‌ కంట్రోలర్‌ యంత్రానికి అమర్చిన తెరపై అక్షరాలను స్కాన్‌ చేసే కర్సర్‌ నియంత్రిస్తుంది. ఆయన ఎంచుకున్న అక్షరాల్ని, యంత్రంలోని వ్యవస్థ తనంతట తానే పని చేసే ‘అల్గారిదమ్‌’ సాయంతో మాటలు వాక్యాల రూపంలో రూపొందించి తెరపై ప్రకటిస్తుంది.కంప్యూటర్‌ ఇంజనీర్‌ డేవిడ్‌, ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్‌ హాకింగ్‌ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్‌ విషయాన్ని మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది. అందుకోసం తన గొంతునే వాడమన్నాడు స్టీఫెన్‌. మాట పడిపోక ముందున్న తన గొంతు ధ్వనిని అందులో ఉపయోగించమన్నాడు. దాని వల్ల స్టీఫెన్‌ హాకింగ్‌ సాంకేతిక సంభాషణ సహజ సంభాషణలా మారిపోయేది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా... కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా తిరస్కరించే వాడు. 2018 మార్చ్ 14 న బుధవారం ఉదయం ఆయన కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో మరణించారు[1]. [2] and he found his training in mathematics inadequate for work in general relativity and cosmology.[3]

విశ్వవిద్యాలయం

స్టీఫెన్ తన 17 వ యేట,1959వ సంవత్సరం 10వ నెలలో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరినాడు.తర్వాత కేంబ్రిడ్జ్‌లో పీహెచ్‌డీ చేశారు.

వైవాహిక జీవితం

స్టీఫెన్‌కు ఇద్దరు భార్యలు. కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న రోజుల్లో జానే విల్డే అనే అమ్మాయితో స్టీఫెన్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటికి స్టీఫెన్‌ వ్యాధి బయటపడలేదు. విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్న మహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గర లోనే ఇల్లు తీసుకుని ఉండేవాడు. అయితే వ్యాధి గురించి తెలిశాక కూడా జానే పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకొన్నారు, 1965లో వీరిద్దరూ పెళ్ళీ చేసుకొన్నారు . వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల . అయితే కొన్ని కారణాల వల్ల 1995లో వీరి విడిపోయారు. ఆ తర్వాత అదే సంవత్సరం స్టీఫెన్‌.. ఎలైన్‌ మాసన్‌ అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నారు. 1980లో స్టీఫెన్‌ అనారోగ్యంలో ఉన్న సమయంలో మాసన్‌ ఆయనకు నర్స్‌గా పనిచేశారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే 2006లో మాసన్‌తో కూడా విడిపోయారు.

పరిశోధనలు, ఆవిష్కరణలు,అభిప్రాయాలు

ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1966లో ఆయన సమర్పించిన‘ప్రొపర్టీస్‌ ఆఫ్‌ ఎక్స్‌పాండింగ్‌ యూనివర్సెస్‌’ థీసిస్‌ను ఆన్‌లైన్‌లో ఉంచగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దానిని చదివేందుకు ఆసక్తి చూపారు , 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయాడు. క్వాంటం థియరి, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడియేషన్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తకరచన ప్రారంభించాడు. ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల దగ్గర ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ... కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.2014: హాకింగ్ జీవిత విశేషాలతో ది థియరీ ఆప్ ఎవ్వరిథింగ్ అనే సినిమా తీశారు. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సోషల్‌ మీడియాలో చేరిన క్షణాల్లోనే ఆయన మిలియన్‌ ఫాలోవర్స్‌ను పొందాడు. ఇక స్టీఫెన్ హాకింగ్ చేసిన తొలి పోస్ట్‌కు క్షణాల్లో ఏకంగా ఐదులక్షల లైక్లు వచ్చాయి.

  • "మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం అనేదొక కట్టుకథ. మరణం తర్వాత జీవితం,స్వర్గం , నరకం వంటివేమీ లేవు. ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్‌ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్‌ పని చేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కన్నుమూసేలోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి".

పుస్తకాలు

Technical

Popular

Footnote: On Hawking’s website, he denounces the unauthorised publication of The Theory of Everything and asks consumers to be aware that he was not involved in its creation. www.ifscindia.in

Children's Fiction

Films and series

A list of Hawking’s publications through the year 2002 is available on his website.

డిగ్రీలు - పదవులు - పురస్కారాలు

  • 1975 ఎడిటంగ్ మెడల్
  • 1976 రాయల్ సొసైటి హ్యుగ్స్ మెడల్
  • 1979 అల్బర్ట్ ఐన్ స్టీన్ మెడల్
  • 1982 ఆర్డర్ ఆఫ్ బ్రీటీష్ ఎఒపైర్ (కమాండర్)
  • 1985 రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ బంగారు పతకం
  • 1986 పొంటిఫిషియల్ అకాడమి ఆఫ్ సైన్స్ లో సభ్యత్వం
  • 1988 భౌతిక శాస్త్రంలో అంతర్జాతీయ బహుమతి
  • 1989 కన్ కర్డ్ లో ఆస్ట్రియా ప్రిన్స్ అవార్డ్
  • 1989 కంపానియన్ ఆఫ్ ఆనర్
  • 1999 అమెరికా భౌతిక శాస్త్ర సమితి వారి జూలియస్ ఎడ్గర్ లిలెన్ ఫెల్ద్ ప్రైజ్
  • 2003 కేస్ వెస్ట్రెన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం వారి మైకెల్ సన్ మోర్లీ అవార్డ్
  • 2006 రాయల్ సొసైటీ కాప్లి మెడల్

వివాదాలు

బ్రిటన్‌, అమెరికాల్లో కొందరు ప్రముఖ సిద్ధాంతకర్తలు ఊహ ప్రకారం- స్టీఫెన్‌ హాకింగ్‌ 1985లోనే మరణించాడు. తాను రాసిన ‘ఎ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌’ పుస్తక ప్రచురణకు మూడేళ్ల ముందే ఆయన చనిపోయారని, ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకే ఆయన స్థానంలో మరొకరు ఉన్న వ్యక్తిని ప్రతిష్ఠించి- తమ సైంటిఫిక్‌ ఎజెండాను వ్యాప్తి చేస్తున్నారని ఈ థియరిస్టుల వాదన, *[5]. హాకింగ్ 1963లో ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ (ఏఎల్ఎస్) అనే జబ్బు బారిన పడ్డారు. ఇది ఓ భయంకరమైన నరాల క్షీణత వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు నాలుగేళ్ల కంటే ఎక్కువ కాలం బతకడం దాదాపు అసాధ్యం. మహా అయితే 1970 వరకు హాకింగ్ జీవించి ఉండాలి. కానీ వ్యాధి సోకి 55 ఏళ్లు అవుతోంది. ఈనెల 8న హాకింగ్ 77వ పుట్టిన రోజును జరుపుకున్నారు. తీవ్రమైన నరాల జబ్బుతో బాధపడుతున్న హాకింగ్ 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పటికీ ఆయన రూపం అలానే ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.

మూలాలు

  1. https://www.bbc.com/telugu/international-43395763
  2. White & Gribbin 2002, p. 58.
  3. Ferguson 2011, pp. 33–34.
  4. The Hawking Paradox, Internet Movie Database, 2005, retrieved 2008-08-29
  5. http://nri.andhrajyothy.com/latestnews/is-stephen-hawking-is-died--so-meny-years-back-20025

బాహ్య లింకులు