సాహితి (సినీ రచయిత): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person|alma_mater=|birth_date=|birth_name=చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి|birth_place=కృష్ణా జిల్లా, మైలవరం|boards=|caption=చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి|children=|death_cause=|death_date=|death_place=|education=|employer=|footnotes=|height=|image=|name=సాహితి|occupation=|other_names=|parents=|party=|predecessor=|relatives=|religion=హిందూ|residence=|salary=|successor=|term=|title=|website=|weight=|years_active=|imagesize=250px|native_place=మైలవరం, కృష్ణా జిల్లా|known=[[కవి]], సినిమా గేయ రచయిత|spouse=|partner=|father=|mother=}}
{{Infobox person|alma_mater=|birth_date=|birth_name=చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి|birth_place=కృష్ణా జిల్లా, మైలవరం|boards=|caption=చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి|children=|death_cause=|death_date=|death_place=|education=|employer=|footnotes=|height=|image=Sahithi-lyric writer.jpg|name=సాహితి|occupation=|other_names=|parents=|party=|predecessor=|relatives=|religion=హిందూ|residence=|salary=|successor=|term=|title=|website=|weight=|years_active=|imagesize=250px|native_place=మైలవరం, కృష్ణా జిల్లా|known=[[కవి]], సినిమా గేయ రచయిత|spouse=|partner=|father=|mother=}}


'''సాహితి''' పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి<ref>[http://www.andhrajyothy.com/artical?SID=474100 తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకు తెలుసా..?] </ref><ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/nijamabad/582107|title='డీజే' సినిమాలో పాటను తొలగించాలి}}</ref>.
'''సాహితి''' పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి<ref>[http://www.andhrajyothy.com/artical?SID=474100 తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకు తెలుసా..?] </ref><ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/nijamabad/582107|title='డీజే' సినిమాలో పాటను తొలగించాలి}}</ref>.

16:53, 30 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

సాహితి
చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి
జననం
చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి

కృష్ణా జిల్లా, మైలవరం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, సినిమా గేయ రచయిత

సాహితి పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి[1][2].

విశేషాలు

ఇతడు కృష్ణా జిల్లా, మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో జన్మించాడు. ఇతడు వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, వరంగల్లులో ఇంటర్మీడియట్,నూజివీడులో డిగ్రీ చదివాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర పట్టా పొందాడు. ఇతడు గుడివాడలో ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశాడు[3].

సినిమా రంగం

ఇతడు సినిమాలలో అవకాశం కోసం 1974లో మద్రాసుకు వెళ్లాడు. మొదట ఆత్రేయ వద్ద సహాయకునిగా చేరాడు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 1979లో విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన కిలాడి కృష్ణుడు సినిమాలో తొలి పాటను రచించాడు. తరువాత ఇతనికి అనేక అవకాశాలు వెనువెంటనే వచ్చాయి. ఇతడు మూడున్నర దశాబ్దాలలో 500కు పైగా పాటలు, 100 ప్రైవేటు ఆల్బమ్స్, 30 డబ్బింగ్ సినిమాలకు పాటలను అందించాడు. కేవలం పాటలే కాక "మల్లన్న", "జర్నీ" వంటి సినిమాలకు సంభాషణలు కూడా అందించాడు[3].

అతని కలం తనదైన శైలిలో పాటకు పట్టాభిషేకం చేస్తుంది. ఆయన పాటలో పదాలు స్వరాల మధ్య విసిరేసినట్టుండవు. స్వరంపై పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నట్టుంటాయి. అతడు రాసిన "జాబిలికీ వెన్నెలకీ", "ఎగిరిపోతే ఎంత బాగుంటుంది" పాటలు అశేష ఆదరణ పొందాయి.[4] అతడు సుమారు 1000 తెలుగు సినిమా పాటలు రాసాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ యాస మరియు మాండలికాలతో జానపద గీతాలను రాసినందున సినిమా పరిశ్రమలో ప్రసిద్ది చెందాడు. అతను దూర ప్రాంతాలు ప్రయాణం చేసి, ప్రజలతో సంభాషించి, వారి వ్యావహారిక పదాలు మరియు పదజాలాన్ని సేకరించి జానపద కవిత్వంలో తనకు ఒక ప్రత్యేకమైన చిహ్నాన్ని సృష్టించాడు. అతడు మొండిమొగుడు పెంకి పెళ్ళాం చిత్రంలో విజయశాంతి పాత్రక్ రాసిన "లాలూ దర్వాజ లష్కర్ బోనాల్ పండుగ" పాట పెద్ద హిట్ అయింది. అతను అందమైన మరియు గొప్ప యాసలను రాసాడని భావిస్తారు.[5]

సినిమాల జాబితా

గేయ రచయితగా

  1. అతిరధుడు (1991)
  2. ఆగ్రహం (1991)
  3. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ (1991)
  4. వద్దు బావా తప్పు (1993)
  5. ఘరానా అల్లుడు (1994)
  6. అమ్మలేని పుట్టిల్లు (1995)
  7. ఆలీబాబా అద్భుతదీపం (1995)
  8. ఆడాళ్లా మజాకా? (1995)
  9. ఇల్లాలు (1997)
  10. దొంగాట (1997)
  11. అల్లరి పెళ్లాం (1998)
  12. డాడీ డాడీ (1998)
  13. ఆవిడే శ్యామల (1999)
  14. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)
  15. తప్పుచేసి పప్పుకూడు (2002)
  16. అదృష్టం (2002)
  17. వెంకీ (2004)
  18. ఖుషి ఖుషీగా (2004)
  19. సఖియా (2004)
  20. మాస్ (2004)
  21. బాస్ (2006)
  22. ఆటాడిస్తా (2008)
  23. భలే దొంగలు (2008)
  24. బ్లేడ్ బాబ్జీ (2008)
  25. సమర్ధుడు (2009)
  26. వేదం (2009)
  27. మిరపకాయ్ (2011)
  28. ప్రేమ కావాలి (2011)
  29. ఢమరుకం (2012)
  30. రామయ్యా వస్తావయ్యా (2013)
  31. చల్‌ మోహన రంగా (2018)

సంభాషణల రచయితగా

  1. మల్లన్న
  2. జర్నీ

సినిమా పాటల జాబితా

మూలాలు

  1. తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకు తెలుసా..?
  2. "'డీజే' సినిమాలో పాటను తొలగించాలి".
  3. 3.0 3.1 సుమబాల (17 June 2013). "Sahithi My Song My Story". V6 News Telugu. Retrieved 30 April 2018.
  4. "అలాంటి దర్శకుల్లో క్రిష్ ఒకరు: గేయ రచయిత సాహితి -". www.andhrajyothy.com. Retrieved 2018-04-30.
  5. Y.s.c; Y.s.c (2011-12-04). "Tapping into dialects". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-04-30.

బయటిలింకులు