మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , అధారం → ఆధారం, → using AWB
ట్యాగు: 2017 source edit
పంక్తి 11: పంక్తి 11:


ఎందరో అభిమానులు ఈ పుస్తకం చదివి గర్వపడ్దారు, చివరి రోజులు గుర్తుచేసుకొని చలించిపోయారు. ఇలా తెలుగువారందరి హృదయాల్లో, వారి ఆత్మీయురాలిగా ఆమె పట్ల ప్రేమ, గౌరవం నిండుగా ఉన్నాయని మరొకసారి నిరూపించినది ఈ పుస్తకం.
ఎందరో అభిమానులు ఈ పుస్తకం చదివి గర్వపడ్దారు, చివరి రోజులు గుర్తుచేసుకొని చలించిపోయారు. ఇలా తెలుగువారందరి హృదయాల్లో, వారి ఆత్మీయురాలిగా ఆమె పట్ల ప్రేమ, గౌరవం నిండుగా ఉన్నాయని మరొకసారి నిరూపించినది ఈ పుస్తకం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* {{Cite news|url=http://pustakam.net/?p=8441|title=మహానటి సావిత్రి : వెండితెర సామ్రాజ్ఞి-1|date=2011-10-09|work=పుస్తకం|access-date=2018-05-15}}
* {{Cite news|url=http://pustakam.net/?p=8454|title=మహానటి సావిత్రి : వెండితెర సామ్రాజ్ఞి-2 (సమాప్తం)|date=2011-10-09|work=పుస్తకం|access-date=2018-05-15|}}


[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]

12:36, 15 మే 2018 నాటి కూర్పు

మహానటి సావిత్రి పుస్తకం ముఖ చిత్రం.

మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి ప్రముఖ సినీ నటీమణి సావిత్రి జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకము. దీని రచయిత పల్లవి. ఈ పుస్తకాన్ని 20 ఆగష్టు 2007 తేదీన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తొలి ప్రతిని సావిత్రి కుమార్తె అయిన శ్రీమతి విజయ చాముండేశ్వరికి అందజేసి విడుదలచేశారు. వెలువడిన రెండు సంవత్సరాల కొద్ది కాలంలోనే మూడు ముద్రణలు పూర్తిచేవడం తెలుగు ప్రజలలో సావిత్రికు ఉన్న స్థానాన్ని తెలియజేస్తుంది. రచయిత్రి తన కృషిఫలితాన్ని పద్మభూషణ్ కె.ఈ.వరప్రసాద్ రెడ్డి మరియు వసంత దంపతులకు అంకితం ఇచ్చారు.

ముందుమాట

"నేత్రాభినయంతోనే జనస్రవంతిని మంత్రముగ్ధులను చేసిన అభినేత్రి సావిత్రి జీవితం నాటకీయతలో ఆమె ధరించిన ఏ పాత్రకూ తీసిపోదు. తారాజువ్వలా తారామండలానికి ఎగిసి, మితిమీరిన బోళాతనంతో తోకచుక్కలా రాలి, రోగగ్రస్తమై, శల్యావశిష్టమైన శరీరంతో జీవన రంగస్థలి నుండి నిష్క్రమించిన తారామని ఆమె. కరుణకు, పరోపకారానికి చిరునామా అయిన ఆ సహృదయురాలి కథ కరుణామయ గాధగా మిగిలిపోవడం గుండెలు పిండేటంతటి విషాదం. గొప్ప భావుకవుల, భాసాది నాటకకర్తల ఊహకు సైతం అందనంత 'మెలాంకలిక్ డ్రామా'?" - వరప్రసాద్ మాటల్లో.

ఎందరో మనసులను,హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న మహా నటి.. కేవలం ముఖ కవళికల ఆధారంగా మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటి.. భార్య అంటే ఇలా వుండాలి అని అనిపించిన "దేవత"లో ఆమె నటన వర్ణనాతీతం..

రచయిత్రి

మహానటి సావిత్రి మన తెలుగు జాతి సంపద. ఈ తరం వారికి మరియు ముందు తరాలకు ఈ అమూల్యమైన సంపదను పరిచయం చేయాలనే ఉద్దేశంతో చేసిన పల్లవి చేసిన ప్రయత్నం ఈ పుస్తకం. సావిత్రి అభిమానిగా పల్లవి అనుపమానమైన కృషి మరెన్నో ఇలాంటి పుస్తకాలకు మార్గదర్శకం కావాలి. తెలుగు దేశమంతా విస్తరించిన సావిత్రి అభిమానులు పల్లవికి ఋణపడి వుంటారు.

ఎందరో అభిమానులు ఈ పుస్తకం చదివి గర్వపడ్దారు, చివరి రోజులు గుర్తుచేసుకొని చలించిపోయారు. ఇలా తెలుగువారందరి హృదయాల్లో, వారి ఆత్మీయురాలిగా ఆమె పట్ల ప్రేమ, గౌరవం నిండుగా ఉన్నాయని మరొకసారి నిరూపించినది ఈ పుస్తకం.

మూలాలు

బయటి లింకులు

  • "మహానటి సావిత్రి : వెండితెర సామ్రాజ్ఞి-1". పుస్తకం. 2011-10-09. Retrieved 2018-05-15.
  • "మహానటి సావిత్రి : వెండితెర సామ్రాజ్ఞి-2 (సమాప్తం)". పుస్తకం. 2011-10-09. Retrieved 2018-05-15. {{cite news}}: Cite has empty unknown parameter: |1= (help)