సాహితి (సినీ రచయిత): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:


==సినిమా రంగం==
==సినిమా రంగం==
ఇతడు సినిమాలలో అవకాశం కోసం 1974లో [[చెన్నై|మద్రాసు]]కు వెళ్లాడు. మొదట [[ఆత్రేయ]] వద్ద సహాయకునిగా చేరాడు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 1979లో [[విజయనిర్మల]] దర్శకత్వంలో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] హీరోగా తెరకెక్కిన [[కిలాడి కృష్ణుడు]] సినిమాలో తొలి పాటను రచించాడు. తరువాత ఇతనికి అనేక అవకాశాలు వెనువెంటనే వచ్చాయి. ఇతడు మూడున్నర దశాబ్దాలలో 500కు పైగా పాటలు, 100 ప్రైవేటు ఆల్బమ్స్, 30 డబ్బింగ్ సినిమాలకు పాటలను అందించాడు. కేవలం పాటలే కాక "మల్లన్న", "జర్నీ" వంటి సినిమాలకు సంభాషణలు కూడా అందించాడు.

==సినిమాల జాబితా==
==సినిమాల జాబితా==
===గేయ రచయితగా===
===గేయ రచయితగా===

14:26, 30 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

సాహితి పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి[1][2].

విశేషాలు

ఇతడు కృష్ణా జిల్లా, మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో జన్మించాడు. ఇతడు వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, వరంగల్లులో ఇంటర్మీడియట్,నూజివీడులో డిగ్రీ చదివాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర పట్టా పొందాడు. ఇతడు గుడివాడలో ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాడు.

సినిమా రంగం

ఇతడు సినిమాలలో అవకాశం కోసం 1974లో మద్రాసుకు వెళ్లాడు. మొదట ఆత్రేయ వద్ద సహాయకునిగా చేరాడు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 1979లో విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన కిలాడి కృష్ణుడు సినిమాలో తొలి పాటను రచించాడు. తరువాత ఇతనికి అనేక అవకాశాలు వెనువెంటనే వచ్చాయి. ఇతడు మూడున్నర దశాబ్దాలలో 500కు పైగా పాటలు, 100 ప్రైవేటు ఆల్బమ్స్, 30 డబ్బింగ్ సినిమాలకు పాటలను అందించాడు. కేవలం పాటలే కాక "మల్లన్న", "జర్నీ" వంటి సినిమాలకు సంభాషణలు కూడా అందించాడు.

సినిమాల జాబితా

గేయ రచయితగా

  1. వద్దు బావా తప్పు (1993)
  2. ఘరానా అల్లుడు (1994)
  3. దొంగాట (1997)
  4. డాడీ డాడీ (1998)
  5. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)
  6. తప్పుచేసి పప్పుకూడు (2002)
  7. అదృష్టం (2002)
  8. వెంకీ (2004)
  9. ఖుషి ఖుషీగా (2004)
  10. సఖియా (2004)
  11. మాస్ (2004)
  12. బాస్ (2006)

సంభాషణల రచయితగా

సినిమా పాటల జాబితా

మూలాలు

  1. తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకు తెలుసా..?
  2. "'డీజే' సినిమాలో పాటను తొలగించాలి".

బయటిలింకులు