Coordinates: 17°21′41″N 78°28′28″E / 17.36139°N 78.47444°E / 17.36139; 78.47444

గన్‌ఫౌండ్రి, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:


== చరిత్ర ==
== చరిత్ర ==
నిజాం కాలంలో నిర్మించిన అనేక ఫిరంగి, ఫిరంగి గుళ్ల కర్మాగారాలలో గన్‌ఫౌండ్రి ఒకటి. హైదరాబాద్ రెండవ నిజాం నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ సేవకుడైన ఫ్రెంచ్ జనరల్ [[రేమండ్]] 1786లో దీనిని నిర్మించాడు.



== డివిజన్ లోని ప్రాంతాలు ==
== డివిజన్ లోని ప్రాంతాలు ==

18:11, 20 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

గన్‌ఫౌండ్రి
ప్రదేశం
ప్రదేశంహైదరాబాదు, భారతదేశం
భౌగోళిక అంశాలు17°21′41″N 78°28′28″E / 17.36139°N 78.47444°E / 17.36139; 78.47444
వాస్తుశాస్త్రం.
శైలిMughal Cannon Architecture
స్థాపించబడిన తేదీ1786
గరిష్ట ఎత్తు15 మీటర్లు (49 అడుగులు)

గన్‌ఫౌండ్రి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. నిజాం నవాబులు యుద్ధంలో ఉపయోగించే ఫిరంగిలో వాడే మందు పౌడర్‌ను ఇక్కడ తయారు చేస్తుండేవారు. ఈ ప్రాంతాన్ని 'తోప్‌-కా-సాంచా'గా పిలిచేవారు. కాలక్రమేణా గన్‌ఫౌండ్రిగా మారిపోయింది.

చరిత్ర

నిజాం కాలంలో నిర్మించిన అనేక ఫిరంగి, ఫిరంగి గుళ్ల కర్మాగారాలలో గన్‌ఫౌండ్రి ఒకటి. హైదరాబాద్ రెండవ నిజాం నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ సేవకుడైన ఫ్రెంచ్ జనరల్ రేమండ్ 1786లో దీనిని నిర్మించాడు.

డివిజన్ లోని ప్రాంతాలు

అగర్వాల్‌ చాంబర్స్‌, పూల్‌బాగ్‌, బ్యాండ్‌లైన్‌ బస్తీ, కట్టెలమండి, ఆదర్శ్‌ నగర్‌, నేతాజీనగర్‌, మురళీధర్‌బాగ్‌, మహేశ్‌నగర్‌, చిరాగ్‌అలీ లేన్‌, బషీర్‌బాగ్‌, గన్‌ఫౌండ్రి.

గన్‌ఫౌండ్రి సమీపంలోని కార్యాలయాలు

ఎల్‌బీ స్టేడియం, దూర్‌ సంచార్‌భవన్‌, ఎస్‌బీహెచ్‌ ప్రధాన కార్యాలయం, వ్యవసాయ శాఖ కమిషనరేట్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌, ఎస్‌ఎస్‌సీ బోర్డు, రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, ఆగాఖాన్‌ ఫౌండేషన్‌, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, దేశోద్ధారక భవన్‌, పరిశ్రమల భవన్‌, బిర్లామందిర్‌, షక్కర్‌ భవన్‌, హాకా భవన్‌, నిజాం కళాశాల, లేపాక్షి ఎంపోరియం, టెలిఫోన్‌ భవన్‌ (సూర్యలోక్‌ కాంప్లెక్స్‌), గగన్‌విహార్‌, జనరల్‌ పోస్టాఫీసు, చంద్రవిహార్‌, మానవ హక్కుల కమిషన్‌, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం, భారతీయ విద్యాభవన్‌ తదితర కార్యాలయాలన్నీ ఈ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా సెల్‌ఫోన్‌ మార్కెట్‌కు ప్రసిద్ధిగాంచిన చిరాగ్‌ అలీలేన్‌, ప్రముఖ బంగారు దుకాణాలు కూడా ఈ డివిజన్‌లో ఉన్నాయి. బ్రిటీషు కాలం నుంచి ఉన్న మిషనరీ స్కూళ్లు, నిజాం హయాంలో స్థాపించిన స్కూళ్లు గన్‌ఫౌండ్రి డివిజన్‌లోనే ఉన్నాయి. క్రైస్తవుల ప్రార్థనాలయాలు ఈ డివిజన్‌లోనే అధికం. లిటిల్‌ ఫ్లవర్‌, ఆల్‌ సెయింట్స్‌, రోజరీ కాన్వెంట్‌, సుజాత పాఠశాల‌, స్టాన్లీ, గ్రామర్‌ పాఠశాల‌తో పాటు స్లేట్స్‌ పాఠశాల‌, తదితర క్రైస్తవ మిషనరీ స్కూళ్లన్నీ ఇక్కడే. అదే విధంగా నిజాం హయాంలో ఏర్పాటు చేసిన మహబూబియా, ఆలియా విద్యాసంస్థలు, నిజాం కళాశాలలు ఈ డివిజన్‌ పరిధిలోకి వస్తాయి. మెథడిస్ట్‌, సెవెంత్‌ సెంటినరీ, క్యాథలిక్‌, రాక్‌ చర్చి తదితర క్రైస్తవ ప్రార్థన మందిరాలు ఇక్కడే ఉన్నాయి.

మూలాలు