రైతుబంధు పథకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాషాసవరణలు
చి Chaduvari, పేజీ రైతు బంధు పథకం ను రైతుబంధు పథకం కు తరలించారు: మరింత సరైన పేరు
(తేడా లేదు)

06:59, 14 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం.[1]

వివరాలు

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 4000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 8000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు.[2]

మూలాలు

  1. "రైతు బంధు పథకానికి నిధులు విడుదల". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 12 April 2018.
  2. "పంట నిల్వకు రైతు బంధు పథకం." నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 12 April 2018.