అంతఃపురం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 46: | పంక్తి 46: | ||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
||
*{{IMDb title|0275925}} |
*{{IMDb title|0275925}} |
||
[[వర్గం:ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు]] |
17:55, 6 జూన్ 2018 నాటి కూర్పు
అంతఃపురం (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణవంశీ |
---|---|
తారాగణం | సాయి కుమార్, సౌందర్య , ప్రకాష్ రాజ్ |
సంగీతం | ఇళయరాజా |
గీతరచన | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
నిర్మాణ సంస్థ | ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
అంతఃపురం 1998లో విడుదలైన తెలుగు సినిమా.
కథ
ఇది ముఠా కక్ష్యల నేపథ్యంలో తీసిన చిత్రం. రాయలసీమలోని ఒక ముఠా నాయకుడు నరసింహ (ప్రకాష్ రాజ్) కుటుంబానికి వేరొక కుటుంబంతో ముఠా కక్ష్యలు ఉంటాయి. ఇతని కుమారుడు శేఖర్ (సాయి కుమార్) కు ఈ గొడవలు నచ్చక కుటుంబానికి దూరంగా న్యూజిలాండ్ దేశంలో నివసిస్తుంటాడు. అక్కడే ఒక అమ్మాయి భానుమతి (సౌందర్య) ని ప్రేమ వివాహం చేసుకుంటాడు. వీరికి ఒక కుమారుడు కలిగిన తర్వాత తన తండ్రి కోరిక మేరకు తిరిగి గ్రామానికి తిరిగి వస్తాడు. ఇది ఇతని భార్యకు ఇష్టం లేకున్నా భర్త మాటకు విలువ నిచ్చి తను కూడా అక్కడికి వెళుతుంది కాని గొడవలు ఇంకా ముదిరిపోతాయి. అనుకోకుండా జరిగిన గొడవలో సాయికుమార్ ప్రత్యర్థుల చేతిలో హతమవుతాడు. అక్కడే ఉంటే తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నదని అతని భార్య, కుమారుడిని తీసుకొని పారిపోతుంది. ఈ క్రమంలో కథ అనేక మలుపులు తిరుగుతుంది.
నిర్మాణం
అభివృద్ధి
నాట్ విత్ మై డాటర్ అన్న 1991 నాటి అమెరికన్ చిత్రంలోని పాయింట్ ఆధారంగా తీసుకుని అంత:పురం సినిమా కథను అభివృద్ధి చేశారు. [1]
తారాగణం
- ప్రకాష్ రాజ్
- సాయి కుమార్
- సౌందర్య
- శారద
- జగపతిబాబు - అతిథి పాత్ర
- చిన్నా
- ఎమ్మెస్ నారాయణ
- బాబు మోహన్
- తెలంగాణ శకుంతల
సాంకేతికవర్గం
- కథ - దర్శకత్వం - కృష్ణ వంశీ
పురస్కారాలు
అంతఃపురం సినిమాలో సౌందర్య నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ప్రకటించింది. జగపతి బాబుకు ఉత్తమ సహాయ నటుడి పురస్కారం లభించింది.
పాటలు
- కల్యాణం కానున్నది కన్నె జానకికి - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: కె. ఎస్. చిత్ర
- అసలేం గుర్తుకురాదు - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: కె. ఎస్. చిత్ర
- సై చిందెయ్ శివమెత్తర సాంబయ్యా - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: శంకర్ మహాదేవన్
- సూరీడు పువ్వా జాబిల్లి గువ్వా - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: ఎస్. జానకి
- ఛెమక్ ఛెమక్ ఛెమకులే - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: నాగూర్ బాబు, స్వర్ణలత
బయటి లింకులు
- ↑ టి.ఎన్.ఆర్. "డైరెక్టర్ కృష్ణ వంశీ ఏక్సక్లూసివ్ ఇంటర్వ్యూ". యూట్యూబ్. ఐడ్రీమ్స్ తెలుగు మూవీస్. Retrieved 17 December 2016.