సరైనోడు: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 85: | పంక్తి 85: | ||
==వసూళ్ళు== |
==వసూళ్ళు== |
||
ఈ సినిమా మూడు వారాల్లోనే 101 కోట్లు వసూలు చేసింది . మొత్తంగా 127 కోట్ల వసూలు చేసింది. |
ఈ సినిమా మూడు వారాల్లోనే 101 కోట్లు వసూలు చేసింది . మొత్తంగా 127 కోట్ల వసూలు చేసింది. |
||
==మరిన్ని== |
|||
==రికార్డ్== |
|||
యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన భారతీయ సినిమాగా `సరైనోడు` నిలిచింది. ఈ సినిమాను రమారమి 14.6 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు మరే భారతీయ సినిమాకు ఇంత స్థాయిలో వ్యూస్ రాలేదు. |
ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్‌లో పెట్టారు. సినిమా మొత్తం డబ్ చేసినా, టైటిల్‌ను మాత్రం `సరైనోడు`గానే ఉంచేశారు. తెలుగు టైటిల్‌తోనే హిందీ సినిమాను విడుదల చేశారు. అదే విధంగా యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన భారతీయ సినిమాగా `సరైనోడు` నిలిచింది. ఈ సినిమాను రమారమి 14.6 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు మరే భారతీయ సినిమాకు ఇంత స్థాయిలో వ్యూస్ రాలేదు. |
||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
05:09, 24 మార్చి 2018 నాటి కూర్పు
సరైనోడు | |
---|---|
దస్త్రం:Sarrainodu-Telugu poster.jpg | |
దర్శకత్వం | బోయపాటి శ్రీను |
స్క్రీన్ ప్లే | బోయపాటి శ్రీన |
కథ | బోయపాటి శ్రీన |
నిర్మాత | అల్లు అరవింద్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | రిషి పంజాబీ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | తమన్ యస్ |
నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2016 ఏప్రిల్ 22 | 11 May 2017 (Hindi release date)
సినిమా నిడివి | 160 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹50 crore[1] |
బాక్సాఫీసు | ₹127 crore[2] |
సరైనోడు 2016లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని బోయపాటి శ్రీను అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటీంచాడు. ఈ సినిమాకి తమన్ యస్ సంగీతాన్ని సమకూర్చాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసా ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు.
కథ
గన (అల్లు అర్జున్) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా సమాజంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన, హైదరాబాద్ లో తన కుటుంబంతో ఉంటూ, అన్యాయాలను, అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు. గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. గన ఓక రోజు తను నివాసించే ఏరియా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా)ని చూసి ప్రేమలో పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా) ని ఒప్పించి తన ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. ఆమెను చంపటానికి వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) అనే విలన్ మనుషులు వెంటబడుతూంటారు. అప్పుడు గన ఏం చేసాడు? ఆమెను కాపాడాడా?. వైరం ధనుష్ తో వైరం పెట్టుకున్నాడా? మరి ఎమ్మల్యేతో లవ్ స్టోరీ ఏమైంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
నటీనటులు
- అల్లు అర్జున్ - గన
- ఆది పినిశెట్టి - వైరం ధనుష్
- రకుల్ ప్రీత్ సింగ్ - మహాలక్ష్మి
- కేథరిన్ త్రెసా - హర్షితా రెడ్డి
- శ్రీకాంత్ - శ్రీపతీ
- బ్రహ్మనందం -
- జయప్రకాష్ రెడ్డి -
- అంజలి - ( "బ్లాక్ బాస్టర్" ఐటం సాంగ్‌లో నటించింది )
- ప్రదీప్ రావత్ - ఓబుల్
- విద్యుల్లేఖా రామన్
- జయప్రకాష్ వి - ఉమాపతి
- సురేఖ వాణి - పద్మ
- వినయ ప్రసాద్
పాటలు
ఈ సినిమాకు పాటలకు, మరియు నేపథ్య సంగీతానికీ తమన్ సారథ్యం వహించాడు. ఈ సినిమా ఆడియో 2016, ఏప్రిల్ 1వ తేదీన విడుదలయ్యింది.
సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అత్తిలాక సుందరి" | రామజోగయ్య శాస్త్రి, బన్నీ సురేష్ | విశాల్ దాడ్లని, కార్తీక్ | 4:15 |
2. | "యూ ఆర్ మై ఎమ్మెల్యే" | అనంత్ శ్రీరామ్ | ధనుంజయ్ | 4:34 |
3. | "ప్రయివేట్ పార్టీ" | కృష్ణ చైతన్య | మనాసి, విక్కి | 4:23 |
4. | "బ్లాక్ బస్టర్" | రామజోగయ్య శాస్త్రి | శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్, సిమ, శ్రీ కృష్ణ, దీపూ | 5:05 |
5. | "తెలుసా తెలుసా" | శ్రీ మణి | జుబిన్ నౌటియల్, సమీరా భరద్వాజ్ | 4:25 |
Total length: | 22:02 |
పురస్కారాలు
- ఉత్తమ నటుడు ( విమర్శకులు ) - అల్లు అర్జున్
విడుదల
మొదట ఈ సినిమాను ఏప్రిల్ 8, 2016 న విడుదల చేయాలని అనుకున్నారు. చివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2016, ఏప్రిల్ 22 న థియేటర్లలో విడుదలైంది.
వసూళ్ళు
ఈ సినిమా మూడు వారాల్లోనే 101 కోట్లు వసూలు చేసింది . మొత్తంగా 127 కోట్ల వసూలు చేసింది.
మరిన్ని
ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్‌లో పెట్టారు. సినిమా మొత్తం డబ్ చేసినా, టైటిల్‌ను మాత్రం `సరైనోడు`గానే ఉంచేశారు. తెలుగు టైటిల్‌తోనే హిందీ సినిమాను విడుదల చేశారు. అదే విధంగా యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన భారతీయ సినిమాగా `సరైనోడు` నిలిచింది. ఈ సినిమాను రమారమి 14.6 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు మరే భారతీయ సినిమాకు ఇంత స్థాయిలో వ్యూస్ రాలేదు.
బయటి లింకులు
మూలాలు
- ↑ Hooli, Shekhar H (22 April 2016). "'Sarainodu' (Sarrainodu) movie review by audience: Live update". IBTIMES.
- ↑ "Sarainodu 'Sarainodu' (Sarainodu) total worldwide box office collection: Allu Arjun's film grosses Rs. 127 crore in its lifetime". International Business Times. Retrieved on 7 July 2016.
{{cite web}}
: Italic or bold markup not allowed in:|publisher=
(help)