కె. వి. కృష్ణకుమారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = డాక్టర్ కె.వి. కృష్ణ కుమారి
| name = డాక్టర్ కె.వి. కృష్ణ కుమారి

16:32, 10 జూన్ 2018 నాటి కూర్పు

డాక్టర్ కె.వి. కృష్ణ కుమారి
సత్య సాయి బాబా తో కె.వి.కృష్ణకుమారి
జననంకృష్ణ కుమారి
ఫిభ్రవరి 6, 1947
India తెనాలి, గుంటూరు
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లుకృష్ణక్క
వృత్తిడాక్టర్
రచయిత్రి
మతంహిందూ
తండ్రిడాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు
తల్లిసత్యవతి

ప్రముఖ రచయిత్రి డా. కె.వి.కృష్ణకుమారి కృష్ణక్కగా సుప్రసిద్ధులు. రచయిత్రిగా షష్టిపూర్తి ఉత్సవానికి చేరువవుతున్న కృష్ణకుమారి పుట్టిందీ, పెరిగిందీ, ఉన్నత విద్య వరకూ చదివిందీ తెనాలి అయితే, వైద్యవిద్య అభ్యసించినది కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం. చేస్తున్న వృత్తి మెడికల్ ప్రాక్టీసే అయినా, ప్రధాన వ్యాపకం రచనా వ్యాసాంగమే. 'రమ్యకథా కవయిత్రి'గా పేరు పొందిన కృష్ణకుమారి తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించారు.

బాల్యం, విద్యాభ్యాసం

కె.వి.కృష్ణకుమారి తెనాలికి చెందిన డా. కాజ వెంకట జగన్నాధరావు, వెంకట సత్యవతి దంపతులకు 1947, ఫిబ్రవరి 6 న జన్మించిన కృష్ణకుమారి ప్ర్రాథమిక, ఉన్నత, కాలేజీ చదువుల్ని తెనాలిలోనే పూర్తి చేసారు. అనంతరం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎం.బి.బి.యస్., గైనిక్ పిజి చేసారు.

రచనా వ్యాసాంగం

కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసారు.

రచనలు

  • కర్మయోగి
  • భద్రాకళ్యాణం
  • మనిషి లో మనీషి డాక్టర్ అక్కినేని
  • మంచుపూలు
  • శ్రీ కృష్ణామృతం
  • సశేషం

పురస్కారాలు

  1. 1992 లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీద అందుకున్నారు
  2. 1993 లో ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం
  3. 1993 లో సాహితీ వైద్య శిరోమణి పురస్కారం
  4. 1994 లో మహాత్మా గాంధీ జాతీయ పురస్కారం
  5. 1995 లో గ్లోరి ఆఫ్ ఇండియా అంతర్జాతీయ పురస్కారం
  6. 1997 లొ భరతముని పురస్కారం
  7. 2005లో శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు పురస్కారం
  8. 2005లో అక్కినేని అవార్డు పురస్కారం
  9. 2007 శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం శ్రీ విజయ దుర్గా పీటము వారి నుండి
  10. విశిష్ట రచయిత్రిగా సర్వధారి పురస్కారం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి చేతులమీదుగా
  11. 2013లో సి .నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
  12. డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం

వనరులు

మూలాలు

బయటి లింకులు